ఐరాసలో అమెరికాకు చుక్కెదురు | UN nations urge to end US sanctions on cuba | Sakshi
Sakshi News home page

ఐరాసలో అమెరికాకు చుక్కెదురు

Published Wed, Oct 29 2014 2:04 PM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM

UN nations urge to end US sanctions on cuba

న్యూయార్క్ :  ఐక్యరాజ్య సమితిలో అగ్రరాజ్యం అమెరికాకు  చుక్కెదురు అయ్యింది. గత 48 ఏళ్లుగా క్యూబా దేశంపై అమెరికా కొనసాగిస్తున్న ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ క్యూబా పెట్టిన తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసింది.  పలు దేశాలు కూడా క్యూబాపై అమెరికా ఆంక్షలను తీవ్రంగా వ్యతిరేకించాయి.

ఈ తీర్మానంపై  భారత కాలమాన ప్రకారం బుధవారం ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో ఓటింగ్‌ జరిగింది.  క్యూబాకు అనుకూలంగా 188 దేశాలు ఓటు వేయగా, వ్యతిరేకంగా కేవలం రెండే ఓట్లు పడ్డాయి. అవి కూడా ఒకటి అమెరికాది కాగా మరొకటి ఇజ్రాయిల్ వేసిన ఓటు. 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement