Mozambique
-
తీవ్ర విషాదం.. పడవ మునిగి 90 మంది మృతి
ఆఫ్రికా దేశం మొజాంబిక్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మొజాంబిక్ ఉత్తర తీర ప్రాంత సుముద్రంలో మత్స్యకార పడవ మునిగిపోవటంతో 90 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 130 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సామర్థ్యానికి మించి పడవలోకి ప్రయాణికులు ఎక్కటంతో ఈ ప్రమాదం జరిగినట్లు నాంపులా ప్రావిన్స్ అధికారులు చెప్పారు. Andy Vermaut shares: Dozens killed as boat sinks off north coast of Mozambique: More than 90 people died when an overcrowded makeshift ferry sank off the north coast of Mozambique, local authorities said on Sunday. https://t.co/O4MSafGYK0 Thanks. pic.twitter.com/vVehEtxG9C — Andy Vermaut (@AndyVermaut) April 7, 2024 ఈ ప్రమాదంలో అధికంగా చిన్నారులే మృతి చెందినట్లు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది ఇప్పటివరకు ఐదు మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే సుముద్రంలో పరిస్థితుల కారణంగా మృత దేహాలు వెతికే ఆపరేషన్ కష్టంగా మారిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నరని స్థానిక అధికారులు తెలిపారు. More than 90 people died when an overcrowded makeshift ferry sank off the north coast of Mozambique, local authorities said on Sunday. Read more at: https://t.co/8lVayQMPHE — Daily Tribune (@tribunephl) April 7, 2024 -
మళ్లీ కశ్మీర్‌పై పాక్ ఏడుపు
ఐక్యరాజ్య సమితి: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో జరిగిన ఒక చర్చాకార్యక్రమంలోనూ కశ్మీర్ అంశాన్ని లేవదీసి పాకిస్తాన్ భారత్‌పై తన అక్కసును మరోసారి వెళ్లబోసుకుంది. దీంతో భారత్ ఘాటుగా స్పందించింది. పాకిస్తాన్ చేసే ద్వేషపూరిత, తప్పుడు ప్రచారాలకు కనీసం స్పందించాల్సిన అవసరం తమకు లేదని భారత్ తేల్చిచెప్పింది. నెలపాటు మొజాంబిక్ దేశ అధ్యక్షతన ఐరాస భద్రతా మండలిలో సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులోభాగంగానే ‘ మహిళలు, శాంతి, భద్రత’ అంశంపై చర్చలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అసంబద్ధంగా జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రసంగించారు. ఆ తర్వాత ఐరాస భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంభోజ్ మాట్లాడారు. ‘ బిలావల్ వ్యాఖ్యానాలు పూర్తిగా నిరాధారం. పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో చేసిన ప్రసంగమిది. మహిళలకు భద్రతపై చర్చాకార్యక్రమాన్ని మేం గౌరవిస్తున్నాం. మహిళా దినోత్సవ కాల విలువకు గుర్తించాం. ఈ అంశంపైనే మనం దృష్టిసారిద్దాం. అసందర్భంగా పాక్ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలపై కనీసం స్పందించాల్సిన అగత్యం భారత్‌కు లేదు. గతంలో చెప్పాం. ఇప్పుడూ, ఇకమీదటా చెప్పేది ఒక్కటే. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లు భారత్‌లో అంతర్భాగమే. దాయాదిదేశం పాక్‌తో పొరుగుదేశ సంబంధాలను సాధారణస్థాయిలో కొనసాగించాలని భారత్ మొదట్నుంచీ ఆశిస్తోంది. అలాంటి వాతావరణం నెలకొనేలా చూడాల్సిన బాధ్యత పాక్‌పై ఉంది. కానీ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారి శత్రుత్వాన్ని పెంచుకుంటోంది’ అని రుచిరా ఘాటుగా వ్యాఖ్యానించారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ బలగాలపై దారుణ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని బాలాకోట్‌లో కొనసాగుతున్న జైషే మొహమ్మద్ ఉగ్ర శిబిరంపై భారత వాయుసేన మెరుపుదాడి తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. జమ్మూకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా విడదీశాక భారత్‌పై పాక్ ఆక్రోశం మరింతగా ఎగసింది. -
మొజాంబిక్‌లో దాడి.. 16 మంది మృతి
మపుటో: తూర్పు ఆఫ్రికా దేశం మొజాంబిక్‌లో ఇస్లామిక్ తీవ్రవాదులు మంగళవారం 16 మందిని హతమార్చిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మొజాంబిక్‌లోని కాబో డెల్గాడో అనే ముస్లిం ఆధిక్య ప్రాంతంలో ఇస్లామిక్ తీవ్రవాదులు 2017 అక్టోబర్ నుంచి దాడులకు పాల్పడుతున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు కనీసం 200 మంది ప్రజలను చంపేశారు. వేలాది మంది ప్రజలు ఇళ్లు వదిలిపారిపోయారు. తాజాగా మంగళవారం మిత్సుబిషి ట్రక్కులో ప్రయాణికులు, సరుకులను వేసుకుని వెళ్తుండగా తీవ్రవాదులు దాడి చేశారు. ఇంట్లో తయారు చేసుకొచ్చిన పేలుడు పదార్థాలను తీవ్రవాదులు ట్రక్కుపై విసిరి, అనంతరం కాల్పులు ప్రారంభించారు. వాహనంలోనే ఎనిమిది మంది చనిపోయారనీ, కిందకు దిగి పారిపోతుండగా కాల్చడంతో మరో ఏడు మంది కూడా మరణించారనీ, మరో వ్యక్తి బుధవారం చనిపోయాడిన స్థానిక వ్యక్తి చెప్పారు. అఫ్గాన్‌లో కారుబాంబు దాడి కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో శుక్రవారం ఉదయం అమెరికా కాన్వాయ్ లక్ష్యంగా జరిగిన కారు బాంబు ఆత్మాహుతి దాడిలో నలుగురు పౌరులు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. అమెరికా భద్రతాదళ సిబ్బందిలోనూ నలుగురికి స్వల్ప గాయాలయ్యాయని అధికారులు చెప్పారు. గత రెండ్రోజుల్లో కాబూల్‌లో జరిగిన రెండో ఆత్మాహుతి దాడి ఇది. కాబూల్‌లోని యాకతోత్‌లోని భవనాలను అమెరికా, నాటో బలగాలు భద్రతగా ఉంటాయి. అక్కడికి దగ్గర్లోనే అఫ్గానిస్తాన్ జాతీయ భద్రతా దళాల భవనాలు కూడా ఉంటాయి. అమెరికా దళాల వాహనశ్రేణి వెళ్తుండగా తాలిబన్ ఉగ్రవాది కారుతో వెళ్లి ఢీకొట్టాడు. -
‘ఇదాయ్’ తాకిడికి 150 మంది మృతి
హరారే: ఆఫ్రికా దేశాలైన మొజాంబిక్, జింబాంబ్వే, మలావిలను ‘ఇదాయ్’ తుపాను అతలాకుతలం చేస్తోంది. భారీవర్షాలకు తోడు ఎగువప్రాంతాల నుంచి వరదలు ఒక్కసారిగా పోటెత్తడంతో ఈ మూడుదేశాల్లో 150 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది ప్రజలు గల్లంతయ్యారు. మూడుదేశాల్లో దాదాపు 15 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇదాయ్ తాకిడితో వేలాది ఇళ్లతో పాటు రహదారులు, వంతెనలు ధ్వంసం కాగా, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో చాలాప్రాంతాలు అంధకారంలోకి జారిపోయాయి. విమానాశ్రయాల్లో భారీగా వరదనీరు నిలిచిపోవడంతో ఆహారసామగ్రి, మందులు, ఇతర నిత్యావసరాలు తీసుకొచ్చేందుకు తీవ్రఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్మీతో పాటు రెడ్‌క్రాస్, ఇతర స్వచ్ఛంద సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. -
పార్టీలోకి దూసుకెళ్లిన కారు..23మంది బలి
మొజాంబిక్ : సౌతర్న్ ఆఫ్రికాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకెళ్లిన కారు దాదాపు డజన్ల సంఖ్యలో ప్రాణాలు బలిగొంది. అంతా పార్టీలో లీనమై ఉన్న సందర్భంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో ఎక్కువ సంఖ్యలో మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళితే.. సౌతర్న్ ఆఫ్రికాలోని మొజాంబికాలోని మాపుటో అనే ప్రాంతంలో ఆదివారం పెద్ద సంఖ్యలో పార్టీకి హాజరయ్యారు. ఆదివారం కావడంతో సరదాగా గడుపుతున్నారు. అదే సమయంలో వాయువేగంతో దూసుకొచ్చిన కారు కాస్త సరాసరి పార్టీలో ఉన్న జనాలపైకి వెళ్లింది.. దీంతో 23మంది అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు చెప్పిన కథనం ప్రకారం కారును ఆపాలని ఆదేశాలు ఇచ్చానా ఆ డ్రైవర్ నిర్లక్ష్యం చేశాడని తెలిసింది. పాద చారుల వంతెనపక్కనే పార్టీ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగిందని, అయితే, ఉద్దేశపూర్వకంగా చేసినా దాడి అయుంటుందా? ఉగ్రవాదా కోణాలు ఉన్నాయా అని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పెట్రోల్ ట్యాంకర్ పేలుడు.. భారీ ప్రాణ నష్టం
మపుటో: పెట్రోల్ లోడ్‌తో చేస్తున్న ఓ ట్యాంకర్ పేలడంతో 73 మందికి పైగా మృతిచెందారు. ఈ ఘోర ప్రమాదం మొజాంబిక్ లోని టెటె ఏరియాలో గురువారం(భారత కాలమానం ప్రకారం) అర్ధరాత్రి సంభవించింది. మొజాంబిక్ లోని బీరా నగరం నుంచి మాలావికి ఓ ట్యాంకర్ పెట్రోల్ లోడ్‌తో వెళ్తుండగా దురదృష్టవశాత్తూ ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. మార్గం మధ్యలో వాహనాన్ని నిలపగా.. పెట్రోల్ కొనుగోలు చేసేందుకు టెటె గ్రామస్తులు ట్యాంకర్ చుట్టూ గుమిగూడగా ఆ సమయంలో అది పేలడంతో భారీ ప్రాణనష్టం సంభవించగా, డజన్ల కొద్ది ప్రజలు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు వివరించారు. పేలుడు ఘటనపై ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించనుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
‘గిఫ్ట్’ తిలాపియా చేపల సాగుతో ...పోషకాహార భద్రత!
• ‘గిఫ్ట్’ తిలాపియా చేపల సాగుకు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం • ‘ ‘ఏక లింగ’ తిలాపియా చేపలతో స్థానిక చేప జాతుల మనుగడకు ముప్పేమీ ఉండదు • ‘ మన చిన్న రైతులకు ఆహార భద్రత.. ప్రపంచ మార్కెట్లకు ఎగుమతులకూ అవకాశం • ‘మొజాంబిక్ తిలాపియా’ సాగుపై తెలంగాణ ప్రభుత్వ ఆంక్షలు సమంజసమే • ‘ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ విజేత, ప్రసిద్ధ ఆక్వా నిపుణుడు డా. విజయ్ గుప్తాతో ఇంటర్వ్యూ చిన్న కుంటల్లో విస్తారంగా ‘గిఫ్ట్’ తిలాపియా చేపల సాగు ద్వారా చిన్న-సన్నకారు రైతులు, పేదలకు పోషకాహార భద్రతను అందించవచ్చని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆక్వాకల్చర్ నిపుణులు డాక్టర్ మోదడుగు విజయ్ గుప్తా ‘సాక్షి సాగుబడి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. చెరువుల్లో తిలాపియా సంతానోత్పత్తిని అరికట్టేందుకు మగ పిల్లలను ఉత్పత్తి చేసి రైతులకు ఇస్తున్నందున జీవవైవిధ్యానికి ముప్పు ఉండదన్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించిన డా. గుప్తా.. ఖండాంతరాల్లో ఆక్వా దిగుబడుల పెంపుదలకు విశేష కృషి చేసి.. నీలి విప్లవ పితామహునిగా గుర్తింపు పొందారు. లక్షలాది మంది చిన్న, సన్నకారు రైతులకు ఉపకరించే చేపల సాగు పద్ధతులను రూపొందించడం ఆయన ప్రత్యేకత. ప్రపంచ ఆహార పురస్కారాన్ని(2005), సన్హక్ శాంతి పురస్కారం(2015) అందుకున్నారు. వ్యవసాయక జీవవైవిధ్యంపై ఇటీవల ఢిల్లీలో జరిగిన తొలి సదస్సులో ప్రధాని మోదీ నుంచి పురస్కారాన్ని అందుకున్నారు. ఆక్వాకల్చర్‌పై ఏపీ ప్రభుత్వానికి గౌరవ సలహాదారుగా ఉన్నారు. తిలాపియా వంటి విదేశీ జాతుల చేపల వల్ల దేశంలోని జల వనరుల్లో స్థానిక జాతుల మత్స్య సంపదకు ముప్పు వచ్చి పడిందన్న వార్తలు దక్షిణాది రాష్ట్రాల్లో ఇటీవల వెలువడుతున్నాయి. మన జలవనరుల్లో సంప్రదాయ చేపల మనుగడకు గొడ్డలిపెట్టుగా మారిందని గుర్తించి, ఈ తిలాపియా చేపల సాగుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయితే, మరోవైపు తిలాపియా చేపల సాగును కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. మీరేమంటారు? ప్రపంచవ్యాప్తంగా 9 రకాల తిలాపియా చేపలు సాగులో ఉన్నాయి. అందులో మొజాంబిక్ తిలాపియా (ైట్ఛౌఛిజిటౌఝజీట ఝౌటట్చఝఛజీఛిఠట) అనే రకం చేపల సాగుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయితే, కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది మరొక రకం. దాని పేరు నైల్ తిలాపియా. దాని శాస్త్రీయ నామం ైట్ఛౌఛిజిటౌఝజీట జీౌ్టజీఛిఠట . ఈజిప్ట్‌లోని నైలు నది పరీవాహక ప్రాంతంలో పెరగడం వల్ల ఆ పేరు వచ్చింది. మొజాంబిక్ తిలాపియా చేప సైజు అంతగా పెరగదు. నైల్ తిలాపియా పెద్ద సైజుకు పెరుగుతుంది. అంతర్జాతీయంగా, వాణిజ్యపరంగా గుర్తింపు పొందిన రకం ఇది. ప్రస్తుతం 170 దేశాల్లో సాగవుతోంది. ఏటా 50 లక్షల టన్నుల మేరకు ఉత్పత్తవుతోంది. దీని సాగుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని రిజర్వాయర్లలో కేజెస్‌లో కూడా దీన్ని పెంచుతున్నారు. నిజానికి తిలాపియా చేపలు ఆఫ్రికాలో పుట్టినవైనప్పటికీ 1950వ దశకం నుంచి మన దేశంలో ఉన్నాయి. విదేశీ చేప అయినందువల్ల తిలాపియా సాగును అనుమతించాలా లేదా అన్న తటపటాయింపు చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. అనేక కమిటీలు ఏర్పడినప్పటికీ నిర్ణయం తీసుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్.ఎఫ్.డి.బి.) ఐదారేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వాన్ని దీనిపై నిర్ణయం తీసుకోమని కోరింది. అప్పుడు కేంద్రం నియమించిన కమిటీ నైల్ తిలాపియా సాగుకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. మొజాంబిక్ తిలాపియా కాదు. అప్పుడు కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం ఇటీవల మొజాంబిక్ తిలాపియా సాగుపై ఆంక్షలు విధించడం సమంజసమే. ► మత్స్య సంపద జీవవైవిధ్యానికి దీని సాగు వల్ల ముప్పు ఉందనే విషయంపై మీ అభిప్రాయం..? జీవవైవిధ్య పరిరక్షణ అత్యవసరమైన అంశమన్నది నా అభిప్రాయం. ఆఫ్రికాలో చాలా సదస్సులు కూడా నిర్వహించాను. అయితే, కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పేర్కొన్న విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకొని సాగు చేస్తే నైల్ తిలాపియా జీవవైవిధ్యానికి ముప్పుగా పరిణమించదన్నది నా అభిప్రాయం. నైల్ తిలాపియా తల్లి చేపల నుంచి రూపొందించిన ‘గిఫ్ట్’ తిలాపియా చేపల సాగుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర ప్రభుత్వాలు కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలనే అనుసరిస్తున్నాయి. అయితే, ఇక్కడ ఉన్న ఒక సమస్య ఏమిటంటే.. మన దేశవాళీ చేపల కన్నా చాలా వేగంగా సంతతిని పెంపొందించుకునే ప్రత్యేక లక్షణం తిలాపియాకు ఉంది. అందువల్లే అవాంఛిత చేప (వీడ్ ఫిష్)గా దీనికి పేరొచ్చింది. 4,5 నెలల వయసులోనే ఇది గుడ్లు పెట్టడం ప్రారంభిస్తుంది. బొచ్చె తదితర కార్పు చేపలకైతే రెండేళ్లు పడుతుంది. తిలాపియా చేప వెయ్యి నుంచి 2 వేల గుడ్లు పెడుతుంది. ఏదైనా ప్రమాదం ఉందంటే పిల్లలను నోట్లో దాచుకొని కాపాడుతుంది. కాబట్టి 95 శాతం పిల్లలు బతుకుతాయి. మన చేపలు గుడ్లు పెట్టి వదిలేస్తాయి. 