ధిక్కారానికి ప్రతీక..ఉడుకు రక్తానికి ఉత్తేజం
కాలపరీక్షకు నిలిచి గెలిచిన శిఖరం
కాలంతోపాటే మార్పులు సహజం. ఇరవయ్యో శతాబ్దంలోనే ఉచ్ఛస్థితికి చేరిన కమ్యూనిజం ప్రపంచవ్యాప్తమై... అదే శతాబ్దంలో ప్రభావం కోల్పోయే దశకు చేరింది. కమ్యూనిస్టుల కంచుకోటలు కూలిపోయారుు. సోవియట్ ముక్కలైంది. చైనా సైతం కమ్యూనిస్టు పంథా నుంచి ఓపెన్ మార్కెట్ వైపు మళ్లింది. రెండు కమ్యూనిస్టు ప్రబల శక్తులు ప్రపంచీకరణ ప్రభంజనంలో మనుగడ సాగించడానికి తమ సిద్ధాంతాలను వదులుకొన్నా... పెట్టుబడిదారుల పెద్దన్న, అగ్రరాజ్యం అమెరికాకు పక్క నుంచే సవాలు విసురుతూ.. ఐదు దశాబ్దాల సుదీర్ఘకాలం కమ్యూనిజాన్ని శ్వాసించిన ధీశాలి! గుబురు గడ్డం, ఆలివ్‌గ్రీన్ మిలటరీ దుస్తులు, నోట్లో సిగార్... ఆ రూపం ధిక్కారానికి ప్రతీక! తిరగబడే ఉడుకురక్తానికి ఒక ఉత్తేజం!! అంతా తానే అనుకునే అమెరికా గుండెల్లో దశాబ్దాలుగా మోగుతున్న ‘ఫిరంగి’. ఆయనే ఫిడెల్ క్యాస్ట్రో. పాశ్చాత్యదేశాల్లో తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని నెలకొల్పి.. కాల పరీక్షకు నిలబడి గెలిచాడు.
- సాక్షి నాలెడ్‌జ సెంటర్
మిత్రులతో కలిసి మిలటరీ స్థావరంపై దాడి
1952 మార్చి 10న దేశాధ్యక్షుడు కార్లోస్ ప్రియో ప్రభుత్వంపై సైనిక తిరుగుబాటు జరిగింది. ఫుల్జెన్షియో బటిస్టా అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. అమెరికాకు సన్నిహితంగా ఉంటూ సోషలిస్టు సంస్థ, ఉద్యమాలపై ఉక్కుపాదం మోపడం మొదలుపెట్టాడు. సాయుధ తిరుగుబాటు ద్వారానే మిలటరీ పాలకులను దించగలమని భావించిన ఫిడేల్.. ఒరియెంటే ఫ్రావిన్‌సలోని మోంకాడా మిలటరీ స్థావరంపై అనుచరులతో కలిసి దాడి చేశాడు. మిలటరీ సాయుధ సంపత్తిని కొల్లగొట్టి ప్రభుత్వంపై తిరుగుబాటుకు ఆయుధాలను సమకూర్చుకోవాలనేది ఆయన ఆలోచన. అరుుతే ఈ ప్రయత్నంలో అతని బృందం విఫలమైంది. ఫిడేల్ ప్రభుత్వ బలగాలకు పట్టుబడ్డాడు.
15 ఏళ్ల శిక్ష..19 నెలలకే విడుదల
ప్రభుత్వ బలగాలకు పట్టుబడిన క్యాస్ట్రోను విచారించారు. 15 ఏళ్ల జైలుశిక్ష విధించారు. అరుుతే విచారణ సందర్భంగా సైన్యం అరాచకాలను ఎలుగెత్తి చాటడం, దానికి విదేశీ మీడియా మంచి ప్రాధాన్యం ఇవ్వడంతో ఫిడేల్ ప్రాచుర్యంలోకి వచ్చాడు. 19 నెలల జైలు జీవితం తర్వాత 1955లో ప్రభుత్వ క్షమాభిక్ష ద్వారా విడుదలయ్యాడు. జైల్లో ఉన్నకాలంలోనే భార్య బలార్ట్‌కు విడాకులిచ్చాడు. మార్క్సిజాన్ని లోతుగా అధ్యయనం చేశాడు. విడుదలయ్యాక మెక్సికో వెళ్లాడు. అక్కడే యువ పోరాటయోధుడు ఎర్నెస్టో చేగువెరాను కలిశాడు. బటిస్టా ప్రభుత్వాన్ని కూల్చే లక్ష్యంతో జూలై ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. 1956 డిసెంబరు 2న 82 మందితో చిన్న నౌకలో బయలుదేరి క్యూబాలోని ఒరియెంటే ఫ్రావిన్‌సకు చేరుకున్నాడు. బటిస్టా సైన్యంతో జరిగిన పోరాటంలో ఫిడేల్ క్యాస్ట్రో, చేగువెరా, రౌల్ క్యాస్ట్రోలతోపాటు మరో 9 మంది మాత్రమే ప్రాణాలతో మిగిలారు. మిగతా వారు దొరికిపోవడమో లేదా ప్రాణాలు కోల్పోవడమో జరిగింది. తోటి విప్లవకారులతో కలిసి సైన్యం కంటపడకుండా ఫిడేల్... సియర్రా మాయెస్ట్రా పర్వతశ్రేణిలో ఆశ్రయం పొందాడు. అక్కడి నుంచే రెండేళ్లపాటు బటిస్టా ప్రభుత్వంపై గెరిల్లా దాడులు కొనసాగించాడు. ఈ క్రమంలో బటిస్టాను వ్యతిరేకించే శక్తులు, సంస్థలకు ఫిడేల్ తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు.
ఆయన జీవితం ఓ దర్పణం
క్యాస్ట్రో జీవితం...20వ శతాబ్దంలో చోటుచేసుకున్న ఎన్నో పరిణామాలకు దర్పణం. విప్లవోద్యమాలు, ప్రజా తిరుగుబాట్లు, ప్రచ్చన్న యుద్ధం, పాశ్చాత్య-తూర్పు దేశాల మధ్య అంతరాలు, ఉత్తర అమెరికా-దక్షిణ అమెరికా మధ్య వైరం, కమ్యూనిజం- పెట్టుబడిదారీ విధానం మధ్య ఘర్షణ... ఇలా ఎన్నో పరిణామక్రమాలు. వీటన్నింటినీ చూశాడాయన. కాలగమనంలో ఎన్నో ఆటుపోట్లు.. కుట్రలు కుతంత్రాలు.. కానీ క్యాస్ట్రోలో మార్పులేదు. నేటికీ ఆయన తిరుగుబాటు ప్రతీక. కమ్యూనిజం పతనమైనా.. తట్టుకొని నిలబడ్డ కమ్యూనిస్టు.
వలసొచ్చిన స్పానిష్ రైతు బిడ్డ
స్పెరుున్ నుంచి వలస వచ్చిన ధనిక రైతు ఏంజెల్ మరియా బౌటిస్టా క్యాస్ట్రో క్యూబాలోని ఓరియెంటే ఫ్రావిన్సులోని బిరాన్ సమీప ప్రాంతంలో స్థిరపడ్డాడు. లీనా రుజ్ గొంజాలెజ్ ఇతని తోటల్లో పనిచేసేది. ఈమెకు ఏంజెల్ మరియాతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఫలితంగా 1926 ఆగస్టు 13న ఫిడేల్ అలెజాండ్రో క్యాస్ట్రో రుజ్ (ఫిడేల్ క్యాస్ట్రో) జన్మించాడు. ఫిడేల్ పుట్టాక అతని తల్లిదండ్రులు పెళ్లిచేసుకున్నారు. క్యాస్ట్రో చదువుల్లో చురుకుగా ఉండేవాడు.. మంచి అథ్లెట్ కూడా. బేస్‌బాల్‌పై అమితాసక్తి. 1945లో న్యాయశాస్త్రాన్ని అభ్యసించడానికి హవానా యూనివర్సిటీలో చేరాడు. అక్కడే యువ క్యాస్ట్రోకు పలు రకాల భావాజాలాలతో, సిద్ధాంతాలతో పరిచయం ఏర్పిడింది. కమ్యూనిజంపై వర్సిటీ ప్రాంగణంలో విసృ్తత చర్చలు జరిగేవి. లా చదువును మధ్యలోనే వదిలేసి 1948లో కొలంబియాలో అమెరికాకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో పాల్గొన్నాడు. కొలంబియా అధికారుల నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో క్యూబా విద్యార్థులు కొలంబియాలోని తమ దేశ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందారు. అనంతరం క్యాస్ట్రో హవానాకు తిరిగి వచ్చి ‘లా’ కోర్సును కొనసాగించాడు. ఆర్టాడోక్సో పార్టీకి చెందిన జనాకర్షక నేత ఎడ్యురాడో చిబాస్‌కు అభిమానిగా మారాడు. ఆర్థిక స్వాతంత్య్రం, రాజకీయ స్వేచ్ఛ, సామాజిక న్యాయం, అవినీతి నిర్మూలన చిబాస్ పార్టీ ప్రధాన ఆశయాలుగా ఉండేవి. న్యాయశాస్త్రం చదువుతుండగానే క్యాస్ట్రో ఫిలాసఫీ విద్యార్థిని మిర్టా డియాజ్ బలార్ట్‌ను పెళ్లాడాడు. ఈమె సంపన్న రాజకీయవేత్త కూతురు. ఉన్నతవర్గాలతో పరిచయం ఏర్పడినా... అటువైపు కాకుండా క్యాస్ట్రో కమ్యూనిజం వైపు మళ్లాడు. దేశ ఆర్థిక సమస్యలన్నింటికీ విశృంఖల పెట్టుబడిదారీ వ్యవస్థే కారణమని విశ్వసించేవాడు. లా కోర్సు పూర్తయ్యాక ప్రాక్టీసు ప్రారంభించినా పెద్దగా నడవలేదు. క్యాస్ట్రోపై అప్పుల భారం ఉండేది. అరుునా ఏ దశలోనూ రాజకీయ కార్యకలాపాలను వదల్లేదు. హింసాత్మకంగా మారిన పలు నిరసన ప్రదర్శనల్లో క్యాస్ట్రో పాల్గొన్నాడు.
తిరుగుబాటుతో అధికారం హస్తగతం
1959 జనవరి 2న క్యాస్ట్రో నేతృత్వంలో 9 వేల మందితో కూడిన తిరుగుబాటు దళాలు రాజధాని హవానాలోకి ప్రవేశించారుు. అధికారాన్ని హస్తగతం చేసుకున్నారుు. బటిస్టా పారిపోగా... వందల కొద్దీ అతని మద్దతుదారులకు మరణశిక్ష పడింది. క్యాస్ట్రో ప్రధానమంత్రి అయ్యారు. 1976లో రాజ్యాంగాన్ని మార్చి ఫిడేల్ అధ్యక్షుడయ్యారు. 1959 ఫిబ్రవరి 15న తన తమ్ముడు రౌల్ క్యాస్ట్రోను సైనికదళాల చీఫ్ కమాండర్‌గా నియమించాడు. అత్యంత జనాకర్షక నేతగా, అనర్గళంగా ఉపన్యాసాలిచ్చే ఫిడేల్... ప్రజలకు భూమిని తిరిగి ఇచ్చేస్తానని, పేదల హక్కులు కాపాడతానని హామీ ఇచ్చాడు. బటిస్టా అనుచరులు చట్టవిరుద్ధంగా కూడబెట్టిన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1960లో క్యూబాలోని అమెరికా వ్యాపారాలన్నింటినీ జాతీయం చేశాడు. ప్రతిచర్యగా 1961 జనవరి 3న అప్పటి అమెరికా అధ్యక్షుడు ఐసన్‌హోవర్ క్యూబాపై ఆంక్షలు విధించారు.
అమెరికాకు కొరకరాని కొయ్యలా..
1961లో ప్రవాస క్యూబన్లతో తిరుగుబాటు సైన్యాన్ని ఏర్పరచి ఫిడేల్ క్యాస్ట్రో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అమెరికా ప్రయత్నించి విఫలమైంది. ఇక అప్పటినుంచి క్యాస్ట్రో అగ్రరాజ్యానికి కొరకరాని కొయ్యగా మారాడు. బటిస్టాకు వ్యతిరేకంగా పనిచేసిన సాయుధ గ్రూపులు, సంస్థలన్నింటినీ క్యాస్ట్రో ఏకం చేశాడు. ఇవన్నీ కలిసి 1965లో ‘కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ క్యూబా’ ఏర్పడింది. ఏకపార్టీ వ్యవస్థ నెలకొంది. మరోవైపు అమెరికా ఆంక్షల నేపథ్యంలో క్యూబా ఇతర దేశాలతో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టింది. సోవియట్ యూనియన్ అధ్యక్షుడు కృశ్చేవ్‌తో క్యాస్ట్రో బంధం బలపడింది. 1962లో రష్యా ... కూబ్యా గడ్డపై క్షిపణులను మొహరించడంతో 13 రోజుల పాటు ప్రపంచం అణుయుద్ధం భయంతో వణికిపోరుుంది. మూడో ప్రపంచయుద్ధం వస్తుందనే ఆందోళన నెలకొంది. అరుుతే అమెరికాతో కుదిరిన రహస్య సయోధ్య కారణంగా రష్యా మిస్‌సైల్స్‌ను ఉపసంహరించడంతో ఉద్రిక్తలు తగ్గారుు. అరుుతే ప్రపంచ రాజకీయ చిత్రపటంపై కమ్యూనిస్టు యోధుడిగా క్యాస్ట్రో ప్రతిష్ట పెరిగింది.
అలీనోద్యమంలో ముఖ్య పాత్ర
చక్కెర పరిశ్రమలను జాతీయం చేయడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, ముఖ్యంగా ప్రజలందరికీ ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడంతో క్యూబన్లలో క్యాస్ట్రో ప్రతిష్ట ఇనుమడించింది. మరోవైపు సోవియట్‌తో సన్నిహితంగా ఉంటూనే అలీనోద్యమంలో క్యూబా ముఖ్యపాత్ర పోషించింది. లాటిన్ అమెరికా దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొని తిరుగుబాట్లకు మద్దతు ఇవ్వకుండా 1964 తర్వాత రష్యా కొంతవరకు క్యూబాను కట్టడి చేసింది. అరుుతే క్యాస్ట్రో ఇతర ఖండాల్లో విప్లవోద్యమాలకు మద్దతును ఆపలేదు. 1966లో ఆసియా- ఆఫ్రికా, లాటిన్ అమెరికా సాలిడారిటీ ఆర్గనైజేషన్‌ను ప్రారంభించారు. బొలీవియాలో 1967లో చేగువెరా తిరుగుబాటు విఫలమైంది. చే హతమయ్యాడు. క్యాస్ట్రో తన పంథా వీడలేదు. అంగోలాలో మార్క్సిస్టు గెరిల్లాలకు మద్దతుగా 15 వేల మంది సైన్యాన్ని పంపాడు. 1977లో ఇథియోపియాకు సైనికులను పంపాడు. పలుదేశాలకు వైద్యులను పంపి సాయం చేశాడు.
అండగా సోవియట్
అమెరికా ఆంక్షల నేపథ్యంలో సోవియట్ యూనియన్ 1960ల నుంచే క్యూబాకు దన్నుగా నిలిచింది. ఆర్థిక సహాయం చేయడమే కాకుండా... క్యూబా ఉత్పత్తి చేసిన చక్కెరలో (దేశానికి ఇదే ప్రధాన ఆదాయవనరు) సింహభాగాన్ని కొనుగోలు చేసింది. అమెరికా మిత్రదేశాల వ్యాపార ఆంక్షల వల్ల ఇబ్బందిపడుతున్న క్యూబాకు కావాల్సిన ఆహారపదార్థాలు, వస్తువులు అందజేసింది. దీంతో రగిలిపోయిన అమెరికా హత్యాయత్నాలకు తెగించింది.
సోవియట్ పతనం తర్వాత..
గోర్బచేవ్ సమయానికి సోవియట్ పరిస్థితి తారుమారైంది. క్యూబా నుంచి చక్కెర కొనుగోలును నిలిపివేసింది. సోవియట్ పతనం తర్వాత క్యూబా ఆర్థిక పరిస్థితి దిగజారింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిపోయారుు. దీనికి అమెరికా ఆంక్షలే కారణమని క్యాస్ట్రో విమర్శించేవాడు. క్యాస్ట్రో పాలన ముగిస్తే తప్ప ఆంక్షల ఎత్తివేత ఉండదని అమెరికా స్పష్టం చేసింది. 2000 జూలైలో అమెరికా ఆంక్షలకు వ్యతిరేకంగా క్యాస్ట్రో క్యూబా చరిత్రలోనే పెద్ద ర్యాలీ తీశారు. తన ప్రభుత్వానికి వ్యతిరేకులు లేకుండా చూసు కోవడంలో క్యాస్ట్రో నిర్దయగా వ్యవహరించారు. క్యూబా పర్యటనకు వెళ్లిన పోప్ జాన్‌పాల్-2 మానవ హక్కుల ఉల్లంఘటనపై క్యాస్ట్రో సమక్షంలోనే విమర్శలు సంధించారు. తర్వాత క్యూబా మనుగడ కోసం క్యాస్ట్రో కొన్ని రంగాల్లో సంస్కరణలను ప్రవేశపెట్టారు.
అమెరికా ‘పక్కలో బల్లెం’
ఆదిలోనే బెడిసికొట్టాయి..
క్యూబాలో అంతర్భాగమైన గాంటనామా బేను అమెరికాకు శాశ్వతంగా లీజుకు అద్దెకిచ్చాక.. దాదాపు 50 ఏళ్లపాటు అమెరికా ప్రభుత్వం, కంపెనీలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి, తిరుగుబాట్లు రాకుండా చూశారుు. 1946లో అరుుతే అమెరికా నేర సామ్రాజ్య నేతలు క్యూబా రాజధాని హవానాలో సమావేశాలు జరిపేవారు. 1959లో క్యూబా నియంత ఫల్జెన్సియో బటిస్టా ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వచ్చిన క్యాో్ట్ర సర్కారును మొదట అమెరికా గుర్తించింది. క్యాస్ట్రో కమ్యూనిస్టు పోకడలు, 500 మందికి పైగా బటిస్టా మద్దతుదారులను విప్లవకారులు కాల్చి చంపడంతో అమెరికాకు అనుమానాలు ఎక్కువయ్యారుు. అప్పట్లోనే అధికార పీఠమెక్కిన క్యాస్ట్రో అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆయన్ను కలవడానికి అగ్రరాజ్య నేత ఐసెన్‌హోవర్ నిరాకరించారు. చివరికి ఉపాధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్‌ను కలిసి క్యాస్ట్రో హవానాకు వెనుదిరిగివచ్చారు. అలా ఆదిలోనే మంచి సంబంధాలకు పునాదులు పడలేదు.
అమెరికా ఆస్తుల జాతీయం!
1960లో అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత క్యాస్ట్రో సర్కారు.. క్యూబాలోని ప్రైవేటు భూములను హస్తగతం చేసుకుంది. అమెరికా బడా కార్పొరేషన్ల అనుబంధ కంపెనీలు సహా వందలాది ప్రైవేటు కంపెనీలను జాతీయం చేసింది. దాంతో 1961లో క్యూబాతో అమెరికా అన్ని దౌత్య సంబంధాలను తెగతెంపులు చేసుకుంది. ఐసెన్‌హోవర్ తర్వాత అధ్యక్షుడైన జాన్ కెన్నడీ1962 ఫిబ్రవరిలో క్యూబాపై ఆంక్షలు విధించారు.
బే ఆఫ్ పిగ్స్ లో దెబ్బపడింది!
1961 జనవరి 20న అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన వెంటనే జాన్ ఎఫ్ కెన్నడీ సీఐఏ తోడ్పాటుతో జరిపిన ‘బే ఆఫ్ పిగ్‌స’ దాడి ఘోరంగా విఫలమైంది. 1961 ఏప్రిల్ 17న ‘బ్రిగేడ్ 2506’ పేరుతో క్యూబా నుంచి గతంలో పారిపోరుు వచ్చిన సాయుధులతో ఓ పారామిలటరీ దళాన్ని సీఐఏ ఏర్పాటు చేసింది. ఆ దళాన్ని క్యూబాలోని బే ఆఫ్ పిగ్‌స ప్రాంతంలో దింపి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది. అరుుతే క్యూబా దళాలు మూడు రోజుల్లో ఈ కిరారుు సేనలను ఓడించాయి.
తప్పిన అణుయుద్ధం
సోవియట్ యూనియన్ క్యూబాలో క్షిపణుల మోహరింపు పరిణామాల తర్వాత 13 రోజులపాటు రెండు అగ్రరాజ్యాలు, క్యూబా ప్రజలేగాక యావత్ ప్రపంచం తీవ్ర ఉత్కంఠకు గురైంది. రెండు అగ్ర రాజ్యాల మధ్య అణు యుద్ధం తప్పదని అందరూ భయపడ్డారు. క్యూబాలోకి మరిన్ని సోవియట్ క్షిపణులు ప్రవేశించకుండా అమెరికా యుద్ధనౌకలు క్యూబాను చుట్టుముట్టారుు. మోహరించిన క్షిపణులను కమ్యూనిస్ట్ రష్యాకు తిరిగి పంపేయాలని అమెరికా షరతు పెట్టింది. క్యూబా నుంచి క్షిపణులు తొలగిస్తే.. టర్కీ, ఇటలీ నుంచి అమెరికా క్షిపణులు తొలగిస్తామన్న కెన్నడీ ప్రతిపాదనను సోవియట్ నేత నికితా క్రుశ్చేవ్ అంగీకరించడంతో అణుయుద్ధ ప్రమాదం తప్పింది. చివరికి 2008లో అమెరికాలో రిపబ్లికన్ల పాలనకు తెరపడి ఒబామా అధ్యక్షుడవ్వడంతో అమెరికా, క్యూబాల మధ్య మామూలు సంబంధాలకు మార్గం సుగమమైంది. ఒబామా క్యూబా గడ్డపై అడుగుపెట్టారు. దీంతో రెండు దేశాల మధ్య దశాబ్దాల వైరానికి తెరపడింది.
ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో మనం విన్న మాటలు.. అమెరికా పక్కలో బల్లెం క్యూబా. అమెరికా అట్లాంటిక్ తీర రాష్ట్రం ఫ్లోరిడాకు 90 మైళ్ల దూరంలో క్యూబా ఉండడం ఇందుకు కారణం. 50 ఏళ్లపాటు ఈ కరీబియన్ ద్వీప దేశాన్ని పాలించిన ఫిడెల్ క్యాస్ట్రో అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే అమెరికా శత్రువుగా మారారు. అంటే 1961 ఆరంభంలో రెండు దేశాల మధ్య తెగిన దౌత్య సంబంధాలు 2015 జూలై 20 వరకూ మళ్లీ అతుక్కోలేదు. అరుుతే ఈ రెండు పరిణామాలూ క్యాో్ట్ర బతికుండగానే జరిగాయి.
అనారోగ్యం.. సోదరుడికి పగ్గాలు
2006 జూలైలో క్యాస్ట్రో పేగులకు అత్యవసర శస్త్రచికిత్స అవసరమైంది. అప్పుడే తన సోదరుడు రౌల్ క్యాస్ట్రోకు తాత్కాలికంగా దేశాధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పారు. ఆరోగ్యం సహకరించని కారణంగా తాను అధ్యక్ష బాధ్యతలు చూడలేనని స్పష్టం చేయడంతో 2008లో రౌల్ పూర్తిస్థారుు అధ్యక్షుడయ్యారు. తదనంతరం ప్రజాజీవితం నుంచి పూర్తిగా తెరమరుగైన ఫిడేల్ క్యాస్ట్రో అనారోగ్యం పాలైన నాలుగేళ్ల తర్వాత తొలిసారి సాధారణ ప్రజానీకానికి కనిపించారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. టీవీలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. జాతీయ అసెంబ్లీలోనూ మాట్లాడారు. తర్వాత అప్పుడప్పుడు మీడియాకు ఆయన వీడియోలు, ఫోటోలను క్యూబా ప్రభుత్వం విడుదల చేసింది. క్యాస్ట్రో పరిస్థితి విషమంగా ఉందని పలుమార్లు వదంతులు వ్యాపించారుు. చివరకు ఈ కమ్యూనిస్టు యోధుడు శుక్రవారం సాయంత్రం (భారతకాలమానం ప్రకారం శనివారం ఉదయం) తుదిశ్వాస విడిచారు.