africa countries
-
మాయరోగం... మరోసారి!
అవును... మళ్ళీ మరో మాయరోగం బయటకొచ్చింది. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీపాక్స్ (ఎంపాక్స్) తాజాగా విజృంభించింది. స్వీడన్ నుంచి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ దాకా అనేక ప్రాంతాలకు విస్తరించింది. ఫలితంగా, ప్రపంచం మరోసారి ఉలిక్కిపడింది. దీన్ని ఆందోళన చెందా ల్సిన అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా రెండేళ్ళలోనే రెండోసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించాల్సొచ్చింది. భారత్ సైతం ఎయిర్‌పోర్ట్‌లు, ఆస్పత్రుల్ని అప్రమత్తం చేసి, కాంగో సహా మధ్య ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల ఆరోగ్యంపై కన్నేసింది. మాస్కుల ధారణ, చేతుల పరిశుభ్రత, గుంపుల్లో తిరగకపోవడం లాంటి ముందుజాగ్రత్తలే శ్రీరామ రక్ష అని మంకీపాక్స్ మరోసారి గుర్తుతెచ్చింది. తరచూ తలెత్తుతున్న ఈ వైరస్ల రీత్యా ఔషధ పరి శోధన, ఆరోగ్య వసతుల కల్పనపై మరింత పెట్టుబడి పెట్టాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పింది. ప్రపంచంపై ఎంపాక్స్ పంజా విసరడం ఇప్పటికిది మూడోసారి. అసలు 15 నెలల పైచిలుకు క్రితం ఇది ఇక ఆందోళన చెందాల్సినది కాదని డబ్ల్యూహెచ్ఓ తేల్చింది. తీరా ఇటీవల కొద్ది వారాలుగా వైరస్ పునర్ విజృంభణతో ఆగస్ట్ 14న మరోసారి అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సి వచ్చింది. దీనికి కారణం లేకపోలేదు.2023 సెప్టెంబర్ నుంచి కేసులు పెరుగుతున్నాయి. పైగా గతంలో 2022–23లో ప్రపంచాన్ని చుట్టుముట్టినప్పటితో పోలిస్తే, ఈసారి జన్యుపరంగా విభిన్నమైన వైరస్ (క్లాడ్ 1బి వేరియంట్) దీనికి కారణమవుతోంది. ఈ సాంక్రమిక వ్యాధి గతంలో ఒకరి నుంచి మరొకరికి లైంగిక సంపర్కం ద్వారానే వ్యాపించేది. కొత్త వేరియంట్ ఇప్పుడు రోగితో స్పర్శ, దగ్గరగా మాట్లాడడం, రోగి వాడిన దుస్తులు, దుప్పట్లు వాడడం ద్వారా కూడా వ్యాపిస్తున్నట్టు నిపుణుల మాట. మరణాల రేటూ మునుపటి కన్నా పెరిగింది. ఈ ఒక్క ఏడాదే 116కి పైగా దేశాల్లో 15,600కి పైగా కేసులు నమోదయ్యాయి. 500 పైచిలుకు మంది ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్రికాలో నిరుటితో పోలిస్తే ఇప్పుడు మరణాలు 160 శాతం పెరిగాయి. ప్రపంచంలో దాదాపు 70 లక్షల మందికి పైగా మరణానికి కారణమైన కోవిడ్ లానే మంకీపాక్స్‌కూ జనం భయపడుతున్నది అందుకే!ఏడాది ౖక్రితం అత్యవసర పరిస్థితిని ఎత్తివేసినప్పుడే ఎంపాక్స్‌పై దీర్ఘకాలిక నిఘా, నియంత్రణ ప్రణాళికలు అవసరమని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ వ్యాధి సాంక్రమిక రోగ విజ్ఞానంపై ఇంకా పూర్తిగా అవగాహన లేదంటూ ప్రజారోగ్య నిపుణులు, వైరస్ శాస్త్రవేత్తలు సైతం హెచ్చరించారు. అయినా సరే ఈ రోగాన్ని కనిపెట్టే పరీక్షల్ని మెరుగుపరచడం, టీకాలు – యాంటీ వైరల్ మందులకు సంబంధించి క్లినికల్ పరీక్షలపై దృష్టి పెట్టడం, టీకాల తయారీని విస్తరించడం లాంటి చర్యలేవీ ఆచరణలో పెట్టలేదు. ఈ అంతర్జాతీయ నిర్లక్ష్యమే ఇప్పుడు శాపమైంది. ఇవాళ్టికీ మంకీపాక్స్‌కు టీకాల సరఫరా పరిమితం. నియంత్రణకు కోటి డోసుల అవసరం ఉంటే, 2.1 లక్షల డోసులే తక్షణం అందుబాటులో ఉన్నాయట. డోసులు దానం చేస్తామని యూరోపియన్ యూనియన్, అమెరికాలు వాగ్దానం చేశాయి కానీ, వ్యాక్సిన్లపై ఇప్పటికీ కొన్ని అధికాదాయ దేశాల గుత్తాధిపత్యమే సాగుతోంది. అత్యవసరంలో ఉన్న అనేక దేశాలకు అది పెద్ద దెబ్బ. ఆఫ్రికాలో అవసరమున్నా యూరోపియన్ దేశాల్లోనే టీకాలను మోహరించడమే అందుకు ఉదాహరణ. కోవిడ్ కాలంలో లానే ఇప్పుడూ పేదదేశాలకు సాంకేతికత బదలాయింపు జరగట్లేదు. టీకాలకై పెనగులాట తప్పట్లేదు. మహమ్మా రుల కట్టడికి ఒక సమానత్వ ఒప్పందంపై ప్రపంచ దేశాలు విఫలమైతే దెబ్బతినేది ప్రజారోగ్యమే!మన దేశంలోనూ ఈ ఏడాది మంకీపాక్స్ కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులేవీ లేవనీ, మన దగ్గర ఇది పెద్దయెత్తున రాకపోవచ్చనీ అంచనా. అయినా అప్రమత్తత తప్పదు. కేంద్రం ఇప్పటికే ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిపి, చర్యలు ప్రారంభించింది. రోగ నిర్ధారణ వసతు లతో పాటు, ఆరోగ్య బృందాల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తోంది. అక్కడితో ఆగకుండా ప్రజల్లో చైతన్యం కల్పించాలి. రాష్ట్రాలతో అన్ని రకాల కీలక సమాచారాన్ని పంచుకోవాలి. నిజానికి, ఇలాంటి వైరస్ల విజృంభణ వేళ వ్యవహరించాల్సిన తీరుపై కోవిడ్ విలువైన పాఠాలే నేర్పింది. ఇన్ఫెక్షన్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. అలాగే, కేసుల వివరాలను సమగ్రంగా నమోదు చేయాలి. ప్రాథమిక అంశాలే అనిపించినా, ఇవే అతి ముఖ్యం. కోవిడ్‌లో లాగా కాక ఈసారైనా రోగ నిర్ధారణ కిట్లు, టీకాలు వర్ధమాన దేశాలకు సక్రమంగా చేరితేనే ఉపయోగం. సరిహద్దులు దాటి సులభంగా విస్తరించే ఇలాంటి మాయదారి రోగాలను కట్టడి చేయాలంటే అన్నిచోట్లా సమస్థాయిలో ప్రయత్నాలు జరగడం కీలకం. వ్యాధి సోకిన, సోకే అవకాశం ఉన్న వర్గాలన్నిటికీ టీకాలు అందుబాటులో ఉంచి, సంరక్షణ చేపట్టేలా ఆర్థిక, విధానపరమైన అండదండలు కావాలి. సత్వర, కీలక చర్యలు చేపట్టడమే ముఖ్యమనేది కోవిడ్ నేర్పింది. అందులోనూ ఇలాంటి మాయరోగాలకు ముకుతాడు వేయాలంటే, తొలి 100 రోజుల్లోని ఆచరణే అతి ముఖ్యం. ఎప్పటికప్పుడు స్వరూప స్వభావాల్ని మార్చుకుంటున్న ఎంపాక్స్ ఆఫ్రికా సమస్య, కేసులు బయట పడ్డ కొన్ని దేశాల తలనొప్పి అనుకుంటే పొరపాటు. ఇది ప్రపంచానికే ముప్పు అని ముందు గుర్తించాలి. ‘ఇది మరో కరోనా కాదు’ అంటూ డబ్ల్యూహెచ్ఓ అంటున్నా, వైరస్ విజృంభణ ధోరణులు భయపెడుతున్నాయి. టీకాలు, చికిత్సలు లేకుండా ఆఫ్రికా దేశాలను వాటి ఖర్మానికి వదిలేయడం దుస్సహం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ సమన్వయంతో కట్టడికి కృషి చేయాలి. అత్యవసర ఆరోగ్య పరిస్థితి అని ప్రకటించడంలోని అసలు ఉద్దేశం అదే! జంతుజాల వైరస్లు పదే పదే ఎందుకు తలెత్తుతున్నాయో దృష్టి పెట్టాల్సి ఉంది. విస్మరిస్తే మనకే కష్టం, నష్టం. పారాహుషార్! -
దేశానికి లౌకిక పౌరస్మృతి తక్షణావసరం.. : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఆఫ్రికా దేశాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితి
సిడ్నీ: ప్రాణాంతక మంకీపాక్స్ (ఎంపాక్స్) ఆఫ్రికా దేశాలను వణికిస్తోంది. కాంగోలో 450 మందిని పొట్టనబెట్టుకున్న ఈ వ్యాధి ఇతర దేశాలకు వేగంగా వ్యాప్తి చెందుతోంది. మధ్య, తూర్పు ఆఫ్రికా దేశాల్లో ఎంపాక్స్ విస్తరణ పెరుగుతున్నట్లు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ఆయా దేశాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించింది. యూరప్ దేశమైన స్వీడన్‌లోనూ ఒక ఎంపాక్స్ కేసు వెలుగులోకి వచ్చింది! దీని వ్యాప్తిని అడ్డకోవడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి పనిచేయాలని డబ్ల్యూహెచ్ఓ పిలుపునిచ్చింది. ఎంపాక్స్‌లో క్లేడ్–2 కంటే క్లేడ్–1 ప్రమాదకరం. గత సెపె్టంబర్లో క్లేడ్–2బీ వేరియంట్ పుట్టుకొచి్చంది. ఎంపాక్స్ సోకితే ఫ్లూ తరహా లక్షణాలు కనిపిస్తాయి. కాళ్లు, చేతులపై కురుపులు, పుండ్లు ఏర్పడతాయి. బాధితులతో లైంగిక సంబంధాలు, దగ్గరగా వెళ్లడం, శ్వాస పీల్చడం వల్ల వైరస్ సోకుతుంది. ప్రతి 100 కేసుల్లో కనీసం నలుగురు మరణించే ప్రమాదముంది. ఎంపాక్స్ నియంత్రణకు వ్యాక్సిన్ వచి్చనా అది పరిమితంగానే లభిస్తోంది. కాంగో, బురుండి, కెన్యా, రువాండాలకు వ్యాపించింది. ఎంపాక్స్‌ను ఇంకా మహమ్మారిగా ప్రకటించలేదు. -
Africa : పాత దుస్తులే వాళ్లకి ఫ్యాషన్!
సాక్షి, అమరావతి: అమెరికా, చైనా వంటి అగ్ర దేశాల్లో వాడేసి వదిలేసిన పాత దుస్తులే ఆఫ్రికా ప్రజలకు కొత్త ఫ్యాషన్. దీంతో ఆఫ్రికా ఖండాన్ని సెకండ్ హ్యాండ్ వ్రస్తాలు ముంచెత్తుతున్నాయి. అక్కడి వ్యాపారస్తులు విదేశాల నుంచి టన్నుల కొద్దీ పాత దుస్తుల్ని దిగుమతి చేసుకుని పెద్దఎత్తున వ్యాపారం చేస్తున్నారు. ఇలా వచ్చిన వాటిలో 50 శాతం పైగా వాడుకోవడానికి వీలుగా లేక పోవడంతో చెత్తకుప్పలుగా మిగిలిపోతున్నాయి. ఆ దుస్తులు ఆఫ్రికాలోని పర్యావరణానికి సవాలు విసురుతున్నాయి. వాస్తవానికి ప్రపంచంలో అత్యంత నాణ్యమైన పత్తిని ఆఫ్రికా దేశాల్లోనే పండిస్తున్నా.. పేదరికం కారణంగా అక్కడి ప్రజలు మాత్రం దిగుమతి చేసుకున్న సెకెండ్ హ్యాండ్ దుస్తులతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇక్కడి పరిస్థితులను మెరుగు పరిచేందుకు ఇటీవల ‘ఆఫ్రికన్ కాంటినెంటల్ ఫ్రీ ట్రేడ్ ఏరియా’ ద్వారా ఖండం అంతటా సెకండ్ హ్యాండ్ దుస్తుల వ్యాపారాన్ని నిషేధించాలని నిర్ణయించినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. లక్షల టన్నుల్లో దిగుమతి ఆఫ్రికా ఖండంలో మాగ్రెబ్ (అరబ్ సంస్కృతి గల దేశాలు), సబ్ సహారా దేశాలు ఉన్నాయి. 2021లో మాగ్రెబ్ దేశాల్లో సెకండ్ హ్యాండ్ దుస్తుల మొత్తం దిగుమతులు సుమారు 107 మిలియన్ డాలర్లు కాగా, సబ్ సహారాలో 1,734 మిలియన్ డాలర్లుకు పైగా ఉంది. ‘గ్రీన్‌పీస్ ఆఫ్రికా’ సంస్థ సర్వే ప్రకారం మడగాస్కర్ ఏటా లక్ష టన్నుల సెకండ్ హ్యాండ్ దుస్తులను దిగుమతి చేసుకుంటే, కెన్యా 900 మిలియన్ల దుస్తులు, ఘనా 720 మిలియన్ల పాత దుస్తులను దిగుమతి చేసుకుంటున్నాయి. పాత వ్రస్తాల దిగుమతిపై సరైన చట్టాలు లేకపోవడం, చెత్తగా మిగిలిన వాటిని ప్రాసెస్ చేయడంపై సరైన పరిజ్ఞానం లేకపోవడంతో ఈ దేశాలు సెకండ్ హ్యాండ్ దుస్తుల చెత్త కుప్పలుగా మారుతున్నాయి. దిగుమతైన దుస్తుల్లో 60% పైగా ప్లాస్టిక్ కలిసిన వ్రస్తాలే ఉండడంతో వాటిని తగులబెట్టినా.. భూమిలో పాతిపెట్టినా పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ట్రాషన్: ది స్టెల్త్ ఎక్స్పోర్ట్ ఆఫ్ వేస్ట్ ప్లాస్టిక్ క్లాత్స్ టు కెన్యా’ నివేదిక ఆఫ్రికాకు సెకండ్ హ్యాండ్ దుస్తుల దిగుమతులు డిమాండ్‌ను మించిపోయాయని, అవి ఇక్కడి పర్యావరణ వ్యవస్థను దెబ్బతీస్తున్నట్టు ప్రకటించింది. ఈ వ్యర్థాల వల్ల నదులు, సముద్రాలు, పట్టణాలు, అడవులు, ప్రజల ఆరోగ్యం కలుíÙతమవుతున్నట్టు నివేదించింది. ఈ దేశాల్లో 2029 నాటికి సెకెండ్ హ్యాండ్ దుస్తుల వార్షిక విలువ 27.5 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. ఇది ఆఫ్రికా మొత్తం ఆదాయంలో 12.4 శాతం. ఆఫ్రికాలో రెండో అతిపెద్ద ఉపాధి రంగం పేదరికం తాండవించే ఆఫ్రికా దేశాల్లో చవకైన దుస్తులకు డిమాండ్ ఉంది. అక్కడ వ్యవసాయం తర్వాత సెకండ్ హ్యాండ్ వస్త్రాల మార్కెట్టే అతిపెద్ద ఉపాధి రంగం. ఈ తరహా దుస్తులకు అతిపెద్ద ఎగుమతిదారు బ్రిటన్. ఆ దేశం నుంచి 14 మిలియన్ టన్నులు, అమెరికా నుంచి 7 లక్షల టన్నులు వాడేసిన దుస్తులను ఏటా ఆఫ్రికాకు ఎగుమతి చేస్తుండగా, యూరోపియన్ యూనియన్, చైనా తర్వాతి స్థానంలో ఉన్నాయి. భారత్, పాకిస్తాన్ నుంచి కూడా ఆఫ్రికాకు ఈ వ్రస్తాలు ఎగుమతి అవుతున్నాయి. ఒక్క ఘనా దేశానికే ప్రతివారం యూరప్, యూఎస్, ఆ్రస్టేలియా నుంచి 15 మిలియన్ల సెకండ్ హ్యాండ్ వస్త్రాలు ఎగుమతి అవుతున్నాయి. సెకెండ్‌హ్యాండ్ దుస్తులను ఎక్కువగా దిగుమతి చేసుకునే కెన్యాలో ప్రతిరోజూ 4 వేల టన్నుల వస్త్ర వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. కెన్యా ప్రభుత్వానికి సెకండ్ హ్యాండ్ వ్రస్తాల దిగుమతి, ఇతర దేశాలు విరాళంగా ఇచ్చిన వాటిపై విధించే పన్ను ముఖ్య ఆదాయ వనరు. ఈ దేశంలో 91.5 శాతం కుటుంబాలు సెకండ్ హ్యాండ్ దుస్తులను కొనుగోలు చేస్తున్నాయని అంచనా. పత్తి ప్రధాన ఉత్పత్తిదారైన జింబాబ్వే పెట్టుబడుల కొరత కారణంగా 85 శాతం పత్తిని ఎగుమతి చేస్తూ, 95 శాతం వ్రస్తాలు దిగుమతి చేసుకుంటోంది. గ్రీన్‌పీస్ ఆఫ్రికా 2022లో ఇచ్చిన నివేదిక ప్రకారం ఆఫ్రికా దేశాలకు విరాళంగా ఇచ్చే సెకెండ్ హ్యాండ్ దుస్తుల్లో 40 శాతం పైగా ధరించేందుకు పనికిరానివే. వాటిని బహిరంగ ప్రదేశాల్లో వదిలేయడమో, నదుల్లో పారవేయడమో చేస్తున్నారు. -
నాలుగు రోజుల గ్యాప్‌లో 6వేల మంది మృతి!
రెండూ ఆఫ్రికన్ దేశాలే. కానీ, ప్రకృతి ప్రకోపానికి తీరని నష్టంతో తల్లడిల్లిపోతున్నాయి. కేవలం నాలుగే రోజుల వ్యవధిలో.. ఈ రెండు దేశాల్లో ఆరు వేలమంది ప్రాణాలు పోయాయి. ఒకవైపు మొరాకోలో సంభవించిన భూ విలయం.. మరోవైపు లిబియాలో పోటెత్తిన జల విలయం.. వేల మందిని బలిగొనడమే కాకుండా.. ఊహించని స్థాయిలో ఇరు దేశాలకు నష్టం కలగజేశాయి. ఆఫ్రికా దేశం లిబియాలోని దెర్నా నగరాన్ని వరదలు ఒక్కసారిగా ముంచెత్తాయి. ఒక్క ఆ నగరంలో వరదల ధాటికి 2 వేల మందికిపైగా మృతి చెందారు. మిగతా అన్నిచోట్లా కలిపి మృతుల సంఖ్య వెయ్యికి పైనే ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ మరణాలు కాకుండా.. కొన్ని వేల మంది గల్లంతయ్యారు. 48 గంటలు గడిచినా వాళ్ల జాడపై ఇంకా స్పష్టత రాలేదు. జాడ లేకుండా పోయిన వాళ్ల సంఖ్య పదివేలకు పైనే ఉండొచ్చని అధికారిక వర్గాల అంచనా. అంటే.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయని లిబియా ప్రధాని ఒసామా హమద్ చెబుతున్నారు. మధ్యధరా సముద్రంలో సంభవించిన డేనియల్ తుపాను.. లిబియాను అతలాకుతలం చేస్తోంది. తుపాను ధాటికి వారం రోజులుగా ఆ దేశంలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. దెర్నా సహా ప్రధాన నగరాలను డిజాస్టర్ జోన్‌గా ప్రకటించారు. ఒక్కసారిగా డ్యామ్‌లు తెగిపోయి ఉప్పెన.. ఊళ్లను ముంచెత్తింది. జనాలు ఎటూ తప్పించుకోలేని పరిస్థితుల్లో ప్రాణాలు పొగొట్టుకున్నారు. దెర్నాలో అయితే వరద పెను విలయం సృష్టించింది. మరోవైపు విద్యుత్ లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపింది. తాగు నీరు, ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నట్లు వెల్లడించింది. దేశంలో మరికొన్ని రోజులపాటు భారీ వర్షాలు పడనున్నట్లు అక్కడి వాతావరణ శాఖ ప్రకటించడంతో.. జనం బిక్కుబిక్కమంటూ గడుపుతున్నారు. మొరాకోలో మృత్యుఘోష శుక్రవారం రాత్రి మొరాకోలో సంభవించిన భూకంపం.. 3 వేల మందికిపైగా ప్రజల ప్రాణాల్ని బలితీసుకుంది. సహయాక చర్యల్లో ఇంకా మృత దేహాలు బయటపడుతూనే ఉన్నాయి. దీంతో ప్రకృతి విలయం దాటిచ మృతుల సంఖ్య ఇంకా పెరిగేలా కనిపిస్తోంది. భూకంపం వచ్చి నాలుగు రోజులు గడుస్తుండడంతో.. బాధితులు సజీవంగా బయటపడతారన్న ఆశలు కనుమరుగైపోయాయని అధికారులు అంటున్నారు. మొరాకోలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మర్రాకేశ్‌కు నైరుతి దిశగా 71 కిలోమీటర్ల దూరంలో శుక్రవారం రాత్రి ఈ పెను విపత్తు సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రత నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం ధాటికి అల్ హౌజ్, మర్రాకేశ్, క్వార్జాజేట్, అజిలాల్ సహా పలు ప్రాంతాలు వణికిపోయాయని తెలిపింది. దీంతో చాలా భవనాలు నేలమట్టం అయ్యాయి. -
G20 Summit: ఇకపై జీ20 కాదు.. జీ21
న్యూఢిల్లీ: భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న జీ20 సదస్సులో ఆఫ్రికా యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం కల్పించే విషయమై ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదన చేయగా సభ్యదేశాలు ఆమోదాన్ని తెలిపాయి. అనంతరం భారత విదేశాంగ శాఖమంత్రి జైశంకర్ ఆఫ్రికన్ యూనియన్ (AU) ఛైర్పర్సన్ అజాలి అసోమానిని ఆయనకు కేటాయించిన కుర్చీలో కూర్చోబెట్టారు. దీంతో 20 సభ్యుల జీ20లో ఆఫ్రికా యూనియన్ చేరికతో 21 సభ్యులయ్యారు. మొరాకోలో విషాదం.. 18వ శిఖరాగ్ర జీ20 సమావేశాల్లో అతిధులకు స్వాగతం పలుకుతూ ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వాగత సందేశంలో మొదట మొరాకోలో సంభవించిన భూకంపం పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తూ బాధితులకు సానుభూతి తెలిపి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపాన్ని ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో మొరాకోకు భారత్ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. వెల్కమ్ ఆఫ్రికా.. అనంతరం 55 దేశాల సమూహమైన ఆఫ్రికా యూనియన్ వారికి జీ20లో శాశ్వత సభ్యత్వం విషయాన్ని ప్రధాని మోదీ ప్రకటించగా.. సభ్యదేశాలు ఈ ప్రతిపాదనను ఆమోదించాయి. అనంతరం ప్రధాని మోదీ యూనియన్ ఆఫ్ కొమొరోస్ ప్రెసిడెంట్, ఆఫ్రికన్ యూనియన్ ఛైర్పర్సన్ అజాలి అసోమానిని జీ20 హై టేబుల్లో కూర్చోవాల్సిందిగా కోరారు. సభ్యదేశాల ప్రతినిధుల కరతాళధ్వనుల మధ్య భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ అసోమానీని తన సీటు వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. భారత్ చొరవ.. జీ20లో ఆఫ్రికా యూనియన్ దేశాల సభ్యత్వం విషయమై ప్రధాని మోదీ ఎంతో చొరవ చూపించారు. ఆఫ్రికా దేశాలకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కోరుతూ ఆయన జీ20 నాయకులకు గతంలో లేఖ రాశారు. జులైలో శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన ముసాయిదా ప్రకటనలో ఈ ప్రతిపాదనను కూడా చేర్చారు. ఈరోజు సభ్య దేశాల ఆమోదంతో దాదాపు 130 కోట్ల జనాభా కలిగిన అఆఫ్రికా యూనియన్ దేశాలు జీ20 కూటమిలో చేరి ప్రపంచానికి మరింత చేరువైంది. The African Union officially joins the #G20 as a permanent member. Chair of the 2023 #G20 Summit, PM Modi of India, welcomed the AU during the Inaugural Session of the #G20, saying that this development will strengthen the #G20 and also strengthen the voice of the Global South.… pic.twitter.com/fyojy1fHuY — Presidency | South Africa 🇿🇦 (@PresidencyZA) September 9, 2023 ఇది కూడా చదవండి: G20 Summit: ఢిల్లీ డిక్లరేషన్‌లో గొప్పేముంది? -
ఈ భేటీ జీ20 కుటుంబానికి మైలురాయి.. ఎందుకంటే..
ఢిల్లీ: ఆఫ్రికన్ యూనియన్ను శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోవడం G20 కుటుంబానికి ఒక మైలురాయి అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన రెండు రోజుల G20 శిఖరాగ్ర సదస్సు ప్రారంభ సెషన్లో ప్రసంగించిన ప్రధాని మోదీ.. 55 దేశాల ఆఫ్రికన్ యూనియన్ను కూటమిలో కొత్త సభ్యుడిగా స్వాగతించారు. గ్లోబల్ సౌత్‌కు కొత్త ఆశలను కల్పిస్తున్న ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్ అజలీ అసోమానీకి స్వాగతం తెలిపారు. Advancing a more inclusive G20 that echoes the aspirations of the Global South! PM @narendramodi extends a heartfelt welcome to President @_AfricanUnion and the President of Comoros Azali Assoumani. Thrilled to have the African Union as a permanent member. A milestone for the… pic.twitter.com/SqwziRCwiT — PMO India (@PMOIndia) September 9, 2023 'G20లో పూర్తి సభ్యునిగా ఆఫ్రికన్ యూనియన్ ప్రవేశాన్ని స్వాగతిస్తున్నాను. ఈ సభ్యత్వం కోసం కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నాము. ఆఫ్రికా ఖండానికి ప్రపంచ సేవలు అందడమే కాకుండా సవాళ్లపై ఆఫ్రికా దేశాలు పోరాడేలా పరస్పర సహకారాలు అందుతాయి.' అని ట్విట్టర్ వేదికగా ఆఫ్రికన్ యూనియన్ కమీషన్ హెడ్ మౌసా ఫకీ మహమత్ అన్నారు. గత కొన్నాళ్లుగా గ్లోబల్ సౌత్ ప్రాతినిధ్యంపై భారత్ వాయిస్ వినిపిస్తోంది. జీ20 కేవలం 20 దేశాలకు సంబంధించిన విషయం కాదని, వెనకబడిన గ్లోబల్ సౌత్ కోసం పాటుపడేలా ఉండాలని ప్రధాని మోదీ గత డిసెంబర్లోనే అన్నారు. ప్రపంచ వేదికలపై విదేశాంగ మంత్రి జై శంకర్ కూడా ఇదే విషయాన్ని పలుమార్లు స్పష్టం చేశారు. I welcome the @_AfricanUnion's entry into the #G20 as full member. This membership, for which we have long been advocating, will provide a propitious framework for amplifying advocacy in favor of the Continent and its effective contribution to meeting global challenges. — Moussa Faki Mahamat (@AUC_MoussaFaki) September 9, 2023 ఢిల్లీ వేదికగా నేడు జీ20 సమావేశం ప్రారంభమైంది. ప్రపంచ దేశాల నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభ సెషన్లో మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆఫ్రికన్ యూనియన్ జీ20 కూటమిలో భాగస్వామిగా చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆఫ్రికా కూటమికి ఆహ్వానం పలికారు. ఇదీ చదవండి: కంటికి ఐ ప్యాచ్‌తో జీ20 సదస్సుకు జర్మనీ ఛాన్సలర్.. ఎందుకంటే! -
'భారత్' అభివృద్ధి చెందుతున్న దేశాల స్వరం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారతదేశం ఆతిధ్యమిస్తున్న ప్రతిష్టాత్మక జీ20 సదస్సు ప్రారంభానికి ప్రధాని మోదీ ఒక డిజిటల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటు జీ20లో భాగస్వాములు కానీ దేశాల ప్రయోజనాల కోసం సైతం భారతదేశం తాపత్రయ పడుతోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలతో పాటు జీ20లో భాగస్వాములు కాని వెనబడిన ఆఫ్రికా దేశాల ప్రయోజనాలను కూడా భారతదేశం ముందుకు తీసుకు వెళ్తుందని అన్నారు. ప్రపంచ భౌగోళిక రాజకీయాల కారణంగా ఉద్రిక్తత పెరిగిన నేపథ్యంలో జీ20 సదస్సులో అభివృద్ధి చెందుతున్న దేశాల స్వరాన్ని వినిపించడానికి భారత్, ఇండోనేషియా, భారత్, బ్రెజిల్ త్రయం సిద్ధమైందని అన్నారు. ఈ జీ20 త్రయం గతేడాది సమావేశాలకు ఆతిధ్యమిచ్చిన ఇండోనేషియా, ఇప్పుడు ఆతిధ్యమిస్తున్న భారత్ వచ్చే ఏడాది ఆతిధ్యమివ్వనున్న బ్రెజిల్ దేశాలను సూచిస్తుందన్నారు. మా తొమ్మిదేళ్లుగా పాలనలో ‘సబ్కా సాథ్' 'సబ్కా వికాస్' 'సబ్కా విశ్వాస్' 'సబ్కా ప్రయాస్’ విధానాలను అనుసరించాము. ఇప్పుడు ఇదే సూత్రాన్ని ప్రపంచ దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి కూడా అమలు చేయాలనుకుంటున్నామన్నారు. మేము జీ20 కోసం ఇదే మా ఎజెండా అని తెలిపినప్పుడు ప్రపంచ దేశాలన్నీ స్వాగతించాయన్నారు ప్రధాన మంత్రి. జీ20 సమాఖ్యలో ఆఫ్రికా దేశాల సభ్యత్వం విషయంలో ప్రధాని మోదీ ఎంతో చొరవ చూపించారు. ఆఫ్రికా దేశాలకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కోరుతూ ఆయన జీ20 నాయకులకు లేఖ కూడా రాశారు. జులైలో శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన ముసాయిదా ప్రకటనలో ఈ ప్రతిపాదనను కూడా చేర్చారు. సెప్టెంబర్ 9,10 తేదీల్లో ఢిల్లీలో జరిగే సమావేశాల్లో దీనిపై తుదినిర్ణయం వెలువడే అవకాశముంది. మొత్తం 19 దేశాలు పాల్గొనే జీ20 సమావేశాల్లో ప్రధానంగా వాతావరణ మార్పులు, ప్రతికూల పరిస్థితుల్లో ఆయా దేశాలకు రుణ సహాయం, క్రిప్టోకరెన్సీ నియమాలు, బ్యాంకు సంస్కరణలతోపాటు నల్ల సముద్రం గుండా ఉక్రెయిన్‌కు బియ్యం ఎగుమతి.. తదితర అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఇది కూడా చదవండి: ఎవరితో పెట్టుకుంటున్నారో వారికి తెలియాలి -
ఆదిమ ఖండంలో... నియంత పాలనలు
సైనిక తిరుగుబాట్లతో ఆఫ్రికా ఖండం అతలాకుతలం అవుతోంది. కొన్నేళ్లుగా ఇక దేశం తర్వాత ఒక దేశంలో ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసి సైనిక నియంతలు అధికారం చేజిక్కించుకుంటున్నారు. బుర్కినా ఫాసో మొదలుకుని తాజాగా గబాన్ దాకా ఈ జాబితా నానాటికీ పెరుగుతూనే పోతోంది. ఆ సైనిక కుట్రల పట్ల ఆయ దేశాల్లో పెద్దగా వ్యతిరేకత కూడా వ్యక్తం కాకపోవడం విశేషం. పైగా యువ ఆఫ్రికన్లు ఈ పరిణామాన్ని రెండు చేతులా స్వాగతిస్తుండటం విస్మయకర వాస్తవం... ► పశ్చిమ ఆఫ్రికాలోని నైగర్‌లో సైనిక తిరుగుబాటు జరిగి నెలన్నర కూడా కాలేదు. అప్పుడే ఆదిమ ఖండంలో మరో కుట్ర. మధ్య ఆఫ్రికా దేశం గాబాన్లో గత ఆదివారమే ఎన్నికలు జరిగాయి. బుధవారం ఉదయమే ఫలితాలు వెలువడ్డాయి. 2009 నుంచీ దేశాన్ని పాలిస్తూ వస్తున్న అధ్యక్షుడు అలీ బొంగో ఒండింబా మరోసారి తన అధికారాన్ని నిలుపుకున్నారు. ఆయన పార్టీ ఘన విజయం సాధించినట్టు టీవీల్లో అధికారిక ప్రకటన వెలువడింది. దాంతో ఆయన అభిమానులు పండుగ చేసుకున్నారు. కానీ నిమిషాల్లోనే పరిస్థితి పూర్తిగా తిరగబడింది. ఈసారి సైనికాధికారులు టీవీ తెరపైకి వచ్చారు. బొంగోను అదుపులోకి తీసుకుని ఆయన అధికారిక నివాసంలోనే ఖైదు చేసినట్టు, పాలనా పగ్గాలు తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అలా మరో ఆఫ్రికా ఖండంలో ప్రజాస్వామ్యం మరోసారి పరిహాసానికి గురైంది. మరో దేశం సైనిక కుట్రను చవిచూసింది. వరుస సైనిక కుట్రలు ఆఫ్రికాలో, ముఖ్యంగా పశ్చిమ, సెంట్రల్ ఆఫ్రికాలో కొన్నేళ్లుగా సైనిక కుట్రలు పరిపాటిగా మారాయి. ► గత జూలై 26న నైగర్ అధ్యక్షుడు మొహమ్మద్ బజొమ్ను ఆయన సొంత ప్రెసిడెన్షియల్ బాడీ గార్డులే నిర్బంధంలోకి తీసుకున్నారు. ► 2022 జనవరిలో బుర్కినా ఫాసో అధ్యక్షుడు రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోరేనుఆ దేశ సైన్యాధ్యక్షుడే బందీని చేసి అధికారం చేజిక్కించుకున్నాడు. అయితే 8 నెలల్లోనే కింది స్థాయి సైనికాధికారులు అతన్ని కూడా జైలుపాలు చేసి అధికారాన్ని పంచుకున్నారు! ► 2012 సెపె్టంబర్లో గినియాలో అధ్యక్షుడు ఆల్ఫా కొండేను ప్రత్యేక సైనిక బృందాలు ఖైదు చేసి పాలనా పగ్గాలను తమ చేతుల్లోకి తీసుకున్నాయి. ► 2021 మేలో మాలిలో కల్నల్ అసిమి గొయిటా కూడా సైనిక కుట్రకు పాల్పడ్డాడు. అంతకుముందు కూడా ఇలా ప్రభుత్వాన్ని పడదోసిన చరిత్ర అతనిది. ► 2021 ఏప్రిల్‌లో చాద్ రిపబ్లిక్లో కూడా అధ్యక్షుడు ఇద్రిస్ దెబీ ఇట్నో మృతి కారణంగా అనిశ్చితి ఏర్పడటంతో సైన్యం జోక్యం చేసుకుంది. అయితే, ఆయన కుమారుడే అధికార పగ్గాలు చేపట్టేలా చక్రం తిప్పి రంగం నుంచి తప్పుకుంది. పాలనపై తమ ఆధిపత్యాన్ని మాత్రం నిరి్నరోధంగా కొనసాగిస్తూనే ఉంది! ఆఫ్రికాలోనే ఎందుకిలా? కేవలం గత మూడేళ్లలో ఆఫ్రికాలో కనీసం 5 దేశాల్లో సైనిక కుట్రలు జరిగా యి. ఇందుకు పలు కారణాలు కనిపిస్థాయి కూడా... ► సంప్రదాయ పాలక వర్గపు మితిమీరిన అవినీతి, ఆశ్రిత పక్షపాతం తదితర పోకడలతో ఆఫ్రికా యువత తీవ్రంగా విసిగిపోయింది. ► అదే సమయంలో ఇటు జనాదరణలోనూ, అటు ఆర్థికంగా కూడా ఆయా ప్రభుత్వాలు బలహీనపడుతూ వచ్చాయి. ఈ పరిస్థితిని సైనిక పెద్దలు అవకాశంగా మలచుకున్నారు ► ప్రజల్లో, ముఖ్యంగా పట్టణ ప్రాంత యువతలో అధికార పారీ్టల పట్ల ఉన్న ఏహ్య భావాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ...అందుకే ఆఫ్రికా యువతలో అసంతృప్తి! ఆఫ్రికా యువతలో ప్రజాస్వామిక ప్రభుత్వాల పట్ల నెలకొన్న తీవ్ర అసంతృప్తికి కారణాలు లేకపోలేదు... ► ఉపాధి అవకాశాల లేమి ► పెచ్చరిల్లిన అవినీతి ► అధిక వర్గాల్లోనూ వారి మితిమీరిన ఆశ్రిత పక్షపాతం ► ఈ దేశాల్లో చాలావరకు మాజీ ఫ్రెంచి వలస రాజ్యాలే. దాంతో వాటిపై ఇప్పటికీ చాలా విషయాల్లో ఫ్రాన్స్ ప్రభావం కొనసాగుతోంది. ఇది కూడా యువతకు మింగుడు పడడం లేదు. ► ఎలాగైనా అధికారాన్ని నిలుపుకోవడానికి పాలక పార్టీలు చేస్తున్న అక్రమాలతో జనం మరింతగా విసిగిపోయారు. దశాబ్దాలుగా బొంగోల రాజ్యమే! గాబన్పై బొంగో కుటుంబం ఒకరకంగా అర్ధ శతాబ్దానికి పైగా గుత్తాధిపత్యం చెలాయించిందనే చెప్పాలి. ► అలీ బొంగో 14 ఏళ్లుగా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు! ఇది ఆయ నకు మూడో టర్ము. 2018లోనే స్ట్రోక్‌కు గురైనా అధికారాన్ని మాత్రం వీడలేదు. ► అయితే దేశాన్ని ఆధునీకరణ బాట పట్టించేందుకు ఆయన ప్రయత్నాలు చేయకపోలేదు. కానీ జనం ఆకాంక్షలను నెరవేర్చేందుకు అవి సరిపోలేదు. ► అలీ తండ్రి ఒమర్ బొంగో అయితే ఏకంగా 40 ఏళ్లకు పైగా నియంతలా దేశాన్ని పాలించారు! 2009లో ఆయన మరణానంతరం జరిగిన ఎన్నికల్లో అలీ తనను తాను విజేతగా ప్రకటించుకున్నారు. కానీ నిజానికి విపక్ష నేత ఆంద్రే ఎంబా ఒబామే నెగ్గారని చెబుతారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఇటలీ తీరంలో పడవ బోల్తా.. ఇద్దరి మృతి
మిలాన్: ఇటలీ సముద్ర తీరానికి సమీపంలో రెండు పడవలు నీటమునిగాయి. రెండు పడవల్లో ఒకదాంట్లో 48 మంది మరో దాంట్లో 42 మంది వలసదారులు ప్రయాణిస్తున్నారని వారిలో 57 మందిని కాపాడిన ఇటలీ తీరప్రాంత రక్షణ దళాలు ఓ తల్లీ బిడ్డలను మాత్రం కాపాడలేకపోయామని గల్లంతైన మరో 30 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నామని ఇటలీ కోస్ట్ గార్డులు తెలిపారు. వయా ట్యునీషియా.. స్ఫాక్స్ బీచ్ తీరంలో గత వారం 10 మృతదేహాలను కనుగొన్నామని ట్యునీషియా పోర్టు గుండా ఇటలీకి చేరుకోవడం సులభం కాబట్టి అక్రమ వలసదారులు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెబుతున్నారు స్ఫాక్స్ అధికారులు. తాజాగా ఈ రెండు పడవలు కూడా ట్యునీషియా పోర్టు నుండే ఇటలీ వైపుగా వచ్చాయని అవి లంపెడుసా ద్వీపం దాటగానే ఉరుములు మెరుపులతో సముద్రంలో అలజడి రేగడంతో అలల తాకిడికి అందులో ప్రయాణిస్తున్న 90 మంది వలసదారులతో సహా పడవలు బోల్తా పడ్డాయన్నారు. కోస్ట్ గార్డుల సాహసం.. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఇటలీ తీర రక్షణ దళాలు హుటాహుటిన స్పందించి 57 మందిని రక్షించగలిగామని తెలిపారు స్ఫాక్స్ అధికారులు. కానీ ప్రమాదంలో ఓ తల్లీ బిడ్డలను మాత్రం కాపాడలేకపోయామని. వారి మృతదేహాలు మాత్రం లభ్యమయ్యాయని తెలిపారు. పడవలోని మిగిలిన 30 మంది గల్లంతు కాగా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇలా అయితే ఎలా? ఈ రెండు పడవల్లోని వలసదారులు సహారా-ఆఫ్రికా దేశాలకు చెందిన వారే అయి ఉంటారని, ఎంతగా ప్రయత్నించినా ఆఫ్రికా దేశాల నుండి ఈ అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయలేకున్నామని తెలిపారు ఇటలీ వలసల విచారణాధికారి ఇమ్మానుయేల్ రిసిఫారీ. వారాంతా మెరుగైన జీవితం కోసమే ఇటు వస్తున్నారు. అదేదో చట్టబద్దంగా వస్తే బాగుంటుంది కానీ దొడ్డిదారిన రావడం వల్లనే ఇలా ప్రమాదాల బారిన పడుతున్నారని అన్నారు. డిమాండ్ ఎక్కువ.. ఎందరో వలసదారులు చనిపోతున్నారని సముద్రంలో ప్రమాదాలను నివారించడానికి నౌకలను ఏర్పాటు చేయడం కూడా అక్రమ వలసలను ప్రోత్సహిస్తున్నట్లే ఉంది. పొరుగు దేశానికి వలసలంటే భయపడేవారు కూడా ధైర్యంగా అడుగేసి ఇటు వైపుగా కదులుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ అక్రమ వలసలు రెట్టింపయ్యాయి. 2022లో 42,600 మంది వలస వచ్చినట్లు రికార్డుల్లో నమోదు కాగా ఈ ఏడాది మాత్రం 92,000 మందికిపైగా వలస వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. Migrants rescued from rough seas off Italy. Reports say dozens could still be missing at sea, while more stranded migrants were airlifted from rocks on the island of Lampedusa. Read more: https://t.co/cJMUPoyyWL pic.twitter.com/lbXo28Rbrd — Sky News (@SkyNews) August 7, 2023 ఇది కూడా చదవండి: మొరాకోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి.. -
మా వాళ్లనే అరెస్ట్ చేస్తారా? ఢిల్లీ పోలీసులపై 100 మంది ఆఫ్రికన్ల దాడి!
న్యూఢిల్లీ: వీసా గడువు ముగిసినా దేశ రాజధానిలో ఉంటున్న ముగ్గురు నైజీరియన్లు అదుపులోకి తీసుకుంది యాంటీ డ్రగ్స్ ఫోర్స్. దీంతో దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమవారిని అరెస్ట్ చేస్తున్నారని తెలిసి సుమారు 100 మంది ఆఫ్రికన్లు పోలీసులను చుట్టు ముట్టారు. నైజీరియన్లను వారి నుంచి విడిపించేందుకు పోలీసులకు చుక్కులు చూపించారు. దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని స్వదేశం పంపించేందుకు నెబ్‌సరాయ్‌లోని రాజుపార్క్‌కు శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు నార్కొటిక్స్ సెల్ బృందం వెళ్లింది. వీసా గడువు ముగిసిన ముగ్గురు నైజీరియన్లను తమ అదుపులోకి తీసుకున్నారు. అప్పుడే పోలీసులను 100 మంది ఆఫ్రికన్లు చుట్టుముట్టారు. వారిని వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ గందరగోళ పరిస్థితుల్లోనే ముగ్గురిలో ఇద్దరు పోలీసుల చెర నుంచి తప్పించుకున్నారు. 22 ఏళ్ల పిలిప్ అనే వ్యక్తి దొరికిపోయాడు. పోలీసులపై మూకదాడి సమాచారం అందుకున్న నెబ్సరాయ్ పోలీస్ స్టేషన్ బృందం, నార్కొటిక్స్ స్క్వాడ్ సాయంత్రం 6.30 గంటలకు రాజ్‌పార్క్‌కు చేరుకుంది. ఓ మహిళతో పాటు మొత్తం నలుగురు నైజీరియన్లను అదుపులోకి తీసుకుంది. మళ్లీ సుమారు 150-200 మంది ఆఫ్రికన్ దేశాల ప్రజలు పోలీసులను చుట్టుముట్టారు. పోలీసుల చెరలో ఉన్న వారు తప్పించుకునేందుకు సాయం చేశారు. వారిని చెదరగొట్టిన పోలీసులు నిందితులను నెబ్సరాయ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి వారిని స్వదేశాలకు పంపించనున్నారు. Delhi Cops Arrest 3 On Drug Charge, Foreigners' Mob Brings Them Back https://t.co/Ggnt34m0rC pic.twitter.com/tFJLQBcF1L — NDTV (@ndtv) January 8, 2023 ఇదీ చదవండి: రాజౌరీ: హిందువులే లక్ష్యంగా దాడులు.. కేంద్రం కీలక నిర్ణయం.. గ్రామ రక్షణ కమిటీల పునరుద్ధరణ -
వంట చేసిన రామ్ చరణ్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఇటీవల టాలీవుడ్ నటులు ఎక్కువగా వ్యాకేషన్లో కనిపిస్తున్నారు. షూటింగ్‌లతో ఎప్పుడు బిజీగా ఉండే హీరోలు కాస్త ఫ్రీ టైం దొరికితే విదేశాలకు చెక్కెస్తున్నారు. ఇటీవలే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మాల్దీవులకు వెళ్లి రాగా.. టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు సైతం లండన్‌లో వ్యాకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో ఆర్ఆర్ఆర్ హీరో రామ్ చరణ్ సైతం చేరిపోయారు. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్‌లో ఉన్నారు. జపాన్‌లో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న స్టార్ హీరో ఒక్కసారిగా టాంజానియాలో సందడి చేస్తూ కనిపించారు. (చదవండి: జపాన్‌లో రామ్ చరణ్ వీరాభిమాని.. ఆమె ప్రతిభకు చెర్రీ ఫిదా) ఆయన సతీమణి ఉపాసనతో కలిసి టాంజానియాలో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను రామ్ చరణ్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతోంది. టాంజానియాలోని ఓ జూలో జీప్ నడుపుతున్న వీడియో క్లిప్‌ను పోస్ట్ చేశాడు. అక్కడే స్థానికులతో కలిసి రామ్ చరణ్ వంట చేస్తూ సందడి చేశారు. అనంతరం తన కెమెరాతో అక్కడి వన్యప్రాణుల చిత్రాలను కూడా బంధించారు. ఈ మెగా హీరో 'పేరులేని ఆఫ్రికా' అంటూ పోస్ట్‌కు క్యాప్షన్ కూడా ఇచ్చాడు. నల్లటి టీ-షర్టు, నీలిరంగు జాకెట్ ధరించిన చెర్రీ కొత్త లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
Mumbo Jumbo: ముంబో జంబో.. ఈ ఇడియమ్ ఎప్పుడైనా వాడారా? అర్థం తెలిస్తే!
English Idioms- Mumbo Jumbo: అర్థం పర్ధం లేని మాటలు, పనులు, తెలివి తక్కువ నిర్ణయాలు, గందర గోళ పరిస్థితి, నవ్వులాటగా తోచే సీరియస్ పనులు... మొదలైన సందర్భాలలో ఉపయోగించే జాతీయం ఇది. 1738లో ఫ్రాన్సిస్ మూర్ అనే రచయిత ఈ ఎక్స్ప్రెషన్ను మొదటిసారిగా ఉపయోగించాడు. పశ్చిమ ఆఫ్రికాలో మూఢాచారాలు అనిపించే క్రతువులు కొన్ని ఉండేవి. అలాంటి వాటిలో ముంబో జంబో ఒకటి. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న అర్థంలో ఈ ఇడియమ్‌ను ఫ్రాన్సిస్ ఉపయోగించలేదు. ఆ తరువాత మాత్రం ‘నాన్సెన్స్’ అనిపించే పనులు, మాటల విషయాల్లో ఉపయోగిస్తున్నారు. ఉదా: 1. వాటిజ్ ఆల్ దిస్ ముంబో జంబో? 2. ఇట్ ఈజ్ నాట్ ముంబో జంబో యాజ్ సమ్ పీపుల్ థింక్.. మరి మీరు ఎపుడైనా ఈ ఇడియమ్‌ను ఉపయోగించారా? సమ్‌థింగ్ స్పెషల్.. పాత ఫొటోలు పాడయ్యాయా? ప్రతి ఇంట్లోనూ ఫొటో ఆల్బమ్స్ ఉంటాయి. వాటిలో చాలా పాత ఫోటోలు పాడై పోయి ఉంటాయి. ఇమేజ్ రిస్టోరేషన్ మెథడ్స్ వల్ల కొత్త ఫోటో వచ్చినప్పటికీ, దీనికి, ఒరిజినల్‌కు తేడా బాగా కనిపిస్తుంది. ఒరిజినల్‌కు, కొత్త ఇమేజ్‌కు పెద్ద తేడా లేకుండా సహజంగా ఉండడానికి gfp- యాప్ ఫ్రీ ఏఐ టూల్స్ ఉపకరిస్తాయి. ఎక్కడ ఏది అవసరమో (ఫిల్ ఇన్‌ది గ్యాప్స్) క్షణాల వ్యవధిలో సమకూరుస్తాయి ఈ ఏఐ టూల్స్. ప్రతీకాత్మక చిత్రం ఆర్ట్ అండ్ కల్చర్: అయ్యయ్యో! క్యూబా ఆర్టిస్ట్ ఆల్ఫ్రెడో మార్టిరెనా పర్యావరణ స్పృహతో ఎన్నో కార్టూన్లు గీశాడు. వాటిలో మీరు చూస్తున్న కార్టూన్ ఒకటి. ప్రపంచ జనాభా ఊహించని రీతిలో పెరిగిపోతుంది. పల్లెలు మాయమై పట్టణాలు ఇరుకు అవుతున్నాయి. చెట్లు మాయం అవుతున్నాయి. ఎటు చూసినా కాంక్రిట్ జంగిల్. దాని ప్రతికూల ప్రభావం ఏమిటో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది పచ్చదనం రూపంలో కాస్త ప్రాణవాయువు. అట్టి విషయాన్ని ఈ కార్టూన్ ఎంత చక్కగా చెప్పిందో! చదవండి: Pubarun Basu: నాలుగేళ్ల వయసులో మొదలెట్టాడు.. అద్భుతం ఆవిష్కృతం! అంతర్జాతీయ స్థాయిలో! -
Covid-19:అసలైన కరోనా వ్యాక్సిన్లను గుర్తించడం ఇలా..
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్లకు నకిలీలు పుట్టుకురావడం ఆందోళన కలిగిస్తోంది. నకిలీ వ్యాక్సిన్లతో ఆరోగ్యానికి ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో నకిలీ కోవిïÙల్డ్ వ్యాక్సిన్లను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) రెండు వారాల క్రితం వెల్లడించింది. ఈ నేపథ్యంలో అసలైన టీకాలను కనిపెట్టడం ఎలా అన్నదానిపై కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. భారత్‌లో ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుతి్నక్–వి టీకాలను ప్రజలకు ఇస్తున్నారు. కోవిషీల్డ్‌ను పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్, కోవాగ్జిన్‌ను హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ ఉత్పత్తి చేస్తున్నాయి. అసలైన టీకాలను ఎలా గుర్తించాలో చూద్దాం.. కోవిషీల్డ్ ► లేబుల్ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ► వయల్‌పై అల్యూమినియం మూత పైభాగం కూడా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ► ట్రేడ్‌మార్కుతో సహా కోవిషీల్డ్ అనే బ్రాండ్ నేమ్ స్పష్టంగా కనిపిస్తుంది. ► జనరిక్ పేరు బోల్డ్ ఆక్షరాల్లో కాకుండా సాధారణంగా ఉంటుంది. ► సీజీఎస్ నాట్ ఫర్ సేల్ అని ముద్రించి ఉంటే అసలైనదిగా గుర్తించాలి. ► వయల్‌పై లేబుల్ అతికి ఉన్నచోట ఎస్ఐఐ లోగో కనిపిస్తుంది. ► ఎస్ఐఐ లోగో నిట్టనిలువుగా కాకుండా కొంత వంపుగా ఉంటుంది. ► లేబుల్‌పై కొన్ని అక్షరాలను ప్రత్యేకమైన తెల్ల సిరాతో ముద్రిస్తారు. ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. సులభంగా చదవొచ్చు. ► మొత్తం లేబుల్‌పై తేనెపట్టు లాంటి చిత్రం ఒక ప్రత్యేకమైన కోణంలో చూస్తే కనిపిస్తుంది. కోవాగ్జిన్ ► లేబుల్‌పై డీఎన్ఏ నిర్మాణం లాంటి చిత్రం అతినీలలోహిత కాంతిలోనే కనిపిస్తుంది. ► లేబుల్‌పై సూక్ష్మమైన చుక్కలతో కోవాగ్జిన్ అని రాసి ఉంటుంది. కోవాగ్జిన్ అని రాసి ఉన్న హోలోగ్రామ్ కూడా అతికించి ఉంటుంది. -
ట్విట్టర్ బ్యాన్: అసలు కారణం ఇదేనా?
అబూజా: ఆఫ్రికన్ కంట్రీ నైజీరియా.. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తమ అధ్యక్షుడు బుహారీ ట్వీట్‌ను తొలగించిన కారణంగానే ట్విట్టర్ కార్యాకలాపాలను నిలిపివేస్తున్నట్లు నైజీరియా ప్రభుత్వం ప్రకటించింది. అయితే నైజీరియా నిర్ణయంపై సొంత ప్రజలు అంసతృప్తి వ్యక్తం చేస్తుండగా.. ప్రపంచం మొత్తం నివ్వెరపోతోంది. అయితే ఇది అసలు కారణం కాదనే వాదన ఒకటి వెలుగులోకి వచ్చింది. నిజానికి ట్విట్టర్‌పై నైజీరియా సర్కార్ గుర్రుగా ఉంది అధ్యక్షుడి ట్వీట్ డిలీట్ వ్యవహారంతో మాత్రమే కాదని ఆ వాదన సారాంశం. గత కొన్నేళ్లుగా నైజీరియాలోని లాగోస్ ఆఫ్రికాలోనే అత్యంత ఆకర్షణనీయమైన టెక్ హబ్‌గా పెట్టుబడిదారులను ఆకర్షిస్తూ వస్తోంది. కానీ, ఈ ఏప్రిల్‌లో ట్విట్టర్ ఆఫ్రికాలో తన రీజినల్ హెడ్‌క్వార్టర్ కోసం లాగోస్ కాకుండా.. ఘనాను ఎంచుకుంది. దీనిపై నైజీరియా వివరణ కోరగా.. ఘనా ప్రభుత్వం బయటి పెట్టుబడులను ఆకర్షించడంలో ముందుందని ట్విట్టర్ కారణం చెప్పింది. నిజానికి ట్విట్టర్ వివరణను సమర్థించడానికి బోలెడు కారణాలున్నాయి. అయినప్పటికీ నైజీరియా ఆ విషయంలో దారుణంగా హర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో తాజా ట్వీట్ డిలీట్ వ్యవహారం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. దెబ్బ నైజీరియాకే! ఇక ట్విట్టర్ బ్యాన్ వివాదంతో నైజీరియా టెక్ రంగం సంక్షోభంలో పడే అవకాశం లేకపోలేదని నిపుణులు చెప్తున్నారు. ఇరవై కోట్లకు పైగా జనాభా ఉన్న నైజీరియాలో స్మార్ట్ ఫోన్ యూజర్ల శాతం 60కి పైనే ఉంది. మరోవైపు టెక్ పెట్టుబడులతో లాగోస్ ఆర్థికాభివృద్ధికి బీజం వేసింది. ఆఫ్రికాకే అతిపెద్ద ఆర్థిక కేంద్రంగా అవతరించింది. ఇలాంటి తరుణంలో నైజీరియా ట్విట్టర్ బ్యాన్ నిర్ణయంతో.. విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2016లో నైజీరియా టూర్లో మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్బుక్ ఆఫీస్ ప్రారంభించబోతున్నట్లు ప్రకటించాడు. 2021 ద్వితియార్థంలో అది జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫేస్బుక్ పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. తాజా పరిస్థితుల తర్వాత నైజీరియా ప్రతినిధులు ఫేస్బుక్ హెడ్ క్వార్టర్స్‌కు సందేశం పంపగా.. అక్కడి నుంచి బదులు లేకపోవడంతో ఇది దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు చెప్తున్నారు. ఇక ఇదే బాటలో మరికొన్ని టెక్ సంస్థలు లాగోస్ నుంచి వెనక్కి వెళ్లే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి నైజీరియా దూకుడు నిర్ణయం వల్ల 170 మిలియన్ డాలర్ల మేర విదేశీ పెట్టుబడులు వెనక్కిపోయే ప్రమాదం నెలకొన్నట్లు వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు. -
దారుణం: ప్రియుడిని చంపి ఆ భాగాలతో బిర్యానీ..
రబాత్: ఉత్తర ఆఫ్రికాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మరో యువతితో పెళ్లికి సిద్దమైన ప్రియుడిని హత్య చేసిన మహిళ అనంతరం అతడి ప్రైవేటు భాగాలను బిర్యాని వండిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అంతేగాక ఆ బిర్యానినీ భవన నిర్మాణ కార్మికులకు పెట్టిన ఈ సంఘటన విని పోలీసులు సైతం విస్తుపోయారు. వివరాలు.. ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోకు చెందిన 30 ఏళ్ల మహిళ ఏడేళ్లుగా ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో అతడు మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నట్లు ఆమె అనుమానించింది. ఇదే విషయం ప్రియుడిని అడుగగా అతడు ఆ యువతిని పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో ఆ మహిళ ప్రియుడితో గొడవపడింది. ఈ క్రమంలో అతడిని హత్య చేసింది. అయితే ఈ విషయం బయటరాకుండా ఉండేందుకు అతడి మృతదేహాన్ని మాయం చేయాలనుకుంది. దీంతో అతడి శరీరాన్ని ముక్కలుగా కోసి అతడి ప్రైవేటు భాగాలు(పురుషాంగం, వృషణాలు)తో బిర్యానీ వండింది. దానిని పక్కనే భవన నిర్మాణం పనులు చేస్తున్న కూలీలకు వడ్డించింది. ఆ తర్వాత మిగిలిన శరీరా భాగాలను కుక్కలకు వేసింది. అయితే ఆ వ్యక్తి ఎంతకి ఇంటికి రాకపోవడం, అతడి ఫోన్ కూడా స్విచ్చాఫ్ రావడంతో మృతుడి కుటుంబ సభ్యులు అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి ఆచూకి కనిపించకపోవడంతో సదరు మహిళపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు మహిళ ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులు మిక్సీలో దంతాలు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని పరీక్షించగా అవి మృతుడివే అని తేలడంతో పోలీసుల ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితురాలు చెప్పిన విషయాలకు పోలీసులు కూడా షాకయ్యారు. దీంతో సదరు మహిళపై కేసు నమోదు చేసి ఆమె మానసిక పరిస్థితి తెలుసుకునేందుకు పోలీసులు ఆస్పత్రికి తరలించారు. చదవండి: సంబంధం పెట్టుకోవాలని కానిస్టేబుల్ వేధింపులు డబ్బు వివాదం: కుటుంబంతో కలిసి భర్త హత్య -
‘ఇదాయ్’ తాకిడికి 150 మంది మృతి
హరారే: ఆఫ్రికా దేశాలైన మొజాంబిక్, జింబాంబ్వే, మలావిలను ‘ఇదాయ్’ తుపాను అతలాకుతలం చేస్తోంది. భారీవర్షాలకు తోడు ఎగువప్రాంతాల నుంచి వరదలు ఒక్కసారిగా పోటెత్తడంతో ఈ మూడుదేశాల్లో 150 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది ప్రజలు గల్లంతయ్యారు. మూడుదేశాల్లో దాదాపు 15 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇదాయ్ తాకిడితో వేలాది ఇళ్లతో పాటు రహదారులు, వంతెనలు ధ్వంసం కాగా, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో చాలాప్రాంతాలు అంధకారంలోకి జారిపోయాయి. విమానాశ్రయాల్లో భారీగా వరదనీరు నిలిచిపోవడంతో ఆహారసామగ్రి, మందులు, ఇతర నిత్యావసరాలు తీసుకొచ్చేందుకు తీవ్రఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్మీతో పాటు రెడ్‌క్రాస్, ఇతర స్వచ్ఛంద సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. -
సరికొత్త సహకారం దిశగా...
వలస పాలకులపై పోరాడటంలో, ప్రకృతి వనరుల్లో, జన సంపదలో ఎన్నో సారూ ప్యతలున్న భారత్-ఆఫ్రికా దేశాల మధ్య సాన్నిహిత్యాన్ని మరింత పెంచే శిఖరాగ్ర సదస్సుకు నేటినుంచి మూడు రోజులపాటు న్యూఢిల్లీ వేదిక కాబోతున్నది. శతాబ్దా లుగా ఆఫ్రికా దేశాలతో మన దేశానికి సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలున్నాయి. అక్కడ వివిధ రంగాల్లో పనిచేస్తున్న భారతీయులు దాదాపు 27 లక్షలమంది. మన దేశంతో పోలిస్తే విస్తీర్ణంలో పది రెట్లు ఎక్కువగా...ఇంచుమించు మన జనాభాతో సమానంగా(జన సంఖ్య 110 కోట్లు) ఉండే ఆఫ్రికా దేశాలతో వాణిజ్య బంధానికి పదును పెట్టేందుకు 2008లో తొలి భారత్-ఆఫ్రికా ఫోరం శిఖరాగ్ర సమ్మేళనం జరి గింది. 2011లో ఇథియోపియా రాజధాని ఆడిస్ అబాబాలో తదుపరి శిఖరాగ్ర సదస్సు జరిగింది. వాస్తవానికి మూడో సదస్సు నిరుడు డిసెంబర్లో నిర్వహించాలని భావించారు. అయితే ఆ సమయంలో ఆఫ్రికా ఖండాన్ని ఎబోలా మహమ్మారి పట్టి పీడిస్తుండటంతో...దాదాపు అన్ని దేశాలూ దాని నిర్మూలనపై దృష్టి పెట్టడంతో ఆ సదస్సును వాయిదా వేయక తప్పలేదు. ఆఫ్రికా దేశాలతో బహుళ రంగాల్లో చేయీ చేయీ కలిపి నడిచేందుకు అంతర్జా తీయంగా భారత్-ఆఫ్రికా ఫోరం తరహాలోనే మరో మూడు పని చేస్తున్నాయి. అవి-యూరప్ దేశాలతో కూడిన ఈయూ-ఆఫ్రికా సమ్మేళనం, అమెరికా-ఆఫ్రికా సమ్మేళనం, చైనా-ఆఫ్రికా సహకార ఫోరం(ఎఫ్ఓసీఏసీ). ఈ మూడింటిలోనూ ఎఫ్ఓసీఏసీ మిగిలినవాటికన్నా చాలా ముందు ఆవిర్భవించడమే కాదు...విస్తృతిరీ త్యా కూడా చాలా పెద్దది. చైనా నాయకులకుండే ముందు చూపు అలాంటిది. వారు 2000 సంవత్సరంలోనే ఎఫ్ఓసీఏసీని ఏర్పాటు చేసి ఆఫ్రికా ఖండంలోని దాదాపు 46 దేశాలతో వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకున్నారు. అక్కడి మౌలిక సదుపా యాల రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సహకా రం అందజేశారు. 2006 నాటికి 500 కోట్ల డాలర్లుండే చైనా ఆర్థిక సాయం ఇప్పుడు 2,000 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇదికాక రైల్వే లైన్లు, ఓడరేవులు, జాతీయ రహ దార్ల నిర్మాణాల్లో ఆ దేశం పాలుపంచుకుంటోంది. చైనా రైల్వే నిర్మాణ సంస్థ నిరు డు నైజీరియాలో 1,200 కోట్ల డాలర్ల ప్రాజెక్టును చేజిక్కించుకుంది. ఆఫ్రికా ఖండమంతా దాదాపుగా చైనా వేళ్లూనుకున్నాక 2008లో యూపీఏ ప్రభుత్వ హయాంలో భారత్-ఆఫ్రికా ఫోరం ఆవిర్భవించింది. దీని ఫలితం ప్రోత్సాహకరంగానే ఉన్నా...2011లో రెండో సదస్సు కూడా జరిగినా సంబంధాలు ఎదగవలసినంతగా ఎదగలేదు. ప్రస్తుతం 41 దేశాల్లో 137 ప్రాజెక్టుల ద్వారా మన దేశ పెట్టుబడుల విలువ 750 కోట్ల డాలర్లు మాత్రమే. యూపీఏ సర్కారు హయాం లో మన విదేశాంగ విధానంలో ఏర్పడిన జడత్వమే ఇందుకు కారణం అనుకో వచ్చు. 1,300 కోట్ల డాలర్లతో ఈయూ...ఎంతో ఆలస్యంగా నిరుడు ప్రవేశించినా 900 కోట్ల డాలర్ల పెట్టుబడులతో అమెరికా వరసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. వచ్చే డిసెంబర్లో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో చైనా నేతృత్వం లోని ఎఫ్ఓసీఏసీ సమావేశాలు జరగబోతున్న ప్రస్తుత తరుణంలో భారత్-ఆఫ్రికా ఫోరం సమ్మేళనానికి కీలక ప్రాధాన్యత ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక మన విదేశాంగ విధానానికి చురుకుదనం వచ్చింది. ఇరుగు పొరుగు దేశాలతో, సుదూర తీరాల్లోని దేశాలతో సంబంధాలను పటిష్టం చేసుకోవడంలో, మన ప్రయోజనా లను విస్తృతం చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో వ్యవహరించారు. కానీ, ఆఫ్రికా దేశాలపై మాత్రం ఇంతవరకూ సరిగా దృష్టి సారించలేదు. అయితే ఈ విషయంలో దీటైన వ్యూహంతో ముందుకెళ్లదల్చుకున్న సంకేతాలు కనబడుతు న్నాయి. గతంలో వలె కాకుండా ఈసారి ఆఫ్రికా ఖండంలోని మొత్తం 54 దేశాల అధినేతలనూ ఈ శిఖరాగ్ర సమ్మేళనానికి ఆహ్వానించడమే ఇందుకొక ఉదాహరణ. గతంలో జరిగిన రెండు సదస్సులకూ ఆఫ్రికా యూనియన్ ఎంపిక చేసిన 15 దేశాల అధినేతలను మాత్రమే ఆహ్వానించారని గుర్తు చేసుకుంటే ఈ మార్పుకున్న ప్రాధాన్యత తెలుస్తుంది. ఆహ్వానించిన 54 దేశాల అధినేతల్లో కనీసం 40మంది తమ తమ ప్రతినిధి బృందాలతో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఆ రకంగా చూస్తే ఇది మన దేశంలో జరిగే అతి పెద్ద అంతర్జాతీయ సమ్మేళనం అవుతుంది. న్యూఢిల్లీ శిఖరాగ్ర సమ్మేళనానికి అనుకూలించే పరిణామాలు చాలా ఉన్నాయి. ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులు పెట్టడంలో చైనాది పైచేయిగా ఉండొచ్చుగానీ...దాని తీరుతెన్నులపై ఆయా దేశాల్లో బోలెడంత అసంతృప్తి ఉంది. భారీ భవంతుల నిర్మాణ పనుల్ని చైనాకు అప్పజెప్పిన బోట్స్వానా ఎదుర్కొంటున్న సమస్యలే ఇందుకు ఉదాహరణ. వాటిల్లో ఏ ప్రాజెక్టూ సకాలంలో పూర్తికాక ఆ దేశం అవస్థలు పడింది. వివిధ దేశాల్లో మొత్తంగా చైనాకు చెందిన 2,500 కంపెనీలు వివిధ ప్రాజెక్టుల్లో పాలుపంచుకుంటున్నాయి. వీటిల్లో స్థానికులకు కాక చైనీయులకే ఉపాధి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయని ఆఫ్రికా దేశాలు కినుకవహిస్తున్నాయి. భారత్ బరిలో ఉంటే...తమకు ప్రత్యామ్నాయాలున్నాయని చెప్పినట్టవుతుందని అవి అభిప్రాయపడుతున్నాయి. అపారమైన ప్రకృతి వనరులున్నా ఆఫ్రికా దేశాలు ఇప్పటికీ పేదరికంతో, నిరుద్యోగితతో, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. చీకటి ఖండమన్న పేరును పోగొట్టుకోలేకపోతున్నాయి. అక్కడున్న ఇంధన వనరులు మన దేశ అవసరాలకు ఎంతగానో తోడ్పడతాయి. అలాగే మనవద్ద ఉన్న వివిధ రంగాలకు సంబంధించిన టెక్నాలజీ, నైపుణ్యత, విద్య, వైద్యం, ఐటీ వంటివి ఆఫ్రికాకు ఉపయోగపడతాయి. నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాధనకు అనుసరిస్తున్న విధానాల్లో ఎప్పటికప్పుడు సవరణలు చేసుకుంటూ విజయం సాధిస్తున్న చైనాను ఆదర్శంగా తీసుకుంటే మన దేశం కూడా ఆఫ్రికాలో ముందడుగు వేస్తుంది. అది మన పలుకుబడి విస్తరణకూ, అంతర్జాతీయ వేదికల్లో భారత్‌కు మద్దతు పెరగడానికి దోహదపడుతుంది.