1 శాతం పిల్లలు మాత్రమే బతకగలుగుతాయి. అందుకని.. ఒక ఏడాదిలోనే తిలాపియా చేపల సంతతి బాగా పెరిగిపోతుంది. మొజాంబిక్ తిలాపియా, నైల్ తిలాపియా రెంటిల్లోనూ ఇదే సమస్య. అందువల్లనే కేంద్ర ప్రభుత్వం మోనో సెక్స్ ‘గిఫ్ట్’ తిలాపియా చేప పిల్లల సాగుకు అనుమతి ఇచ్చింది. ► మోనో సెక్స్ చేప పిల్లలంటే..? చేపల జీవవైవిధ్యానికి నష్టం జరగకుండా ఉండడం కోసం మోనో సెక్స్ (ఏక లింగ) తిలాపియా చేప పిల్లల సాగుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మోనో సెక్స్ అంటే.. పిల్లలన్నీ మగవే ఉంటాయి. హాచింగ్ ప్రక్రియ మొదటి 20 రోజుల్లో పరిమిత మోతాదులో హార్మోన్లు కలిపిన మేత వేస్తారు. దీని వల్ల ఆడ పిల్లలు కూడా మగ పిల్లలుగా మారిపోతాయి. కృష్ణా జిల్లాలోని రాజీవ్‌గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చర్ ఇలా రూపొందించిన ‘గిఫ్ట్’ తిలాపియా చేపలను రైతులకు అందిస్తున్నది. మలేషియా నుంచి మేలైన నైల్ తిలాపియా తల్లి చేపలను దిగుమతి చేసుకుంటున్నారు. స్థానికంగా నేచురల్ సెలక్షన్ ద్వారా జన్యుపరంగా అభివృద్ధి చేసిన ‘గిఫ్ట్’ (జెనిటికల్లీ ఇంప్రూవ్డ్ ఫామ్ తిలాపియా) తిలాపియా పిల్లలను రైతులకు ఇస్తున్నారు (జన్యుమార్పిడి కాదు). రైతులకు ఇచ్చే గిఫ్ట్ తిలాపియా పిల్లల్లో 92 - 95 శాతం వరకు మగవే ఉంటాయి. కాబట్టి తామర తంపరగా సంతతి పెరిగే ప్రమాదం ఉండదు. కొందరు రైతులు థాయ్‌లాండ్ నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నారు. ► లింగ మార్పిడి హార్మోన్ల వల్ల వినియోగదారుల ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదా? చేప పిల్ల పుట్టిన 20 రోజుల్లోగానే మేత ద్వారా పరిమిత మోతాదులో హార్మోన్లు ఇస్తారు. ఆ తర్వాతే చేప పిల్లలు రైతులకు ఇస్తారు. ఆ తర్వాత మామూలు మేతతో పెంచుతారు. కాబట్టి వినియోగదారుల ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో దీనికి మంచి ధర పలుకుతోంది. అమెరికాలో గిఫ్ట్ తిలాపియా చేప కిలో 12 డాలర్లు పలుకుతోంది. ► కాబట్టి ఏ రకంగా చూసినా ‘గిఫ్ట్’ తిలాపియాను దూరంగా ఉంచాల్సిన అవసరం లేదంటారా..? ఏక లింగ తిలాపియా పిల్లలను రైతులకు ఇస్తున్నాం కాబట్టి భయమేమీ అవసరం లేదు. నిశ్చింతగా పెంచుకోవచ్చు, తినొచ్చు. గిఫ్ట్ తిలాపియా పిల్లల్లో కొద్ది శాతం ఆడ పిల్లలు కూడా ఉంటాయి. అందుకే, జీవవైవిధ్య పరిరక్షణ దృష్ట్యా జీవభద్రతా చర్యలు తీసుకోవాలని కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలలో పేర్కొంది. ► రైతు స్థాయిలో తీసుకునే జీవభద్రతా చర్యలు ఏమిటి? రైతులకు ఇచ్చే ‘గిఫ్ట్’ తిలాపియా ఏక లింగ చేప పిల్లల్లో కూడా కొద్ది శాతం మేరకు ఆడ పిల్లలు కూడా ఉంటాయి. అందువల్ల చెరువుల్లో నుంచి నీటిని బయటకు (సరస్సులు, నదుల్లోకి) వదిలేటప్పుడు ఈ చేపలు బయటకు వెళ్లకుండా అరికట్టే జల్లెళ్లను ఏర్పాటు చేయమని చెబుతున్నాం. నీటిని వదిలేసిన తర్వాత చెరువుల్లో సున్నం చల్లుతారు. అప్పటికి ఇంకా చేప పిల్లలు, గుడ్లు ఏమైనా మిగిలి ఉంటే చనిపోతాయి. ఎండగట్టిన చెరువులో తర్వాత మళ్లీ ఏకలింగ చేప పిల్లలు తెచ్చి వేసి పెంచుకుంటారు. కాబట్టి సమస్య ఉండదు. ► గిఫ్ట్ తిలాపియా చేపల సాగులో ఉన్న సౌలభ్యం ఏమిటి? ఏక లింగ తిలాపియాలో ఆడ చేప కన్నా మగ చేప వేగంగా పెరుగుతుంది. ఏక లింగ గిఫ్ట్ తిలాపియా చేప పిల్లలు.. సాధారణ కార్పు చేపల కన్నా వేగంగా పెరుగుతాయి. చెరువుల్లో, ఇళ్ల దగ్గర కుంటల్లో మామూలుగా అయితే 5-6 నెలల్లోనే 150 - 200 గ్రాముల సైజుకు ఎదుగుతాయి. ఇంటెన్సివ్ ఫార్మింగ్‌లో అయితే 4 నెలలకే పెరుగుతుంది. ఎక్కువ విస్తీర్ణంలో పెంచితే కిలో రూ. 50 - 60కే స్థానిక పేద ప్రజలకు అందించవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయడానికి అనువైన కమోడిటీ ‘గిఫ్ట్’ తిలాపియా. 700 - 800 గ్రాముల బరువుకు పెంచితే ఎగుమతి చేయడానికి వీలుగా ఉంటుంది. ముల్లు తీసేసి.. చేప మాంసాన్ని ఎగుమతి చేస్తారు. ► మన దగ్గర నుంచి తిలాపియా ఎగుమతి అవుతోందా? చాలా తక్కువండి. మనం ఇప్పుడు ప్రారంభ దశలోనే ఉన్నాం. కంటూన్యూయస్ సప్లయిస్ ఉంటేనే ఎక్స్పోర్ట్ మార్కెట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. తగిన పరిమాణంలో ఉత్పత్తి పెంచడం, నాణ్యతా ప్రమాణాలు పాటించ గలిగితే తిలాపియా ఎగుమతులు చేయొచ్చు.. ఆంధ్రలో ఫిష్ ఫార్మర్స్ నిజానికి విస్తృతంగా 50 - 200 ఎకరాల్లో పెంచుతున్నారు. అందుకే వీరిని వ్యాపారవేత్తలని పిలవాలి. ‘గిఫ్ట్’ తిలాపియా నిజానికి పావెకరం, అరెకరం, ఎకరం పొలమున్న చిన్న, సన్నకారు రైతులకు అనువైనది. ► తిలాపియా సాగు చిన్న, సన్నకారు రైతులకు ఎలా అనువైనదంటారు? చిన్న చిన్న కుంటలు, దొరువుల్లో కూడా వేగంగా పెంచుకోవచ్చు. ప్రతికూల పరిస్థితులను తట్టుకునే గుణం దీనికుంది. ఆక్సిజన్ కొంచెం తక్కువగా