పారిస్: శుక్రవారం ముగియనున్న పారిస్ పర్యావరణ సదస్సులో సభ్య దేశాల మంత్రుల సమావేశం తర్వాత ‘సంయుక్త ఒప్పందం’పై ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ఒప్పందం ముసాయిదాను 48 పేజీల నుంచి 29 పేజీలకు కుదించి సభ్య దేశాలకు పంపించినట్లు ఫ్రాన్స్ తెలిపింది. మరోవైపు, పేద దేశాలు పర్యావరణ పరిరక్షణ దిశగా చేసే ప్రయత్నాలకు ఇచ్చే నిధులను రెట్టింపు చేస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ప్రకటించారు. అగ్రరాజ్యంగా తమ బాధ్యతను నిర్వర్తిస్తామన్నారు.