'కూల్చిన వారిని చట్టం ముందు నిలబెట్టాలి'
కౌలాలంపూర్/కీవ్: ఉక్రెయిన్ గగనతలంపై ఎయిర్ లైన్స్ విమానం పేల్చివేతపై అంతర్జాతీయ సమాజం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రయాణీకుల విమానాన్ని కూల్చివేయడంపై తీవ్ర ఆందోళన తెలిపింది. విమానం కూల్చివేతపై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరిపించాలని, ఈ నరమేధానికి కారణమైన వారిని చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేసింది.
కాగా సంఘటనా స్థలంలో సహాయక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు సాగిస్తున్నారు. పొద్దుతిరుగుడు తోటల్లో ఛిద్రమైన స్థితిలో చెల్లాచెదురుగా పడివున్న మృతదేహాలను వెలికితీస్తున్నారు. ఇప్పటివరకు 181 మృతదేహాలు బయటకు తీశారు. మృతి చెందిన వారిలో 173 మంది నెదర్లాండ్స్ చెందిన వారున్నారు. మృతుల్లో దాదాపు 100 మంది ఎయిడ్స్ పరిశోధకులున్నారు.