
'ఎంత ఘోరం... మాటలు కూడా రావడం లేదు'
వాషింగ్టన్: మలేసియా ఎయిర్ లైన్స్ విమానాన్ని కూల్చివేత ఘటనపై దర్యాప్తులో సహాయం అందించేందుకు అమెరికా ముందుకు వచ్చింది. విమానం పేల్చివేతపై అంతర్జాతీయ దర్యాప్తులో సహాయం చేసేందుకు సిద్దమని అమెరికా అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ప్రకటించారు.
ఎంహెచ్ 17 విమాన పేల్చివేతను అత్యంత ఘోరమైన ఘటనగా ఆయన వర్ణించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపేందుకు కూడా మాటలు రావడం లేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో మలేసియా, నెదర్లాండ్స్ ప్రభుత్వాలకు సానుభూతితో కూడిన సహాయం చేస్తామని జాన్ కెర్రీ తెలిపారు. మృతుల కుటుంబాలకు కూడా సహాయం అందించేందుకు సిద్దమని ప్రకటించారు.