John Kerry
-
భారత్-పాక్ పరిణామాలపై అగ్రరాజ్యం ఆరా!
అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల సీజన్ కొనసాగుతున్నప్పటకీ ఆ దేశ నాయకత్వం భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగమంత్రి జాన్ కెర్రీ గత రెండురోజుల్లోనే రెండుసార్లు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో ఈ అంశంపై ముచ్చటించారు. దాయాది పాకిస్థాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చూడాలని భారత్‌కు అమెరికా సూచించింది. ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్ దౌత్యపరంగా ఏకాకిని చేయడంతోపాటు పలురకాలుగా దెబ్బతీసేందుకు భారత్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అగ్రరాజ్యం నుంచి ఈ సూచన రావడం గమనార్హం. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు సుష్మా స్వరాజ్ ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్నారు. గత సోమవారం ఆమె పాకిస్థాన్ తీరును దుయ్యబడుతూ ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. ఈ నేపథ్యంలో జాన్ కెర్రీ రెండుసార్లు సుష్మాతో మాట్లాడారని విశ్వసనీయ దౌత్య వర్గాలు తెలిపాయి. ఉడీ ఉగ్రవాద దాడి అనంతరం అమెరికా నాయకత్వం నేరుగా భారత్‌ను సంప్రదించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుతున్న నేపథ్యంలో ఈ అంశంపై ప్రధానంగా వీరి మధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. -
అమెరికాను అభ్యర్తించిన పాక్ ప్రధాని
-
అమెరికా, రష్యా చేతులు కలిపాయి!
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థను సిరియాలో నియంత్రించడానికి రెండు అగ్రరాజ్యాలు చేతులు కలిపాయి. సిరియాలో శాంతి నెలకొల్పి అక్కడి ప్రజలకు మంచి చేయడంలో భాగంగా తమ దేశం రష్యాతో కలిసి ఇక నుంచి మిలిటెంట్లపై దాడులు చేయడానికి సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగమంత్రి జాన్ కెర్రీ తెలిపారు. ఇప్పటివరకూ స్వతంత్రంగా వైమానిక, ఇతర దాడులు నిర్వహించిన అమెరికాతో పాటు రష్యా కూడా ఉగ్రవాదాన్ని సీరియస్ అంశంగా తీసుకుంది. రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్ తో జెనీవాలో చర్చలు జరిపిన అనంతరం ఆయన ఈ విషయాలను వెల్లడించారు. సిరియాలో రాజకీయ స్థిరత్వం రావాలన్నా, మళ్లీ ప్రశాతం వాతావారణ ఏర్పడాలంటే తమ దేశాల ఆర్మీ బలగాలు ఉగ్రవాదులపై దాడులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. నస్రా ఫ్రంట్, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదాన్ని సిరియాలో రూపుమాపడమే తమ లక్ష్యమని కెర్రీ పేర్కొన్నారు. సోమవారం నుంచి వీరి వ్యూహాలు అమలు చేసే అవకాశాలున్నాయని, సిరియా అంతర్యుద్ధం గురించి ఆ దేశ అధ్యక్షుడు బషర్ హఫీజ్ అల్ అస్సద్ తో చర్చలు జరుపుతామని జాన్ కెర్రీ వివరించారు. సిరియాలో ఐఎస్ఐఎస్ దాడుల వల్ల ఇప్పటికే వేల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. -
స్వదేశీ ఉగ్రవాదంపై పోరాడండి
* పాక్‌కు అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ సూచన * ఢిల్లీ ఐఐటీలో ప్రసంగం న్యూఢిల్లీ: స్వదేశీ ఉగ్రవాద సంస్థలను ఏరివేసేందుకు పాకిస్తాన్ మరింత శ్రమించాల్సిన అవసరం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ తెలిపారు. తన భూభాగంపై ఉగ్రవాదం చేస్తున్న అరాచకాలను అర్థం చేసుకుని.. దాన్ని అంతమొందించేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఉగ్ర ప్రభావంతో తీవ్రంగా నష్టపోతున్న పాకిస్తాన్లో ఇంతవరకు 50 వేలమంది.. ఉగ్రభూతం బారిన పడి మరణించిన విషయాన్ని గుర్తుచేశారు. ‘పాకిస్తాన్ కూడా ఉగ్రప్రభావిత దేశమే. అయినా.. పాకిస్తాన్ ఒక్కతే.. డాయిష్, అల్‌కాయిదా, లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హుక్కానీ నెట్‌వర్క్‌లతో పోరాడలేదు. అందుకే మేం సహాయం అందిస్తున్నాం’ అని ఐఐటీ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కెర్రీ తెలిపారు. ఈ సంస్థల ద్వారానే భారత్-పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలకు విఘాతం కలుగుతోందని.. అఫ్గానిస్తాన్‌లోనూ అశాంతి, అస్థిరతకు వీరే కారణమన్నారు. భారత్-పాక్ మధ్య స్నేహ బంధం కోసం ప్రధాని మోదీ చేస్తున్న ప్రయత్నాన్ని కెర్రీ అభినందించారు. దక్షిణ చైనా సముద్రంలో నెలకొన్న అస్థిరతకు మిలటరీ ద్వారా సమాధానం చెప్పలేమని.. చైనా, ఫిలిప్పీన్స్ దేశాలు కూర్చుని సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ కోర్టు తీర్పు ప్రకారం నడుచుకుంటే ఇబ్బందులుండవని కెర్రీ తెలిపారు. కాగా, ప్రజల హక్కులను కాలరాయకుండా.. కుల,మత, ప్రాంతాలకు అతీతంగా తమ నిరసనను తెలియజేసే హక్కును కల్పించాలని కెర్రీ అన్నారు. ఇటీవల బెంగళూరులో జరిగిన ఘటనకు సంబంధించి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్పై దేశద్రోహం కేసు పెట్టడాన్ని ప్రస్తావిస్తూ కెర్రీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు తమ భావాలను వెల్లడించే అవకాశం ఇవ్వనపుడు.. వారు ఉగ్రవాదులుగా మారే ప్రమాదం ఉందన్నారు. కాగా, మంగళవారం నాటి రెండో వ్యూహాత్మక సమావేశం తర్వాత విడుదల చేసిన సంయుక్త ప్రకటనలోనూ భారత్, అమెరికా దేశాలు.. దక్షిణ చైనా సముద్రంలో పరిస్థితి, ఎన్ఎస్జీలో సభ్యత్వం, ఉగ్రవాదంపై ఒకే వాణిని వినిపించాయి. మోదీతో కెర్రీ భేటీ ప్రధానితో కెర్రీ బుధవారం భేటీ అయ్యారు. భారత్‌తోపాటు ఆసియా ప్రాంతంలో అభివృద్ధి కోసం అమెరికా మదిలో ఉన్న ఆలోచనలను ప్రధానితో పంచుకున్నారు. మోదీ అమెరికా పర్యటన సందర్భంగా చేసుకున్న ఒప్పందాల పురోగతితోపాటు.. మంగళవారం జరిగిన ఇరుదేశాల రెండో వ్యూహాత్మక సదస్సు వివరాలను ప్రధానికి తెలియజేశారు. కాగా, బుధవారం మధ్యాహ్నం అమెరికా బయలుదేరాల్సిన కెర్రీ తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. చైనాలో జరిగే జీ-20 సదస్సులో పాల్గొన్నాక ఒబామాతో కలిసి అమెరికా వెళ్లనున్నారు. మరోవైపు, భారత-అమెరికా రక్షణ రంగ ఒప్పందంపై చైనా ఆందోళన చెందాల్సిన పనిలేదని అమెరికా ఓ ప్రకటనలో తెలిపింది. ఇది ఇరుదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకునే ఒప్పందమేనంది. భారత్‌కు అణు సరఫరా బృందం (ఎన్ఎస్జీ)లో సభ్యత్వం విషయంలో అమెరికా ఎప్పుటికీ అండగానే ఉంటుందని తెలిపింది. -
చైనా.. భారత్‌ని చూసి నేర్చుకో!
న్యూఢిల్లీ: భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ పరోక్షంగా మన పొరుగుదేశం చైనాకు చురకలు అంటించారు. అంతర్జాతీయ ట్రిబ్యునల్ తీర్పులను ఏ విధంగా గౌరవించాలో భారత్‌ను చూసి చైనా నేర్చుకోవాలని హితవు పలికారు. దక్షిణ చైనా సముద్రంపై గుత్తాధిపత్యం తనకే ఉందని మొండిగా వాదిస్తున్న చైనా.. ఈ విషయంలో హెగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును బాహాటంగా ధిక్కరించిన సంగతి తెలిసిందే. కానీ, దక్షిణ సముద్రం తరహా వివాదమైన బంగ్లాదేశ్‌తో సముద్ర జలాల సరిహద్దుల విషయంలో భారత్ అంతర్జాతీయ ట్రిబ్యునల్ తీర్పును గౌరవించింది. తీర్పు ప్రకారం నడుచుకొని వివాదాన్ని ముగించింది. ఢిల్లీ ఐఐటీలో విద్యార్థులతో ముచ్చటిస్తూ ఈ విషయాన్ని ప్రస్తావించిన జాన్ కెర్రీ భారత్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. భారత్ చట్టానికి కట్టుబడే దేశమని కితాబిచ్చారు. (చదవండి: చైనాకు భారీ ఎదురుదెబ్బ!) ’బంగ్లాదేశ్‌తో సముద్ర జలాల సరిహద్దుల విషయంలో అంతర్జాతీయ తీర్పును ఒప్పుకోవడం ద్వారా భారత్ తన విశిష్టతను చాటుకుంది. వివిధ ప్రాంతాల్లో ప్రమాదకరంగా పరిణమిస్తున్న వివాదాల్లో పరిష్కరానికి ఇది నమూనాగా నిలుస్తుంది. దక్షిణ చైనా సముద్రం సహా పలు వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ఈ విధానం అనుసరణీయం’ అని కెర్రీ కొనియాడారు. దక్షిణ చైనా సముద్రం వివాదం విషయంలో సైనిక పరిష్కారానికి తావు లేదని ఆయన అన్నారు. అయితే, కష్టకాలంలో తన మిత్రదేశాలకు అమెరికా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. -
మీరు ఇక్కడకు బోట్లలో వచ్చారా?
-
మీరు ఇక్కడకు బోట్లలో వచ్చారా?
తాను ఎన్నడూ చూడనంత అతి భారీ వర్షాన్ని చూసిన అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ.. ఢిల్లీలో పలు ప్రాంతాలకు వెళ్లాల్సి ఉన్నా, తన పర్యటనలను చాలావరకు రద్దుచేసుకున్నారు. ఒక్క ఐఐటీలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమానికి మాత్రం కష్టమ్మీద ఆయన వెళ్లగలిగారు. మామూలుగా అయితే అందరినీ ఎలా ఉన్నారనో.. మిమ్మల్నందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉందనో పలకరిస్తారు. కానీ ఆయన మాత్రం.. ''మీరు ఇక్కడికి ఎలా వచ్చారు.. బోట్లలో వచ్చారా'' అని అడిగారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురవడంతో రోడ్ల మీద పరిస్థితి చూసిన ఆయనకు ఈ అనుమానం వచ్చింది. జాన్ కెర్రీ ఆ ప్రశ్న అడగ్గానే ఒక్కసారిగా సమావేశం హాల్లో నవ్వులు విరబూశాయి. అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేయడం భారత్, అమెరికా దేశాలకు మాత్రమే తెలిసిన విద్య అని జాన్ కెర్రీ చెప్పారు. ఆ తర్వాత ఆయన భారత - అమెరికా సంబంధాలు, ఉగ్రవాదాన్ని అణిచేయడం, వాణిజ్య సంబంధాలు.. ఇలా పలు అంశాలపై తన అభిప్రాయాలను విద్యార్థులతో పంచుకున్నారు. పలు దేశాలు బలప్రయోగంతోనే సమస్యలను పరిష్కరించాలని చూస్తున్నాయని... కానీ అమెరికా, భారత దేశాలు మాత్రం అంతర్జాతీయ నిబంధనలకు లోబడి వాటి ద్వారానే ముందుకు వెళ్తున్నాయని అన్నారు. ఉగ్రవాదానికి మూలాలు ఏంటో వెలికితీయాలని, వేర్వేరు కారణాలను మనం అర్థం చేసుకోవాలని చెప్పారు. ఒక్కో దేశానికి, ప్రాంతానికి మధ్య కారణాలు వేర్వేరుగా ఉంటాయని ఆయన తెలిపారు. అలాగే అవినీతిపై కూడా పోరాడి దాన్ని అరికట్టాలని ఐఐటీ విద్యార్థులకు సూచించారు. ఉగ్రవాదంపై పోరులో ఏ ఒక్క దేశం విజయం సాధించలేదని అమెరికా విదేశాంగ మంత్రి అన్నారు. భారత ప్రభుత్వం జీఎస్టీ బిల్లుతో పాటు కొత్త దివాలా చట్టాలను ఆమోదించిందని, విదేశీ పెట్టుబడుల నియంత్రణలలో మార్పులు చేసిందని.. వచ్చే సంవత్సరం భారతదేశం సంయుక్తంగా పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తుందని, దీనివల్ల భారతీయ వ్యాపారుల సత్తా అందరికీ తెలుస్తుందని ఆయన అన్నారు. -
ఉగ్ర నిర్మూలనకు అవకాశం
-
ఉగ్ర నిర్మూలనకు అవకాశం
అమెరికా సాయంతో ముందడుగు: సుష్మ స్వరాజ్ న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి విస్తృతమైన అవకాశం ఉందని.. అయితే ఇందుకు మరింత సహకారం అవసరమని భారత్ అభిప్రాయపడింది. భారత్-అమెరికా మధ్య రెండో వ్యూహాత్మక వాణిజ్య చర్చలు (ఎస్ అండ్ సీడీ) మంగళవారమిక్కడ జరిగాయి. ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సుష్మాస్వరాజ్, జాన్ కెర్రీ, వాణిజ్య శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్, పెన్నీ ప్రిజ్కర్ ఇందులో పాల్గొన్నారు. ఉగ్రవాద నియంత్రణతో పాటు ఇంధన, వాణిజ్య అంశాలపై చర్చించారు. ప్రపంచానికి పెను సవాలుగా మారిన ఉగ్రవాదాన్ని తుదముట్టించవచ్చని.. అయితే ఇందుకు మరింత సహకారం అవసరమని సుష్మా తెలిపారు. ద్వైపాక్షిక వ్యాపార సంబంధాలు బలపడాలంటే కంపెనీల ఆకాంక్షలు, ఆసక్తులను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. అలాగే అణు సరఫరా బృందం (ఎన్ఎస్జీ)లో సభ్యత్వం, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందేందుకు అమెరికాతో కలిసి ముందుకు సాగుతామన్నారు. సైబర్ ముప్పు నుంచి రక్షించుకొనేందుకు తొలిసారిగా అమెరికాతో కలిసి రూపొందించనున్న కార్యాచరణ తుది రూపునకు వచ్చిందన్నారు. రక్షణ, ఇంధన, సైబర్ భద్రత రంగాల్లో ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడ్డాయని కెర్రీ చెప్పారు. భారత్‌లోని ఇళ్లకు విద్యుత్ సరఫరా అందించే దిశగా పౌర అణు ఇంధన రియాక్టర్లు నెలకొల్పేందుకు సహకారం అవసరమన్నారు. -
జాన్ కెర్రీ ఇండియాకు ఎందుకొచ్చారంటే!
న్యూఢిల్లీ: అమెరికా విదేశాంగమంత్రి జాన్ కెర్రీకి తాజా భారత పర్యటన కొంత చికాకు తెప్పించి ఉండవచ్చు. ఎందుకంటే ఆయన సోమవారం రాత్రి న్యూఢిల్లీలో అడుగుపెట్టగానే భారీ వర్షం పలుకరించింది. హస్తినలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆ ట్రాఫిక్‌లో సాక్షాత్తు జాన్ కెర్రీ చిక్కుకుపోయారు. దీంతో ఆయన చికాకు పడ్డారో లేదో తెలియదు కానీ ఆయన వెంట ఉన్న మీడియా ప్రతినిధులు మాత్రం తమ చిరాకునంతా ట్విట్టర్లో వెళ్లగక్కారు. మంగళవారానికి అంతా సర్దుకుంది. భారత్‌తో అత్యంత కీలకమైన రక్షణశాఖ ఒప్పందాలను అమెరికా కుదుర్చుకుంది. ఆ టాప్ వివరాలు మీకోసం.. భారత్-అమెరికా మధ్య 'వ్యూహాత్మక-వాణిజ్య సంబంధాలను' పెంపొందించేందుకు ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆరంభించిన చర్చలను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో జాన్ కెర్రీ ఢిల్లీలో అడుగుపెట్టారు. ఆయన బుధవారం ప్రధాని మోదీతో సమావేశమవుతారు. అమెరికా-భారత్ వాణిజ్యాన్ని ఐదురెట్లు పెంచి 500 బిలియన్ డాలర్ల (రూ. 33.52 లక్షల కోట్ల)కు చేర్చే లక్ష్యంతో వీరి మధ్య చర్చలు జరగనున్నాయి. జాన్‌కెర్రీ మంగళవారం విదేశాంగమంత్రి సుష్మాసర్వాజ్ను కలిశారు. సాయంత్రం కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అవుతారు. మరమ్మతులు, సరఫరాల కోసం ఇరుదేశాల సైనిక శిబిరాలు పరస్పరం ఉపయోగించుకునేందుకు అనుమతిస్తూ వాషింగ్టన్లో అమెరికా-భారత్ ఒక ఒప్పందంపై సంతకం చేసిన నేపథ్యంలో జాన్‌కెర్రీ భారత పర్యటనకు వచ్చారు. చైనా తన సైనిక శక్తిని అమేయంగా పెంచుకుంటున్న నేపథ్యంలో దానిని దీటుగా ఎదుర్కొనేందుకు రక్షణ బంధాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు రక్షణమంత్రి మనోహర్ పరీకర్, అమెరికా రక్షణమంత్రి ఆష్టన్ కార్టర్‌తో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇరుదేశాల సంయుక్తంగా, వ్యూహాత్మకంగా ఆర్మీ కార్యకలాపాలు చేపట్టేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని కార్టర్ పేర్కొనగా.. ఈ ఒప్పందం వల్ల భారత భూభాగంలో అమెరికా సైనిక శిబిరాలు ఏర్పాటుచేసేందుకు వీలు ఉండబోదని మనోహర్ పరీకర్ స్పష్టం చేశారు. జాన్ కెర్రీ భారత్‌లో పర్యటించడం ఇది నాలుగోసారి. ఆయన బుధవారం ఢిల్లీ ఐఐటీలో విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నారు. కెర్రీ పర్యటన నేపథ్యంలో అణు సరఫరాల గ్రూప్ (ఎన్ఎస్జీ), 48 దేశాల బృందం (జీ 48)లో స్వభ్యత్వం కోసం అమెరికా మద్దతును భారత్ మరింత బలంగా కోరే అవకాశముంది. -
ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న అమెరికా మంత్రి
అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ.. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు. భారతదేశ పర్యటన కోసం ఢిల్లీ వచ్చిన ఆయన.. భారీ వర్షం పుణ్యమాని దాదాపు గంట పాటు ఢిల్లీ వీధుల్లోనే ఉండిపోయారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తాజ్ మహల్ హోటల్‌కు వెళ్లేటప్పుడు ఆయన కాన్వాయ్ ట్రాఫిక్‌లో ఇరుక్కుంది. దాంతో కెర్రీతోపాటు వచ్చిన అమెరికా జర్నలిస్టులు టకటకా తమ ఫోన్లు తీసుకుని, ఢిల్లీ ట్రాఫిక్ జామ్ గురించి ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు. వెంటనే భారత ఇంటెలిజెన్స్ అధికారులు కూడా రంగంలోకి దిగి విదేశీ అతిథికి ఎలా భద్రత కల్పించాలో చర్చించారు. మఫ్టీలో ఉన్న పోలీసులను అక్కడకు పంపి, తీన్‌మూర్తి మార్గ్ ప్రాంతంలోని ట్రాఫిక్ జామ్‌ను త్వరగా క్లియర్ చేయడానికి ప్రయత్నించారు. శాంతిపథ్ - తీన్ మూర్తి మార్గ్ ప్రాంతం మొత్తం నీళ్లు నిలిచిపోవడంతో దాదాపు గంట పాటు వాహనాలు ఏవీ కదల్లేదు. ఇతర మార్గాల్లో వాహనాలను అరగంట పాటు ఆపేసి మరీ కెర్రీ కాన్వాయ్‌ని పంపారు. ఇందుకోసం దాదాపు 50 మంది పోలీసులను మోహరించారు. అయితే.. పోలీసులు మాత్రం జాన్ కెర్రీ ట్రాఫిక్‌లో చిక్కుకోలేదని, ఆయనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉందని, ఆయన కోసం విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీ వరకు ఒక కారిడార్ మొత్తాన్ని క్లియర్ చేశామని అంటున్నారు. ఈయన కాన్వాయ్ కారణంగా ఇతర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది తప్ప ఆయన ఇరుక్కోలేదని ఓ పోలీసు అధికారి చెప్పారు. ఢిల్లీలో 21.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో దేశ రాజధానిలో చాలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. రింగ్ రోడ్డు ప్రాంతంలో ట్రాఫిక్ మొత్తం నత్తనడకన సాగింది. దక్షిణ ఢిల్లీలోని రింగ్‌రోడ్డు ప్రాంతంలో 5 కిలోమీటర్ల దూరం వెళ్లడానికి గంటన్నరకు పైగా సమయం పట్టింది. పీక్ అవర్స్‌లో కూడా జల్లులు పడుతూనే ఉండటంతో రోడ్ల మీద నిలిచిపోయిన నీటిని తోడేందుకు అధికారులకు తలప్రాణం తోకకు వచ్చింది. పలు ప్రాంతాల్లో మోకాలి లోతున నీళ్లు ఉన్నాయి. వాహనాలు ఆగిపోయాయి. సరిగ్గా నెల రోజుల ముందు కూడా ఢిల్లీ- గుర్గావ్ ప్రాంతంలో ఇలాంటి ట్రాఫిక్ జామ్ పరిస్థితే ఏర్పడింది. -
ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న అమెరికా మంత్రి
-
వచ్చేవారం భారత్ లో జాన్ కెర్రీ పర్యటన
వాషింగ్టన్: అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ వచ్చే వారం భారత్ ను సందర్శించనున్నారు. ఈ మేరకు అగ్రదేశం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 29 న జాన్ కెర్రీ బంగ్లాదేశ్ లో పర్యటించిన అనంతరం ఇండియా చేరుకుంటారు. ఆయన అగస్టు 31 వరకు ఇండియాలో పర్యటిస్తారు. ఇరుదేశాల ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలపై చర్చించనున్నారు. అమెరికా వాణిజ్య కార్యదర్శి పెన్నీ ప్రిట్జ్కర్ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పలు వాణిజ్య ఒప్పందాలపై చర్చించనున్నారు. ఇరుదేశాల వ్యూహాత్మక, వాణిజ్య ఒప్పందాలను ఈ పర్యటన మరింత బలోపేతం చేయగలదని అమెరికా తెలిపింది. -
‘తిరుగుబాటు’పై ఉక్కుపాదం
-
‘తిరుగుబాటు’పై ఉక్కుపాదం
టర్కీ పోలీసుల అదుపులో 6 వేల మంది - చట్ట ప్రకారం వ్యవహరించాలని ఒబామా సూచన - ప్రభుత్వ యంత్రాంగాల్లో వైరస్‌ను తొలగిస్తామన్న ఎర్డోగన్ - జూలై 15 ప్రజాస్వామ్య దినోత్సవంగా ప్రకటన ఇస్తాంబుల్/అంకారా: సైనిక కుట్రను విజయవంతంగా తిప్పికొట్టిన టర్కీ.. అందుకు సహకరించిన వారిపై కొరడా ఝులిపిస్తోంది. శనివారం మొదలైన అరెస్టులు ఆదివారం కూడా కొనసాగాయి. విచారణ నిమిత్తం 6 వేల మందిని అదుపులోకి తీసుకున్నామని టర్కీ న్యాయశాఖ మంత్రి బెకిర్ బొజ్‌డేగ్ ప్రకటించారు. అరెస్టైన వారిలో ఆర్మీకి చెందిన ముగ్గురు అత్యున్నత స్థాయి అధికారులు, వందల మంది సైనికులు ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న పదుల సంఖ్యలో న్యాయమూర్తులు, న్యాయవాదులకు అరెస్టు వారెంట్లు జారీ చేశామని బెకిర్ చెప్పారు. ఇప్పటికే దాదాపు 3 వేల మంది న్యాయమూర్తుల్ని, న్యాయవాదుల్ని తొలగించారు. అంకారాలో గులెన్ వర్గానికి న్యాయవాదుల్ని అరెస్టు చేశారు. తిరుగుబాటు అనంతర పరిస్థితుల్ని చట్ట ప్రకారం పరిష్కరించాలని అమెరికా అధ్యక్షుడు ఒబామా కోరగా, టర్కీ ప్రభుత్వ యంత్రాంగాల్లో వైరస్‌ను తొలగిస్తామని ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగన్ ప్రకటించారు. జూలై 15ను ప్రజాస్వామ్య దినోత్సవంగా నిర్వహిస్తామని టర్కీ ప్రధాని తెలిపారు. తిరుగుబాటు సందర్భంగా రేగిన హింసలో 161 మంది పౌరులు, ప్రభుత్వ అనుకూల సైనికులు మరణించారు. సైనిక కుట్రలో పాల్గొన్న 104 మంది మృతిచెందారని మిలట్రీ ప్రకటించింది. శనివారం రాత్రి నుంచి అధ్యక్షుడు ఎర్డొగన్ మద్దతుదారులు దేశ వ్యాప్తంగా ప్రదర్శనలు కొనసాగించారు. పోలీసుల అదుపులో 34 మంది జనరల్స్ టర్కీ ప్రముఖ చానల్ కథనం ప్రకారం ఆర్మీలోని వివిధ హోదాల్లో ఉన్న 34 మంది జనరల్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. అత్యున్నత హోదాలో ఉన్న ఆర్మీ కమాండర్లు ఎర్డల్ ఒజ్‌టర్క్, అడెమ్ హ్యుడుటి, ఒజాన్ ఓజ్‌బకీర్‌లను కూడా అరెస్టు చేశారు. ఎయిర్‌ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ బెకిర్ ఎర్కన్ వ్యాన్ తో పాటు మరో 12 మంది కింది స్థాయి అధికారుల్ని ఇన్‌సర్లిక్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి అదుపులోకి తీసుకున్నారు. మిలట్రీ హెలికాప్టర్లో గ్రీస్‌కు తప్పించుకుపోయిన ఎనిమిది మందిని తమకు అప్పగించాలని టర్కీ డిమాండ్ చేసింది. మా పాత్ర లేదు: అమెరికా టర్కీలో సైనిక కుట్రను ప్రపంచ నాయకులతో పాటు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఖండించారు. తమపై టర్కీ ఆరోపణలు ద్వైపాక్షిక సంబంధాల్ని దెబ్బతీస్తాయని అమెరికా దేశ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ పేర్కొన్నారు. కాగా, సెనిక కుట్ర సందర్భంగా మరణించిన వారి అంత్యక్రియలు ఆదివారం అంకారా, ఇస్తాంబుల్ నిర్వహించారు. ఎర్డోగన్ స్వయంగా ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తన స్నేహితుడు, అతని కుమారుడి మరణాల్ని తట్టుకోలేక అంత్యక్రియల్లో అధ్యక్షుడు కంటతడి పెట్టారు. -
నాడు అణుబాంబులు.. నేడు పుష్పగుచ్ఛాలు
కాలంతోపాటు గాయం మానిపోతుందంటారు. చరిత్రలోనే అత్యంత హేయమైన నరమేధాన్ని ఎదుర్కొన్న జపాన్ కూడా 'ఎన్నటికీ మర్చిపోలేని' గాయాన్ని మాన్పుకోవాలనుకుంటోంది. నాటి శత్రుదేశాలతో స్నేహం కోరుకుంటోంది. జీ7(గ్రూప్ ఆఫ్ సెవెన్) కూటమి ద్వారా ఆ ప్రక్రియకు గతంలోనే బీజాలు పడినప్పటికీ సోమవారం చోటుచేసుకున్న పరిణామంతో అది చారిత్రక మలుపుతిరిగింది. నాడు హిరోషిమా, నాగసాకీలపై అణుబాంబులు కురిపించిన అమెరికా నేడు పుష్పగుచ్ఛాలతో అణుబాంబు మృతుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించింది. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ సహా జీ7 దేశాల మంత్రుల బృందం సోమవారం హిరోషిమాలోని అణుబాంబు మృతుల స్మారక స్థూపాన్ని సందర్శించింది. నాటి విధ్వంసంలో మరణించిన లక్షలాదిమందికి నివాళులు అర్పించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక అమెరికా విదేశాంగ మంత్రి హిరోషిమాను సందర్శించడం ఇదే మొదటిసారి కావటంతో జాన్ కెర్రీ పర్యటనపై సర్వత్రా ఆసక్తినెలకొంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం జపాన్ చేరుకున్న జాన్ కెర్రీ ఫ్రాన్స్, యూకే, జర్మనీ, ఇటలీ, కెనడా దేశాల మంత్రులతో కలిసి జపాన్ తో చర్చలు జరుపుతారు. పలు అభివృద్ధి అంశాలు, ఆర్థిక ఒప్పందాలపై అవగాహన కుదుర్చుకుంటారు. జపాన్ లో అడుగుపెట్టకముందు అమెరికాలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కెర్రీ హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబులు వేసినందుకు జపాన్ కు క్షమాపణలు చెప్పబోయేదిలేదని కుండబద్దలు కొట్టారు. దాదాపు మూడు లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన నాటి సంఘటనపట్ల విచారం వ్యక్తచేస్తామేతప్ప క్షమాపణలు కోరమని కెర్రీ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా 1945, ఆగస్టు 6న జపాన్ లోని పారిశ్రామిక నగరం హిరోషిమాపై అమెరికా యుద్ధవిమానాలు అణుబాంబు వేశాయి. మూడు రోజుల తర్వాత (ఆగస్టు 9న) తీర పట్టణం నాగసాకిపై మరో అణుబాబు పడింది. రెండు ఘటనల్లో దాదాపు మూడు లక్షల మంది చనిపోగా, 30 ఏళ్లపాటు రేడియేషన్ ఎఫెక్ట్ కొనసాగింది. -
ఐఎస్ఐ వ్యవహారంపై అమెరికా నిఘా
వాషింగ్టన్ : పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐకి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలపై అమెరికా పూర్తిగా దృష్టిసారిస్తోంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్టు ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జాన్ కెర్రీ తెలిపారు. విదేశీ వ్యవహారాల కమిటీ సమావేశంలో కెర్రీ మాట్లాడుతూ... ‘ఉగ్రవాద సంస్థలతో ఐఎస్ఐ సంబంధాలపై దృష్టిసారిస్తున్నాం. వచ్చే వారంలో వాషింగ్టన్లో జరగనున్న అమెరికా-పాక్ సమావేశాల్లో ఈ అంశం చర్చకు రానుంది’ అని చెప్పారు. ప్రమాదకరమైన హఖానీ నెట్‌వర్క్‌పై కూడా అమెరికా నిఘా ఉంచింది. హఖానీ నెట్వర్క్ అల్ ఖైయిదాతో కలిసి పనిచేస్తుందనే ఆరోపణలున్నాయి. 2008లో కాబూల్‌లోని భారత కార్యాలయంపై జరిగిన దాడి సహా భారత్, అఫ్ఘానిస్తాన్ లలో దాడులకు పాల్పడ్డారు. -
చివరి ప్రయత్నం
పర్యావరణ ఒప్పందంపై ఏకాభిప్రాయానికి కసరత్తు ♦ సమావేశాలు మరో రోజు పొడిగింపు పారిస్: ఫ్రాన్స్‌లో 12 రోజులుగా జరుగుతున్న పర్యావరణ సదస్సులో కీలక ఒప్పందంపై ఇంకా ఏకాభిప్రాయం కుదరకపోవటంతో.. భేటీలను మరోరోజు పొడగించాలని నిర్ణయించారు. గురువారం రాత్రంతా వివిధ దేశాల మంత్రులు కూర్చుని చర్చించినా పెద్దగా సాధించిందేమీ లేదు. కర్బన ఉద్గారాలు, నిధులను అందించే విషయాలపై సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటంతో.. పర్యావరణంపై చరిత్రాత్మక ఒప్పందంపై ఏకాభిప్రాయం కోసం చివరిసారిగా భేటీ కానున్నారు. ఉద్గారం, నిధుల అందజేత విషయంలో ముందుగా నిర్ణయించిన అంశాలను అమలుచేయాల్సిందేనని భారత్, చైనాలు పట్టుబడుతున్నాయి. ఉష్ణోగ్రత పెరగటం వల్ల నష్టపోయే దేశాలు, పేద దేశాలకు ఆర్థిక సహాయం చేసే విషయంలో అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సమన్వయం కుదరకపోవటమే.. ఒప్పందంపై ఏకాభిప్రాయానికి సమస్యగా మారింది. కాగా, ప్రపంచ మానవాళిని దృష్టిలో ఉంచుకుని సభ్యులు సానుకూలంగా ఆలోచించాలని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ బాన్ కీ మూన్ కోరారు. మరోవైపు, ఒప్పందం ముసాయిదాలో పేజీల సంఖ్య 27 పేజీలకు చేరింది. తుది ముసాయిదాలో భారత్ చేసిన సూచనలకు చోటు కల్పించారు. అయితే ఈ ముసాయిదా వల్ల పర్యావరణానికి ఒనగూరే లాభమేమీ లేదని.. సమయం మించిపోతున్నందున మంత్రులు ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకోవాలని గ్రీన్పీస్తోపాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు కోరాయి. అయితే.. సంపన్నదేశాలే ఎక్కువ ఉద్గారానికి కారణమవుతున్నాయని ప్రకాశ్ జవదేకర్ పునరుద్ఘాటించారు. ఈ దేశాలు వాస్తవాన్ని ఆలోచిస్తే.. పర్యావరణ సమస్యకు చాలామట్టుకు పరిష్కారం లభిస్తుందనానరు. కాగా, కీలకమైన చివరి సమావేశానికి ముందు అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ.. ప్రకాశ్ జవదేకర్‌తో భేటీ అయ్యారు. -
ఏకాభిప్రాయానికి చివరిరోజు
కాప్-21లో ‘భారత సూచన’లకు పట్టుబడుతున్న యూఎస్ పారిస్: వాతావరణ మార్పులపై రూపొందించిన ఒప్పంద ముసాయిదాపై 11 రోజులుగా మేధోమథనం జరుగుతోంది. దీనికి తుదిరూపు ఇచ్చేందుకు ఇంకా ఒకరోజు మాత్రమే మిగిలుంది. అయినా ఇంత వరకు ఒప్పందంపై పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో మరోసారి సభ్యదేశాల మంత్రులంతా సమావేశం కానున్నారు. కాగా, భారత్ ప్రతిపాదించిన నియమాల అమలు అవసరమని.. దీనిపై సభ్యదేశాలు ఆలోచించాలని అమెరికా సూచించింది. బుధవారం నాటి ఒబామా-మోదీ ఫోన్ సంభాషణ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ.. భారత మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో సమావేశమయ్యారు. సమావేశ వివరాలను వెల్లడించనప్పటికీ.. భేటీ సంతృప్తికరంగా సాగిందని.. పర్యావరణ మార్పులపై భారత్-అమెరికా సంయుక్తంగా పోరాటం చేయనున్నాయని జవదేకర్ తెలిపారు. భవిష్యత్ తరాలకు మంచి చేసేందుకు పారిస్ సదస్సు వేదికని జాన్ కెర్రీ తెలిపారు. అయితే.. ఉద్గారాల విషయంలో అందరూ ఒకతాటిపైనే ఉన్నా.. పేద దేశాలకు ఆర్థిక సాయం చేయటం, పర్యావరణ మార్పులతో నష్టపోతున్న దేశాలకు పరిహారం అందించటం విషయంలోనే ఏకాభిప్రాయం రావటం లేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ తెలిపారు. అయితే.. ఒప్పందంలో అంశాలపై ఏకాభిప్రాయ సాధనకు పలు దేశాలతో భారత్ చర్చలు జరుపుతోంది. -
