English Idioms- Mumbo Jumbo: అర్థం పర్ధం లేని మాటలు, పనులు, తెలివి తక్కువ నిర్ణయాలు, గందర గోళ పరిస్థితి, నవ్వులాటగా తోచే సీరియస్ పనులు... మొదలైన సందర్భాలలో ఉపయోగించే జాతీయం ఇది. 1738లో ఫ్రాన్సిస్ మూర్ అనే రచయిత ఈ ఎక్స్‌ప్రెషన్‌ను మొదటిసారిగా ఉపయోగించాడు.
పశ్చిమ ఆఫ్రికాలో మూఢాచారాలు అనిపించే క్రతువులు కొన్ని ఉండేవి. అలాంటి వాటిలో ముంబో జంబో ఒకటి. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న అర్థంలో ఈ ఇడియమ్‌ను ఫ్రాన్సిస్ ఉపయోగించలేదు. ఆ తరువాత మాత్రం ‘నాన్సెన్స్’ అనిపించే పనులు, మాటల విషయాల్లో ఉపయోగిస్తున్నారు.
ఉదా: 1. వాటిజ్ ఆల్ దిస్ ముంబో జంబో?
2. ఇట్ ఈజ్ నాట్ ముంబో జంబో యాజ్ సమ్ పీపుల్ థింక్.. మరి మీరు ఎపుడైనా ఈ ఇడియమ్‌ను ఉపయోగించారా?
సమ్‌థింగ్ స్పెషల్.. పాత ఫొటోలు పాడయ్యాయా?
ప్రతి ఇంట్లోనూ ఫొటో ఆల్బమ్స్ ఉంటాయి. వాటిలో చాలా పాత ఫోటోలు పాడై పోయి ఉంటాయి. ఇమేజ్ రిస్టోరేషన్ మెథడ్స్ వల్ల కొత్త ఫోటో వచ్చినప్పటికీ, దీనికి, ఒరిజినల్‌కు తేడా బాగా కనిపిస్తుంది. ఒరిజినల్‌కు, కొత్త ఇమేజ్‌కు పెద్ద తేడా లేకుండా సహజంగా ఉండడానికి gfp- యాప్ ఫ్రీ ఏఐ టూల్స్ ఉపకరిస్తాయి. ఎక్కడ ఏది అవసరమో (ఫిల్ ఇన్‌ది గ్యాప్స్) క్షణాల వ్యవధిలో సమకూరుస్తాయి ఈ ఏఐ టూల్స్.
ప్రతీకాత్మక చిత్రం
ఆర్ట్ అండ్ కల్చర్: అయ్యయ్యో!
క్యూబా ఆర్టిస్ట్ ఆల్‌ఫ్రెడో మార్టిరెనా పర్యావరణ స్పృహతో ఎన్నో కార్టూన్‌లు గీశాడు. వాటిలో మీరు చూస్తున్న కార్టూన్ ఒకటి. ప్రపంచ జనాభా ఊహించని రీతిలో పెరిగిపోతుంది. పల్లెలు మాయమై పట్టణాలు ఇరుకు అవుతున్నాయి. చెట్లు మాయం అవుతున్నాయి.
ఎటు చూసినా కాంక్రిట్ జంగిల్. దాని ప్రతికూల ప్రభావం ఏమిటో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది పచ్చదనం రూపంలో కాస్త ప్రాణవాయువు. అట్టి విషయాన్ని ఈ కార్టూన్ ఎంత చక్కగా చెప్పిందో!
చదవండి: Pubarun Basu: నాలుగేళ్ల వయసులో మొదలెట్టాడు.. అద్భుతం ఆవిష్కృతం! అంతర్జాతీయ స్థాయిలో!
Comments
Please login to add a commentAdd a comment