బీజింగ్: మలేసియా ఎయిర్ లైన్స్ విమానాన్ని కూల్చివేత ఘటనతో ఉక్రెయిన్ మీదుగా వెళ్లే విమానాలు రద్దవుతున్నాయి. ఇప్పటికే భారత్- ఉక్రెయిన్ కు విమాన సర్వీసులు రద్దు చేసింది. చైనా కూడా ఉక్రెయిన్ మీదుగా వెళ్లే తమ విమానాలను మళ్లించింది. ఉక్రెయిన్ మీదుగా వెళ్లే అన్ని విమాన సర్వీసులను వేరే మార్గాల్లో నడపాలని నిర్వహించినట్టు చైనా పౌర విమానయాన శాఖ తెలిపింది.
తూర్పు ఉక్రెయిన్ మీదుగా చైనా విమానాలు వారానికి 28 రౌండ్ల ట్రిప్పులు వేస్తాయని చైనా పౌర విమానయాన పరిపాలన విభాగం(సీఏఏసీ) వెల్లడించింది. అయితే చైనా, ఉక్రెయిన్ మధ్య రెగ్యులర్ విమాన సర్వీసులు లేవని తెలిపింది. ఉక్రెయిన్ లో తలెత్తిన పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నేటి నుంచి తమ విమానాలను మళ్లిస్తున్నట్టు చైనా ప్రకటించింది.
చైనా విమానాల దారి మళ్లింపు
Published Fri, Jul 18 2014 7:56 PM | Last Updated on Sat, Sep 2 2017 10:29 AM
Advertisement