ఐఎస్ఐ వ్యవహారంపై అమెరికా నిఘా
వాషింగ్టన్ : పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐకి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలపై అమెరికా పూర్తిగా దృష్టిసారిస్తోంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్టు ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జాన్ కెర్రీ తెలిపారు.
విదేశీ వ్యవహారాల కమిటీ సమావేశంలో కెర్రీ మాట్లాడుతూ... ‘ఉగ్రవాద సంస్థలతో ఐఎస్ఐ సంబంధాలపై దృష్టిసారిస్తున్నాం. వచ్చే వారంలో వాషింగ్టన్‌లో జరగనున్న అమెరికా-పాక్ సమావేశాల్లో ఈ అంశం చర్చకు రానుంది’ అని చెప్పారు. ప్రమాదకరమైన హఖానీ నెట్‌వర్క్‌పై కూడా అమెరికా నిఘా ఉంచింది. హఖానీ నెట్‌వర్క్ అల్ ఖైయిదాతో కలిసి పనిచేస్తుందనే ఆరోపణలున్నాయి. 2008లో కాబూల్‌లోని భారత కార్యాలయంపై జరిగిన దాడి సహా భారత్, అఫ్ఘానిస్తాన్ లలో దాడులకు పాల్పడ్డారు.