పెట్రోల్ ట్యాంకర్ పేలుడు.. భారీ ప్రాణ నష్టం | petrol Tanker truck blew up and so many died | Sakshi
Sakshi News home page

పెట్రోల్ ట్యాంకర్ పేలుడు.. భారీ ప్రాణ నష్టం

Published Fri, Nov 18 2016 8:22 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

పెట్రోల్ ట్యాంకర్ పేలుడు.. భారీ ప్రాణ నష్టం - Sakshi

పెట్రోల్ ట్యాంకర్ పేలుడు.. భారీ ప్రాణ నష్టం

మపుటో: పెట్రోల్ లోడ్‌తో చేస్తున్న ఓ ట్యాంకర్ పేలడంతో 73 మందికి పైగా మృతిచెందారు. ఈ ఘోర ప్రమాదం మొజాంబిక్ లోని టెటె ఏరియాలో గురువారం(భారత కాలమానం ప్రకారం) అర్ధరాత్రి సంభవించింది. మొజాంబిక్ లోని బీరా నగరం నుంచి మాలావికి ఓ ట్యాంకర్ పెట్రోల్ లోడ్‌తో వెళ్తుండగా దురదృష్టవశాత్తూ ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.

మార్గం మధ్యలో వాహనాన్ని నిలపగా.. పెట్రోల్ కొనుగోలు చేసేందుకు టెటె గ్రామస్తులు ట్యాంకర్ చుట్టూ గుమిగూడగా ఆ సమయంలో అది పేలడంతో భారీ ప్రాణనష్టం సంభవించగా, డజన్ల కొద్ది ప్రజలు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు వివరించారు. పేలుడు ఘటనపై ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించనుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement