మొపుటో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం మొజాంబిక్ రాజధాని మొపుటో చేరుకున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక నరేంద్రమోదీ తొలిసారి ఆఫ్రికా ఖండంలో పర్యటిస్తున్నారు. 1982 తర్వాత భారత ప్రధాని ఇక్కడ పర్యటించడం కూడా ఇదే ప్రథమం. మొజాంబిక్ రాజధాని మొపుటోలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న ప్రధాని... సాయంత్రం దక్షిణాఫ్రికా వెళతారు. రెండురోజుపాటు ప్రిటోరియా, జొహెన్నస్‌బర్గ్, డర్బన్, పీటర్‌మారిట్జ్ బర్గ్‌ల్లో పర్యటిస్తారు.
తర్వాత రెండురోజులు టాంజానియా, కెన్యాల్లో ప్రధాని మోదీ పర్యటన సాగనుంది. ఇండో ఆఫ్రికన్ సంబంధాల బలోపేతమే లక్ష్యంగా.. ఆయాదేశాల అధినేతలతో ప్రధాని మోదీ భేటీ అవుతారు. అక్కడి భారతీయులతోనూ ప్రత్యేకంగా సమావేశమవుతారు. కాగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా అయిదురోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మొజాంబిక్, దక్షిణాఫ్రికా, టాంజానియా, కెన్యాలో పర్యటిస్తారు.