ఉన్నా, నీటి నాణ్యత అంత బాగోలేకపోయినా పెరుగుతుంది. తక్కువ సాంద్రతలో వేసి (ఎక్స్టెన్సివ్ పద్ధతుల్లో) పెంచేటప్పుడు ప్రొటీన్లు అధికంగా ఉండే మేత వేయాల్సిన అవసరం కూడా ఉండదు. అందుకనే దీన్ని పూర్ మాన్ ఫిష్ అంటారు. కాబట్టే ‘గిఫ్ట్’ తిలాపియాకు ‘ఆక్వాటిక్ చికెన్’ అని పేరొచ్చింది. పెరట్లో కోళ్లు సులువుగా పెంచుకుంటాం కదండి.. అలాగే దీన్ని ఇళ్ల దగ్గర చిన్న కుంట ఉన్నా నిశ్చింతగా పెంచుకోవచ్చు. పెద్ద సాంకేతిక పరిజ్ఞానం ఏమీ అక్కర్లేదు. ► మంచినీటి కార్పు చేపలు పెరిగే దాని కన్నా తక్కువ నీటి నాణ్యత ఉన్నా సరిపోతుందా? అవునండి. కొల్లేటి ప్రాంతంలో చేపలను మీటరున్నర - రెండు మీటర్ల లోతు నీటిలో పెంచుతుంటారు. కొంచెం ఆక్సిజన్ తగ్గినా చేపలు చనిపోతూ ఉంటాయి. తిలాపియాకు అంత సమస్య ఉండదు. అర మీటరు నుంచి మీటరు లోతు నీరున్నా, ఆ నీరు అంత నాణ్యంగా లేకపోయినా పెరుగుతాయి. వానాకాలంలో నాలుగైదు నెలలు నీళ్లుండే సీజనల్ చెరువులు కూడా తిలాపియా పంట తీసుకోవచ్చు. అప్పటికే 200 గ్రాముల బరువు వస్తుంది. చెరువు కొద్ది నెలల్లో ఎండిపోతుంది కాబట్టి జీవవైవిధ్యానికీ సమస్య ఉండదు. నీటిని సరస్సులు, నదుల్లోకి వదలకుండా జాగ్రత్తపడితే.. తెలంగాణ వంటి చోట్ల కూడా చెరువుల్లో గిఫ్ట్ తిలాపియా పెంచుకోవచ్చు. ► చిన్న కుంటల్లో చిన్న రైతులు పెంచడానికి వీలైన చేపలు ఇంకేమి ఉన్నాయి? మూల అనే చిన్న చేప ఉంది. విటమిన్-ఎ ఎక్కువగా ఉంటుంది. 3-4 అంగుళాలు పెరుగుతుంది. ఐదారు గ్రాముల బరువు పెరగ్గానే తినొచ్చు. చాలా దేశాల్లో, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో దీన్ని ప్రోత్సహిస్తున్నారు. ఆటో బ్రీడింగ్ దీని ప్రత్యేకత. చెరువులో ఒకసారి వేస్తే చాలు.. దాని సంతతి అలా పెరుగుతూనే ఉంటుంది. వారానికోసారో రెండుసార్లో కొన్ని చేపలు పట్టుకొని తింటూ ఉండొచ్చు. బెంగాల్లో అయితే కూరగాయలతో కలిపి గుప్పెడు చిరు చేపలు వేసి వండుకు తింటారు. అలా పేద ప్రజల్లో విటమిన్-ఎ లోపాన్ని తగ్గించడానికి మూల చేప ఉపకరిస్తుంది. ఆహార భద్రతనిస్తుంది. ఆహార భద్రత అంటే తిండి గింజలను బాగా ఉత్పత్తి చేసి, గోదాముల్లో ముక్క బెట్టడం కాదు. ప్రజలకు అందుబాటులోకి తేవాలి. కొనుగోలు శక్తి లేని పేదలు ఇటువంటి చేపలు పెంచుకునేలా ప్రోత్సహిస్తే పౌష్టికాహార భద్రత కలుగుతుంది. పెరట్లో కుంటలో పెంచుకుంటూ ఉంటే.. సొర, బీరకాయల మాదిరిగా రోజుకు రెండు చేపలు తీసుకొని తింటూ ఉండొచ్చు. చెరువుల్లో వరి తౌడు, చిట్టు చల్లితే చాలు. కొందరు పిట్టు అంటే నూనెగింజల చెక్కను కూడా వరి తౌడులో కలిపి వేస్తుంటారు. కార్పు చేపల సాగులో మేత కూడా వేస్తుంటారు. తౌడులో ప్రొటీన్లు 8-10 % ఉంటాయి. నూనెగింజల పిట్టులో 30-35% వరకు ఉంటుంది. ► కోస్తా తీరప్రాంతంలో భూముల్లో భూగర్భ జలాల్లోకి ఉప్పునీరు చొచ్చుకు రావడం పెనుసమస్యగా ఉంది. ఈ భూముల్లో ఉప్పు నీటితో చేపలు పెంచుకోవచ్చా? పెంచవచ్చు. ‘గిఫ్ట్’ తిలాపియా చేప 15 పీపీటీ మేరకు ఉప్పు సాంద్రతను కూడా తట్టుకొని చక్కగా పెరుగుతుంది (సముద్రపు నీటిలో ఉప్పదనం 35 పీపీటీ మేరకు ఉంటుంది). నీటి ఉప్పదనం అంతకన్నా ఎక్కువ ఉన్నా పెరిగే ఎట్రోప్లస్ (ఉ్టటౌఞఠట), పండుగప్ప వంటి చేపల జాతులు ఉన్నాయి. హర్యానాలో సెలైన్ భూముల్లో చేపలు సాగు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలోని రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చర్ (కేంద్ర ప్రభుత్వ సంస్థ) గిఫ్ట్ తిలాపియా, పండుగప్ప పిల్లలను రైతులకు అందిస్తున్నది. గిఫ్ట్ తిలాపియా పిల్లలు, ఇతర వివరాల కోసం... బి. అప్పలనాయుడు, సహాయ ప్రాజెక్టు మేనేజర్, ఆర్.జి.సి.ఎ. తిలాపియా ప్రాజెక్టు, కొణతనపాడు, ప్రొద్దుటూరు పంచాయతీ, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా, ఆం. ప్ర. మొబైల్ : 98665 30366 E mail: tilapiargca@gmail.com ఇంటర్వ్యూ : పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఫొటోలు : తూనుగుంట్ల దయాకర్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సాక్షి -
మొజాంబిక్ నుంచి పప్పుధాన్యాలు
ప్రధాని మోదీ పర్యటనలో ఒప్పందం * ఉగ్రవాదం ప్రపంచానికి పెనుముప్పన్న నరేంద్ర మోదీ * ఆఫ్రికా దేశం మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్‌తో చర్చలు * పప్పు కొనుగోళ్లు సహా 3 ఒప్పందాలపై సంతకాలు * మొజాంబిక్‌కు నిత్యావసర ఔషధాల విరాళం ప్రకటన మపుటో (మొజాంబిక్): వివిధ దేశాల్లో ఉగ్రవాద దాడులు జరుగుతున్న నేపథ్యంలో.. ప్రపంచానికి ఉగ్రవాదం అతి ప్రమాదకరమైన ముప్పు అని.. అది భారత్, మొజాంబిక్ దేశాలపై ఒకే రకంగా ప్రభావం చూపుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. నాలుగు ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా గురువారం ఉదయం మొజాంబిక్ చేరుకున్న ప్రధాని రాజధాని మపుటోలో ఆ దేశాధ్యక్షుడు ఫిలిప్ న్యూసితో సమావేశమై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. భారత్, మొజాంబిక్‌లు భద్రత, రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని, ఆహార భద్రతపై సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించాయి. ఈ సందర్భంగా ఇరు దేశాలూ మూడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ప్రధానంగా.. భారత్‌లో పప్పు ధాన్యాల కొరత తలెత్తుతున్న పరిస్థితుల్లో మొజాంబిక్ నుంచి పప్పు ధాన్యాలు కొనుగోలు చేసేందుకు దీర్ఘ కాలిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అనంతరం న్యూసీతో కలిసి మీడియాతో మాట్లాడారు. మొజాంబిక్‌కు భారత్ విశ్వసనీయమైన మిత్రదేశమని, ఆధారపడదగ్గ భాగస్వామి అని మోదీ పేర్కొన్నారు. ఈ దేశ ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయటంలో భాగంగా.. ఎయిడ్స్‌కు చికిత్స చేసేందుకు వినియోగించే ఔషధాలు సహా నిత్యావసర ఔషధాలను భారత్ విరాళంగా ఇస్తుందని ప్రకటించారు. అభివృద్ధి, పురోగతి బాటలో మొజాంబిక్‌తో పాటు ప్రతి అడుగులోనూ కలిసి నడుస్తుందంటూ.. ఆ దేశ భద్రతా బలగాల సామర్థ్యాలను పెంపొందించేందుకు భారత్ సాయపడుతుందని చెప్పారు. వ్యవసాయాభివృద్ధికి భారత్ తోడ్పాటు... భారత్, మొజాంబిక్ దేశాలు హిందూ మహాసముద్రం ద్వారా అనుసంధానితమై ఉన్నాయంటూ.. సముద్ర భద్రత సహా కొత్తగా పుట్టుకొస్తున్న భద్రతా సవాళ్ల గురించి మోదీ ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతి భీకరమైన ముప్పు ఉగ్రవాదమని అధ్యక్షుడు న్యూసీ, తాను అభిప్రాయపడ్డామని.. ఈ ప్రమాదానికి భారత్, మొజాంబిక్ దేశాలు అతీతం కాదని మోదీ చెప్పారు. ‘‘ఉగ్రవాద వ్యవస్థలకు ఇతర నేరాలకు సంబంధముంది. ఈ వ్యవస్థలు, ఈ మహమ్మారులపై పోరాటం చేయటంలో భాగంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణకు మేం ఒప్పందం చేసుకున్నాం’’ అని తెలిపారు. వ్యవసాయాభివృద్ధికి తాను ప్రాధాన్యం ఇస్తున్నట్లు న్యూసీ చెప్పారని.. మొజాంబిక్‌లో వ్యవసాయ మౌలికవసతులు, ఉత్పాదకతను ఎలా మెరుగుపరచాలనే అంశంపై ఇరు దేశాల నిపుణులు చర్చలు జరిపారని వివరించారు. మొజాంబిక్ నుంచి పప్పుధాన్యాల కొనుగోలుకు భారత్ కట్టుబడి ఉందని.. ఇది ఈ దేశంలో వాణిజ్య వ్యవసాయంలో దీర్ఘకాలిక పెట్టుబడులకు, వ్యవసాయ ఉపాధి పెరగటానికి, రైతుల ఆదాయాలు పెరగటానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. నిజానికి ఆఫ్రికాలో భారతీయ పెట్టుబడుల్లో దాదాపు నాలుగో వంతు మొజాంబిక్‌లోనే ఉన్నాయన్నారు. న్యూసీ గత ఏడాది ఆసియా పర్యటనలో ముందుగా భారతదేశాన్ని సందర్శించినందున.. తాను కూడా ఇప్పుడు ఆఫ్రికా పర్యటనలో ముందుగా మొజాంబిక్‌కు వచ్చానని మోదీ పేర్కొన్నారు. పోర్చుగీస్ జాతీయ భాషగా ఉన్న మొజాంబిక్‌లో పెట్టుబడులు పెట్టాలనకునే భారతీయ వ్యాపారవేత్తల కోసం భారత దౌత్యకార్యాలయం ఇంగ్లిష్‌లో ముద్రించిన మార్గదర్శకాల పుస్తకాన్ని.. మోదీ ఈ సందర్భంగా న్యూసీకి బహూకరించారు. గత 34 ఏళ్లలో మొజాంబిక్‌ను సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీ. ఈ పర్యటనలో మొజాంబిక్ జాతీయ అసెంబ్లీ అధ్యక్షురాలు వెరోనికా మకామోతో కూడా మోదీ భేటీ అయ్యారు. మొజాంబిక్‌లోని 250 మంది పార్లమెంటు సభ్యుల్లో 93 మంది మహిళలే కావటం పట్ల మోదీ హర్షం వ్యక్తంచేశారు. ఇరు దేశాల మధ్య యువ పార్లమెంటేరియన్ల బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు గల్ఫ్ నేతలకు మోదీ శుభాకాంక్షలు... ఈద్-అల్-ఫితర్‌ను పురస్కరించుకుని గల్ఫ్ దేశాల నేతలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. అబుదాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారని యూఏఈ అధికారిక వార్తాసంస్థ వామ్ తెలిపింది. అలాగే కతార్ ఎమిర్ షస్త్రక్ తామిమ్ బిన్ హమద్ అల్-థానితోనూ మోదీ ఫోన్లో మాట్లాడారు. -
మొపుటో చేరుకున్న ప్రధాని మోదీ
మొపుటో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం మొజాంబిక్ రాజధాని మొపుటో చేరుకున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక నరేంద్రమోదీ తొలిసారి ఆఫ్రికా ఖండంలో పర్యటిస్తున్నారు. 1982 తర్వాత భారత ప్రధాని ఇక్కడ పర్యటించడం కూడా ఇదే ప్రథమం. మొజాంబిక్ రాజధాని మొపుటోలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న ప్రధాని... సాయంత్రం దక్షిణాఫ్రికా వెళతారు. రెండురోజుపాటు ప్రిటోరియా, జొహెన్నస్‌బర్గ్, డర్బన్, పీటర్‌మారిట్జ్ బర్గ్‌ల్లో పర్యటిస్తారు. తర్వాత రెండురోజులు టాంజానియా, కెన్యాల్లో ప్రధాని మోదీ పర్యటన సాగనుంది. ఇండో ఆఫ్రికన్ సంబంధాల బలోపేతమే లక్ష్యంగా.. ఆయాదేశాల అధినేతలతో ప్రధాని మోదీ భేటీ అవుతారు. అక్కడి భారతీయులతోనూ ప్రత్యేకంగా సమావేశమవుతారు. కాగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా అయిదురోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మొజాంబిక్, దక్షిణాఫ్రికా, టాంజానియా, కెన్యాలో పర్యటిస్తారు. -
మొజాంబిక్ తీరంలో ఎంహెచ్ 370 శకలం లభ్యం!
అదృశ్యమైన మలేసియా ఎయిర్‌లైన్స్ బోయింగ్ ఎంహెచ్ 370 విమానానికి చెందినదిగా భావిస్తున్న శకలాన్ని మొజాంబిక్ సముద్రతీరంలో గుర్తించారు. మలేసియా దర్యాప్తు బృందం అధికారులు ఈ శకలం ఫొటోలను పరిశీలిస్తున్నారు. దాదాపు రెండేళ్ల క్రితం ఈ విమానం అదృశ్యమైన సంగతి తెలిసిందే. 2014 మార్చి 8న మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు వెళ్తుండగా ఈ విమానం అదృశ్యమైంది. విమానంలో మొత్తం 239 మంది ఉన్నారు. గతేడాది ఎంహెచ్ 370 విమానానిదిగా భావిస్తున్న శకలం హిందూ మహాసముద్రంలోని రీయూనియన్ దీవిలో కనుగొన్నారు. విమానం రెక్క, తోక భాగాలతో కూడిన శకలం లభ్యమైంది. కాగా మలేసియా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు తమ సిబ్బందిని రంగంలోకి దింపి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినా విమానం కూలిన ప్రాంతాన్ని గుర్తించలేకపోయాయి. 46 వేల చదరపు మైళ్ల పరిధిలో ఇప్పటివరకు ముప్పావు భాగాన్ని శోధించినా ఫలితం లేకపోయింది. -
మొజాంబిక్‌లో మూడు భారత కంపెనీల పెట్టుబడి
600 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్న ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, బీపీసీఎల్ న్యూఢిల్లీ: మొజాంబిక్ తీరంలోని రొవుమ ఏరియా-1 సహజవాయువు క్షేత్రంలో మూడు భారత ప్రభుత్వ సంస్థలు నాలుగేళ్లలో 600 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. ఓఎన్జీసీకి చెందిన ఓఎన్జీసీ విదేశ్, ఆయిల్ ఇండియా, బీపీసీఎల్ కంపెనీలు ఈ స్థాయి భారీ పెట్టుబడులు పెట్టనున్నాయని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం చెప్పారు. ఈ క్షేత్రం నుంచి సహజవాయువును ద్రవీకృత సహజవాయువు(ఎల్ఎన్జీ-లిక్విఫైడ్ నేచురుల్ గ్యాస్)గా మార్చి భారత్ వంటి దేశాలకు ఎగుమతులు చేస్తాయని పేర్కొన్నారు. ఈ సహజవాయువు క్షేత్రంలో ఈ మూడు కంపెనీలకు 30 శాతం వాటా ఉంది. ఈ క్షేత్రంలో 75 ట్రిలియన్ క్యూబిక్ అడుగుల గ్యాస్ నిక్షేపాలున్నట్లు అంచనా. ఇప్పటికే ఈ క్షేత్రంలో 600 కోట్ల డాలర్ల వరకూ పెట్టుబడులు పెట్టామని ప్రధాన్ వివరించారు. ఈ బ్లాక్ నుంచి తొలి ఎల్ఎన్జీ ఉత్పత్తి 2019 మొదట్లో జరిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. రెండు రోజుల మొజాంబిక్ పర్యటన అనంతరం భారత్ వచ్చిన ఆయన ఈ వివరాలు వెల్లడించారు. -
వీడియోకాన్ ‘మొజాంబిక్’ డీల్
న్యూఢిల్లీ: మొజాంబిక్‌లోని భారీ గ్యాస్ క్షేత్రంలో వీడియాకాన్ గ్రూప్‌నకు ఉన్న 10% వాటా... ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా(ఓఐఎల్) చేతికొచ్చింది. ఓఎన్జీసీ అనుబంధ సంస్థ ఓఎన్జీసీ విదేశ్(ఓవీఎల్), ఓఐఎల్లు సంయుక్తంగా ఈ వాటాను కొనుగోలు చేయడంద్వారా డీల్ ప్రక్రియ పూర్తయింది. ఇందుకోసం ఇరు కంపెనీలు కలిసి మంగళవారం 2.475 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.15,300 కోట్లు)ను వీడియోకాన్‌కు చెల్లించిన ట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రొవూమా ఏరియా-1 అనే పేరుతో పిలిచే ఈ మెగా గ్యాస్ బ్లాక్‌లో మరో 10 శాతం వాటాను ఓవీఎల్ 2.64 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అమెరికా ఇంధన దిగ్గజం అనడార్కో పెట్రోలియం నుంచి ఓవీఎల్ ఈ వాటాను చేజిక్కించుకుంది. దీనికి సబంధించిన చెల్లింపులను ఫిబ్రవరి చివరికల్లా పూర్తి చేసే అవకాశం ఉందని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ఈ గ్యాస్ బ్లాక్‌లో కనీసం 35 ట్రిలియన్ ఘనపు టడుగులు(టీసీఎఫ్-ఒక ట్రిలియన్ అంటే లక్ష కోట్లు), గరిష్టంగా 65 టీసీఎల్ల గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్లు అంచనా. రిలయన్స్ కేజీ-డీ6లో నిక్షేపాలతో పోలిస్తే మొజాంబిక్ బ్లాక్‌లో 13 రెట్ల అధిక నిల్వలు ఉన్నట్లు లెక్క. కాగా, వీడియోకాన్ తన 10 శాతం వాటా కోసం 2.8 బిలియన్ డాలర్ల మొత్తాన్ని డిమాండ్ చేసిందని... అయితే, సంప్రతింపుల ద్వారా ఈ మొత్తాన్ని 2.475 బిలియన్ డాలర్లకు తగ్గించగలిగామని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇదే బ్లాక్‌లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్)కు చెందిన అనుబంధ సంస్థకు ఇప్పటికే 10 శాతం వాటా ఉండటం గమనార్హం. -
కావాలనే విమాన్ని కూల్చేసిన పైలట్!!
గత నెలలో నమీబియాలో మొజాంబిక్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఒకటి కుప్పకూలిపోయి, అందులో ఉన్న మొత్తం 33 మంది మరణించిన విషయం గుర్తుంది కదూ. ఆ విమానాన్ని సాక్షాత్తు పైలటే కావాలని కూల్చేశాడట!! మొజాంబిక్ నుంచి అంగోలా వెళ్తున్న ఆ విమానం నమీబియాలోని గేమ్ పార్కులో నవంబర్ 30వ తేదీన కూలిపోయింది. ఆ విమాన పైలట్ కావాలనే ఆ విమానాన్ని కూల్చేసినట్లు బీబీసీ ఆదివారం తన కథనంలో పేర్కొంది. అయితే ఆయనలా చేయడానికి కారణమేంటో ఇంతవరకు తెలియలేదు. ఆ విమానాన్ని ఎలాగైనా కూల్చేయాలని పైలట్ హెర్మినో డాస్ శాంటాస్ ఫెర్నాండెజ్ భావించాడని మొజాంబిక్ పౌర విమానయానశాఖ అధిపతి జావో ఆబ్రూ తెలిపారు. పైలట్ తనను తాను కాక్‌పిట్‌లో బంధించుకున్నారని, కో పైలట్‌ను కూడా లోనికి రానివ్వలేదని ఆయన చెప్పారు. ఆ సమయంలో అలారం మోగిన చప్పుడు, తలుపు పదేపదే బాదిన చప్పుడు వినిపించాయని కూడా తెలిపారు. దీన్నిబట్టి చూస్తే పైలట్ కావాలనే విమానాన్ని కూల్చేసినట్లు స్పష్టం అయ్యిందన్నారు. అంతేకాదు, విమానం ఎగిరే ఎత్తును, దాని వేగాన్ని కూడా ఆయనే మార్చాడని తెలిపారు. ఆ ప్రమాదంలో ఆరుగురు సిబ్బంది, 27 మంది ప్రయాణికులు మరణించారు. -
మొజాంబిక్ గ్యాస్ క్షేత్రంలో ఓవీఎల్‌కు 10% వాటా
న్యూఢిల్లీ: దేశీయ ఆయిల్ రంగ దిగ్గజం ఓఎన్జీసీ మొజాంబిక్ గ్యాస్ క్షేత్రంలో 10% వాటాను సొంతం చేసుకోనుంది. అంతర్జాతీయ అనుబంధ కంపెనీ ఓఎన్జీసీ విదేశీ ద్వారా యూఎస్ సంస్థ అనడార్కో పెట్రోలియం కార్పొరేషన్‌కు గల 10% వాటాను కొనుగోలు చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు 264 కోట్ల డాలర్ల(సుమారు రూ. 17,000 కోట్లు)ను వెచ్చించనుంది. గడిచిన ఏడాది కాలంలో ఓవీఎల్‌కు ఇది నాలుగో డీల్ కావడం విశేషం. గతేడాది సెప్టెంబర్ నుంచి చూస్తే కంపెనీ 1,100 కోట్ల డాలర్ల విలువైన డీల్స్‌ను కుదుర్చుకుంది. మొజాంబిక్లోగల రోవుమా-1 ఆఫ్‌షోర్ క్షేత్రం 65 ట్రిలియన్ ఘనపు అడుగుల గ్యాస్ నిల్వలను కలిగి ఉన్నట్లు అంచనా. ఈ క్షేత్రంలో ఉత్పత్తి అయ్యే గ్యాస్‌ను ఎల్‌ఎన్‌జీగా మార్పుచేసి ఇండియాకు దిగుమతి చేసుకోవాలనేది ఓవీఎల్ ప్రణాళిక. కాగా, ఆయిల్ ఇండియాతో కలిసి జూన్‌లో వీడియోకాన్ గ్రూప్ నుంచి ఇదే బ్లాకులో 10% వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు 247 కోట్ల డాలర్లను చెల్లించనుంది. రోవుమా-1లో ప్రభుత్వ రంగ సంస్థ బీపీసీఎల్‌కు సైతం 10% వాటా ఉంది. వెరసి రోవుమా-1లో దేశీయ కంపెనీలు మొత్తం 30% వాటాను సొంతం చేసుకోనున్నాయి. తద్వారా రోజుకి 60-80 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్‌ను పొందేందుకు వీలు కలగనుంది. ఓఎన్జీసీ ఓవీఎల్ ఏర్పాటయ్యాక 2011 వరకూ మొత్తం 15 దేశాలలో 32 ఆస్తులను కొనుగోలు చేసింది. ఇందుకు 17 బిలియన్ డాలర్లను వెచ్చించింది. ఇక గత ఏడాది కాలంలో మరో 11 బిలియన్ డాలర్లను వెచ్చించడం ద్వారా మరో నాలుగు డీల్స్‌ను కుదుర్చుకోవడం గమనార్హం.