హరారే: ఆఫ్రికా దేశాలైన మొజాంబిక్, జింబాంబ్వే, మలావిలను ‘ఇదాయ్’ తుపాను అతలాకుతలం చేస్తోంది. భారీవర్షాలకు తోడు ఎగువప్రాంతాల నుంచి వరదలు ఒక్కసారిగా పోటెత్తడంతో ఈ మూడుదేశాల్లో 150 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది ప్రజలు గల్లంతయ్యారు. మూడుదేశాల్లో దాదాపు 15 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇదాయ్ తాకిడితో వేలాది ఇళ్లతో పాటు రహదారులు, వంతెనలు ధ్వంసం కాగా, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో చాలాప్రాంతాలు అంధకారంలోకి జారిపోయాయి. విమానాశ్రయాల్లో భారీగా వరదనీరు నిలిచిపోవడంతో ఆహారసామగ్రి, మందులు, ఇతర నిత్యావసరాలు తీసుకొచ్చేందుకు తీవ్రఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్మీతో పాటు రెడ్‌క్రాస్, ఇతర స్వచ్ఛంద సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment