
ఆగస్టులో క్యూబాకు జాన్ కెర్రీ
వాషింగ్టన్: క్యూబాతో సయోధ్య కుదుర్చుకునేందుకు అమెరికా సిద్ధమైంది. సుమారు 50 ఏళ్ల తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను పునరుద్దరించడంలో భాగంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి జాన్ కెర్రీ వచ్చే ఆగస్టు 14న క్యూబా వెళ్లనున్నారు. అక్కడి హవానాలోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని దేశ ప్రయోజనాలకు అనుగుణంగా పునర్ నియమిస్తారు. సోమవారం అమెరికాలో క్యూబా విదేశాంగ మంత్రి బ్రునో రడ్రిగ్వెజ్‌తో కెర్రీ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్యూబాతో తాము మంచి పొరుగుదేశంగా ఉండాలనుకుంటున్నట్లు తెలిపారు. పరస్పర గౌరవంతో ఇరు దేశాల ప్రజలు జీవించాలని కోరుకుంటున్నామన్నారు. 1958 తర్వాత మొదటిసారిగా క్యూబా విదేశాంగ మంత్రితో సమావేశమైనట్లు చెప్పారు.