Cuba
-
క్యూబాలో వింత ఆచారం
కోరికలు తీర్చాలనో.. అవి తీరినందుకు మొక్కు చెల్లించుకోవడానికో ఆలయాల్లో పొర్లు దండాలు పెట్టడం చూస్తూనే ఉంటాం. క్యూబాలో కూడా ఇలాంటి సంస్కృతే ఉండటం విశేషం. పొర్లు దండాలు కాకున్నా సెయింట్ లాజరస్ ఊరేగింపు సందర్భంగా భక్తులు నేలపై పాకుతూ వెళ్తుంటారు. అందుకోసం భక్తులు పేదరికానికి ప్రతీకగా సంచులతో చేసిన బట్టలు వేసుకుంటారు. మోచేతులు, కాళ్లు రక్తమోడుతున్నా పట్టించుకోకుండా పాకుతారు. హవానా శివార్లలోని ఎల్ రిన్కాన్ అనే చిన్న చర్చికి చెప్పుల్లేకుండా నడిచి వెళ్తారు. కోర్కెలు తీర్చాల్సిందిగా లాజరస్ను మొక్కుకుంటారు. ఇది తాతల నాటి సంప్రదాయమట. ఏదేమైనా దాన్ని కచ్చితంగా ఆచరిస్తామని చెబుతారు వాళ్లు. క్యూబా నాస్తికత్వాన్ని వీడి 1992లో లౌకిక రాజ్యంగా మారింది. అక్కడ ఇటీవల బహిరంగ మత విశ్వాస ప్రదర్శనలు పెరిగాయి. 200 ఏళ్ల క్రితం బానిసలుగా వచ్చిన ఆఫ్రికన్లు యోరుబా మతంలోని శాంటరియా శాఖను తమతో తీసుకొచ్చారు. కొందరేమో బలవంతంగా కాథలిక్ మతంలోకి మారారు. దేశమంతటా ఈ రెండు మతాల సమ్మిళిత వాతావరణం ఉంటుంది. 1959 విప్లవం తరువాత క్యూబాలో వ్యవస్థీకృత మతాన్ని అణచివేసి శాంటరియా చాలావరకు విస్తరించింది. అది మతం కాదని క్యూబా ఆధ్యాత్మిక సంస్కృతి అని చెబుతుంటారు. ఇప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించింది. రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచి అమెరికాతో శత్రుత్వమున్నా ఒబామా హయాంలో దౌత్య సంబంధాలు కాస్త మెరుగయ్యాయి. కానీ 2016లో డొనాల్డ్ ట్రంప్ రాకతో క్యూబాపై ప్రతికూల ప్రభావం పడింది. మళ్లీ ట్రంప్ రాకతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడుతుందని క్యూబన్లు భయపడుతున్నారు. ఈ క్లిష్ట సమయాల్లో మత విశ్వాసాలను నమ్ముకుంటున్నారు. -
ప్రపంచ విప్లవ జ్వాల
ప్రజల కోసం సర్వస్వం త్యజించిన విప్లవ నేత చే గువేరా! ఆయన అసలు పేరు ఎర్నెస్టో గెవారా! ఆయన పెట్టుబడిదారీ వ్యవస్థతో పాటు సామ్యవాదంలోని సంప్రదాయ వాదాన్ని కూడా వ్యతిరేకించాడు. అర్జెంటీనాలోని రొసారియా అనే పట్టణంలో 1928 జూన్ 14న ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. 1953లో బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయం నుండి వైద్య విద్యలో పట్టా పొందాడు. ఆ తదుపరి మోటారు సైకిల్‌పై దక్షిణ అమెరికా ఖండమంతటా పర్యటిస్తున్న సమయంలో ప్రజల జీవన స్థితిగతుల గురించి తెలుసుకున్నాడు. విప్లవమొక్కటే సామాజిక అసమానతలను తొలగించగలదని భావించాడు. 1954లో గౌటెమాలలో ప్రజాబాహుళ్యపు అభ్యున్నతికి కృషి చేస్తున్న సామ్యవాద అనుకూల ప్రభుత్వంతో కలిసి పనిచేశాడు. కానీ అదే సంవత్సరం అమెరికా సాయంతో జరిగిన కుట్ర మూలంగా ఆ ప్రభుత్వం కూలి పోయింది. అక్కడి నుంచి మెక్సికో వెళ్ళిపోయాడు. ఈ ఘటనతో అతని విప్లవ దృక్పథం మరింత బలపడింది. మెక్సికోలో ఫిడెల్ క్యాస్ట్రో నాయకత్వంలో అక్కడికి ప్రవాసం వచ్చిన క్యూబా విప్లవకారులతో చేతులు కలిపాడు. 1950వ దశకం చివరలో అప్పటి క్యూబా నియంత బాటిస్టాకు వ్యతిరేకంగా కాస్ట్రో ఆధ్వర్యంలో జరిగిన గెరిల్లా పోరాటం (1956–1959)లో చే గువేరా ముఖ్య పాత్ర పోషించాడు. డాక్టర్‌గా, మిలిటరీ కమాండర్‌గా అంకిత భావంతో సేవలందించాడు. పోరాటం విజయవంతమైన తరువాత, కాస్ట్రో 1959 జనవరిలో క్యూబా ప్రభు త్వాధికారాన్ని చేపట్టాడు. ఆ ప్రభుత్వంలో చే పరిశ్రమల మంత్రిగా, క్యూబా జాతీయ బ్యాంకు అధ్యక్షునిగా పనిచేశాడు. క్యూబా ప్రతినిధిగా అనేక దేశాలు పర్యటించాడు. ఈ పర్యటనలలో భాగంగానే 1959 జూలై నెలలో భారతదేశంలో కూడా పర్యటించాడు. తన రచనలలో వర్ధమాన దేశాలలో రైతాంగ విప్లవోద్యమాలు నిర్మింపబడాలని కోరుకున్నాడు! పేద దేశాలలో విప్లవాన్ని వ్యాప్తిచేయ తలపెట్టి ఆయన 1965లో క్యూబాలో తన అత్యున్నత స్థానాన్ని, పలుకుబడిని వదలి పెట్టి కాస్ట్రో వారిస్తున్నా వినకుండా దేశం నుండి అదృశ్యమయ్యాడు. కొద్దిమంది అనుచరులతో రహస్యంగా ఆఫ్రికా దేశమైన కాంగోలో కొంతకాలం గడిపాడు. ఆ సమయంలో ఆ దేశం తూర్పు ప్రాంతంలో గెరిల్లా తిరుగుబాటుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. 1966 చివరిలో మళ్ళీ దక్షిణ అమెరికాకు వచ్చాడు! బొలీవియా దేశంలో మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడు తున్న విప్లవకారులకు నాయకత్వం వహించాడు! ఈ సమయంలోనే బొలీవియన్ సైన్యానికి చిక్కాడు! 1967 అక్టోబర్ 9న వల్లెగ్రాండె అనే ప్రాంతంలో ఆ సైన్యం ఆయన్ని చంపివేసింది. అలా ఓ ప్రపంచ విప్లవ జ్వాల ఆరిపోయింది!– ఎమ్డీ మునీర్, సీనియర్ జర్నలిస్ట్(నేడు చే గువేరా వర్ధంతి) -
విప్లవ జ్యోతి
ప్రపంచ ప్రజలను ప్రభావితం చేసిన విప్లవ నాయకుడు చే గువేరా. అర్జెంటీనాకు చెందిన ఈ మార్క్సిస్ట్ విప్లవకారుడు... వైద్యుడు, రచయిత, మేధావి, గెరిల్లా నాయకుడు, సైనిక సిద్ధాంతకర్త, క్యూబన్ విప్లవంలో ముఖ్యుడు. ఆయన అసలు పేరు ఎర్నేస్తో ‘చే’ గువేరా. 1928 జూన్ 14న అర్జెంటీనాలోని రోసారియోలో జన్మించారు. ఆయనకు ఆస్తమా వ్యాధి వుండేది. ఆ వ్యాధితో బాధపడుతూనే విప్లవ పోరాటాలు చేశారు. లాటిన్ అమెరికాలో పర్యటన సమయంలో అక్కడి పేదరికం చూసి చలించిపోయారు. దీనికి కారణం ఆర్థిక తారతమ్యాలు, ఏకస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థ, నూతన వలసవాదం, సామ్రాజ్యవాదాలేనని భావించారు. సమకాలీన వ్యవస్థపై తిరుగుబాటు చేయడం ద్వారా సమస్యలను పరిష్కరించవచ్చని భావించారు. అందుకే విప్లవం బాట పట్టారు.మెక్సికోలో ఉంటున్న సమయంలో రౌల్, ఫిడెల్ కాస్ట్రోలను కలిశారు. అప్పటి నుంచి వారితో భుజం భుజం కలిపి క్యూబాను బాటిస్టా పాలన నుంచి విముక్తి చేయడానికి పోరాడారు. విప్లవకారుల్లో ముఖ్యమైన వ్యక్తిగా, సైన్యంలో రెండవ స్థానానికి చేరుకుని, నియంతృత్వ బాటిస్టాపై జరిగిన గెరిల్లా పోరాటంలో కీలకపాత్ర పోషించారు. క్యూబా తిరుగుబాటు తర్వాత ఏర్పడిన ప్రభుత్వంలో అనేక ప్రధాన బాధ్యతలను స్వీకరించారు. మంచి వ్యవసాయ సంస్కరణలను ప్రవేశపెట్టారు. జాతీయ బ్యాంకు అధ్యక్షునిగా, క్యూబా సైనికదళాల బోధనా నిర్దేశకునిగా, క్యూబన్ సామ్యవాద దౌత్యవేత్తగా ప్రపంచ వ్యాప్తంగా పర్యటనలు చేశారు.గెరిల్లా యుద్ధ తంత్రంపై ఆధార గ్రంథాన్ని రాశారు. దక్షిణ అమెరికాలో ఆయన జరిపిన యూత్ మోటార్ సైకిల్ యాత్ర జ్ఞాపకాల ఆధారంగా పుస్తకం రాశారు. గువేరా 1965లో క్యూబాను వదలి కాంగో కిన్షాసాలోనూ, బొలీవియాలోనూ యుద్ధాలకు నాయకత్వం వహించారు.బొలీవియా యుద్ధంలో పాల్గొని, 1967 అక్టోబర్ 9న అక్కడి సైనికాధికారులకు పట్టుబడి కాల్చివేతకు గురయ్యారు. అలా తాను పుట్టిన దేశం వదలి ప్రపంచ పీడితుల పక్షాన వివిధ దేశాల్లో పోరాటాలు చేస్తూ అసువులు బాసి ఆధునిక విప్లవం మీద తనదైన ముద్ర వేశారు చే!– ర్యాలి ప్రసాద్, కాకినాడ(నేడు చే గువేరా జయంతి) -
అక్కడ పెట్రోలు రేట్లు ఐదు రెట్లు పెరగనున్నాయి!
పెట్రోల్ ధరలు రెండు రూపాయలు పెరిగితేనే ఆందోళనలు జరిగిన సంఘటనలు గతంలో కోకొల్లలు, అలాంటిది 500 శాతం పెరిగితే?.. అది సామాన్య ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకీ ఇంత శాతం ధరలు ఏ దేశంలో పెరుగుతాయి, ఎప్పటి నుంచి అమలులోకి రానున్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. భారత్‌లో పెట్రోల్ ధరలు ఇప్పుడు రూ.100 నుంచి రూ.120 మధ్యలో ఉండటంతోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లో పెట్రోల్ ధరలు రూ.250 నుంచి రూ.350 వరకు ఉన్నాయి. ఇప్పుడు కరేబియన్ దేశం క్యూబా ఉన్న ధరలనే 500% పెంచుతూ ప్రకటించింది. ఒక వైపు కరోనా ప్రభావం, మరోవైపు అమెరికా తీవ్ర ఆంక్షల మధ్య ఆర్ధిక సంక్షోభంలో పడ్డ క్యూబా.. ద్రవ్యోల్బణ లోటును తగ్గించుకోవడానికి పెట్రోల్ ధరలను భారీగా పెంచాలని నిర్ణయించుకుంది. దీంతో 25 పెసోలుగా ఉన్న ఒక లీటరు పెట్రోల్ రేటు ఫిబ్రవరి 1 నుంచి 132 పెసోలకు పెరుగుతుంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ 450 రూపాయల కంటే ఎక్కువన్నమాట. ఇదీ చదవండి: వాచ్‌మెన్‌కు ఇప్పుడే సారీ చెప్పు.. ఆకాశ్‌ను ఆదేశించిన ముకేశ్ అంబానీ - ఎందుకంటే? కేవలం పెట్రోల్ ధరలు మాత్రమే కాకుండా.. రాబోయే రోజుల్లో డీజిల్, ఇతర రకాల ఇంధనాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని, విద్యుత్, సహజవాయువుల ధరల పెరుగుదల త్వరలోనే జరుగుతుందని ఆర్థిక మంత్రి 'వ్లాదిమిర్ రెగ్యురో' (Vladimir Regueiro) వెల్లడించారు. కొత్త ధరలు అమలులోకి వచ్చిన తరువాత కేవలం అమెరికన్ డాలర్లతో మాత్రమే కొనుగోలు చేయాలనీ క్యూబా ప్రభుత్వం నిర్ణయించింది. ధరలు అందుబాటులోకి వచ్చిన తరువాత క్యూబా ప్రజలు పెద్ద ఎత్తున ఆర్థిక కష్టాలను చవి చూడాల్సి వస్తుందని స్పష్టంగా అర్థమవుతోంది. -
సీన్యో కాల్వీనో
ఇటాలో కాల్వీనో అనే పేరు వినగానే ఆయనో ఇటాలియన్ రచయిత అనిపించడం సహజమే. ఊహకు అందేట్టుగా ఇటాలియనే అయినా కాల్వీనో పుట్టింది క్యూబా రాజధాని హవానాలో. తమ దేశ మూలాలు మర్చిపోకూడదనే ఉద్దేశంతో తల్లి పెట్టిన ఈ పేరు ఆయనకు పెద్దయ్యాక మరీ జాతీయవాదపు పేరులా తోచింది. అయితే వాళ్ల కుటుంబం ఇటలీకి తిరిగి వచ్చాక, తన 20 ఏళ్ల వయసులో కాల్వీనో జాతీయవాద ఫాసిస్టు పార్టీ మీద పోరాడటం దానికి ఒక చిత్రమైన కొనసాగింపు. ఆ పోరాటంలో భాగంగా ఇటాలియన్ కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయ్యాడు. కమ్యూనిస్టుగా బతికాడు. అనంతర కాలంలో ఆ పార్టీకి దూరమయ్యాడు. అప్పటికే ఆయన వాస్తవిక చిత్రణ మీద పార్టీ విమర్శించడం మొదలుపెట్టింది. ఇక హంగెరీ మీద సోవియట్ రష్యా దాడి(1956) తర్వాత పార్టీ మీది భ్రమలు పూర్తిగా చెదిరిపోయి రాజీనామా చేశాడు. మళ్లీ ఏ పార్టీలోనూ సభ్యుడు కాలేదు. జర్నలిస్టుగా ఉద్యోగం చేసుకుంటూ; కథలు, నవలలు రాసుకుంటూ; తనకు నచ్చిన రాతలను ప్రమోట్ చేసుకుంటూ, కథల మీద మాట్లాడుకుంటూ బతికాడు. ఆధునిక ఇటాలియన్ సాహిత్యంలో అత్యధికంగా అనువాదం అయిన రచయితగా ప్రసిద్ధి గడించిన ఇటాలో కాల్వీనో శతజయంతి (జననం: 1923 అక్టోబర్ 15) సంవత్సరం ఇది. ఇటాలో కాల్వీనో ప్రపంచంలో నిచ్చెన వేసుకుని చందమామ మీదికి ఒక్క గెంతులో ఎక్కేయొచ్చు. దాని పాలను లోడుకోవచ్చు. చేయాల్సిందల్లా పొక్కులుగట్టిన చందమామ ఉపరితలం మీదుండే పొలుసులను కొద్దిగా జరిపి అక్కడ గరిట పెట్టడమే. కాకపోతే ఆ మీగడ చిక్కదనపు పాలల్లో ‘ఎక్కువభాగం పండ్లు, కప్పల గుడ్లు, శిలాజిత్, అలచందలు, తేనె, పటికలుగా మారిన పిండి, సొరచేపల గుడ్లు, నాచు, పుప్పొడి, చిన్నచిన్న పురుగులు, చెట్ల జిగురు, మిరియాలు, ఖనిజ లవణాలు, బూడిద’ ఉంటాయి కాబట్టి వాటిని శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది (ద డిస్టన్ ్స ఆఫ్ ద మూన్ ). ఇంకా, కాల్వీనో లోకంలో చిన్న పిల్లను పోనివ్వడానికి జోర్డాన్ నది తన నీటిని కొద్దిగా వంచి దారి ఇస్తుంది. ఎందుకంటే ఆ నదికి ఇష్టమైన ఉంగరపు ఆకృతి కేకుల్ని ఆ పాప పెడతానంది కదా (ఫాల్స్ గ్రాండ్‌మదర్)! ఆయన సృజించిన నగరానికి ఎప్పటికీ దేనికీ కిందికి దిగే పనిలేదు. అది పొడవాటి ఫ్లెమింగో కాళ్ల మీద నిలబడి ఉంటుంది. అదొక్కటే నగరానికీ, భూమికీ సంబంధం (ది ఇన్విజిబుల్ సిటీ). వెంట వెంటనే కలుసుకుంటున్నట్టుగా వచ్చి, లేచి, విరిగిపడే అలల్లో ఒకదాన్నుంచి ఇంకోదాన్ని ఎలా విడదీయాలో తెలీక అదేపనిగా చూస్తుంటాడు ‘మిస్టర్ పాలొమార్’. విలువలు తలకిందులైన ప్రపంచంలో ఒక మనిషి నిజాయితీ కూడా ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేయగలదు. అందరూ బుద్ధిగా దొంగతనం చేస్తున్నప్పుడు, ఆయన మాత్రం చేయనంటే ఎలా కుదురుతుంది? (ద బ్లాక్ షీప్). కాల్వీనో తల్లి ఇటలీలోని సార్డినీయా ద్వీపానికి చెందినవారు. ప్రపంచంలో శతాధిక వృద్ధులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇదీ ఒకటి. దీనికి భిన్నంగా కాల్వీనో అరవై ఏళ్లే బతికాడు(మరణం: 1985 సెప్టెంబర్ 19). ఆయన రచనల విషయంలో మాత్రం ఈ మాట అనలేము. ‘అవర్ యాన్సెస్టర్స్’ ట్రయాలజీ, ‘కాస్మికామిక్స్’ లాంటి పుస్తకాలను వెలువరించిన కాల్వీనో ప్రపంచంలో అన్నీ అసాధ్యాలే. కొన్నిసార్లు రాస్తున్నప్పుడు నాకు వెర్రెత్తుతుంది అంటాడాయన. ఒక నవలను మళ్లీ మళ్లీ చదవడానికి ఉపక్రమించే పాఠకుడి జీవితం కూడా ఆయనకు నవల అవుతుంది. దీన్ని అత్యంత పోస్ట్ మాడర్నిస్ట్ నవల అంటారు (ఇఫ్ ఆన్ ఎ వింటర్స్ నైట్ ఎ ట్రావెలర్). కానీ ఆయన రచనలు ఎంత ఆధునికమో అంత ప్రాచీనం. ఎంత ప్రాచీనమో అంత ఆధునికం. కొత్త పుంతలు తొక్కడం అనే మాట ఆయనకు బాగా వర్తిస్తుంది. ఇటాలియన్ జానపద గాథలను కూడా ఆయన ప్రచురించాడు. కాల్వీనో రచనా వ్యాసంగంలో ఇదొక ముఖ్యాంశం. ‘రాజకీయాల తర్వాత, సాహిత్యానికి రెండో స్థానం ఇవ్వడం అనే ఆలోచన పెద్ద తప్పు. ఎందుకంటే, రాజకీయాలు దాదాపుగా ఎన్నడూ తన ఆదర్శాలను సాధించలేవు. మరోపక్కన, సాహిత్యం దాని రంగంలో అది కొంతైనా సాధించగలదు, దీర్ఘకాలంలో కొంత ఆచరణాత్మక ప్రభావాన్ని కూడా కలిగించగలదు... ముఖ్యమైన విషయాలు నెమ్మదైన ప్రక్రియల ద్వారా మాత్రమే సాధించగలం’ అనే కాల్వీనో విదేశీ సంస్కృతులను గురించిన అవగాహన ఏ సంస్కృతికైనా కీలకం అనేవాడు. సొంత సృజన శక్తిని సజీవంగా ఉంచుకోవాలంటే విదేశీ ప్రభావాలకు సిద్ధంగా ఉండాలన్నాడు. ఇద్దరం కలుస్తున్నామంటే, భిన్న ప్రపంచాల్ని వెంట బెట్టుకుని వస్తాం; ఆ కలిసిన బిందువు నుంచి కొత్త కథ మొదలవుతుందంటాడు. ఒకరోజు– మనకు కవితలు, నవలలు రాసేలా కవికీ, రచయితకూ ప్రత్యామ్నాయం కాగలిగే సాంకేతిక పరిజ్ఞానం వస్తుందని 1967లోనే కాల్వీనో ఊహించిన విషయాన్ని ఛాట్ జీపీటీ నేపథ్యంలో పాత్రికేయుడు రాబెర్టో డి కారో గుర్తుచేసుకుంటారు. విదేశీ మాటలు, ప్రత్యేకించి ఆంగ్లపదం ‘ఫీడ్‌బ్యాక్’ మీద కాల్వీనో మోజు పడి, దాన్ని ఎలాగైనా ‘మిస్టర్ పొలొమార్’ ఆంగ్లానువాదంలో చేర్చాలని ఉబలాటపడ్డాడట. ‘సీన్యో(మిస్టర్ లాంటి ఒక గౌరవ వాచకం) కాల్వీనో! ఒక ఇటాలియన్ చెవికి ఆ పదం ఎంత అందంగా వినబడినా, ఆంగ్ల సాహిత్యంలో అదేమంత ఉచితంగా ఉండ’దని కాల్వీనో రచనలకు స్థిర అనువాదకుడిగా పనిచేసిన విలియమ్ వీవర్ తిరస్కరించాడట. అయితే, ఎంతటి కృత్రిమ మేధ వచ్చినా, చంద్రుడి పాలు మీగడలా చిక్కగా ఉంటాయని ఊహించిన కాల్వీనో మెదడును ఏ కంప్యూటరూ అందుకోలేదని మనం ఫీడ్‌బ్యాక్ ఇచ్చి ఆయన్ని ఆనందపరచొచ్చు! -
చేగువేరా బయోపిక్ నేపథ్యంలో వస్తోన్న 'చే'
క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా రూపోందుతున్న చిత్రం "చే". లాంగ్ లైవ్ అనేది ట్యాగ్ లైన్. క్యూబా తరువాత ప్రపంచంలో తొలిసారి రూపొందుతున్న చేగువేరా బయోపిక్ ఇదే. నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్‌పై బి.ఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ పోస్టర్‌ను చేగువేరా కూతురు డా.అలైదా గువేరా చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె చిత్రయూనిట్‌ను అభినందించారు. (ఇది చదవండి: యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న 'హిట్ లిస్ట్'.. ఆసక్తి పెంచుతోన్న టీజర్!) ఈ సందర్భంగా హీరో , దర్శకుడు బీఆర్ సభావత్ నాయక్ మాట్లాడుతూ... ' విప్లవ వీరుడు , యువత స్పూర్తిదాయకుడు చేగువేరా జీవిత చరిత్రను సినిమా గా తీయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఆయన చేసిన పోరాటాలు, త్యాగాలు ఈ చిత్రంలో చూపించాం. అప్పటి పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఈ సినిమాను రూపోందించాం." అని చెప్పారు. త్వరలో సినిమా టీజర్ ,ట్రైలర్ రిలీజ్ చేసి విడుదల తేదిని ప్రకటిస్తామని తెలిపారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్ , పసల ఉమా మహేశ్వర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. రవిశంకర్ సంగీతం అందిస్తున్నారు. (ఇది చదవండి: ప్రేయసిని పెళ్లాడిన హీరో, ఫోటోలు వైరల్) -
అతిపెద్ద ఐస్‌క్రీమ్ పార్లర్..
ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అతి పెద్ద ఐస్‌క్రీమ్ పార్లర్. క్యూబాలోని హవానా నగరంలో ఉంది. పేరు కొపేలియా పార్క్. ఈ పార్లర్లో పనిచేసే సిబ్బందికి అస్సలు ఖాళీ ఉండదు. ఒక రౌండ్లో 600ల మంది కస్టమర్లకు ఒకేసారి ఐస్‌క్రీమ్ అందిస్తుంటారు. రోజూ ఇక్కడకు కనీసం 30 వేలమంది వస్తుంటారు. 1966లో నిర్మించిన దీనిని ఐస్ క్రీమ్ కేథడ్రల్ అని కూడా పిలుస్తారు. అయితే ఇంత పెద్ద ఐస్‌క్రీమ్ పార్లర్లో ఐస్‌క్రీమ్ ధర తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక్కో ఐస్‌క్రీమ్ ధర కేవలం రూ.17.20 మాత్రమే. ధర తక్కువ అని ఇక్కడికి వస్తున్నారు అనుకుంటే పొరపాటే! ఈ పార్లర్లోని ఐస్‌క్రీమ్ రుచులు విదేశీ పర్యాటకులను కూడా విపరీతంగా ఆకర్షిస్తోంది. దీనికి ఒక చారిత్రక నేపథ్యం కూడా ఉంది. కమ్యూనిస్ట్ విప్లవం విజయవంతం అయిన తర్వాత అమెరికా నుంచి ఫిడెల్ క్యాస్ట్రో 28 కంటైనర్ల ఐస్‌క్రీమ్ ఆర్డర్ ఇచ్చారట. దాని రుచి ఆయనను ఎంతగానో ఆకట్టుకుందట! దీంతో అలాంటి ఐస్‌క్రీమ్ తమ దేశంలోనూ ఉండాలనే ఉద్దేశంతో కొపేలియా పార్క్ నిర్మించారట! (చదవండి: ఆ దీవిలో అడుగుపెట్టాలంటే హడలిపోవాల్సిందే! బతుకు మీద ఆశ వదులుకోవాల్సిందే) -
క్యూబాలో చైనా గూఢచారులు
వాషింగ్టన్: కమ్యూనిస్ట్ చైనా తమ పొరుగు దేశం క్యూబాలో 2019 నుంచి గూఢచార స్థావరాన్ని నడుపుతోందని అమెరికా ఆరోపించింది. ప్రపంచవ్యాప్తంగా చైనా నిఘా సమాచార సేకరణ సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటున్న ప్రయత్నాల్లో ఇదో భాగమని పేర్కొంది. పేరు వెల్లడించటానికి ఇష్టపడని ఓ అధికారి ఈ మేరకు డ్రాగన్ దేశంపై ఆరోపణలు గుప్పించారు. క్యూబాలోని చైనా నిఘా కేంద్రంపై అమెరికా నిఘా సంస్థలు ఓ కన్నేసి ఉంచాయని ఆయన తెలిపారు. చైనా నిఘా కార్యకలాపాల విస్తరణ ప్రయత్నాలను అడ్డుకునే ప్రయత్నాలను బైడెన్ ప్రభుత్వం ముమ్మరం చేసిందన్నారు. దౌత్యపరమైన, ఇతర మార్గాల్లో చేపట్టిన ఈ ప్రయత్నాలు కొంత సఫలీకృతమయ్యాయని ఆయన అన్నారు. అమెరికాకు అత్యంత సమీపంలో ఉన్న క్యూబా గడ్డపై నుంచి చైనా గూఢచర్యం కొత్త విషయం కాదు, ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నదేనని తమ నిఘా వర్గాలు అంటున్నాయని ఆ అధికారి ఉటంకించారు. అట్లాంటిక్ సముద్రం, లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్యం, సెంట్రల్ ఆసియా, ఆఫ్రికా, ఇండో–పసిఫిక్ ప్రాంతాల్లో నిఘా కేంద్రాల ఏర్పాటుకు చైనా యత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే క్యూబాలోని నిఘా కేంద్రాన్ని 2019లో చైనా అప్‌గ్రేడ్ చేసిందని ఆ అధికారి వివరించారు. క్యూబాలో సిగ్నల్ ఇంటెలిజెన్స్ సేకరణ వ్యవస్థ ఏర్పాటుపై రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరినట్లు గురువారం వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో కథనం వచ్చింది. బదులుగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న క్యూబాకు భారీగా ముట్టజెప్పేందుకు చైనా సిద్ధమైందని కూడా అందులో పేర్కొంది. అయితే, వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనాన్ని క్యూబా డిప్యూటీ విదేశాంగ మంత్రి ఖండించారు. -
అణచివేతకు గురయ్యే వారిని ప్రేమించాలని చెప్పేవారు
బొల్లోజు రవి ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులకు స్ఫూర్తి ప్రదాత అయిన నిన్నటితరం గెరిల్లా యుద్ధ యోధుడు, మార్క్సిస్టు విప్లవవీరుడు చేగువేరా నేటి యువతరానికీ ఓ ఐకాన్. తండ్రి విప్లవ బాటను నిలువెల్లా నింపుకున్న ఆయన కుమార్తె, మానవ హక్కుల కార్యకర్త డాక్టర్ అలైదా గువేరా ‘సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిద్దాం... ప్రపంచ శాంతిని కాపాడుకుందాం’అంటూ ప్రపంచమంతా చాటి చెబుతున్నారు. క్యూబా రాజధాని హవానాలోని విలియం సోలెర్ చిల్ర్డన్స్ హాస్పిటల్లో వైద్యురాలిగా పనిచేçస్తూనే ప్రపంచ దేశాల్లో జరిగే వివిధ కార్యక్రమాలకు ఆమె హాజరవుతుంటారు. క్యూబా సంఘీభావ యాత్రలో భాగంగా భారత్‌లో పర్యటిస్తున్న అలైదా గువేరా ఆదివారం తన కుమార్తె, చేగువేరా మనవరాలు ప్రొఫెసర్ ఎస్తిఫినా గువేరాతో కలసి హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ అలైదా గువేరా ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... నాన్నతో గడిపిన కాలం గుర్తుంది... లాటిన్ అమెరికా దేశాల్లో విప్లవాన్ని రగిలించేందుకు వెళ్లిన నాన్నను బొలీవియాలో 1967లో అమెరికా అనుకూల బొలివీయా దళాలు కాల్చి చంపినప్పుడు నాకు సుమారు ఏడేళ్లు. అయినప్పటికీ ఆయనతో గడిపిన క్షణాలు నాకు ఇప్పటికీ మెరుపులా గుర్తున్నాయి. ఆయన ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు నన్ను లేపేవారు. చెరకు తోటలకు తీసుకెళ్లేవారు. అక్కడ ఆయన పనిచేస్తుంటే నేను చెరకుగడలు తింటూ గడిపేదాన్ని. ఇతరులతో మాట్లాడుతూ నన్ను ఆడిస్తూ ఉండేవారు. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు వీపుపై తిప్పుతూ ఆడించేవారు. నాకు, నా సోదరులకు జంతువుల కథలను ఎక్కువగా చెప్పేవారు. వారాంతాల్లో స్వచ్ఛంద పనులు చేసేవారు. ప్రపంచంలో అణిచివేతకు గురవుతున్న మానవ సమూహాలను ప్రేమించాలని చెప్పేవారు. సామాజిక సేవా కార్యక్రమాలకు తీసుకెళ్లేవారు. మాకు దూరంగా ఉన్నా ఉత్తరాలు రాసే వారు. మరో తండ్రిలా క్యాస్ట్రో... నాన్న చనిపోయాక క్యూబా కమ్యూనిస్టు పితామహుడు, అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ నేతల్లో ఒకరైన ఫిడేల్ క్యాస్ట్రోనే అన్నీ తానై నన్ను చూసుకున్నారు. క్యాస్ట్రో మరో తండ్రిలాంటి వారు. ఆయనతో కలిసి గడిపిన కాలం ఎంతో ప్రత్యేకం. 1987లో నాకు పెళ్లయింది. పెళ్లి రాత్రి 11:30 గంటలకు జరిగింది. ఆయన రాకకోసం వేచిచూసి ఆ సమయంలో చేసుకున్నాం. నాకు కూతురు పుట్టినప్పుడు ఆయన ఆసుపత్రికి వచ్చారు. విక్టోరియా అనే పేరు పెట్టాలని సూచించారు. కానీ అప్పటికే నేను, మావారు ఒక పేరు నిర్ణయించాం. ఈ విషయం ఆయనకు చెప్పేసరికి కాస్తంత నొచ్చుకున్నారు. పాపను చూసి అమ్మలా నువ్వు ఉండొద్దు (నవ్వుతూ) అని అన్నారు. ప్రపంచానికి మా దేశ వైద్య రంగం ఆదర్శం... క్యూబా వైద్య రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. కరోనా కాలంలోనూ వివిధ దేశాలకు వైద్య సాయం చేసింది. ఖతార్‌లోని ఒక ఆసుపత్రిలో పనిచేసే వారంతా క్యూబన్లే. వారికి ఆ దేశం వేతనాలు ఇస్తుంది. హైతీలోనూ ఒక ఆసుపత్రిలో క్యూబన్లు పనిచేస్తున్నా వారికి వేతనాలు ఇచ్చే పరిస్థితుల్లో ఆ దేశం లేదు. అందువల్ల ఖతార్‌లో వచ్చే ఆదాయాన్ని హైతీ ఆసుపత్రుల్లో పనిచేసే క్యూబన్ డాక్టర్లకు చెల్లిస్తున్నాం. అర్జెంటీనాలో స్మారక నేత్ర ఆసుపత్రి, బొలీవియాలో జనరల్ ఆసుపత్రి ఉన్నాయి. కరోనా కాలంలో ఫ్రాన్స్ కూడా క్యూబా వైద్య సాయం కోరింది. ఇటలీ, కెనాడాలకు వైద్య సాయం చేస్తున్నాం. మా దేశంలో చిన్నారులకు 14 రకాల టీకాలు ఇస్తుంటాం. క్యూబాలో ప్రస్తుతం శిశుమరణాల రేటు ప్రతి వెయ్యిలో ఐదుగా ఉంది. క్యూబాలో స్త్రీ, పురుషులకు సమాన హక్కులు.. క్యూబాలో 100 శాతం స్త్రీ, పురుష సమానత్వం ఉంది. సమాన పనికి సమాన వేతనం ఇస్తున్నారు. మా దేశంలో మహిళా సంఘం ఉంది. అది అన్ని రకాలుగా మహిళల కోసం పనిచేస్తుంది. చినప్పటి నుంచే బాలబాలికలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నాం. పైస్థాయిలోనూ సమాన అవకాశాలు ఉన్నాయి. అందుకే మహిళలు అన్ని రకాలుగా ముందున్నారు. అక్కడి చట్టాలు మహిళల హక్కులు కాపాడతాయి. మహిళా ఉద్యోగులకు ప్రసవానికి ముందు రెండు నెలలు, ప్రసవం తర్వాత 9 నెలలు వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నారు. ఆ తర్వాత ఎవరికైనా కూడా అదనపు సెలవులు కావాలంటే మరో మూడు నెలలు 75 శాతం వేతనంతో సెలవు ఇస్తున్నారు. త్వరలో ఏడాదిపాటు వేతనంతో కూడిన సెలవులు ఇచ్చేలా కొత్త చట్టం రానుంది. అంతేకాదు ఆరు నెలలు తల్లికి, మరో ఆరు నెలలు తండ్రికి పూర్తి వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలనుకుంటున్నారు. క్యూబాలో ఇప్పుడు మగవారు కూడా వారికొక సంఘం కోరుకుంటున్నారు (నవ్వుతూ). మా దేశంలో పిల్లలను కొట్టకూడదు. క్యూబా డాక్టర్లలో 72 శాతం మంది మహిళలే. నాన్న కమ్యూనిస్టు... నాన్న చేగువేరా పూర్తి కమ్యూనిస్టు. ఇరాన్ వంటి దేశాల్లోనూ ఆయన్ను ఆరాధిస్తారు. జీవితాంతం కమ్యూనిస్టు సిద్ధాంతంతోనే ఆయన పనిచేశారు. కమ్యూనిస్టుగానే ఆయన చనిపోయారు. క్యూబా ఒకప్పుడు అమెరికా కాలనీగా ఆ దేశ కనుసన్నల్లో బతికింది. 1950లలో విప్లవోద్యమంతో అమెరికా అనుకూల ప్రభుత్వాన్ని పడగొట్టి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక దేశం అన్ని రంగంలో పురోగమించింది. అమెరికాకు ఇది మింగుడు పడడంలేదు. ఇప్పటికీ క్యూబాను నాశనం చేసేందుకు కుట్రలు చేస్తోంది. పుస్తకం రాస్తున్నా.. నేను నాన్న గురించి ‘చేగువేరా–వైద్యం’అనే పుస్తకం రాస్తున్నా. అందుకోసం నాన్న రాసిన పుస్తకాలను లోతుగా అధ్యయనం చేస్తున్నా. బొలీవియన్ డైరీస్ పుస్తకం చదువుతుంటే గుండె బరువెక్కుతుంది. డైరీ చివరి పేజీ నన్ను కన్నీళ్లు పెట్టిస్తుంది. చివరి పేజీ ఆయన్ను చంపిన రోజు. ఒక పోరాట యోధుడి డైరీనే బొలివియన్ డైరీ. ఎన్ని కష్టాలు ఎదురైనా భవిష్యత్తు గురించి ఆందోళన చెందకూడదు. చదవండి: అసెంబ్లీ సమావేశాల తర్వాతే.. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ విస్తరణ! -
Cuba: పట్టణ సేంద్రియ వ్యవసాయంతో వినూత్న పరిష్కారం..
క్యూబా.. నగర, పట్టణ ప్రాంతాల్లో సేంద్రియ ఇంటిపంటల సాగు సంస్కృతికి ప్రపంచంలోనే అతి పెద్ద ఉదాహరణగా నిలిచింది. 70% క్యూబా ప్రజలు అర్బన్ ప్రాంతాల్లో నివాసం ఉంటారు. దేశానికి కావాల్సిన ఆహారంలో 50% ఇప్పుడు సేంద్రియ ఇంటిపంటలే అందిస్తున్నాయి. స్థానిక సహజ వనరులతో ఆరోగ్యదాయకమైన పంటలు పండించుకుంటూ ఆహార సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోగలమని క్యూబా ప్రజలు ప్రపంచానికి చాటుతున్నారు. సోవియట్ యూనియన్ పతనానికంటే ముందు వరకు క్యూబా.. పెట్రోల్, డీజిల్‌తోపాటు 60%పైగా ఆహారోత్పత్తుల్ని, రసాయనిక ఎరువులు, పురుగుమందులను సైతం ఆ దేశం నుంచే దిగుమతి చేసుకుంటూండేది. పొగాకు, చక్కెర తదితరాలను ఎగుమతి చేస్తూ ఆహారోత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటూ ఉండేది. ఆ దశలో సోవియట్ పతనం(1990–91)తో కథ అడ్డం తిరిగింది. అమెరికా కఠిన ఆంక్షల నేపథ్యంలో సోషలిస్టు దేశమైన క్యూబా అనివార్యంగా ఆహారోత్పత్తిలో స్వావలంబన దిశగా అడుగేయాల్సి వచ్చింది. క్యూబా ఆకలితో అలమటించిన కష్టకాలం అది. ఈ సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో క్యూబా సమాజం ఉద్యమ స్ఫూర్తిని చాటింది. నగరాలు, పట్టణాల్లో ఖాళీ స్థలాలన్నీ సేంద్రియ పొలాలుగా మారిపోయాయి. అర్బన్ ప్రజలు సైతం తమ ఇళ్ల పరిసరాల్లోనే సీరియస్‌గా సేంద్రియ ఇంటిపంటల సాగు చేపట్టారు. గ్రామీణ రైతులు కూడా పొలాల్లో ఎగుమతుల కోసం చెరకు, పొగాకు వంటి వాణిజ్య పంటల సాగు తగ్గించి ఆహార పంటల సాగు వైపు దృష్టి సారించారు. సగం కంటే తక్కువ రసాయనాలతోనే రెండు రెట్లు ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేయవలసి వచ్చింది. డీజిల్ లేక ట్రాక్టర్లు మూలనపడ్డాయి. పూర్తిగా ఎద్దులతోనే వ్యవసాయం చేయాల్సి వచ్చింది. అటువంటి సంక్షోభం నుంచి ‘పట్టణ సేంద్రియ వ్యవసాయం’ వినూత్న పరిష్కారాన్ని ఆవిష్కరించింది. నగర/పట్టణ ప్రాంతాల్లో స్థానిక సేంద్రియ వనరులతోనే జీవవైవిధ్య వ్యవసాయ సూత్రాల ఆధారంగా సేద్యం సాధ్యమేనని రుజువైంది. నగరాలు, పట్టణాల్లో ఖాళీ స్థలాలన్నీ సేంద్రియ క్షేత్రాలుగా మారాయి. అక్కడ వీటిని ‘ఆర్గానోపోనికోస్’ అని పిలుస్తున్నారు. ‘సమీకృత సస్య రక్షణ, పంటల మార్పిడి, కంపోస్టు తయారీ, భూసార పరిరక్షణ చర్యలు పెద్ద ఎత్తున అమలయ్యాయి. అడుగు ఎత్తున మడులను నిర్మించి, డ్రిప్‌తో పంటలు సాగు చేశారు. వర్మి కంపోస్టు, పశువుల ఎరువు, జీవన ఎరువులతో పాటు 25% మట్టిని కలిపి మట్టి మిశ్రమాన్ని తయారు చేసి ఈ ఎత్తు మడుల్లో పంటల సాగుకు వినియోగిస్తున్నారు. ఇలా అమలు చేసిన పర్మాకల్చర్, వర్మికల్చర్ తదితర సాంకేతికతలనే ఇప్పుడు క్యూబా ఇతర దేశాలకు అందిస్తోంద’ని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ క్యూబా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ స్టీఫెన్ విల్కిన్సన్ చెప్పారు. 1993లో క్యూబా వ్యవసాయ మంత్రిత్వ శాఖలో ప్రపంచంలోనే తొట్టతొలి పట్టణ వ్యవసాయ విభాగం ఏర్పాటైంది. నగరాలు, పట్ణణాల్లో పంటల సాగుకు ఆసక్తి చూపిన కుటుంబానికి లేదా చిన్న సమూహానికి ఎకరం పావు (0.5 హెక్టారు) చొప్పున ప్రభుత్వం స్థలం కేటాయించింది. వాళ్లు తమకు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించుకొని తింటూ.. మిగిలినవి ఇతరులకు అమ్ముతుంటారు. ఈ ప్లాట్లు కాకుండా.. నగరం మధ్యలో, పరిసరాల్లో 5–10 ఎకరాల విస్తీర్ణంలో డజన్ల కొద్దీ పెద్దస్థాయి సేంద్రియ క్షేత్రాలు (ఆర్గానోపోనికోలు) ఏర్పాటయ్యాయి. సహకార సంఘాలే వీటిని నిర్వహిస్తున్నాయి. బచ్చలి కూర, పాలకూర, టమాటాలు, మిరియాలు, గుమ్మడికాయలు, బత్తాయిలు, ఔషధ మొక్కలు, అనేక ఇతర పంటలను భారీ పరిమాణంలో పండించి తక్కువ ధరకు ప్రత్యేక దుకాణాల్లో సహకార సంఘాలు విక్రయిస్తూ ఉంటాయి. హవానా నగరంలో దేశాధినేత కార్యాలయానికి అతి దగ్గర్లోనే 3 హెక్టార్లలో ‘ఆర్గానోపోనికో ప్లాజా’ క్యూబా ఆహార సార్వభౌమత్వాన్ని చాటుతూ ఉంటుంది. 1995 నాటికే క్యూబా రాజధాని నగరం హవానాలో ఇలాంటి 25,000 సేంద్రియ తోటలు వెలిశాయి. 2020 నాటికి వీటి సంఖ్య 30 వేలకు చేరింది. ఆ విధంగా క్యూబా సమాజం తనపై విరుచుకుపడిన ఆంక్షలను, ఆకలిని అర్బన్ అగ్రికల్చర్ ద్వారా జయించింది. (క్లిక్ చేయండి: అర్బన్ ఫుడ్ హీరో మజెదా బేగం!) – పంతంగి రాంబాబు prambabu.35@gmail.com -
'గే' మ్యారేజెస్‌కు ఆ దేశంలో చట్టబద్దత
హవానా: స్వలింగసంపర్క వివాహాలకు చట్టబద్ధత కల్పించిన దేశాల జాబితాలో మరో దేశం చేరింది. గే మ్యారేజెస్‌కు క్యూబా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటికే మహిళల హక్కులకు పెద్దపీట వేస్తున్న ఈ కమ్యూనిస్టు దేశం 'సేమ్ జెండర్' మ్యారేజెస్‌ను అధికారికం చేసింది. ఈ చట్టం కోసం ఆదివారం పెద్దఎత్తున ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది ప్రభుత్వం. 84లక్ష మంది పాల్గొన్న ఈ ఓటింగ్‌లో దాదాపు 40 లక్షల మంది(66.9శాతం) దీనికి అనుకూలంగా ఓటు వేశారు. 1.95లక్షల మంది(33శాతం) మాత్రం వ్యతిరేకించారు. దీంతో ప్రజల నుంచి భారీ మద్దతు వచ్చినందున గే మ్యారేజెస్‌కు చట్టబద్ధత కల్పిస్తున్నట్లు క్యూబా ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. ఈ విషయంపై క్యూబా అధ్యక్షుడు డయాజ్ క్యానెల్ స్పందిస్తూ.. ఎట్టకేలకు న్యాయం జరిగిందని ట్వీట్ చేశారు. కొన్ని తరాల రుణం తీర్చుకున్నట్లయిందని పేర్కొన్నారు. ఎన్నో క్యూబా కుటుంబాలు ఈ చట్టం కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నాయని చెప్పారు. ఈ చట్టంతో క్యూబాలో స్వలింగ సంపర్కుల పెళ్లికి చట్టబద్దత లభిస్తుంది. వీరు పిల్లల్ని కూడా దత్తత తీసుకోవచ్చు. పురుషులు, మహిళలకు సమాన హక్కులు ఉంటాయి. చదవండి: యువకుడి అసాధారణ బిజినెస్.. సినిమాలో హీరోలా.. -
Mumbo Jumbo: ముంబో జంబో.. ఈ ఇడియమ్ ఎప్పుడైనా వాడారా? అర్థం తెలిస్తే!
English Idioms- Mumbo Jumbo: అర్థం పర్ధం లేని మాటలు, పనులు, తెలివి తక్కువ నిర్ణయాలు, గందర గోళ పరిస్థితి, నవ్వులాటగా తోచే సీరియస్ పనులు... మొదలైన సందర్భాలలో ఉపయోగించే జాతీయం ఇది. 1738లో ఫ్రాన్సిస్ మూర్ అనే రచయిత ఈ ఎక్స్ప్రెషన్ను మొదటిసారిగా ఉపయోగించాడు. పశ్చిమ ఆఫ్రికాలో మూఢాచారాలు అనిపించే క్రతువులు కొన్ని ఉండేవి. అలాంటి వాటిలో ముంబో జంబో ఒకటి. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న అర్థంలో ఈ ఇడియమ్‌ను ఫ్రాన్సిస్ ఉపయోగించలేదు. ఆ తరువాత మాత్రం ‘నాన్సెన్స్’ అనిపించే పనులు, మాటల విషయాల్లో ఉపయోగిస్తున్నారు. ఉదా: 1. వాటిజ్ ఆల్ దిస్ ముంబో జంబో? 2. ఇట్ ఈజ్ నాట్ ముంబో జంబో యాజ్ సమ్ పీపుల్ థింక్.. మరి మీరు ఎపుడైనా ఈ ఇడియమ్‌ను ఉపయోగించారా? సమ్‌థింగ్ స్పెషల్.. పాత ఫొటోలు పాడయ్యాయా? ప్రతి ఇంట్లోనూ ఫొటో ఆల్బమ్స్ ఉంటాయి. వాటిలో చాలా పాత ఫోటోలు పాడై పోయి ఉంటాయి. ఇమేజ్ రిస్టోరేషన్ మెథడ్స్ వల్ల కొత్త ఫోటో వచ్చినప్పటికీ, దీనికి, ఒరిజినల్‌కు తేడా బాగా కనిపిస్తుంది. ఒరిజినల్‌కు, కొత్త ఇమేజ్‌కు పెద్ద తేడా లేకుండా సహజంగా ఉండడానికి gfp- యాప్ ఫ్రీ ఏఐ టూల్స్ ఉపకరిస్తాయి. ఎక్కడ ఏది అవసరమో (ఫిల్ ఇన్‌ది గ్యాప్స్) క్షణాల వ్యవధిలో సమకూరుస్తాయి ఈ ఏఐ టూల్స్. ప్రతీకాత్మక చిత్రం ఆర్ట్ అండ్ కల్చర్: అయ్యయ్యో! క్యూబా ఆర్టిస్ట్ ఆల్ఫ్రెడో మార్టిరెనా పర్యావరణ స్పృహతో ఎన్నో కార్టూన్లు గీశాడు. వాటిలో మీరు చూస్తున్న కార్టూన్ ఒకటి. ప్రపంచ జనాభా ఊహించని రీతిలో పెరిగిపోతుంది. పల్లెలు మాయమై పట్టణాలు ఇరుకు అవుతున్నాయి. చెట్లు మాయం అవుతున్నాయి. ఎటు చూసినా కాంక్రిట్ జంగిల్. దాని ప్రతికూల ప్రభావం ఏమిటో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది పచ్చదనం రూపంలో కాస్త ప్రాణవాయువు. అట్టి విషయాన్ని ఈ కార్టూన్ ఎంత చక్కగా చెప్పిందో! చదవండి: Pubarun Basu: నాలుగేళ్ల వయసులో మొదలెట్టాడు.. అద్భుతం ఆవిష్కృతం! అంతర్జాతీయ స్థాయిలో! -
అమెరికా పౌరసత్వాల్లో భారత్‌కు రెండో స్థానం
వాషింగ్టన్: అమెరికా పౌరసత్వాల్లో భారతీయుల జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది జూన్ 15 వరకు 6,61,500 మందికి పౌరసత్వం మంజూరు చేస్తే వారిలో మెక్సికో తర్వాత భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. మనవారికి 12,928 మందికి పౌరసత్వం లభించింది. మెక్సికో నుంచి అత్యధికంగా 24,508 మందికి అమెరికా పౌరసత్వం దక్కింది. ఫిలిప్పీన్స్(11,316), క్యూబా(10,689), డొమినికస్ రిపబ్లిక్(7,046) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో 8,55,000 మందికి అమెరికా పౌరసత్వం దక్కింది. గతేడాది మొదటి ఐదు స్థానాల్లో మెక్సికో, భారత్, క్యూబా, ఫిలిప్పీన్స్, చైనా దేశాలు నిలిచాయి. కాగా, అప్లికేషన్లను త్వరితగతిన క్లియర్ చేస్తున్నట్టు అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం తెలిపింది. (క్లిక్: కోటీశ్వరుల వలస.. మళ్లీ మొదలైంది.. వీరంతా ఎక్కడికి వెళ్తున్నారు?) -
ఆ హోటల్.. ఇట్స్ అమేజింగ్! జింగ్.. జింగ్
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్‌గోయెంకా అద్భుతమైన దృశ్యాన్ని మన ముందుకు తెచ్చారు. ఉరుకులపరుగుల జీవితం నుంచి దూరంగా వెళ్లి కాసేపు పక్షులా స్వేచ్ఛగా బతికేయాలని అనుకునేవాళ్లకి అనువైన ఓ హోటల్ని పరిచయం చేశారు. క్యూబాలోని దట్టమైన అడవుల్లో ఎత్తైన చెట్లపై ట్రీ టాప్ హోటల్ని నిర్మించారు. ఎత్తైన చెట్లపైన పక్షులు కట్టిన గూళ్ల తరహాలో అధునాతన సౌకర్యాలతో గదులు, లాంజ్‌లు నిర్మించారు. వేర్వేరు చెట్ల మీద గూళ్ల తరహాలో ఉన్న గదులను చేరుకునేందుకు చెట్లపైనే వేలాడే వుడెన్ బ్రిడ్జీలను ఏర్పాటు చేశారు. వెలిజ్ ఆర్కిటెక్టో అనే వ్యక్తి ఈ హోటళ్లను డిజైన్ చేశారు. ప్రశాంతతకి స్వర్గథామంగా ఈ హోటళ్లని స్థానికంగా పేర్కొంటారు. Amazing hotel complex in Cuba located on the trees of a forest where individual nests are connected by wooden suspension bridges. Looks like a haven of peace and tranquility! Architect: Veliz Arquitecto pic.twitter.com/s5lBDJYWaL — Harsh Goenka (@hvgoenka) October 10, 2021 చదవండి : 17 ఏళ్లుగా అడవిలోనే ఒంటరిగా జీవిస్తున్న వ్యక్తి.. కారణం? -
హవానా... అంతా భ్రమేనా?!
అండపిండ బ్రహ్మాండంలో ఆంబోతు రంకేస్తే ఎక్కడో ఉన్న ఎవరికో తగిలి తుస్సుమన్నట్లు అంతర్జాతీయ డిటెక్టివ్ సినిమా స్థాయిలో అందరూ హడావుడి చేసిన హవానా సిండ్రోమ్ వెనుక రహస్యాయుధాలేమీ లేవని తాజా పరిశోధన తేల్చేసింది. మనిషిలో ఏర్పడే మనో, చిత్త భ్రమల కారణంగానే హవానా సిండ్రోమ్ లక్షణాలు కలుగుతున్నాయని న్యూరాలజిస్టుల తాజా అంచనా! ఇంతకీ ఏంటీ సిండ్రోమ్? ఎందుకీ హడావుడి? సైంటిస్టులేమంటున్నారు? చూద్దాం.. ప్రపంచ పెద్దన్న అమెరికానే హైరానా పెట్టిన హవానా సిండ్రోమ్ పేరు 2016–17లో తొలిసారి వినిపించింది. క్యూబాలోని అమెరికా రాయబార కార్యాలయ సిబ్బందిలో తొలిసారి ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి. మైగ్రేన్ తలనొప్పి, అలసట, కడుపులో వికారం, నిద్రమత్తు, చెవుల్లో వింత శబ్దాలు, తలతిరగడం తదితర లక్షణాలు సిబ్బందిలో కనిపించాయి. దీని గురించి బయటపడి ఐదేళ్లైనా ఎందువల్ల వస్తుందో ఎవరూ కచి్ఛతంగా చెప్పలేకపోయారు. చివరకు జేమ్స్‌బాండ్ సినిమాలోలాగా ఏదో రహస్యాయుధం వల్లనే ఈ లక్షణాలు కలుగుతున్నాయని, అమెరికా సిబ్బందిపై ఈ ఆయుధాన్ని శత్రుదేశాలు ప్రయోగిస్తున్నాయని కథనాలు వెలువడ్డాయి. ఈ ఆయుధం క్యూబా సృష్టి అని, రష్యా రూపకల్పన అని పలురకాల ఊహాగానాలు చెలరేగాయి. కొందరు పేరున్న సైంటిస్టులు కూడా దీనికి సరైన కారణం తెలుసుకోకుండా ఆయుధ వాడకం థియరీని బలపరిచారు. అయితే అమెరికాకే చెందిన న్యూరాలజిస్టు రాబర్ట్ బలో మాత్రం భిన్నంగా ఆలోచించారు. హవానా సిండ్రోమ్ లక్షణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ లక్షణాలు తనవద్దకు వచ్చే మనోభ్రాంతి పేషెంట్లలో కూడా ఉన్నట్లు గుర్తించారు. వీటిని సైకోసొమాటిక్(మానసికోత్పన్న) లక్షణాలుగా నిర్ధారణకు వచ్చారు. మానసిక భ్రాంతి కారణంగా కలిగినప్పటికీ ఈ లక్షణాలు నిజమైన బాధను కలగజేస్తాయని ఆయన పరిశోధనలో తేలింది. దీంతో ఈ విషయమై ఆయన మరింత లోతైన అధ్యయనం జరిపారు. బృంద లక్షణాలు మాస్ సైకోజెనిక్ ఇల్నెస్(బృంద చిత్త భ్రమ వ్యాధి) అనేది ఒక సమూహంలోని కొందరు ప్రజలు సామూహికంగా అనుభవించే మనో భ్రమ అని రాబర్ట్ చెప్పారు. ఇదే హవానా సిండ్రోమ్‌కు కారణమై ఉండొచ్చన్నది ఆయన స్థిర అభిప్రాయం. ఒక సమూహంలోని కొందరు తామేదో భయానకమైనదాన్ని ఎదుర్కొన్నామని భావించినప్పుడు ఈ భ్రమ మొదలవుతుందని వివరించారు. ఉదాహరణకు 20వ శతాబ్దంలో టెలిఫోన్లు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. తొలినాళ్లలో పలువురు టెలిఫోన్ ఆపరేటర్లు ఒక షాక్ లాంటి స్థితిని చాలా రోజులు అనుభవించేవారని ఆయన గుర్తు చేశారు. దీనికి కారణం ఎవరూ కనుక్కోలేకపోయారు. ఇది కేవలం మాస్ సైకోజెనిక్ ఇల్నెస్ అని రాబర్ట్ బల్లగుద్ది చెబుతున్నారు. హవానా సిండ్రోమ్ కూడా అలాంటిదేనన్నది ఆయన భావన. ఒత్తిడిలో పనిచేసేవారిలో ఈ ఇల్నెస్ ఆరంభమవుతుంది. ఒకరిలో ఈ భ్రమ ఆరంభం కాగానే, వారు దీని గురించి ఇతరులకు వివరిస్తారు. అలా విన్నవారిలో కొందరు అలాంటి భ్రమకు లోబడతారు. ఇలా ఈ లక్షణాలు వ్యాపిస్తూ ఉంటాయి. మెదడులో రసాయన మార్పుల కారణంగా ఈ లక్షణాలు ఆరంభమై సదరు వ్యక్తిని పలు ఇబ్బందులు పెడుతుంటాయి. ఇవి కొన్ని సంవత్సరాలు కనిపించే అవకాశం ఉందని రాబర్ట్ చెప్పారు. జాతీయ సైన్స్ అకాడమీ ఈ సిద్ధాంతాన్ని కూడా అంగీకరించింది. కానీ తగిన గణాంకాలు లేనందున నిర్ధారించడంలేదు. క్యూబా ప్రభుత్వం కూడా దీనిపై లోతైన పరిశోధన జరిపి గతనెల 13న ఒక నివేదికను విడుదల చేసింది. ఈ సిండ్రోమ్ వెనుక ఎలాంటి ఆయుధాలు లేవని నివేదిక స్పష్టం చేసింది. క్యూబాలో ఎప్పుడో పనిచేసిన ఒక అండర్ కవర్ ఏజెంట్, తాను ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి వల్ల ఈ సిండ్రోమ్ బారిన పడి ఉంటారని, తననుంచి ఇది ఒక అంటువ్యాధిలా వ్యాపించిందనేది హవానా సిండ్రోమ్‌పై తాజా అంచనా. ఇంతకు మించిన కారణాలేమైనా ఉంటే, వాటిని సీఐఏ బయటపెడితే తప్ప హవానా సిండ్రోమ్‌పై హైరానా అనవసరమన్నది సైంటిస్టుల అభిప్రాయం. (చదవండి: అమరీందర్ నిబద్ధతపై సందేహం: రావత్) సిద్ధాంత రాద్ధాంతాలు హవానా సిండ్రోమ్ వల్ల కలిగే ఇబ్బందులు ఒక్కరికే పరిమితం కాకుండా పలుమందిలో ఒకేలా కనిపించడం రాబర్ట్‌ను ఆకర్షించింది. దీంతో ఆయన మాస్ హిస్టీరియా, సైకోసొమాటిక్ డిసీజెస్ తదితర అనేక అంశాలను పరిశీలించి అధ్యయనం చేశారు. సోనార్ ఆయుధం వాడకం చెవి అంతర్భాగంలో ఏర్పడుతున్న హాని వల్ల ఈ లక్షణాలు కలుగుతున్నట్లు 2018లో మియామీకి చెందిన కొందరు జరిపిన అధ్యయనం అభిప్రాయపడింది. ఈ ఫలితాలను కూడా ఆయన మదింపు చేశారు. అయితే ఈ అధ్యయనాలన్నింటిలో లోపాల కారణంగానే తప్పుడు సిద్ధాంతాలు రూపొందాయని ఆయన చెబుతున్నారు. (చదవండి: Bihar: నడి రోడ్డుపై ట్రాఫిక్ పోలీసును చితకబాదాడు) సోనార్ ఆయుధం వాడి ఉంటే కేవలం లోపలి చెవి భాగాలు మాత్రమే కాకుండా మెదడులోని భాగాలు కూడా దెబ్బతిని ఉండేవని వివరించారు. మైక్రోవేవ్ రేడియేషన్ ఆయుధం వల్ల ఈ లక్షణాలు వస్తున్నాయని 2020లో కొందరు సరికొత్త సిద్ధాంతం లేవనెత్తారు. దీన్ని జాతీయ సైన్సు అకాడమీ పరోక్షంగా సమరి్ధంచడంతో ఈ సిద్ధాంతానికి మరింత ప్రాచుర్యం వచ్చింది. అయితే మేక్రోవేవ్ ఆయుధం వల్ల వినిపించే శబ్దాలు నిజమైనవి కావని, మెదడులో ఉండే న్యూరాన్లు అనుభవించే మిధ్యా శబ్దాలని రాబర్ట్ చెప్పారు. హవానా సిండ్రోమ్ లక్షణాలు ఇలాంటి మిధ్యా శబ్దాలు కావని ఆయన గుర్తించారు. ఈ విధంగా అనేక పరిశీలన అనంతరం చిత్త భ్రమ వల్లనే ఈ సిండ్రోమ్ లక్షణాలు కలుగుతున్నాయని రాబర్ట్ నిర్ధారణకు వచ్చారు. – నేషనల్ డేస్క్, సాక్షి. -
వారెవ్వా: ‘పంచ్’ అదిరిందిగా.. బాక్సింగ్‌లో టాప్ ఎవరంటే!
టోక్యో: ఒలింపిక్స్‌లో క్యూబా బాక్సర్ల పంచ్‌లకు ప్రత్యర్థుల వద్ద సమాధానాలు కరువయ్యాయి. ఆదివారం పురుషుల లైట్‌వెయిట్ (63 కేజీలు) విభాగంలో జరిగిన ఫైనల్ బౌట్లో క్యూబా బాక్సర్ ఆండీ క్రూజ్ 4–1తో కీషాన్ డేవిస్ (అమెరికా)పై గెలుపొందాడు. డేవిస్‌పై క్రూజ్‌కు ఇది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. పురుషుల +91 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో రిచర్డ్ టొర్రెస్ జూనియర్ (అమెరికా) 0–5తో బకోదిర్ జలొలోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడాడు. దాంతో 17 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గాలని చూసిన అమెరికాకు నిరాశే మిగిలింది. ఓవరాల్‌గా బాక్సింగ్‌లో ఐదు పతకాలు (నాలుగు స్వర్ణాలు, ఒక కాంస్యం) సాధించిన క్యూబా టాప్ పొజిషన్లో నిలిచింది. వాటర్‌పోలో విజేత సెర్బియా పురుషుల విభాగంలో ఆదివారం జరిగిన వాటర్‌పోలో ఫైనల్లో సెర్బియా 13–10 గోల్స్ తేడాతో గ్రీస్‌పై గెలుపొందింది. నికోలా జాక్సిచ్ మూడు గోల్స్ చేసి సెర్బియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో హంగేరి తర్వాత వాటర్పోలోలో వరుసగా రెండు ఒలింపిక్స్ గోల్డ్ మెడల్స్ నెగ్గిన జట్టుగా సెర్బియా నిలిచింది. గతంలో హంగేరి 2000–08 మధ్య జరిగిన ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ స్వర్ణాలను గెల్చుకుంది. చదవండి: మనసులు గెలిచిన అదితి.. పార్, బర్డీ, ఈగల్ అంటే ఏంటో తెలుసా? -
ఒలింపిక్స్ చరిత్రలో ఒకే ఒక్కడు...
టోక్యో: వందేళ్లకంటే ఎక్కువ చరిత్ర కలిగిన పురుషుల ఒలింపిక్స్ రెజ్లింగ్ క్రీడలో ఎవరికీ సాధ్యంకాని రికార్డును క్యూబా మల్లయోధుడు మిజైన్ లోపెజ్ నునెజ్ సాధించాడు. వరుసగా నాలుగు ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణ పతకాలు గెలిచిన తొలి రెజ్లర్‌గా అతను గుర్తింపు పొందాడు. గ్రీకో రోమన్ 130 కేజీల విభాగంలో బరిలోకి దిగిన 38 ఏళ్ల లోపెజ్ తన ప్రత్యర్థులకు ఒక్క పాయింట్ కూడా సమర్పించుకోకుండా అజేయుడిగా నిలిచి తన మెడలో పసిడి పతకాన్ని వేసుకున్నాడు. రెండోసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న లకోబికి రజతం దక్కింది. సోమవారం జరిగిన ఫైనల్లో లోపెజ్ 5–0తో లకోబి కజాయ (జార్జియా)ను ఓడించి విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన తొలి రౌండ్లో లోపెజ్ 9–0తో అలెక్సుక్ (రొమేనియా)పై, క్వార్టర్ ఫైనల్లో 8–0తో అమీన్ మిర్జాజాదె (ఇరాన్)పై, సెమీఫైనల్లో 2–0తో రిజా కాయల్ప్ (టర్కీ)పై విజయం సాధించాడు. కాంస్య పతక బౌట్లలో రిజా కాయల్ప్ 7–2తో అమీన్ మిర్జాజాదెపై; అకోస్టా ఫెర్నాండెజ్ (చిలీ)పై సెర్గీ సెమెనోవ్ (రష్యా ఒలింపిక్ కమిటీ) గెలిచారు. గతంలో రష్యా మేటి రెజ్లర్ అలెగ్జాండర్ కరెలిన్ (130 కేజీలు) వరుసగా నాలుగు ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణాలు నెగ్గే రికార్డును సృష్టించాలనుకొని విఫలమయ్యాడు. కరెలిన్ 1988, 1992, 1996 ఒలింపిక్స్‌లలో స్వర్ణాలు సాధించి 2000 సిడ్నీ ఒలింపిక్స్ ఫైనల్లో రులాన్ గార్డెనర్ (అమెరికా) చేతిలో 0–1తో ఓడిపోయి రజత పతకం గెల్చుకున్నాడు. లోపెజ్ మాత్రం తన ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నాలుగో స్వర్ణాన్ని దక్కించుకొని చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. గతంలో ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా కూడా నిలిచిన లోపెజ్ 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో 120 కేజీల విభాగంలో పసిడి పతకాలు సాధించాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో 130 కేజీల విభాగంలో విజేతగా నిలిచాడు. ‘పురుషుల రెజ్లింగ్‌లో కొత్త చరిత్ర సృష్టించినందుకు ఆనందంగా ఉంది. నా సుదీర్ఘ కెరీర్లో ఎంతో కష్టపడ్డాను. అత్యుత్తమ రెజ్లర్లను ఓడించి నాలుగోసారి స్వర్ణాన్ని గెలిచినందుకు గర్వంగా కూడా ఉంది. స్వర్ణ పతకం బౌట్ ముగిశాక క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్ కెనల్ నాకు ఫోన్ చేసి అభినందించారు’ అని లోపెజ్ వ్యాఖ్యానించాడు. మహిళల రెజ్లింగ్‌లో జపాన్‌కు చెందిన కవోరి ఇచో మాత్రమే వరుసగా నాలుగు ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించింది. కవోరి ఇచో 2004 ఏథెన్స్, 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్ క్రీడల్లో 63 కేజీల విభాగంలో... 2016 రియో ఒలింపి క్స్‌లో 58 కేజీల విభాగంలో పసిడి పతకాలు గెల్చుకుంది. -
డబ్బులు తీసుకోలేదు.. ఫ్రీగా చేశా: మియా ఖలీఫా
ఎక్స్-పోర్న్‌స్టార్, ప్రయుఖ వెబ్‌కామ్ మోడల్ మియా ఖలీఫా మరోసారి వార్తల్లోకి నిలిచింది. క్యూబా అల్లకల్లోలంపై ఆమె చేసిన పోస్ట్‌తో రాజకీయపరమైన విమర్శలు మొదలయ్యాయి. ఏకంగా క్యూబా అధ్యక్షుడు మిగ్యుయెల్ దిజాయ్-కనెల్ ఆమెపై విరుచుకుపడ్డాడు. మియాను ఓ క్యారెక్టర్‌లేని పర్సనాలిటీగా పేర్కొన్న మిగ్యుయెల్.. ఆమె ఒక అమెరికా పెయిడ్ ఏజెంట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆమె స్పందించింది. ‘ప్రజల పట్ల మానవత్వం లేకుండా ప్రదర్శిస్తున్న మీ తీరును ఇతరులకు తెలియజేయాలనే ఆ పని చేశా. నేనేం డబ్బులు తీసుకుని ఆ పని చేయలేదు. ఏ ప్రభుత్వం కూడా నాకు ఆ పని అప్పజెప్పలేదు. నా పరిధిలో ఉచితంగా ఆ ట్వీట్ చేశా’ అంటూ ట్వీట్ ద్వారా బదులిచ్చింది ఆమె. అంతేకాదు క్యూబా అయినా, పాలస్తీనా అయినా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడమే నా పని అంటూ మరో ట్వీట్ ద్వారా పేర్కొంది. ఇదిలా ఉంటే క్యూబా ప్రజల ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు బైడెన్ మద్దతు తెలిపిన రోజే.. మియా ఖలీఫా ట్వీట్ చేసింది. దీంతో మీడియా ప్రతినిధులు క్యూబా అధ్యక్షుడు మిగ్యుయెల్ దగ్గర ఆమె ప్రస్తావన తీసుకురావడంతో ‘ఆమె అమెరికా చేతిలో కీలు బొమ్మ. క్యారెక్టర్ లేని వ్యక్తి. పెయిడ్ ఏజెంట్’ అంటూ ఆయన విరుచుకుపడ్డాడు. ఇక మియాకు ఇలా ఇన్‌న్యూస్ విషయాలపై కొత్తేం కాదు. గతంలో పాలస్తీనా విషయంలో అమెరికా తప్పుల్ని సైతం వెలేత్తి చూపించిందామె. సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ లెబనీస్-అమెరికన్ సెలబ్రిటీ.. తరచూ కొందరికి సాయం అందించడంతో పాటు ఇలా వివాదాల్లో కూడా నిలుస్తోంది. It’s tough not to see the faces of my people in the suffering of Cubans. Lebanon, Palestine, Cuba, it doesn’t matter where it’s happening, all that matters is it needs to be talked about because look at the result: PRESSURE forces change https://t.co/OG6QeEM7QL — Mia K. (@miakhalifa) July 15, 2021 -
రణరంగంగా క్యూబా.. విధ్వంసకాండ! కుట్ర కోణం?
Cuba Protests దశాబ్దాలుగా కమ్యూనిస్టుల పాలనలో ఉన్న క్యూబాలో కనివిని ఎరుగని రీతిలో జనాగ్రహం పెల్లుబిక్కింది. రోడ్డెక్కిన వేల మంది ప్రజలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన గళం విప్పుతున్నారు. నియంతృత్వ పోకడల ప్రభుత్వం వెంటనే గద్దెదిగాలని, అధ్యక్షుడు మిగ్యుయెల్ దిజాయ్-కనెల్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ తిరుగుబాటు వెనుక కుట్ర కోణం ఉందని క్యూబా ప్రభుత్వం ఆరోపిస్తోంది. హవానా: కరేబియన్ ద్వీప దేశం క్యూబాలో ఈ స్థాయి ప్రభుత్వవ్యతిరేకత కనిపించడం ఇదే తొలిసారి. ఆర్థిక సంక్షోభం వల్లే జనాల్లో ఆగ్రహం నెలకొందని విశ్లేషకులు భావిస్తున్నారు. కరెంట్ కోతలు, ఆహార కొరత, కరోనా మందులు-వ్యాక్సిన్ల కొరత.. వీటికి తోడు అమెరికా ఆంక్షల పర్వం కూడా క్యూబా ప్రజల్లో సొంత ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచుతున్నాయి. అధ్యక్షుడు Miguel Díaz-Canel రాజీనామాకు డిమాండ్ చేసేలా చేశాయి. ‘మా స్వేచ్ఛ మాక్కావాలి’ అంటూ వేల మంది రాజధాని హవానాకు చేరి ప్రదర్శనలు చేపడుతున్నారు. పోలీసులు వాళ్లను అదుపు చేసే సమయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కర్రలతో ఎదురు దాడులకు పాల్పడడమే కాకుండా.. ప్రజా ఆస్తులను సైతం ధ్వంసం చేస్తున్నారు నిరసనకారులు. అణిచివేత దశాబ్దాల కమ్యూనిస్టు పాలనలో ఇంత తీవ్ర స్థాయి నిరసనలు హోరెత్తడం ఇదే తొలిసారి. హవానాతో పాటు చాలాచోట్ల పరిస్థితి రణరంగంగా మారింది. దీంతో మిలిటరీ, పోలీసుల సాయంతో అణిచివేసే ప్రయత్నం చేస్తోంది క్యూబా ప్రభుత్వం. ఇప్పటికే పదుల సంఖ్యలో నిరసనకారుల్ని అరెస్ట్ చేశారు. మరికొందరికి గాయలయ్యాయి. క్యూబాలో 2018లో ఇంటర్నెట్ అడుగుపెట్టగా.. ప్రస్తుతం ప్రజా తిరుగుబాటు ప్రభావంతో సోషల్ మీడియాలో కుప్పలుగా పోస్టులు కనిపిస్తున్నాయి. ‘Freedom, food, vaccines!’ 😲😳#Cuba #CubaProtestspic.twitter.com/8VTjWf5pEr — Auron (@auron83591234) July 12, 2021 దీంతో అక్కడి ప్రభుత్వం ఆదివారం మధ్యాహ్నం నుంచి ఇంటర్నెట్ కనెక్షన్‌ను కట్ చేసింది. మరోవైపు క్యూబా ప్రజాగ్రహంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. క్యూబా ప్రజలు తమ హక్కుల పరిరక్షణ కోసం చేస్తున్న తిరుగుబాటు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందని అభివర్ణించాడు. క్యూబా ప్రజలకు తమ మద్ధతు ఉంటుందని ఆయన ప్రకటించారు. ‘ముందు వాళ్ల డిమాండ్లు ఏంటో వినండి.. అణచివేతను ఆపి పేదరికాన్ని ఎలా రూపుమాపాలో దృష్టిపెట్టండి. ప్రజలపై కవ్వింపు చర్యలకు పాల్పడితే ఊరుకునే ప్రసక్తే లేదు’ అంటూ క్యూబా ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు బైడెన్. జోక్యం చేసుకుంటే ఊరుకోం ఇది ముమ్మాటికీ ‘క్యూబన్-అమెరికన్ మాఫియా’ పనే అని ఆరోపిస్తోంది క్యూబా సర్కార్. పెయిడ్ ఏజెంట్లను నియమించుకున్న అమెరికా.. సోషల్ మీడియాలో దుష్ప్రచారంతో అంతర్జాతీయ సమాజంలో తమను నిలబెట్టే ప్రయత్నం చేస్తోందని అధ్యక్షుడు మిగ్యుయెల్ దిజాయ్-కనెల్ ఆరోపించాడు. ఇందులో కుట్ర దాగుంది. ప్రజలు సమన్వయం పాటించాలి. శాంతి స్థాపన కోసం పదవిని సైతం త్యాగం చేసేందుకు సిద్ధం. ఇతరుల జోక్యం లేకుండా సామరస్యంగా సమస్యను పరిష్కరిద్దాం అని ఆదివారం రాత్రి జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇదిలా ఉంటే క్యూబా అంతర్గత వ్యవహారంలో ఏ దేశమైనా కలుగజేసుకుంటే చూస్తూ ఊరుకోబోమని రష్యా, మెక్సికోలు హెచ్చరికలు జారీ చేశాయి. అఫ్కోర్స్.. పరోక్షంగా ఈ వార్నింగ్ అమెరికాకే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక శాంతియుతంగా ప్రదర్శనలకు అనుమతి ఇచ్చి.. వాళ్ల డిమాండ్లపై చర్చలు జరపాలని ఈయూ ఫారిన్ పాలసీ ఛీఫ్ జోసెఫ్ బొర్రెల్, క్యూబా ప్రభుత్వాన్ని కోరాడు. In the three years I spent going back and forth to Cuba, my Cuban partner and I were stopped repeatedly by the police on the streets in Havana. This is truly amazing to see the people fighting back against the police state.pic.twitter.com/x6WPUq9ddn — Keith Boykin (@keithboykin) July 12, 2021 -
క్యూబాకు పారిపోవాలనేది చోక్సి ప్లాన్
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం నిందితుడు, డొమినికాలో కోర్టు విచారణని ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. డొమినికా మీదుగా క్యూబాకు పారిపోవాలని చోక్సి పన్నాగం పన్నాడని ఆయన గర్ల్‌ఫ్రెండ్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న బార్బరా జబారికా చెప్పారు. వచ్చేసారి క్యూబాలో కలుసుకుంటామని చోక్సి తనతో చెప్పినట్టుగా ఆమె ఏఎన్ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ అతను క్యూబాలో స్థిరపడాలని భావించాడు’అని బార్బరా చెప్పారు. చోక్సికి తాను గర్ల్‌ఫ్రెండ్‌ని కాదన్నారు. చోక్సి నేరస్తుడని తెలీదు చోక్సి పరారీలో ఉన్న నేరస్తుడని తనకు అసలు తెలీదని, అతని అసలు పేరు, బ్యాక్ గ్రౌండ్ ఏదీ తనకు తెలీదని బార్బరా చెప్పారు. ‘నేను యూరోపియన్‌ని. భారత ఆర్థిక నేరగాళ్ల జాబితా గురించీ తెలీదు. చోక్సి అసలు పేరేమిటో గత వారం వరకు నాకు తెలీదు. గత ఏడాది ఆగస్టులో మొదటిసారి చోక్సిని కలుసుకున్నాను. తన పేరు రాజ్ అని పరిచయం చేసుకున్నాడు. తరచు నాకు మెసేజ్‌లు పెడుతూ ఉండేవాడు. కానీ నెలకోసారి మాత్రం రిప్లయ్ ఇచ్చేదాన్ని’ అని చెప్పారు. మరోవైపు ఆంటిగ్వాలో కిడ్నాప్ చేసి తనను డొమినికాకు తీసుకువచ్చారని, ఆ కిడ్నాప్‌లో బార్బరా హస్తం కూడా ఉందంటూ చోక్సి చేసిన ఆరోపణల్ని ఆమె తిప్పికొట్టారు. మెహుల్ చోక్సి బెయిల్ పిటిషన్ విచారణని డొమినికా హైకోర్టు 11వ తేదీకి వాయిదా వేసినట్టుగా స్థానిక మీడియా వెల్లడించింది. కింద కోర్టు అతని బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో చోక్సి హైకోర్టుకెక్కారు. -
లాక్డౌన్.. ఎవరు బెస్ట్?
కరోనా టైంలో చాలా దేశాల్లో లాక్డౌన్ పెట్టారు.. మన దగ్గరా పెట్టారు.. ఇంతకీ ఈ ఉపద్రవం సమయంలో అత్యంత కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేసిందెవరు? దీనిపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఓ భారీ అధ్యయనం నిర్వహించింది. మొత్తం 180 దేశాల్లో లాక్‌డౌన్‌ను పరిశీలించిన అనంతరం 100కు ఇన్ని మార్కులు అని వేసింది.. ఎక్కువ మార్కులు వచ్చిన దేశాలు సమర్థంగా లాక్‌డౌన్‌ను అమలు చేసినట్లు అన్నమాట. అలాగని లాక్డౌన్ అనేసరికి.. ఒక్క కర్ఫ్యూ విధించడం ఒక్కదాన్నే పరిగణనలోకి తీసుకోలేదు. అనేక ఇతర అంశాలను పరిశీలించింది. పాఠశాలలు, ఆఫీసులను మూసేయడం.. బహిరంగ సమావేశాలపై నిషేధం, వృద్ధుల సంరక్షణ, అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం, వైద్య రంగంలో పెట్టుబడి, మాస్కులు తప్పనిసరిగా ధరించేలా చూడటం, ఆర్థికపరమైన ప్యాకేజీలు, ఆదాయం కోల్పోయినవారికి ఆసరాగా నిలవడం, వ్యాక్సిన్లపై ఖర్చు, కాంటాక్ట్ ట్రేసింగ్, లాక్డౌన్ దశలవారీగా ఉపసంహరణ ఇలా అనేక అంశాలను గమనించి.. ఈ ర్యాంకులను విడుదల చేసింది. ఈ అధ్యయనం ప్రకారం.. ప్రపంచంలో అత్యంత కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేసిన దేశం క్యూబా (90.74).. తర్వాతి స్థానాల్లో ఎరిత్రియా(89.81), ఐర్లాండ్(87.96), హొండూరస్(87.96), లెబనాన్(87.04), బ్రిటన్, పెరూ(86.11) ఉన్నాయి. మన విషయానికొస్తే.. భారత్‌కు 68.98 పాయింట్లు రాగా.. చైనాకు 78.24, అమెరికాకు 71.76, ఫ్రాన్స్‌కు 63.89 వచ్చాయి. లాక్డౌన్ మార్కుల స్కేల్‌పై వివిధ దేశాల పరిస్థితి ఎలా ఉందో ఓసారి పరిశీలిస్తే.. -
మనుషులు లేని దీవిలో ఆ ముగ్గురు 33 రోజుల పాటు..
వాషింగ్టన్: తెలియని ప్రాంతంలో ఒక్క పూట గడపాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటిది నర సంచారం లేని దీవిలో.. తిండి తిప్పలు లేకుండా నెల రోజులకు పైగా గడపడం అంటే మాటలు కాదు. ఇలాంటి భయంకర పరిస్థితి ఎదురయ్యింది ముగ్గురు వ్యక్తులకు. వీరంతా 33 రోజుల పాటు మనుషుల్లేని దీవిలో బందీలయ్యారు. నాలుగో మనిషి కనబడడు.. ఆహారం, నీరు లేదు. అదృష్టం కొద్ది అక్కడ కొబ్బరి చెట్లు ఉండటంతో.. ఇన్నాళ్లు బతికి బట్టకట్టగలిగారు. చివరకు 33 రోజుల తర్వాత ఆ దీవి నుంచి సురక్షితంగా బయట పడ్డారు. ఇంతకు వీరంతా ఆ దీవిలోకి ఎందుకు వెళ్లారు.. ఎలా బయటపడగలిగారు అనే విషయాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే.. క్యూబాకు చెందిన ఓ మహిళ, ఇద్దరు పురుషులు.. పడవలో సముద్రంలోకి వెళ్లారు. అలల తాకిడి ఎక్కువ కావడం వల్ల వారు ప్రయాణిస్తున్న పడవ బొల్తా పడింది. ఊహించని ఈ ప్రమాదానికి వారు బిక్క చచ్చిపోయారు. ఎలానో ధైర్యం తెచ్చుకుని చేతికి అందిన వస్తువులను పట్టుకుని సమీపంలోని దీవి వరకు ఈదుకుంటూ వెళ్లిపోయారు. ఇక వారు చేరుకున్న దీవి నర సంచారం ఉండని బహమాన్ దీవుల్లోని అతి చిన్న ద్వీపం అంగుయిలా కే. ఒడ్డుకు అయితే చేరగలిగారు కానీ అక్కడి నుంచి బయటపడే మార్గ కనిపించలేదు. చేసేదేం లేక అటుగా ఏమైనా ఓడలు, విమానాలు వస్తే సాయం అడగవచ్చని భావించి.. కాలం గడపసాగారు. ఇలా ఓ మూడు రోజులు గడిచాయి. వారితో తెచ్చుకున్న ఆహారం మొత్తం అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. దీవిలో ఏమైనా పండ్ల చెట్ల లాంటివి ఉంటాయేమోనని వెతకడం ప్రారంభించారు. అదృష్టం కొద్ది వారికి కొబ్బరి చెట్లు కనిపించాయి. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. మొదట్లో కొబ్బరి బొండాల్లో నీరు తాగి, కొబ్బరిని తిని రోజులు వెళ్లదీశారు. కానీ ఎన్ని రోజులని ఇలా. సరైన ఆహారం లేక.. కేవలం కొబ్బరి మాత్రమే తీసుకుంటుండటంతో వారిలో నీరసం బాగా పెరిగిపోయింది. రోజులు గడుస్తున్న కొద్ది నీరసం పెరగుతోంది.. బతుకు మీద ఆశ తగ్గుతోంది. ఇక తామంతా ఆ దీవిలోనే ఆకలితో అలమటించి సజీవ సమాధి అవ్వక తప్పదని భావించారు. అలా 33 రోజుల గడిచిపోయాయి. #UPDATE @USCG rescued the 3 Cuban nationals stranded on Anguilla Cay. A helicopter crew transferred the 2 men & 1 woman to Lower Keys Medical Center with no reported injuries. More details to follow.#D7 #USCG #Ready #Relevant #Responsive pic.twitter.com/4kX5WJJhs8 — USCGSoutheast (@USCGSoutheast) February 9, 2021 ఈ క్రమంలో ఫిబ్రవరి 8న అమెరికాకు చెందిన కోస్ట్ గార్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి అటుగా ఎగురుతూ వచ్చింది. ఆ శబ్దం వారిలో చనిపోయిన ఆశలను రేకేత్తించింది. బతికిపోయాం.. ఇక బయటపడతాం అని భావించారు. తమ దగ్గరున్న దుస్తులను జెండాలుగా ఊపుతూ.. తమ గురించి ఎయిర్ క్రాఫ్ట్‌లోని వారికి అర్థం అయ్యేలా చేశారు. ఇక విమానంలో ఉన్న వారికి కింద ఏవో జెండాలు కదులుతున్నట్లు తోచి.. కాస్త కిందకు వచ్చారు. అక్కడ ఈ ముగ్గురిని చూసి షాకయ్యారు. ఆ తర్వాత పైలెట్ వీరి గురించి అధికారులకు తెలియజేశాడు. దాంతో ఆ దీవి వద్దకు హెలికాప్టర్‌ను పంపి ఆ ముగ్గురికి నీళ్లు, ఆహారంతో పాటు వారితో మాట్లాడేందుకు వీలుగా ఓ రేడియో వాకీ టాకీని కూడా అందించారు. అయితే, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో అదే రోజు వారిని రక్షించలేకపోయారు. దాంతో ఫిబ్రవరి 9న మరో రెస్క్యూ హెలికాప్టర్ అక్కడికి చేరుకుని ముగ్గురిని రక్షించింది. అనంతరం వారిని హాస్పిటల్‌కు తరలించారు. లక్కీగా వారిలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.. నీరసం మినహా ఇతర అనారోగ్య సమస్యలు ఏం లేవని.. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఇక వీరిని కాపాడిన దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. మీకింకా భూమ్మీద నూకలున్నాయి.. అందుకే బయటపడ్డారు.. మరో సారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి అంటూ నెటిజనులు సూచిస్తున్నారు. చదవండి: ఆరోగ్యం... క్యూబా భాగ్యం! స్కూల్ ఫీజుకు బదులుగా కొబ్బరి బొండాలు..! -
క్యూబాలో కూలిన హెలికాప్టర్.. ఐదుగురి దుర్మరణం
హవానా: గగనతలంలో ఇటీవల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్న ఇండినేషియాలో భారీ విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా క్యూబా దేశంలో ఓ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారని ఆ దేశ మీడియా ప్రకటించింది. అయితే మృతులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు. క్యూబాలోని ఉత్తర దిశలో హెూల్విన్ ప్రావిన్స్ నుంచి గ్వాంటనామో ద్వీపానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హెూల్విన్ ప్రావిన్స్ నుంచి గ్వాంటనామో ద్వీపానికి శుక్రవారం తెల్లవారుజామున (జనవరి 29) హెలికాప్టర్ బయల్దేరింది. అయితే మార్గమధ్యలో ఒక కొండపై అకస్మాత్తుగా హెలికాప్టర్ కూలిపోయిందని ఆ దేశ సాయుధ దళాల మంత్రిత్వశాఖ ప్రకటించింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు కన్నుమూశారని తెలిపింది. అయితే ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఒక కమిషన్‌ను ఏర్పాటు చేశారు. వివరాలు సేకరించి దర్యాప్తుకు ఆదేశించారు. ఈ దేశంలో 2018లో భారీ విమాన ప్రమాదం జరిగింది. దేశ రాజధాని హవానా విమానాశ్రయం సమీపంలో జరిగిన ఘటనలో ఏకంగా 112 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. -
ఘాటెక్కిన హవానా చుట్ట!
ప్రపంచం ఇంకా చిన్నదైంది. ఆర్థిక విధానాల గ్లోబలైజేషన్‌తో తొలిసారి కుచించుకుపోయిన భూగోళం, దాని వెన్నంటే వచ్చిన కమ్యూనికేషన్ విప్లవంతో అరచేతిలోకి చేరిపోయింది. ఇప్పుడు మనం మహమ్మారిగా పిలుచుకుంటున్న కోవిడైజేషన్ ఆ గ్లోబ్ ధరించిన రకరకాల రంగురంగుల వస్త్రాలను విప్పేసింది. నగ్నంగా నిలబెట్టింది. గొప్పదేశాల గోత్రాలు తెలిసిపోతున్నాయి. చిన్న దేశాల సందేశాలు చెవిసోకుతున్నాయి. రెండొందల పై చిలుకు దేశాల పేర్లు వార్తల్ని బ్రేక్ చేస్తున్నాయి. అంతా అనుకున్న ట్టుగానే జరిగి వుంటే ఈ జూలైలో ఒలింపిక్స్ ప్రారంభమై ఉండేవి. నెలరోజులపాటు ప్రపంచం దృష్టి అటు మళ్లి వుండేది. మెడల్స్ గెలిచిన దేశాల పట్టిక మీడియా హైలైట్‌గా వుండేది. కాని ఆ పట్టికలో చాలా దేశాలకు చోటు దొరికి ఉండేది కాదు. ఈ కరోనా పట్టిక అలా కాదు. రెండొందల పైచిలుకు దేశాలకు చోటు కల్పించింది. వీటిలో కొన్ని దేశాల మీదే ప్రజల దృష్టి ఎక్కువగా లగ్నమైంది. వైరస్ ప్రారంభమైన చైనా, అల్లాడుతున్న ఇటలీ, స్పెయిన్లతో పాటు ఇంకో రెండు పేర్లు, రెండు వేర్వేరు కారణాల రీత్యా టాక్ ఆఫ్ ది గ్లోబ్గా నర్తిస్తున్నాయి. అవి అమెరికా, క్యూబా. పక్కపక్కనే ఉంటాయి. ఇరుగూ పొరుగే కానీ, ఈడూ జోడూ అస్సలు కుదరదు. రెంటి మధ్యన హస్తిమశకాంతరం. అమెరికా ఏనుగైతే క్యూబా దోమ. సైజులోనే కాదు సంపదలో కూడా. మన దేశంలో నిరక్షరాస్యులక్కూడా పరిచయం అవసరం లేని పేరు అమెరికా. అది కూడా మనదే, బలిసినవాళ్లుండే బంజారా హిల్స్ లాగా... కాకపోతే ఇంకాస్త పెద్దది అనుకునేవాళ్లు కోకొల్లలు. ‘మావాడు అమెరికాలో తాసిల్దారయితే చూడాలని ఉందండీ’ అంటాడు కోట శ్రీనివాసరావు అదేదో సినిమాలో. మధ్యతరగతి వాళ్లకయితే అమెరికా అంటే ఒక జీవితాశయం. పిల్లల్ని బాగా చదివిస్తే అమెరికాకు వెళ్తారు. డాలర్లు సంపాది స్తారు. అవి ఇండియాకు వచ్చి రూపాయలుగా మారుతాయి. వాటితో పొలం పుట్రా కొనేసి పెట్టొచ్చు పిల్లల కోసం... ఆ డాలర్ డ్రీమ్స్తోనే కొవ్వొత్తులుగా మారుతారు తల్లిదండ్రులు. చాలా మంది సాధిస్తారు. చివరకు తమకు మాత్రమే కనిపించే లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ మెమెంటోను చూసుకుంటూ శేష జీవితం గడుపు తున్న తల్లిదండ్రులు లేని ఊరులేదు మన దేశంలో. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. ఇక క్యూబా సంగతి. మన దేశంలో ఆ పేరు చాలా కొద్దిమందికే తెలుసు. ఫిడెల్ కాస్ట్రో కాల్చిపారేసిన కొహిబా బ్రాండ్ హవానా చుట్టలకూ, చేగువేరా బొమ్మలు వుండే టీ–షర్టు లకు ప్రపంచమంతటా ఉన్నట్టే మన దగ్గర కూడా అంతో ఇంతో క్రేజ్ ఉంది. మన నవతరంలో ఎక్కువమందికి క్యూబా గురించి అంతకుమించిన ఆసక్తి వుండే అవకాశం లేదు. అమెరికాకు ఆగ్నే యంగా వున్న ఫ్లొరిడా తీరానికి 90 మైళ్ల దూరంలో వుంది క్యూబా. ఈ తొంబై మైళ్ల దూరానికి ఒక అరవై ఏళ్ల స్టోరీ కూడా వుంది. అమెరికా–రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తీవ్రంగా వున్న రోజుల్లో కాస్ట్రో కమ్యూనిస్టు కనుక క్యూబా రష్యా అనుకూల వైఖరితో ఉండేది. ఇది అమెరికాకు కంట్లో నలుసులాంటి సమస్య. చివరకు కెనెడీ క్యూబాను బెదిరిస్తాడు. ‘అమెరికాకు కేవలం 90 మైళ్ల దూరంలోనే క్యూబా వుంది జాగ్రత్త’. కాస్ట్రో కూడా అందుకు దీటుగా సమాధానం చెబుతాడు. ‘అవును, అమెరికాకు క్యూబా 90 మైళ్ల దూరంలోనే ఉంది. అంతేకాదు, క్యూబాకు కూడా అమె రికా 90 మైళ్ల దూరంలోనే ఉంది గుర్తు పెట్టుకోండి’. ‘దీవార్’ సినిమాలో అమితాబ్ బచ్చన్‌తో ‘మేరే పాస్ మా హై’ అని శశికపూర్ చెప్పినంత నిబ్బరంగా కాస్ట్రో కూడా అమెరికాకు చెబుతాడు. మహామేరువు లాంటి అమెరికాకు పిపీలికమంత క్యూబా సవాలు విసరడమా? ఆ ధైర్యం వెనుక రహస్యమేమిటి? ఇంకేముంటుంది రష్యా తప్ప అన్నారంతా. కానేకాదు, ఆ ధైర్యం క్యూబా సామాజిక వ్యవస్థ సమకూర్చిన ఆత్మబలం అని తదనం తర పరిణామాలు నిరూపించాయి. కాస్ట్రో తర్వాత క్యూబా విప్లవంలో ప్రముఖపాత్ర పోషించిన చేగువేరా నిజానికి క్యూబా దేశస్తుడు కాదు. అమెరికాలాంటి సామ్రాజ్యవాద దేశానికి ముగు తాడు వేయాలంటే ఒక్క క్యూబాలోనే కాదు అమెరికా ఖండం లోని అన్ని దేశాల్లోనూ విప్లవ ప్రభుత్వాలు ఏర్పడాలని కాంక్షిస్తూ, ఒక విశ్వమానవుడిగా ఆ పోరాటాల్లో పాల్గొంటూ చివరకు బొలీవియా అడవుల్లో హత్యకు గురవుతాడు. భారత్‌కు భగత్ సింగ్లాగా చేగువేరా ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవించాడు. ఒక నాడు అమెరికా ఆంక్షల కారణంగా ఔషధాలు లభించక, కనీస వైద్యసేవలు అందుబాటులో లేక అవస్థలు పడిన క్యూబా అనతి కాలంలోనే అత్యుత్తమమైన ప్రజారోగ్య విధానాన్ని అమలు చేయ గలిగింది. ఈ రోజున క్యూబాలో ప్రతి వెయ్యిమంది జనాభాకు ఒక డాక్టర్ అందుబాటులో ఉన్నాడు. ప్రాథమిక రోగ నివారణ పద్ధతులు, ప్రజారోగ్యంపై సామాజిక, కుటుంబ, ఆర్థిక, మానసిక కారణాల ప్రభావం ఎలా ఉంటుందనే అంశాలు కూడా అక్కడి వైద్యవిద్యలో పాఠ్యాంశాలుగా ఉంటాయి. వైద్యరంగం మొత్తం ప్రభుత్వ అధీనంలోనే ఉంటుంది. కొన్ని కుటుంబాలకు కలిపి ఒక డాక్టర్‌ను, నర్సును కేటాయిస్తారు. ఆ కుటుంబాల్లోని సభ్యులం దరి ఆరోగ్య జాతకాలు సంబంధిత ఫ్యామిలీ డాక్టర్, నర్సుల దగ్గర ఉంటాయి. వారి పరిధిలో కుటుంబాలను తరచుగా వారిం టికే వెళ్లి డాక్టర్, నర్సు పలకరిస్తుంటారు. అందువల్ల సహజంగానే ఆరోగ్యపరమైన అవగాహన, చైతన్యం సమాజంలో ఎక్కువ. పెద్దగా వనరుల్లేని చిన్న దేశం, పేదదేశమైన క్యూబాలో సగటు ఆయుర్దాయం 79.74 Sఏళ్లుగా ఉంది. ఇది అమెరికా కంటే ఒక సంవత్సరం, భారత్‌కంటే పదేళ్లు ఎక్కువ. వైద్య రంగాన్ని ప్రైవే ట్‌కు వదిలేసిన సూపర్ పవర్ అమెరికా వైరస్ దాడికి చిగురు టాకులా వణికిపోతుంటే పక్కనే ఉన్న క్యూబా తన దేశంలో నిలు వరించగలిగింది. పైగా తన వైద్యులను ఇటలీ, స్పెయిన్, ఇరాన్ తదితర అనేక దేశాలకు పంపించి సమస్త మానవాళి తరఫున క్యూబా పోరాటం చేస్తున్నది. అమెరికా మాత్రం చేతులెత్తేసింది. మందుల కోసం భారత్‌ను దేబిరిస్తున్నది. మిస్టర్ జాన్ఎఫ్ కెనెడీ... మిమ్మల్ని క్యూబా ఓడించింది. రష్యా అండతో కాదు. ఆత్మబలం అండతో, ఆశయబలం అండతో. అమెరికా, క్యూబా రెండూ విభిన్నమైన సామాజిక– రాజ కీయ–ఆర్థిక వ్యవస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. రెండు విరుద్ధ భావాలకు ఇవి ప్రతీకలు. అమెరికా, యూరప్, ఇతర పెట్టుబడిదారీ దేశాల మౌలిక సిద్ధాంతం పెట్టుబడి చుట్టూ తిరుగుతుంది. దానిపై వచ్చే లాభాల చుట్టూ తిరుగుతుంది. అందువల్ల విద్య, వైద్యం సహా సమస్త రంగాలను ప్రైవేట్‌పరం చేశాయి. కమ్యూనిస్టులు, సోషలిస్టులు, సోషల్ డెమోక్రాట్లు తర తమ భేదాలతో ఈ విధానాన్ని వ్యతిరేకిస్తారు. పెట్టుబడి కేంద్రక అభివృద్ధికి బదులు మానవకేంద్రక అభివృద్ధిని ప్రతిపాదిస్తారు. అందువల్ల ఈ వ్యవస్థలో మౌలిక రంగాలన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మిగిలిన ఇరవయ్యో శతాబ్దపు చరిత్ర అంతా ఈ రెండు వ్యవస్థల మధ్య జరిగిన ప్రచ్ఛన్న యుద్ధ చరిత్రే. ఈ యుద్ధం ఫలితంగా పెట్టుబడిదారీ వ్యవస్థ ఉదారవాదం ముసుగు వేసుకొని శ్రామికులను, సాధారణ ప్రజలను ఆకర్షించగలిగింది. కమ్యూనిస్టు ఆర్థికాభివృద్దికి ఉన్న పరిమితుల కారణంగా ఈ యుద్ధంలో సోవియట్ రష్యా శిబిరం ఓడిపోయింది. ఇప్పటికీ కమ్యూనిస్టు రాజ్యాలుగా చెప్పుకుం టున్న చైనా, క్యూబా, వియత్నాం దేశాలు వైరస్ వ్యాప్తిని విజయ వంతంగా కట్టడి చేశాయి. రష్యాతోపాటు కమ్యూనిస్టు పాలనను వదిలించుకొని పెట్టుబడిదారీ వ్యవస్థలోకి జారిపోయిన సుమారు 25 తూర్పు యూరప్, సెంట్రల్ ఆసియా దేశాలు కూడా ఈ విషయంలో మెరుగ్గానే వున్నాయి. యూరప్‌లో సగభాగమైన తూర్పు యూరప్‌లోని మొత్తం కరోనా మరణాల సంఖ్య ఒక్క బ్రిటన్ మృతుల సంఖ్య కంటే కూడా తక్కువ. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్‌ల తర్వాత మరణాల సంఖ్యలో యూరప్‌లో నాలుగో స్థానం బ్రిటన్‌ది. తూర్పు యూరప్ దేశాల విద్య, ఆరోగ్య వ్యవస్థల్లో ఉన్న సోషలిస్టు పునాదుల కారణంగానే ఈ తేడా ఉన్నదనే వాదాన్ని గట్టిగా ఖండించలేము. కరోనా ఎపిసోడ్ నుంచి భారత ప్రజాస్వామ్య వ్యవస్థ నేర్చుకోవాల్సిన పాఠం ఉన్నది. వేలంవెర్రిగా ప్రైవేటీకరణవైపు పరుగులు తీయకుండా కనీసం ప్రాథమిక వైద్యం, ప్రాథమిక విద్యలనైనా పూర్తిగా ప్రభుత్వ అజమాయిషీలోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు దేశంలో జరుగుతున్న కరోనా వ్యతిరేక పోరాటంలో ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల పాత్ర దాదాపు పూజ్యం. ప్రభుత్వ వైద్యులు ప్రాణా లకు తెగించి పని చేస్తుంటే కార్పొరేట్ వైద్యులు మీడియా ఇంటర్వూ్యల్లో ఉచిత సలహాలు పారేసే పనిలో బిజీగా గడుపు తున్నారు. హైదరాబాద్‌లో నిరంతరం పేషెంట్లతో కిటకిటలాడే రెండు మూడు కార్పొరేట్ ఆస్పత్రులను లాక్ డౌన్ పీరియడ్‌లో పరిశీలించడం జరిగింది. పేషెంట్ల సంఖ్య 30 శాతానికి పడిపో యింది. ఆశ్చర్యకరమైన విషయం ఎమర్జెన్సీ కేసులు కూడా ఇరవై శాతానికి పడిపోవడం. కరోనాను చూసి గుండెపోట్లు, కిడ్నీ ఫెయి ల్యూర్స్లాంటివి కూడా జడుసుకున్నాయా? ఎమ్ఆర్ఐ స్కానర్లు, సీటీ స్కానర్లు కూడా మూలనపడ్డాయి. వాటి అవసరమే కలగడం లేదు. వైద్యసేవలు అందక రోగాలతో చనిపోయే (నాన్–కరోనా) వారి సంఖ్య కూడా పెరగలేదు. పైపెచ్చు తగ్గింది. కార్పొరేట్ ఆస్పత్రులు పేషెంట్లను భయపెట్టి కృత్రిమ ఎమర్జెన్సీ కేసులను సృష్టిస్తున్నాయని బోధపడటం లేదా? కరోనా అనంతరం జరగబోయే పరిణామాలపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. కరోనా ముగింపు ఏ రకంగా ఉండబోతున్నదో ఎవరికీ ఊహకందడం లేదు. జరగ బోయే విధ్వంసం ఎంతో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. భారతదేశంలో తొలి కరోనా మరణం సంభవించిన నెలరోజుల తర్వాత నేటికి ఆ సంఖ్య 250కి చేరింది. నెల రోజుల వ్యవధిలో టీబీ వ్యాధితో చనిపోతున్న వారి సంఖ్య ఇంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ. డెంగీతో, విషజ్వరాలతో ఇంతకంటే ఎన్నోరెట్లు ఎక్కు వమంది చనిపోయారు. కాకపోతే వాళ్లంతా పేదవర్గాల ప్రజలు. మనదేశంలో కరోనా లాక్డౌన్ ఫలితంగా ముందు ముందు సంభవించబోయే జీవన విధ్వంసం మరింత భయంకరంగా ఉండబోతున్నది. లక్షలాది చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూత పడబోతున్నాయి. కోట్లాదిమంది ఉపాధి కోల్పోబోతున్నారు. అమెరికాలోనే లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోతారన్న అంచ నాలు వస్తున్నవి. ఈ ఫలితాలు రాజకీయ వ్యవస్థల మీద ఎటు వంటి ప్రభావం చూపబోతున్నాయో స్పష్టతరాలేదు. అమెరి కాలో ఈ ఏడాది చివర్లో అధ్యక్ష ఎన్నికలు జరగాలి. డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీపడిన బెర్నీ శాండర్స్ మధ్యలో తప్పుకోవడం ఆ దేశంలోని ఉద్యోగులకు, శ్రామికులకు, పేదలకు అశనిపాతం లాంటిది. మళ్లీ ట్రంప్ గెలిస్తే ఉద్యోగాల ఊచకోత తప్పక పోవచ్చు. కానీ, అంతర్జాతీయంగా అమెరికా ప్రతిష్ట ఒక మెట్టు కిందకు దిగుతుంది. చైనా ఒక మెట్టు పైకి ఎక్కవచ్చు. అంత మాత్రాన అది తక్షణం అగ్రరాజ్యం కాజాలదు. ఎక్కాల్సిన మెట్లు ఇంకా ఉన్నాయి. మూడవ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న భారత ఆకాం క్షలను లాక్డౌన్ పుణ్యమా అని మరో ఐదేళ్లో పదేళ్లో వాయిదా వేసుకోవలసి రావచ్చు. ఆ స్థానం జర్మనీ కైవసం కావచ్చు. భారత రాజకీయాల్లో ప్రస్తుతానికి నరేంద్ర మోదీకి పోటీ లేదు. ఆర్థిక వ్యవస్థను ఆయన గాడిలో పెట్టే తీరుపై వచ్చే ఎన్నికలు నాటి పరిస్థితి ఆధారపడి ఉంటుంది. చివరగా లాక్డౌన్లో గడుపుతున్నవారి కోసం ఒక చిన్న పొడుపు కథ: ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు. అయినా స్కూల్ పిల్లలు మోడల్ అసెంబ్లీని ప్రదర్శించిన పద్ధతిలో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యకర్తలనే కలెక్టర్లుగా భావించి ముఖ్యమంత్రి వేషంలో ఆదేశాలు జారీ చేస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచంలోని అన్ని దేశాలు రాజకీయ విభేదాలు పక్కనపెట్టాయి. ట్రంప్ వైఫల్యం కనిపి స్తున్నా ఆయన ప్రత్యర్థి కాబోతున్న జో బిడెన్ కూడా ఏమీ అనడంలేదు. కానీ ఆయన మాత్రం ప్రతిరోజూ విమర్శలనే పనిగా పెట్టుకున్నారు. ఎవరాయన? క్లూ: అడిగినవారికీ అడగని వారికీ తన ఆటోబయోగ్రఫీ వినిపించే అలవాటు ఆయనకు బాగా ఎక్కువ. మహాత్మాగాంధీ, లియోటాల్‌స్టాయ్, అబ్రహాం లింకన్, కులీకుతుబ్‌షా తదితరుల బయోగ్రఫీల్లోని కొన్ని భాగాలను పొరపాటున తన బయోగ్రఫీలో కలిపి చెప్పుకోవడం కూడా కద్దు. వీరివీరి గుమ్మడి పండు వీరి పేరేమి? - వర్ధెల్లి మురళి -
కరోనాకు సవాల్: క్యూబా వైద్యుల సాహసం
కరోనా వైరస్ ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. ఇప్పటి వరకు 186 దేశాలకు విస్తరించిన ఈ మహ్మమారిని.. ఎదర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ ఏకమవుతున్నాయి. అయితే కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులకూ వైరస్ సోకడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనగా మారింది. ఈ క్రమంలో అమెరికాకు కూతవేటు దూరంలో ఉన్న అతిచిన్న దేశం క్యూబా కరోనా బాధిత దేశాలకు అండగా నిలుస్తోంది. పక్కనున్న శత్రుదేశం అమెరికాను కరోనా పీడిస్తున్న తరుణంలో ఆ దేశానికి వైద్యులను పంపి ఆదుకుంటోంది. యూఎస్‌కే కాదు క్యూబా వైద్యులు నేడు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు సేవలందిస్తున్నారు. క్యూబా.. ఒక చిన్న దేశం.. మన దేశంలో ఓ జిల్లా అంత విస్తీర్ణంలో ఉంటుంది. కేవలం కోటి మంది జనాభా ఉన్న ఈ దేశం ప్రపంచంలోనే డాక్టర్ల కార్ఖానాగా వెలుగొందుతోంది. జనాభా పరంగా చూస్తే హైదరాబాద్ కంటే తక్కువ జనాభాగల దేశం. కానీ ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన వైద్యం ప్రజలందరికీ అందిస్తోంది. ఈ కరోనా కష్టకాలంలో క్యూబా వైద్యులు అనేక దేశాలకు స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. క్యూబాపై అనేక ఆంక్షలు విధించి ఆ దేశాన్ని ఛీదరించుకునే అమెరికాలో, ఇటలీలో కరోనా వైద్య సేవల్లో క్యూబన్ డాక్టర్లు నిమగ్నమయ్యారు. కరోనా కారణంగా ఆరోగ్యం అనేది గాలిలో దీపమైపోయిన వేళ.. భవిష్యత్తు మొత్తం చీకటిగా కనిపిస్తున్న ఇలాంటి సమయంలో క్యూబా మన కళ్ల ముందు కనిపించే ఓ కాంతి రేఖ. విప్లవ యోధులైన చేగువేరా, ఫిడెల్ క్యాస్ట్రోల ప్రభావం అక్కడి యువతరంపై ఎక్కువ. ముఖ్యంగా గొప్ప వైద్యుడు, మానవతావాది అయిన చేగువేరా స్ఫూర్తి క్యూబా డాక్టర్లలో కనిపిస్తుంది. దేశ సేవ అంటే మనుషులకు సేవ చేయడమేననేది క్యూబా సోషలిస్టు ప్రభుత్వం నమ్మే సిద్ధాంతం. అందుకే.. ప్రపంచం మొత్తాన్నీ కరోనా అల్లకల్లోలం చేస్తున్న వేళ.. క్యూబా అధ్యక్షుడిగా క్యాస్ట్రో మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. ప్రపంచానికి క్యూబా ఏం ఇస్తోందో క్యాస్ట్రో చెప్పారు. యుద్ధం చేసి ప్రాణాలు తీసే బాంబులను క్యూబా తయారు చెయ్యబోదన్న క్యాస్ట్రో.. మనుషులకు ప్రాణం పోసే డాక్టర్లను తమ దేశం తయారు చేస్తుందన్నారు. క్యాస్ట్రో చెప్పిన విధంగానే క్యూబా తనను తాను డాక్టర్ల కార్ఖానాగా నిరూపించుకుంది. ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏ ఆపద వచ్చినా క్యూబా ప్రభుత్వం ఆయా దేశాల సహాయార్థం భారీగా డాక్టర్ల బృందాలను పంపి స్వచ్ఛంద వైద్య సేవల్ని అందిస్తుంది. కరోనా అన్ని దేశాలనూ అతలాకుతలం చేస్తున్న వేళ.. క్యూబా డాక్టర్లు కరోనా బాధిత దేశాలకు సేవలందించేందుకు తరలివెళ్లారు. క్యూబా సోషలిస్టు భావాలంటే అమెరికా భయపడుతుంది. అందుకే.. క్యూబా అమెరికా మధ్య విపరీతమైన ఆంక్షలుంటాయి. క్యూబాను అణగదొక్కేందుకు అమెరికా చెయ్యని ప్రయత్నాల్లేవు. అలాగే ఇటలీ, బ్రిటన్, జర్మనీ కూడా అవకాశం వచ్చినప్పుడల్లా క్యూబాపై ఆంక్షల అస్త్రశస్త్రాలు విసురుతూనే ఉంటాయి. అవేవీ మనసులో పెట్టుకోని క్యూబా కరోనా వైద్య సేవలందించేందుకు తన దేశం నుంచి వైద్య బృందాలను పంపింది. తమ దేశంలోకి క్యూబా వైద్యులు రాగానే ఇటలీ పౌరులు కరతాళ ధ్వనులతో వారికి గొప్ప స్వాగతం పలికారంటే.. అది క్యూబా వైద్యులపై ఇటలీకి ఉన్న నమ్మకానికి నిదర్శనం. అమెరికా, ఇటలీ, జర్మనీ, స్పెయిన్ ఇలా అనేక దేశాల్లో ప్రస్తుతం వేలాది మంది క్యూబన్ వైద్యులు కరోనా రోగులకు సేవలందిస్తున్నారు. ఇప్పుడు మాత్రమే కాదు.. గతంలోనూ రోగాలు ప్రబలిన సాటి దేశాలను ఆదుకోవడంలో క్యూబా డాక్టర్లు సైనికుల్లా ముందుకు కదిలారు. హైతీలో కలరా వ్యాపించి జనం పిట్టల్లా రాలిపోతోంటే.. క్యూబా డాక్టర్ల బృందాలు పెద్ద ఎత్తున అక్కడికి వెళ్లి సేవలందించాయి. పశ్చిమాసియా దేశాలకు ఎబోలా ప్రబలినప్పుడు కూడా క్యూబా వైద్యులే ఆపద్భాందవుల్లా కదిలారు. విపత్కర పరిస్థితులలో సరిహద్దులకు అతీతంగా వైద్య సేవలు అందించడంలో ఎప్పుడూ ముందుండే క్యూబా డాక్టర్లు కష్టకాలంలో పోరాడే యోధులు. కరోనా కరాళ నృత్యంతో అమెరికా కకావికలం అయిపోతోంది. ఇటలీలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. స్పెయిన్, ఇరాన్ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయ్. ఈ దేశాలన్నీ సంపన్న దేశాలు. ఆధునిక పోకడలు ఎక్కువగా ఉన్న దేశాలు. కానీ క్యూబా అమెరికాను ఆనుకొని ఉన్న చిన్న దేశం. అమెరికా విద్వేషాన్ని ఎదుర్కొంటూ తన దేశాన్ని తీర్చిదిద్దుకున్న దేశం. ఆయుధాల కంటే ఆరోగ్యమే గొప్ప అని నమ్మిన దేశం. కరోనా విసిరిన సవాలును దీటుగా స్వీకరించి వైద్యసేవలందిస్తున్న క్యూబా మన లాంటి దేశాల ప్రాధాన్యతలు ఎలా ఉండాలో గుర్తు చేస్తోంది. ఆఫ్రికా ఖండం ఎబోలాతో తల్లడిల్లినపుడు అండగా నిలిచింది క్యూబా వైద్యులే. ఇవాళ కరోనాతో అతలాకుతలమవుతున్న వేళ అగ్రరాజ్యాలు చేతులెత్తేసినపుడు మేమున్నామని భరోసా ఇచ్చింది క్యూబా వైద్యులే.. క్యూబాను చూసైనా భారత్ తో సహా అనేక దేశాలు ఇప్పటికైనా తమ వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆయుధాలు, అణ్వస్త్రాల కంటే విద్య, వైద్యం పైన ఎక్కువ దృష్టిసారించాలి. భవిష్యత్తులో యుద్ధాలంటూ చేయాల్సివస్తే అది శతృదేశాలతో కాదనీ.. కరోనా లాంటి భయంకరమైన వైరస్లతోనన్న నిజాన్ని గుర్తించాలి. అందుకు దేశపౌరులను సిద్ధం చేసేందుకు వైద్యరంగాన్ని అత్యంత ప్రాధాన్యమైన రంగంగా గుర్తించాలి. ప్రాణాలు తీసే ఆయుధాల కంటే.. ప్రాణం పోసే వైద్యాన్ని పటిష్టం చేసుకోవాలంటూ దిశా నిర్దేశం చేస్తోంది క్యూబా.