విమానాన్ని కూల్చివేసింది వారే: ఎస్బీయూ
కీవ్: మలేసియా ఎయిర్ లైన్స్ విమానాన్ని కూల్చివేసింది తామేనని రష్యా అనుకూల తిరుగుబాటుదారులు ఒప్పుకున్నారని ఎక్రెయిన్ భద్రతా విభాగం(ఎస్బీయూ) తెలిపింది. రష్యా సైనిక నిఘా విభాగం అధికారులకు, తిరుగుబాటుదారులకు మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణల ద్వారా తమకీ విషయం తెలిసిందని ఎస్బీయూ వెల్లడించింది.
విమానం కూలిపోయిన 20 నిమిషాల తర్వాత రష్యా సైనిక నిఘా అధికారి ఇగోర్ బెజ్లర్.. రష్యా భద్రతాధికారి వాసిలి జెరానిన్ కు ఫోన్ చేశారని పేర్కొంది. 'దొనెస్క్ ప్రాంతంలో విమానాన్ని ఇప్పుడే కూల్చివేశాం' అని జెరానిన్ కు బ్లెజర్ ఫోన్ తెలిపాడని వెల్లడించింది. స్వయం ప్రకటిత దొనెస్క్ పీపుల్స్ రిపబ్లిక్ సంస్థకు బ్లెజర్ కమాండర్ గా ఉన్నాడు. మేజర్, గ్రీక్ పేరుతో ఇద్దరు తీవ్రవాదులు జరిపిన సంభాషణను కూడా ఎస్బీయూ విడుదల చేసింది.