పేద దేశాలకు రెట్టింపు నిధులు: జాన్ కెర్రీ
పారిస్: శుక్రవారం ముగియనున్న పారిస్ పర్యావరణ సదస్సులో సభ్య దేశాల మంత్రుల సమావేశం తర్వాత ‘సంయుక్త ఒప్పందం’పై ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ఒప్పందం ముసాయిదాను 48 పేజీల నుంచి 29 పేజీలకు కుదించి సభ్య దేశాలకు పంపించినట్లు ఫ్రాన్స్ తెలిపింది. మరోవైపు, పేద దేశాలు పర్యావరణ పరిరక్షణ దిశగా చేసే ప్రయత్నాలకు ఇచ్చే నిధులను రెట్టింపు చేస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ప్రకటించారు. అగ్రరాజ్యంగా తమ బాధ్యతను నిర్వర్తిస్తామన్నారు. -
‘నోబెల్ శాంతి’ రేసులో మెర్కెల్
ఓస్లో: ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి రేసులో జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్, అమెరికా విదేశాంగమంత్రి జాన్ కెర్రీ ముందంజలో ఉన్నారు. నోబెల్ అవార్డులన్నింటిలోనూ ఓస్లోలో ప్రదానం చేసే ఏకైక అవార్డైన శాంతి బహుమతి ఎవరిని వరిస్తుందనేది ఉత్కంఠగా మారనుంది. శుక్రవారం ప్రకటించనున్న ఈ అవార్డుకు నామినీల పేర్లను ఎప్పటిలాగే రహస్యంగా ఉంచారు. శాంతి బహుమతి కోసం ఈ ఏడాది 273 మంది పేర్లను పరిశీలించినట్లు సమాచారం. ఈ ఏడాది ప్రపంచాన్ని తీవ్రంగా కుదిపేసిన వలసల సంక్షోభాన్ని నివారించేందుకు కృషి చేసిన వారికి అవార్డు దక్కుతుందని పరిశీలకుల అంచనా. పశ్చిమాసియా, ఆఫ్రికాల నుంచి ఐరోపాకు 6 లక్షల 30 వేల మంది వలస వెళ్లారు. వీరిని ఆదుకోవటానికి నైతిక నాయకత్వం వహించిన మెర్కెల్‌కు శాంతి బహుమతి దక్కే అవకాశాలున్నాయని ఓస్లో శాంతి పరిశోధన సంస్థ చీఫ్ హార్ప్వికెన్ అన్నారు. ఇరాన్‌తో అణు ఒప్పందం ఖరారులో విజయం సాధించిన జాన్ కెర్రీ, ఇరాన్ విదేశాంగ మంత్రి జావద్ జరీఫ్‌లకు కూడా అవకాశాలున్నాయి. -
ఆగస్టులో క్యూబాకు జాన్ కెర్రీ
వాషింగ్టన్: క్యూబాతో సయోధ్య కుదుర్చుకునేందుకు అమెరికా సిద్ధమైంది. సుమారు 50 ఏళ్ల తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను పునరుద్దరించడంలో భాగంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి జాన్ కెర్రీ వచ్చే ఆగస్టు 14న క్యూబా వెళ్లనున్నారు. అక్కడి హవానాలోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని దేశ ప్రయోజనాలకు అనుగుణంగా పునర్ నియమిస్తారు. సోమవారం అమెరికాలో క్యూబా విదేశాంగ మంత్రి బ్రునో రడ్రిగ్వెజ్తో కెర్రీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్యూబాతో తాము మంచి పొరుగుదేశంగా ఉండాలనుకుంటున్నట్లు తెలిపారు. పరస్పర గౌరవంతో ఇరు దేశాల ప్రజలు జీవించాలని కోరుకుంటున్నామన్నారు. 1958 తర్వాత మొదటిసారిగా క్యూబా విదేశాంగ మంత్రితో సమావేశమైనట్లు చెప్పారు. -
పాక్, భారత్‌లకే కాదు.. అమెరికాకు ముప్పే..
ఇస్లామాబాద్ : భారత్-పాకిస్తాన్ల మధ్య చర్చల ప్రక్రియ కొనసాగాలని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ అన్నారు. ఇస్లామాబాద్ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. తీవ్రవాదంపై పోరులో పాకిస్తాన్‌కు తమ మద్దతు ఉంటుందన్నారు. ఉగ్రవాద సంస్థలతో పాక్ భారత్‌లకే కాదని అమెరికా, రష్యాలకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని జాన్ కెర్రీ అన్నారు. తాలిబన్లు, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలతో ముప్పు ఉందని ఆయన పేర్కొన్నారు. -
ఘనంగా దీపావళి
అమెరికా విదేశాంగ శాఖలో తొలిసారిగా వేడుకలు న్యూఢిల్లీ/వాషింగ్టన్: దీపాల పండుగ దీపావళిని గురువారం దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. పాక్, బ్రిటన్ తదితర విదేశాల్లోని హిందువులు, సిక్కులు తదితర భారత సంతతి ప్రజలూ వేడుకలు చేసుకున్నారు. దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా శుభాకాంక్షలు తెలిపారు. 2009లో వైట్‌హౌస్‌లో దీపావళిని తొలిసారి నిర్వహించినందుకు తనకు గర్వంగా ఉందన్నారు. గురువారం అమెరికా విదేశాంగ శాఖ కార్యాలయంలోని చారిత్రక బెంజమిన్ ఫ్రాంక్లిన్ గదిలో ఆ శాఖ మంత్రి జాన్ కెర్రీ తొలిసారి దీపావళి వేడుకలు నిర్వహించారు. వేద మంత్రాల మధ్య సంప్రదాయబద్ధంగా సాగిన ఈ కార్యక్రమంలో ఆయన దీపం వెలిగించారు. భారత్ అమిత శక్తిసామర్థ్యాలున్న దేశమని కొనియాడారు. కాగా, సరిహద్దులో పాక్ కాల్పుల నేపథ్యంలో ద్వైపాక్షిక సంబంధాలు సరిగ్గా లేకున్నా పాకిస్థాన్, దీపావళిని పురస్కరించుకుని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీలకు స్వీట్లు పంపింది. -
ఎబోలాపై తాజా యుద్ధం
మరో రెండునెలల్లోపు ఎబోలా వైరస్‌ను నిర్మూ లించలేకపోతే మన తరంలోనే అతి పెద్ద మానవ విపత్తును ఎదుర్కోవలసి ఉంటుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. పశ్చిమాఫ్రికాలో మొదలై ప్రపంచంలోని అనేక దేశాల్లో విస్తరించిన ఎబోలా ఇప్పటికే 4,500 మందిని బలి తీసుకుంది. మానవ శరీరంలోని ద్రవపదార్థాల (రక్తం, వాంతి, విరోచనం,) ద్వారా శరవేగంగా ఇది వ్యాపిస్తోంది. ఈ వ్యాధికి గురైన వారిలో 70 శాతం మంది నిస్సహాయంగా మరణిస్తున్నారు. దీని బారినపడిన గినియా, లైబీరియా, సియర్రా లియోన్ దేశాల్లో వ్యాధి నివారణ కోసం అవసరమైన సైనిక సామగ్రి, ఆర్థిక సహాయం అందకపోతే అంతర్జాతీయ సమాజం తర్వాత వగచీ ప్రయోజనం లేదని అమెరికా, బ్రిటన్లు తాజాగా హెచ్చరించడం ఎబోలా తీవ్రతను సూచిస్తోంది. 60 రోజులలోపు ఎబోలా వైరస్‌ను అదుపు చేయలేకపోతే ఒక ప్పుడు పోలియో, తర్వాత హెచ్ఐవీ మహమ్మారిలా పరిస్థితి పూర్తిగా అదుపు తప్పుతుందని అమెరికా స్టేట్ సెక్రటరీ జాన్ కెర్రీ శనివారం హెచ్చరించారు. పశ్చిమాఫ్రికాలో ఎబోలా వైరస్ బయటపడిన తొలి దశ లో దాంతో సరిగా వ్యవహరిం చలేకపోయామని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంగీకరించిన నేపథ్యంలో ఆ ప్రాంతంపై దశాబ్దాలుగా ప్రభావం చలాయిస్తున్న పాశ్చాత్య దేశాల్లో కలవరం మొదలైంది. ఎబోలా వైరస్ అదుపు వాటి సామూహిక బాధ్యతగా మారుతోంది. పశ్చిమాఫ్రికాకు పరిమితం కాకుండా విస్తరిస్తున్న ఎబోలా బారిన తాను కూడా చిక్కుకోకతప్పదని పాశ్చాత్య ప్రపంచం వేగంగానే గుర్తించింది. సరిగ్గా తుపాను కేంద్రం (కన్ను)లో పోయి పడ్డామనీ, ఎబోలా వ్యాప్తిని ఊరకే చూస్తూ చేష్టలుడిగే దశకు మనం చేరుకోకూడదనీ, పరిస్థితి విషమం కాకముందే ఉమ్మడి లక్ష్యంతో దాన్ని అరికట్టేందుకు ప్రయత్నాలు చేయాలని పశ్చిమా ఫ్రికాలో ఎబోలా రోగులకు వైద్య సేవలందిస్తున్న ఆక్స్ ఫామ్ చారిటీ సంస్థ పేర్కొంది. వైరస్ విస్తరించిన మూడు దేశాలకు సైనిక దళాలను, వైద్యులను పంపించి, తగినన్ని నిధులు కేటాయించడంలో వెనుకబడితే యావత్ యూరప్, అమెరికా ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని సంస్థ సీఈఓ మార్క్ గోల్డ్ రింగ్ తీవ్రంగా హెచ్చరించారు. ఎబోలా వ్యాధి అదుపుకోసం సమాజం కనీవినీ ఎరుగని రీతిలో సత్వరమే స్పందించాలన్న ఆక్స్ ఫామ్ హెచ్చరిక తనదైన ప్రభావం చూపుతోంది. అమెరికా ఇప్పటికే భారీమొత్తాన్ని ఎబోలా అదుపునకు కేటాయించగా ఇంగ్లండ్ ఇటీవలే 125 మిలియన్ పౌండ్ల సహాయం ప్రకటించింది. మరో బిలియన్ డాలర్లను సహాయం అందించడానికి ఈయూ త్వరలో సమావేశం కానుంది. పశ్చిమాఫిక్రాలోని ఎబోలా చికిత్సా కేంద్రాలలో పనిచేసేందుకు పెద్ద సంఖ్యలో డాక్టర్లు, నర్సులు అవసరం. పైగా వైద్యుల మోహరింపునకు, వైద్య సామగ్రి తరలింపునకు పెద్ద ఎత్తున సైనిక దళాల అవసరం ఏర్పడింది. ఆ ప్రాంతంలో వ్యాధి నివారణలో మునిగి ఉన్న ఆక్స్‌ఫామ్ వంటి సంస్థలు ప్రధానంగా స్వచ్ఛ జలం, పారిశుధ్యం, ప్రజలను జాగరూకులను చేయడంపై దృష్టి పెడుతు న్నాయి. చికిత్స ఎంత అవసరమో ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టడం అంత అవస రం. దీనికి నిధులు పెద్ద ఎత్తున అవసరం. ఈ తరంలోనే అతి పెద్ద విపత్తు చెలరేగుతున్నా దాంతో వ్యవహరించేందుకు ప్రపంచం ఇప్పటికీ పెద్దగా సిద్ధపడలేదని విమర్శ. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమెరికా 4,000 మం దిని, బ్రిటన్ 750 మంది బలగాలను పంపించాయి. ఈయూ నుంచి మరో 2 వేల మంది వైద్య సిబ్బందిని పంపించాలని బ్రిటన్ ప్రధాని ఈయూను కోరను న్నారు. సిబ్బందిని, సహాయ సామగ్రిని శరవేగంగా పంపించడం ద్వారానే పశ్చిమాఫిక్రాలో ఎబోలాను అరికట్టవచ్చు. ప్రతి 20 రోజులకు ఎబోలా కేసులు రెట్టింపు స్థాయిలో నమోదవుతున్నాయి. డిసెంబర్ నాటికి కొత్తగా 10 వేల కేసులు నమోదు కానున్నాయి. గణాంకాలకు సంబంధించిన ఈ భయ విహ్వల నేపథ్యం పాశ్చాత్యదేశాలను తీవ్రంగా వణికిస్తోంది. ఎబోలాపై సామూహిక బాధ్యతను ఈ క్షణం చేపట్టకపోతే పశ్చిమాఫ్రికా ప్రాంత రాజకీయ, ఆర్థిక, సామాజిక చట్రం కుప్పకూలుతుంది. అక్కడి నుంచి వ్యాపించే వ్యాధి ప్రభావం తమ పౌరులను కూడా వదిలిపెట్టదని పాశ్చాత్య సమాజం భీతిల్లుతోంది. -
మోడీ కోసం ఒబామా ఎదురుచూపు!
ప్రధానితో భేటీలో అమెరికా మంత్రుల వెల్లడి ప్రపంచ సవాళ్ల పరిష్కారమే తమ ధ్యేయం అన్న మోడీ న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో వచ్చే సెప్టెంబర్‌లో జరగనున్న శిఖరాగ్ర సమావేశంకోసం ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఎదురుచూస్తున్నారని, ద్వైపాక్షిక సంబంధాలను కొత్త పంథాలో సాగించేందుకు బృహత్తరమైన ఎజెండాతో సిద్ధపడుతున్నారని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ, వాణిజ్య శాఖ మంత్రి పెన్నీ ప్రిజ్ట్కర్ చెప్పారు. ఢిల్లీలో ప్రధాని మోడీతో శుక్రవారం గంటసేపు జరిపిన సమావేశంలో వారీ విషయం చెప్పారు. కాగా, ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టపడేలా, ఈ సమావేశం ద్వారా నిర్దిష్ట ప్రయోజనాలు సాధించేందుకు ఉభయదేశాలు సిద్ధపడాలని మోడీ సూచించారు. దార్శనికత, వ్యూహం, కార్యాచరణ ప్రణాళిక ప్రాతిపదికలుగా ఈ విషయంలో ముందుకు సాగాలని మోడీ సూచించారు. గురువారం భారత్, అమెరికాల మధ్య జరిగిన వ్యూహాత్మక చర్చల వివరాలను కూడా అమెరికా ఇద్దరు మంత్రులు మోడీకి వివరించారు. భారత్‌తో ద్వైపాక్షిక సహకారానికి, అంతర్జాతీయ అంశాల్లో భారత్‌తో భాగస్వామ్యానికి ఒబామా పూర్తి ప్రాధాన్యం ఇస్తున్నట్టు వారు చెప్పారు. సెప్టెంబర్‌లో మోడీతో జరగబోయే భేటీనుంచి పూర్తిస్థాయి ఫలితాలను ఒబామా ఆశిస్తున్నట్టు వారు చెప్పారు. మోడీతో అమెరికా మంత్రులు జరిపిన సమావేశం వివరాలను ప్రధాని కార్యాలయం (పీఎంఓ) ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచ సవాళ్ల పరిష్కారం, శాంతి స్థిరత్వాలకు ప్రోత్సాహం వంటి లక్ష్యాల సాధనకు భారత్, అమెరికాలు భాగస్వామ్యంతో కలసి పనిచేయాలని మోడీ సూచించారు. వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, నైపుణ్యాల అభివృద్ధి, ఆగ్రో ప్రాసెసింగ్, యువతకు ఉపాధి తదితర అంశాల్లో ఉభయదేశాల భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని కూడా మోడీ కోరారు. ఆసియా పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతంలో భారత్ పాత్రను కూడా మోడీ ప్రస్తావించారు. వైట్‌హౌస్ ప్రకటన: భారత్‌తో పటిష్టమైన సంబంధాలకు అధిక ప్రాధాన్యత ఉందని ఒబామా గుర్తించినట్టు అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ ప్రకటించింది. ఉభయదేశాల సంబంధాలు బహుముఖమైనవిగా ఉండాలని, జాతీయ భద్రతా సంబంధాలుగా కొనసాగాలని ఒబామా అభిలషిస్తున్నట్టు కూడా వైట్‌హౌస్ పేర్కొంది. ‘వాణిజ్య చర్చల వైఫల్యానికి కారణం భారత్’ వాషింగ్టన్ : వాణిజ్య సౌలభ్య ఒప్పందం (టీఎఫ్ఏ)పై జరిగిన చర్చల వైఫల్యానికి భారత్ కారణమని, భారత్ పిడివాద వైఖరివల్ల ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటీఓ) భవితవ్యమే అనిశ్చితంగా మారుతోందని అమెరికా ఆరోపించింది. వాణిజ్య సౌలభ్య ఒప్పందం అమలుకు కట్టుబడరాదని భారత్ సహా డబ్ల్యుటీఓలోని కొన్ని సభ్యదేశాలు నిర్ణయం తీసుకున్నాయని, ఈ వైఖరి ఆందోళకరమని అమెరికా ఒక ప్రకనటలో విమర్శించింది . అయితే, వాణిజ్య సౌలభ్య ఒప్పందానికి తాము కట్టుబడి ఉన్నామని, అయితే, ఆ ఒప్పందానికి ముందు ఆహార భద్రతాపరమైన సమస్యలకు శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం లభించేవరకూ తమ ప్రతిపాదనలపై అంగీకారంకోసం కృషిచేస్తామని భారత్ పేర్కొంది. డబ్ల్యుటీఓకు నెలరోజులపాటు విరామం కాబట్టి, సమస్య పరిష్కారానికి తదుపరి చర్యలపై భారత్ దృష్టిని కేంద్రీకరిస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజీవ్ ఖేర్ ఢిల్లీలో వ్యాఖ్యానించారు. కాగా, ఆహార నిల్వల సమస్యకు ఒక పరిష్కారం లభించేవరకూ టీఎఫ్‌ఏపై ఒప్పందాన్ని ఆమోదించరాదన్నది భారత్ వాదనగా ఉందని, ఆహార భద్రతా ప్రయోజనాలకోసం దృష్టిలో పెట్టుకునే భారత్ ఈ వైఖరి కనబరుస్తోందని అమెరికా వాణిజ్య ప్రతినిధి మైక్ ఫ్రోమాన్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. డబ్ల్యుటీఓలో రూపుదిద్దుకున్న బహుళదేశీయ వాణిజ్య వ్యవస్థకు అమెరికా పూర్తిగా కట్టుబడి ఉందని, అయితే, అంగీకారం కుదిరిన ఒప్పందం అమలుకావాలంటే డబ్ల్యుటీఓలోని సభ్యదేశాల ఆమోదం అవసరమని ఫ్రోమాన్ పేర్కొన్నారు. వాణిజ్య సౌలభ్య ఒప్పందం చర్చల వైఫల్యంపట్ల ఆయన తీవ్ర ఆసంతృప్తి వ్యక్తంచేశారు. తాజా పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై తమ వాణిజ్య భాగస్వామ్యదేశాలతో కలసి చర్చిస్తామన్నారు. -
భారత్‌పై ఎలాంటి నిఘాను ఒప్పుకోం:సుష్మా
-
భారత్‌పై ఎలాంటి నిఘాను ఒప్పుకోం
న్యూఢిల్లీ: భారత్‌లో రాజకీయ నేతలపైన, ఇతర సంస్థలపైన ఎలాంటి నిఘా అయినా తమకు ఆమోదయోగ్యం కాదని ప్రభుత్వం గురువారం అమెరికాకు నిర్మొహమాటంగా తేల్చిచెప్పింది. కాగా, ఎలాంటి విభేదాలున్నా పరిష్కరించుకోవచ్చని అమెరికా ప్రతిస్పందించింది. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో, అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఢిల్లీలో దాదాపు గంటసేపు జరిగిన వ్యూహాత్మక చర్చల్లో ఈ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఉభయ నేతలమధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో అమెరికా నిఘా వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా అమెరికాతో ఈ అధికారిక చర్చలు జరిగాయి. వాణిజ్యం, రక్షణ, ఇంధనం తదితర కీలక అంశాలు ఈ చర్చల్లో విస్తృతంగా ప్రస్తావనకు వచ్చాయి. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో సుష్మా స్వరాజ్‌తోపాటు, జాన్ కెర్రీ మాట్లాడారు. బీజేపీ నేతల కార్యకలాపాలపై అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఏ) నిఘా పెట్టిన ట్టు వచ్చిన వార్తలను కెర్రీతో ప్రస్తావించానని సుష్మా చెప్పారు. ఉభయదేశాలు తమను పరస్పరం మిత్రదేశాలుగా పరిగణించుకోవాలని, ఒక మిత్రదేశం మరో మిత్రదేశంపై నిఘాపెట్టడం ఏ మాత్రం ఆమోద యోగ్యం కాదని తాను స్పష్టంచేశానని సుష్మా స్వరాజ్ చెప్పారు. అయితే అమెరికా నిఘా వ్యవహారాన్ని కెర్రీ సమర్థిస్తున్న ధోరణిలో మాట్లాడారు. భారత్‌తో సంబంధాలను విలువైన విగా పరిగణిస్తామని, ఉమ్మడి సమస్యలను రెండు దేశాల నిఘా విభాగాల సహాయంతో పరిష్కరించుకుంటామన్నారు. మోడీకి ఘనస్వాగతం పలుకుతాం: కెర్రీ వచ్చే సెప్టెంబర్‌లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబాతో వాషింగ్టన్లో ప్రధాని మోడీ జరపబోయే సమావేశం కోసం తాము ఎదురుచూస్తున్నామని ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో కెర్రీ చెప్పారు. గుజరాత్ అల్లర్ల అనంతరం, 2005లో నరేంద్ర మోడీకి అప్పటి ప్రభుత్వం వీసా నిరాకరించారని, ఇప్పుడు తాము మోడీకి ఘన స్వాగతం పలుకుతామన్నారు. అణు సరఫరా గ్రూప్‌లో చోటు, భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం అంశాలపై భారత్‌కు పూర్తి మద్దతు ఇస్తున్నామన్నారు. అంతకుముందు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్‌దోవల్‌తో కెర్రీ సమావేశమయ్యారు. జెనీవాలో జరిగే ప్రపంచ వాణిజ్య ఒప్పందం చర్చల లపై భారత్ వైఖరిని ఆయన ప్రస్తావించారు. వాణిజ్యమనేది ఆహార భధ్రతతో ముడిపడి ఉండాలన్న తన వైఖరిని భారత్ పునరుద్ధాటించింది. గతేడాది బాలిలో జరిగిన డబ్ల్యుటీవో ఒప్పందాన్ని ఆమోదించేది లేదని భారత్ లోగడే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా, దక్షిణ ఢిల్లీలోని ఐఐటీని కెర్రీ సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ముంబై దాడుల కుట్రదారులను చట్టానికి పట్టించాలి 2008లో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడులకు సంబంధించిన కుట్రదారులను చట్టానికి అప్పగించే దిశగా పాకిస్థాన్ చర్యలు తీసుకోవాలని భారత్, అమెరికా గురువారం డిమాండ్ చేశాయి. ఉగ్రవాద స్థావరాలను నిర్మూలించడానికి, లష్కరే తోయిబా, అల్ కాయిదా వంటి ఉగ్రవాద సంస్థలను విచ్ఛిన్నం చేయడానికి గట్టిగా కృషిచేయాలని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీల మధ్య చర్చల అనంతరం ఉభయ నేతలు ఈ మేరకు ఒక ఉమ్మడి ప్రకటనను వెలువరించారు. -
నరేంద్ర మోడీకి యుఎస్ ప్రశంసలు
వాషింగ్టన్: అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రణాళిక ఆయన ఎన్నికల నినాదంలోనే ప్రతిఫలించిందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ అన్నారు. ’అందరితో కలసి, అందరి అభివృద్ధి కోసం’ (సబ్కా సాత్, సబ్కా వికాస్) అన్న నినాదం ఎంతో దార్శనికతతో కూడుకున్నదని ఆయన ప్రశంసించారు. మంగళవారం భారత్ పర్యటనకు బయలుదేరుతున్న సందర్భంగా జాన్ కెర్రీ వాషింగ్టన్లో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, అమెరికా దేశాల మధ్య జరగనున్న ఐదవ వార్షిక వ్యూహాత్మక చర్చలకు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో కలసి ఆయన అధ్యక్షత వహించనున్నారు. భారత పర్యటనకు కెర్రీ బయలుదేరే సమయంలో నరేంద్ర మోడీ అభివృద్ధి అజెండాపై ప్రశంసల వర్షం కురిపించారు. భారత్‌లో మోడీ నేతత్వంలోని కొత్త ప్రభుత్వం కృషిలో భాగస్వామి అయ్యేందుకు అమెరికా సంసిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. మోడీ ప్రభుత్వ అభివృద్ధి నినాదానికి తాము మద్దతు ఇస్తున్నామన్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవంలో అమెరికా ప్రైవేటు రంగం ప్రోత్సాహకారిగా పనిచేస్తుందని చెప్పారు. అమెరికన్ ప్రోగ్రెస్ సెంటర్ ఆధ్వర్యంలో వాషింగ్టన్లో జరిగిన కార్యక్రమంలో కెర్రీ ప్రసంగిస్తూ, వస్తుతయారీ, మౌలిక సదుపాయాలు, ఆరోగ్య రక్షణ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర రంగాల్లో భారత్ అభివృద్ధి కోసం అమెరికా కంపెనీలు సహకరిస్తాయన్నారు. పొరుగు దేశాలతో సంబంధాల మెరుగుదల కోసం నరేంద్ర మోడీ తీసుకున్న చర్యలపై కూడా కెర్రీ ప్రశంసలు కురిపించారు. ప్రధానమంత్రిగా తన ప్రమాణ స్వీకారోత్సవానికి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను పిలవడం, ఉభయదేశాల మధ్య సంబంధాల మెరుగుపరిచే దిశగా మోడీ చేపట్టిన మొదటి చర్యగా అభివర్ణించారు. ఉభయదేశాల శ్రేయస్సు, సుస్థిరత కోసం భారత్, పాకిస్థాన్ కలసి పనిచేసేలా అమెరికా అన్నివిధాలా సహాయం అందిస్తుందని కెర్రీ చెప్పారు. -
'ఎంత ఘోరం... మాటలు కూడా రావడం లేదు'
వాషింగ్టన్: మలేసియా ఎయిర్ లైన్స్ విమానాన్ని కూల్చివేత ఘటనపై దర్యాప్తులో సహాయం అందించేందుకు అమెరికా ముందుకు వచ్చింది. విమానం పేల్చివేతపై అంతర్జాతీయ దర్యాప్తులో సహాయం చేసేందుకు సిద్దమని అమెరికా అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ప్రకటించారు. ఎంహెచ్ 17 విమాన పేల్చివేతను అత్యంత ఘోరమైన ఘటనగా ఆయన వర్ణించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపేందుకు కూడా మాటలు రావడం లేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో మలేసియా, నెదర్లాండ్స్ ప్రభుత్వాలకు సానుభూతితో కూడిన సహాయం చేస్తామని జాన్ కెర్రీ తెలిపారు. మృతుల కుటుంబాలకు కూడా సహాయం అందించేందుకు సిద్దమని ప్రకటించారు. -
జీహాదీలకు సహకరించొద్దు!
బాగ్దాద్/న్యూఢిల్లీ: ఇరాక్‌లో అంతర్యుద్ధానికి కారణమైన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్(ఐఎస్ఐఎల్) లాంటి సంస్థలకు ఆర్థికసాయం చేస్తున్న దేశాలు.. చివరకు అదే ప్రమాదాన్ని ఎదుర్కోక తప్పదని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ వ్యాఖ్యానించారు. ఇరాక్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ముందుకురావాలని గల్ఫ్ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఇరాక్ వెళ్లిన కెర్రీ సోమవారం ప్రధానమంత్రి నౌరి అల్ మాలికి సహా పలువురు కీలక రాజకీయ, మత నేతలతో చర్చలు జరిపారు. తిరుగుబాటును అణచేందుకు ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని వారికి సూచించారు. కెర్రీ ఇరాక్ వెళ్లిన రోజే.. హషిమియా పట్టణంలో ఖైదీలను తీసుకువెళ్తున్న భద్రతాబలగాలపై మిలిటెంట్లు చేసిన దాడిలో 69 మంది ఖైదీలు, 9 మంది పోలీసులు మరణించారు. తిరుగుబాటుదారుల చేతికి తల్ అఫార్ ఇరాక్‌లో సున్నీ తిరుగుబాటుదారుల ఆధిపత్యం కొనసాగుతోంది. తాజాగా షియాలు అధికంగా ఉన్న వ్యూహాత్మక పట్టణం తల్ అఫార్ను, అక్కడి విమానాశ్రయాన్ని కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. హోరాహోరీ పోరు అనంతరం ఇరాక్ భద్రతాబలగాలు ఆ పట్టణం నుంచి వెనక్కుతగ్గాయి. దీంతో సిరియా సరిహద్దు ప్రాంతాలన్నీ ప్రభుత్వ నియంత్రణలో లేకుండాపోయాయి. ఇరాక్, సిరియాలను కలిపి ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాగా మార్చాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న సున్నీ జీహాదీలు ఇప్పటివరకు ఇరాక్‌లోని ఐదు రాష్ట్రాల్లోని అత్యధిక ప్రాంతాలపై అదుపు సాధించారు. కాగా, నజాఫ్‌లో ఓ కంపెనీలో పనిచేస్తున్న ఒక భారతీయుడు గుండెపోటుతో మరణించాడని వార్తలు వచ్చాయని, అందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని భారత ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. మోసుల్‌లో కిడ్నాప్‌నకు గురైన 39 మంది భారతీయులను విడిపించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపింది. భారతీయులు ఉద్యోగాలు చేస్తున్న 12 కంపెనీలతో ఇరాక్‌లోని దౌత్యాధికారులు సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొంది. -
పలుకే బంగారం!
హిల్లరీ క్లింటన్... పరిచయం అక్కర్లేని పేరు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్ భార్యగా, అమెరికా అధ్యక్ష పీఠం కోసం పోటీపడిన సెనెటర్‌గా గుర్తింపు ఉన్న హిల్లరీకి యునెటైడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ పదవీకాలం పూర్తయింది. ఇప్పుడు ఆ పదవిలోకి జాన్ కెర్రీ వచ్చారు. అప్పటి నుంచి హిల్లరీ ఏం చేస్తున్నారు? పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. ప్రస్తుతం హిల్లరీ సోషియో ఆంత్రొపాలజిస్ట్గా పేరు తెచ్చుకొన్నారు. ఎన్నో పదవులను సమర్థంగా నిర్వహించిన అనుభవంతో హిల్లరీ క్లింటన్ గొప్ప వక్తగా మారారు. నిర్వాహకులు అత్యధిక పారితోషికం ఇచ్చి మరీ ఆమెను సమావేశాలకు ఆహ్వానిస్తున్నారు. న్యూయార్క్‌టైమ్స్ పత్రిక కథనం ప్రకారం ప్రస్తుతం హిల్లరీ ఒక్కో ప్రసంగానికి రెండు లక్షల డాలర్లు తీసుకుంటున్నారు. వైట్‌హౌస్ నుంచి బయటకు వచ్చిన ఫస్ట్ లేడీస్‌లో ఎవరికీ ఈ స్థాయి డిమాండ్ లేదని న్యూయార్క్‌టైమ్స్ పత్రిక పేర్కొంది. అమెరికాతో పాటు కెనడా, కొన్ని యూరోపియన్ దేశాల నుంచి హిల్లరీకి ‘ప్రత్యేక అతిథి’ గా ఆహ్వానాలు వస్తున్నాయి. అందుకోసం హిల్లరీకి ప్రైవేట్ విమానాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. వ్యవస్థీకృత అంశాల గురించి విశ్లేషణాత్మకంగా ప్రసంగిస్తున్న హిల్లరీ, మంచి డిప్లొమాట్‌గా పేరు తెచ్చుకొన్నారు. తన అనుభవాల ను ప్రస్తావిస్తూ, ‘లీడర్ షిప్ ఈజ్ ఏ టీమ్ స్పోర్ట్’, ‘యూ కెన్ విన్’, ‘విష్పర్ కెన్ బీ లౌడర్ దేన్ షౌట్’ అంటూ ఒక వ్యక్తిత్వవికాస నిపుణురాలిలా మాట్లాడుతున్నారామె. సాధారణంగా అమెరికా అధ్యక్షపీఠం నుంచి వైదొలగి, వైట్ హౌస్ నుంచి బయటకు వచ్చిన మాజీ ప్రెసిడెంట్ల ప్రసంగాలకు, వాళ్లు రాసే పుస్తకాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. హిల్లరీ భర్త బిల్ క్లింటన్‌కు కూడా అలాంటి డిమాండే ఉంది. మిస్టర్ క్లింటన్ ప్రసంగాల ద్వారానే ఏడాదికి దాదాపు కోటిన్నర డాలర్ల డబ్బును సంపాదిస్తున్నారు. మిసెస్ క్లింటన్ ఈ విషయంలో ఆయనకు పోటీనిస్తోంది. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో అమెరికన్ అధ్యక్ష పీఠం కోసం ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే మరోసారి క్లింటన్ ఫ్యామిలీ వైట్‌హౌస్‌లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. అదే జరిగితే హిల్లరీ గిరాకీ డబులవదూ! -
ఏదీ అఫ్ఘాన్ శాంతి తీరం?
‘శాంతి చర్చల’ ప్రహసనానికి తెరదించిన అమెరికా... అధ్యక్ష ఎన్నికల కోసం ఎదురు చూస్తోంది. కొత్త అధ్యక్షుడైనా తమ మాట వింటాడని దాని ఆశ. ఆలూ లేదూ చూలూ లేదూ... అంటారే సరిగ్గా అలా ఉంది అఫ్ఘానిస్థాన్ అధ్యక్ష ఎన్నికల సంరంభం. సెప్టెంబర్ 18-అక్టోబర్ 6 మధ్య నామినేషన్లకు గడువు ముగిసిపోవడమే కాదు, అర్హులుగా బరిలో నిలిచిన వారి జాబితా కూడా ఖరారైంది. యుద్ధ ప్రభువులు, మాజీ మంత్రులుసహా అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ సోదరుడు ఖయూం కర్జాయ్ కూడా పోటీపడుతున్న పది మందిలో ఉన్నారు. ఇంతకూ వచ్చే ఏడాది ఏప్రిల్ 5న జరగాల్సిన ఎన్నికలు అసలు జరుగుతాయా? ఎన్నికలను జరగనిచ్చేది లేదని తాలిబన్ల అధినేత ముల్లా మొహ్మద్ ఒమర్ సోమవారం హెచ్చరించారు. తాలిబన్లే కాదు ఏ మిలిటెంటు గ్రూపూ పాల్గొనని ఈ ఎన్నికల ప్రహసం జరిగినా... వచ్చే ఏడాది చివరికి అమెరికా సహా నాటో బలగాలన్నీ నిష్ర్కమించిన తదుపరి తాలిబన్లను ఎదుర్కొని కొత్త ప్రభుత్వం నిలవగలదా? 2014 తర్వాత ‘శిక్షణ అవసరాల కోసం’ అమెరికా సేనలను నిలిపి ఉంచడానికి అవకాశం కల్పించే ‘అమెరికా-అఫ్ఘాన్ ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాన్ని’ కుదుర్చుకోవాలని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఇటీవల అఫ్ఘాన్‌కు వెళ్లారు. అక్టోబర్ 11-12 తేదీల్లో ఆయన కర్జాయ్‌తో చర్చలు జరిపారు. ప్రధానాంశాలన్నిటిపైన ‘అంగీకారం’ కుదిరిందని కెర్రీ ప్రకటించారు. ఏ అంశాలపై అంగీకారం కుదిరిందో, ఆ ఒప్పందంలో అసలు ఏముందో వెల్లడించ లేదు. కెర్రీ దౌత్య విజయం ఎంతటి ఘనమైనదో... పత్రికా సమావేశంలో సైతం కాసింత నవ్వును పులుముకోలేకపోయిన ఆ ఇద్దరి మొహాలే వెల్లడించాయి. అవినీతిపరుడు, నమ్మరానివాడు అయిన కర్జాయ్ మొండి పట్టు వల్లనే చర్చలు విఫలమయ్యాయనేది అమెరికా ప్రభుత్వ అనధికారిక కథనం. కర్జాయ్ ‘మొండి పట్టు’ దేనిపైన? 2014 తర్వాత అఫ్ఘాన్‌లో ఉంచే అమెరికా సేనలకు అఫ్ఘాన్ చట్టాలు వర్తించకుండా ‘రక్షణ’ కల్పించడంపైన. ఆ రక్షణ లేనిదే తమ సేనలను నిలపడం అసాధ్యమని అమెరికా అంటోంది. అమెరికా తయారు చేసిన అఫ్ఘాన్ భద్రతా బలగాల ఉన్నత సైనికాధికారుల మండలి సైతం అధ్యక్షుని మొండి పట్టు వల్లనే ఒప్పందం కుదరలేదని అంటోంది. అమెరికా అండ లేకుంటే ఇరాన్, పాకిస్థాన్‌ల నుంచి ‘జాతీయ భద్రత’కు ముప్పు తప్పదని వారి వాదన. లేని విదేశీ ముప్పును చూడగలుగుతున్న సైనికాధికార మండలికి ఉన్న అసలు ముప్పు కనిపించకపోవడంలో ఆశ్చర్యం లేదు. 2001లో అమెరికా దురాక్రమణతో అధికారం కోల్పోయిన నాటి కంటే నేడు తాలిబన్ల బలం అనేక రెట్లు పెరిగిందని, వారి ప్రాబల్యం దేశమంతటికీ విస్తరించిందని అంతా అంగీకరించేదే. ఏడాదికి 50 వేల మంది సైనికులు పారిపోయే సైన్యంపై ఆధారపడి ఏ ప్రభుత్వానికైనా, అసలు తమకే అయినా ముప్పు తప్పదనేదే వారి నిజమైన ఆందోళన. సైన్యం నుంచి పారిపోతున్న వారిలో చాలామంది తాలిబన్లలో చేరుతున్నారనేది వేరే సంగతి. కర్జాయ్ అవినీతిపరుడు నిజమేగానీ అఫ్ఘాన్‌ను అవినీతిమయం చేసిన ఖ్యాతి అమెరికాదే. కర్జాయ్‌కి అది డబ్బు సంచులను చేరవేస్తున్న విషయం కూడా రచ్చకెక్కింది. ఎంత డబ్బు పోసినా కర్జాయ్‌ని పూర్తిగా కొనేయలేకపోయామనేదే అమెరికా బాధ. అమెరికా సేనలకు ‘రక్షణ’ అఫ్ఘాన్ ప్రభుత్వ అధికారాల పరిధిలోనిది కాదని, వచ్చే నెల్లో జరుగనున్న తెగల పెద్దల మండలి సమావేశం... ‘లోయా జిర్గా’ మాత్రమే ఆ సమస్యపై నిర్ణయం తీసుకోగలదని కర్జాయ్ వాదన. ఆయన మొండితనం ఏదన్నా ఉందంటే అది అమెరికా చెప్పినట్టు వినకపోవడమే. కర్జాయ్‌తో గత ఏడాది కుదుర్చుకున్న ‘వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని’ నేడు గౌరవించని అమెరికాను కర్జాయ్ ఎందుకు నమ్మాలి? ఆ ఒప్పందం ప్రకారం తమ సైనిక నిర్బంధ కేంద్రాల్లో ఉన్న బందీలనందరినీ వెంటనే అఫ్ఘాన్ దళాలకు బదలాయించాల్సి ఉన్నా అమెరికా ససేమిరా అంటోంది. అమెరికాతో కుదుర్చుకునే ఎలాంటి ఒప్పందాన్నీ అంగీరించేది లేదని కెర్రీ పర్యటనకు ముందే ముల్లా ఒమర్ ప్రకటించారు. అఫ్ఘాన్ అధ్యక్షునితో సైతం సంబంధం లేకుండా తాలిబన్లతో చర్చల కోసం నానా పాట్లూ పడ్డ బరాక్ ఒబామా ప్రభుత్వమే వారితో సయోధ్య కోసం కర్జాయ్ స్వయంగా చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం కలిగించిం ది. కర్జాయ్ ప్రభుత్వంతో రహస్య దౌత్యం సాగిస్తున్న సీనియర్ తాలిబన్ నేత లతీఫ్ మెహసూద్‌ను అమెరికా అరెస్టు చేసింది. ఘోర పరాజయంతో అఫ్ఘాన్ నుంచి నిష్ర్కమిస్తున్నట్టు అనిపించకుండా పరువు దక్కించుకునేలా ఏదో ఒక ఒప్పందం కోసం, తమ సేనలను నిలిపి ఉంచే అవకాశం కోసం అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవంక రష్యా 2014 తదుపరి అఫ్ఘాన్ నుంచి తమ దేశానికి విస్తరించనున్న జిహాదీ ముప్పును ఎదుర్కోడానికి సిద్ధమౌతోంది. అఫ్ఘాన్‌కు పొరుగు నున్న తజకిస్థాన్‌తో ఇటీవలే అది 40 ఏళ్ల పాటూ ఆ దేశంలో తమ సేనలను నిలిపి ఉంచడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అఫ్ఘాన్ ‘శాంతి చర్చల’ ప్రహసనానికి తెరదించిన అమెరికా... అధ్యక్ష ఎన్నికల ప్రహసనం కోసం ఎదురు చూస్తున్నట్టుంది. కర్జాయ్ తదుపరి అధ్యక్షుడైనా అమెరికా మాట వింటాడని దాని ఆశ. తాలిబన్లు ఈ క్రీడను చూస్తూ ఉంటార నే భ్రమ. - పిళ్లా వెంకటేశ్వరరావు -
'షట్‌డౌన్'కు ముగింపు పలకండి: జాన్ కెర్రీ
వాషింగ్టన్: అమెరికా వార్షిక బడ్జెట్ ఆమోదించడంలో ప్రతిష్టంభన ఏర్పడడంతో మొదలైన షట్డౌన్కు ముగింపు పలకాలని చట్టసభ(కాంగ్రెస్)ను విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ కోరారు. 'ఒబామా కేర్' పథకం విషయంలో తలెత్తిన అనిశ్చితి త్వరలోనే తొలగిపోతుందని అంతర్జాతీయ సమాజానికి ఆయన హామీయిచ్చారు. చట్టసభలో చిన్నవర్గం కారణంగా తలెత్తిన ఈ ప్రతిష్టంభనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు డెమోక్రాట్లు సహకరించాలని ఆయన కోరారు. 'మన విభేదాలపై ప్రపంచమంతా దృష్టి సారించింది. ఇటువంటి సమయంలో అమెరికా రాజకీయాల్లో ఎలాంటి తప్పు జరగరాదు' అని జాన్ కెర్రీ వ్యాఖ్యానించారు. కాగా, తన మానసపుత్రిక ‘ఒబామాకేర్’ బీమా బిల్లుపై వెనక్కి తగ్గేది లేదని అధ్యక్షుడు బరాక్ ఒబామా తేల్చిచెప్పారు. ఏ విధమైన మార్పులు, చేర్పులు లేకుండా బిల్లును ఆమోదించాలని ప్రతిపక్షాలకు మరోసారి సూచించారు. ప్రస్తుత షట్‌డౌన్ పరిస్థితి వల్ల రుణాలు చెల్లించకపోతే దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని, అందుకే బడ్జెట్‌ను ఆమోదించి ప్రభుత్వ కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయాలని తన వారాంతపు సందేశంలో ప్రతిపక్షాలను కోరారు. మరోవైపు జీతాలు కోరకుండా పనిచేయాలని ఉద్యోగస్తులకు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యాన్ని చట్టాల చట్రంలో ఎంతోకాలం బంధించలేరని, పుట్టబోయే బిడ్డని ఆపడం వారి వల్ల కాదని చెప్పారు. అయితే ఈ నెల 17 లోపు రుణపరిమితి పెంపుపై అమెరికా చట్టం చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా, షట్‌డౌన్ ముగిసిన తర్వాత సుమారు 8 లక్షల మంది ప్రభుత్వోద్యోగులకు షట్‌డౌన్ కాలానికి జీతాలు చెల్లించేందుకు అమెరికా ప్రతినిధుల సభ అంగీకరించింది. రిపబ్లికన్ల ఆధిక్యం గల ప్రతినిధుల సభ శనివారం ఈ మేరకు ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించింది. -
సిరియాకు తొలగిన యుద్ధ ముప్పు!
ఏడాదిలోగా రసాయన ఆయుధాల నిర్మూలన అమెరికా-రష్యా ఆరు సూత్రాల ఫార్ములా యుద్ధానికి తామింకా సిద్ధమేనన్న ఒబామా మానవత్వంపై నేరాలకు పాల్పడ్డ అసద్ ఐరాస సెక్రెటరీ జనరల్ బాన్ కీ మూన్ ధ్వజం న్యూయార్క్/జెనీవా/వాషింగ్టన్/ఐరాస: సిరియాపై ముసిరిన యుద్ధ మేఘాలు తాత్కాలికంగా పక్కకు తొలగినట్టే కన్పిస్తోంది. సిరియా వద్ద ఉన్న రసాయన ఆయుధాలను 2014 మధ్యకల్లా తొలగిం చడమో, నిర్మూలించడమో చేసే దిశగా అంతర్జాతీయ ఒప్పందం కుదుర్చుకునేందుకు అమెరికా-రష్యా అంగీకరించాయి. ఈ దిశగా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు జాన్ కెర్రీ, సెర్గీ లావ్రోవ్ మూడు రోజులుగా జెనీవాలో జరుపుతున్న చర్చలు శనివారం ఓ కొలిక్కి వచ్చాయి. సిరియా తన వద్ద ఉన్న రసాయన ఆయుధాల పూర్తి జాబితాను వారంలోగా అంతర్జాతీయ సమాజానికి అప్పగించడం, అవి ఉన్న ప్రాంతాలకు తనిఖీదారులకు నిర్నిరోధంగా ప్రవేశం కల్పించడం వంటి ఆరు సూత్రాలతో కూడిన రోడ్ మ్యాప్‌ను రూపొందించనున్నట్టు మంత్రులిద్దరూ సంయుక్త విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అక్టోబర్‌లో సిరియాలో శాంతి సదస్సు జరుగుతుందని ప్రకటించారు. చర్చలు అత్యంత ఫలప్రదమయ్యాయని లావ్రోవ్ అన్నారు. కానీ సిరియాపై యుద్ధానికి దిగే ప్రతిపాదనను తామింకా పక్కన పెట్టలేదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. ‘‘చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు అంతర్జాతీయ సమాజానికి ఒక అవకాశం ఇవ్వదలచాం. దీన్ని కాలయాపన ఎత్తుగడగా మార్చుకునే ప్రయత్నం చేయొద్దు’’ అంటూ సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ను ఆయన హెచ్చరించారు. చర్చలు విఫలమైతే సైనిక చర్యకు దిగేందుకు అమెరికా, అంతర్జాతీయ సమాజం సిద్ధంగా ఉండాలన్నారు. మరోవైపు సిరియాపై సైనిక చర్యకు భారత్ నుంచి సమర్థన లభించడం లేదని అమెరికా అంగీకరించింది. అసద్ మానవత్వంపై క్రూర నేరాలకు పాల్పడ్డారంటూ ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ బాన్ కీ మూన్ ధ్వజమెత్తారు. సిరియా రసాయన ఆయుధాలు వాడిందనేందుకు తిరుగులేని రుజువులను నిపుణుల బృందం వచ్చే వారానికల్లా తనకు అందజేస్తుందని విశ్వాసం వెలిబుచ్చారు. -
నిర్భయ నిందితులకు ఉరిశిక్షను స్వాగతించిన యూఎస్
నిర్భయపై సామూహిక అత్యాచారం కేసులో నలుగురు నిందితులకు న్యూఢిల్లీలోని సత్వర న్యాయస్థానం ఉరిశిక్ష విధించడాన్ని అమెరికా స్వాగతించింది. యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి మెరీ హర్ఫ్ శనివారం వాషింగ్టన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... కోర్టు తీర్పు మానవ మృగాలకు ఓ చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. ఆ తీర్పుతో భారత న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకం మరింత పెరిగిందని ఆమె అన్నారు. భారత్‌లోనే కాకుండే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలపై దాడులు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దాడులను ఆరికట్టేందుకు మరింత కఠినమైన చట్టాలు తేవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాన్ కెర్రీ కూడా నిర్భయ నిందితులకు విధించిన శిక్షను సమర్థించారు. లింగ ఆధారిత హింస అనేది ప్రస్తుత ప్రపంచంలో అంటుజాడ్యంలా విస్తరించిందని అన్నారు. నిర్భయ మృత్యుముఖంలోకి జారుకునే వరకు మృత్యువుతో పోరాడిన ధీరవనిత అని జాన్ కెర్రీ వ్యాఖ్యానించారు. గతేడాది డిసెంబర్ 16న భారత దేశ రాజధాని న్యూఢిల్లీలో ఫార్మసీ విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం నిర్భయతోపాటు ఆమె స్నేహితుడిపై అత్యంత కిరాతకంగా దాడి చేశారు. ఆ ప్రమాదంలో నిర్భయ తీవ్రంగా గాయపడి, న్యూఢిలీ ఆసుపత్రిలో చికిత్స పొందింది. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో మరింత మెరుగైన వైద్యం కోసం భారత ప్రభుత్వం ప్రత్యేక విమానంలో సింగపూర్ తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ గతేడాది డిసెంబర్ 29న మృత్యు ముఖంలోకి జారుకుంది. ఆ క్రమంలో న్యూఢిల్లీతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు పెల్లుబికాయి. దీంతో భారత ప్రభుత్వం నిర్భయ కేసుపై ప్రత్యేక న్యాయ స్థానం ఏర్పాటు చేసింది. ఆ కేసులో ఆరుగురు నిందితుల్లో నలుగురుకి శుక్రవారం ఉరిశిక్ష ఖరారు చేసింది. మరో ఇద్దరు నిందితుల్లో ఒకరు తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకుని మరణించగా,మరోకరు బాలనేరస్థుడుని జువైనెల్ కోర్టు మూడేళ్ల కారగార శిక్ష విధించిన సంగతి తెలిసిందే. -
ఇరాన్‌పై దాడికి ‘సిరియా’నాంది
‘శాంతి’ ఎంత బీభత్సంగా, వికృతంగా విలయ నర్తనం చేయగలదో సిరియాలో గత బుధవారం జరిగిన రసాయనిక ఆయుధ ప్రయోగం కళ్లకు కట్టింది. ఎప్పుడైనా మొద లు కావచ్చనిపించేలా ఉన్న సిరియా దురాక్రమణకు నాంది పాలస్తీనా ‘శాంతి చర్చలు’ కావడం విశేషం. పాలస్తీనా అథారిటీకి ఇస్తున్న 50 కోట్ల డాలర్ల వార్షిక సహాయాన్ని నిలిపేస్తామని బెదిరించి మొహ్మద్ అబ్బాస్‌ను శాంతి చర్చలకు ‘ఒప్పించింది’ అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ. పాలస్తీనాలోకి అక్రమ వలసల విస్తరణను తాత్కాలి కంగా నిలిపివేసేందుకు కుదిరిన ఒప్పం దాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిన కారణంగా ‘శాంతి చర్చలు’ 2010లో నిలిచిపోయాయి. అవి గత నెల 29న తిరిగి మొదలయ్యాయి. ఈ నెల 8న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మరో వెయ్యి అక్రమ కాలనీల నిర్మాణానికి పచ్చ జెండా చూపారు. అందుకే నేటి చర్చలను పాలస్తీనీయులలో అత్యధికులు వ్యతిరేకిస్తున్నారు. ‘ఒకే దేశం (ఇజ్రాయెల్)’ పరిష్కారంతో పాలస్తీనానే లేకుండా చేసి ‘శాశ్వత శాంతి’ని సాధించాలని తపిస్తున్న నెతన్యాహూ ‘శాంతి’ కోసం హఠాత్తుగా తెగ తాపత్రయపడుతున్నారంటే అం దులో నిగూఢార్థం ఏదో ఉండి ఉంటుందనే అర్థం. అది సిరియాపై దురాక్రమణకు రంగం సిద్ధం చేయడమేనని డమాస్కస్ ‘రసాయనిక చేతబడి’ సూచిస్తోంది. సిరియా సమస్యపై ‘నిర్ణయాత్మకం’గా వ్యవహరించడానికి నిర్ణయించిన అమెరికా అందుకు జోర్డాన్ రాజు కింగ్ అబ్దుల్లా మద్దతును కూడగట్టడం కోసమే పాలస్తీనా శాంతి చర్చల ప్రహసనానికి తెరదీసింది. సిరియాకు దక్షిణ, ఆగ్నేయ దిశల్లో విస్తరించిన జోర్డాన్ ఇప్పటికే సిరియా శరణార్థుల సమస్యను ఎదుర్కొంటోంది. ఇజ్రాయెల్‌కు ఈశాన్యంగా ఉన్న జోర్డాన్, సిరియాపై దాడులకు ఆధారం కాగలుగుతుంది. సిరియాకు వాయవ్యంగా ఉన్న టర్కీ, బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని సైనిక చర్యతో కూలదోయాలని చాలా కాలంగా పట్టుబడుతోంది. సిరియాపై ముప్పేట దాడు లకు సన్నాహల్లో భాగంగానే ఇజ్రాయెల్... అసద్‌కు అనుకూలంగా పోరాడుతున్న హిజ బుల్లా బలగాలపై బాంబుల వర్షం కురిపిం చింది. ‘హిజబుల్లా ఉగ్రవాద స్థావరాలపై దాడుల’ పేరిట లెబనాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది. హిజబుల్లా సంస్థ లెబనాన్ దేశ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో భాగస్వామి! లెబ నాన్ సరిహద్దులను తటస్థం చేసి, టర్కీ, జోర్డాన్‌లను కేంద్రాలుగా చేసుకుని సిరి యాపై యుద్ధానికి అమెరికా, ఫ్రాన్స్, బ్రిట న్లు జోరుగా సన్నాహాలు చేస్తున్నాయి. సిరి యాపై దురాక్రమణ మొదలైతే వారికి అదో తాత్కాలిక మజిలీ మాత్రమే. ఇదంతా అమెరికా, ఇజ్రాయెల్‌లకు వ్యతిరేకమైన ఊహాగానమేనని భావించేవారికి ఆదివారం ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక కనువిప్పు. ‘ఐరాస నిపుణులకు అనుమతిపై సుదీర్ఘ వాదోపవాదాల్లో ఇరుక్కోదలుచుకోలేదు. ఎందుకంటే అది అక్కడ విశ్వసనీయమైన నిర్థారణలు చేయలేకపోవచ్చు’ అన్న వైట్‌హౌస్ అధికారుల అభిప్రాయాన్ని అది బట్టబయలు చేసింది. ఒబామా బహిరంగంగానే అసంభవమని చెప్పిన ‘డమాస్కస్ తనిఖీ అనుమతి’ని అసద్ ఎలాంటి వాదోపవాదాలు లేకుండా ఆమోదించారనేది వేరే సంగతి. మార్చిలో అసద్ రసాయనిక ప్రయోగానికి ‘ఇదమిత్థమైన ఆధారాలు’ దొరికాయని ఒబామా చెప్పారు. అప్పుడు కూడా అసద్ తనిఖీకి అంగీకరించారు. అసద్ బల గాలు తిరుగుబాటుదళాలపై నిర్ణయాత్మకం గా పైచేయి సాధించాయని అమెరికా మీడి యా సైతం ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఘోషిస్తోంది. ఈ సానుకూల పరిస్థితుల్లో, ఐరాస నిపుణులు తనిఖీకి వచ్చిన సందర్భాన్ని ఏరి కోరి ఎంచుకొని, అదీ రాజధాని శివార్లలో రసాయనిక ఆయుధ ప్రయోగానికి పాల్పడడానికి అసద్ వెర్రివాడా? ‘అసద్ గెలిచినా లేదా నిలదొక్కుకున్నా ఇరాక్, సిరియా, లెబనాన్‌లపై ఇరాన్ వినూత్నమైన స్థాయిలో గొప్ప ప్రాబల్యాన్ని సంపాదిస్తుంది. ఇజ్రాయెల్ మునుపెన్నడూ ఎరుగనంతటి తీవ్ర ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంపై ఇరాన్ పట్టు మరింతగా బలపడి విస్తరిస్తుంది’ అని ఆదివారం ఆంటోనీ కార్డ్స్మాన్ అమెరికా అసలు సమస్య ఏమిటో విడమరిచారు. ఆం టోనీ సామాన్యుడు కాదు... అమెరికా దురాక్రమణ యుద్ధాలకు గొప్ప వత్తాసుదారైన ‘సెం టర్ ఫర్ స్ట్రేటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్’ నిపుణుడు. అమెరికా ముందున్న సమస్య చిన్నది కాదు... రూఢియైన ప్రపంచ చమురు నిక్షేపాలలో 20 శాతం ఇరాన్, ఇరాక్‌ల చేతుల్లోనూ, 48 శాతం గల్ఫ్‌లోనూ ఉన్నాయి! ‘దుష్టరాజ్యం’ ఇరాన్, దాని మిత్రుడు రష్యాల నుండి ‘ఆత్మరక్షణ’ కోసం యుద్ధానికి దిగక తప్పదు. అందుకే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లు ఐరాస తీర్మానాల గొడవే లేకుండా సిరి యాపై యుద్ధానికి సకల సన్నాహాలు పూర్తి చేశాయి. కాకపోతే ఆశిస్తున్నట్టుగా దీర్ఘకాలిక యుద్ధంలో కూరుకుపోకుండా సిరియా యు ద్ధం నుంచి బయటపడగలమా? రష్యా, చైనా లు ఎలా ప్రతిస్పందిస్తాయి? అని తేల్చుకోలేకనే అమెరికా అధ్యక్షుడు వేచిచూస్తున్నారు. పిళ్లా వెంకటేశ్వరరావు