54 ఏళ్ల తరువాత యూఎస్ ఎంబసీలోకి జాతీయ జెండా! | American flag returns to US embassy in Cuba after 54 years | Sakshi
Sakshi News home page

54 ఏళ్ల తరువాత యూఎస్ ఎంబసీలోకి జాతీయ జెండా!

Published Sat, Aug 15 2015 9:36 AM | Last Updated on Thu, Apr 4 2019 4:27 PM

54 ఏళ్ల తరువాత యూఎస్ ఎంబసీలోకి జాతీయ జెండా! - Sakshi

54 ఏళ్ల తరువాత యూఎస్ ఎంబసీలోకి జాతీయ జెండా!

హవానా: గత  కొన్ని దశాబ్దాల నుంచి అగ్రరాజ్యం అమెరికాకు పొరుగు దేశం క్యూబాతో  సత్సబంధాలు లేవు. దీంతో 54 ఏళ్ల క్రితం క్యూబాలోని రాయబార కార్యాలయంలో అమెరికన్ జాతీయ జెండాను తొలగించారు. ఎప్పుడో ఐదు దశాబ్దాల క్రితం క్యూబాలోని అమెరికా రాయబార కార్యాలయంలో తొలగించబడిన ఆ దేశ జాతీయ జెండా..  ఎట్టకేలకు తిరిగి  వారి రాయబార కార్యాలయంలో రెపరెపలాడింది. 1961, జనవరి 4 వ తేదీన ఇరు దేశాల మధ్య పరస్పర వైరంతో క్యూబాలోని అమెరికన్ రాయబార కార్యాలయం నుంచి జాతీయ జెండాను తొలగించారు. అయితే ప్రస్తుతం ఇరుదేశాల మధ్య సత్సంబంధాలకు బీజం పడింది.

 

1945 తరువాత తొలిసారి అమెరికన్ దేశ సెక్రటరీ కెర్రీ  క్యూబా దేశంలో పర్యటించారు. ఈ సందర్భంగా జాన్ కెర్రీ  శుక్రవారం క్యూబాలోని అమెరికన్ రాయబార కార్యాలయంలో తమ దేశ  జాతీయ జెండాను ఆవిష్కరించి మర్యాద పూర్వక వేడుకలను నిర్వహించారు. అనంతరం ప్రసంగించిన ఆమె.. ఇక నుంచి రెండు దేశాల ప్రజలు ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రగతి పథంలో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.  తొలుత ఇంగ్లిష్ లో తరువాత స్పానిష్ లో మాట్లాడిన ఆమె.. ఇరు దేశాలు తప్పక అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదామన్నారు.  ఇదిలాఉండగా గత 50 సంవత్సరాల నుంచి అమెరికాతో సత్సబంధాలను కొనసాగించకపోవటంతో క్యూబా ఆర్థిక పరిస్థితి తీవ్ర  అవరోధంలోకి నెట్టింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement