అతిపెద్ద ఐస్‌క్రీమ్‌ పార్లర్‌.. | Worlds Largest Ice Cream Parlor: Cuba Coppelia Park | Sakshi
Sakshi News home page

అతిపెద్ద ఐస్‌క్రీమ్‌ పార్లర్‌..

Published Sun, Aug 20 2023 7:26 AM | Last Updated on Sun, Aug 20 2023 1:09 PM

Worlds Largest Ice Cream Parlor: Cuba Coppelia Park - Sakshi

ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అతి పెద్ద ఐస్‌క్రీమ్‌ పార్లర్‌. క్యూబాలోని హవానా నగరంలో ఉంది. పేరు కొపేలియా పార్క్‌. ఈ పార్లర్‌లో పనిచేసే సిబ్బందికి అస్సలు ఖాళీ ఉండదు. ఒక రౌండ్‌లో 600ల మంది కస్టమర్లకు ఒకేసారి ఐస్‌క్రీమ్‌ అందిస్తుంటారు. రోజూ ఇక్కడకు కనీసం 30 వేలమంది వస్తుంటారు. 1966లో నిర్మించిన దీనిని ఐస్‌ క్రీమ్‌ కేథడ్రల్‌ అని కూడా పిలుస్తారు. అయితే ఇంత పెద్ద ఐస్‌క్రీమ్‌ పార్లర్‌లో ఐస్‌క్రీమ్‌ ధర తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

ఒక్కో ఐస్‌క్రీమ్‌ ధర కేవలం రూ.17.20 మాత్రమే. ధర తక్కువ అని ఇక్కడికి వస్తున్నారు అనుకుంటే పొరపాటే! ఈ పార్లర్‌లోని ఐస్‌క్రీమ్‌ రుచులు విదేశీ పర్యాటకులను కూడా విపరీతంగా ఆకర్షిస్తోంది. దీనికి ఒక చారిత్రక నేపథ్యం కూడా ఉంది. కమ్యూనిస్ట్‌ విప్లవం విజయవంతం అయిన తర్వాత అమెరికా నుంచి ఫిడెల్‌ క్యాస్ట్రో 28 కంటైనర్ల ఐస్‌క్రీమ్‌ ఆర్డర్‌ ఇచ్చారట. దాని రుచి ఆయనను ఎంతగానో ఆకట్టుకుందట! దీంతో అలాంటి ఐస్‌క్రీమ్‌ తమ దేశంలోనూ ఉండాలనే ఉద్దేశంతో కొపేలియా పార్క్‌ నిర్మించారట! 

(చదవండి: ఆ దీవిలో అడుగుపెట్టాలంటే హడలిపోవాల్సిందే! బతుకు మీద ఆశ వదులుకోవాల్సిందే)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement