US ambassador
-
వాళ్లను చంపేయండి!
టెల్ అవీవ్: అమాయక పాలస్తీనియన్లపై విచక్షణారహితంగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ సైన్యానికి అమెరికా నేతలు పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపే ఫొటో ఒకటి బహిర్గతమైంది. శాంతికాముక ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా సేవలందించిన రిపబ్లికన్ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీ హమాస్‌పై ఇజ్రాయెల్ దాడికి పూర్తి మద్దతు పలుకుతూ ఒక మిస్సైల్‌పై తన సందేశం రాశారు. ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ లెబనాన్ సరిహద్దు వెంట ఇజ్రాయెల్ స్థావరాలకు వెళ్లారు. గాజా స్ట్రిప్‌పై గగనతల దాడికి సిద్ధంగా ఉంచిన ఒక క్షిపణిపై ‘ వాళ్లను చంపేయండి. అమెరికా ఎల్లప్పుడూ ఇజ్రాయెల్‌కు తోడుగా ఉంటుంది’ అని రాసి సంతకం చేశారు. అయితే దేశాన్ని శాంతియుతంగా పాలిస్తానంటూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యరి్థత్వం కోసం పోటీపడిన నాయకురాలు ఇలా యుద్ధజ్వాలలు మరింత రగిలించడమేంటి? అంటూ నెటిజన్లు నిక్కీ హేలీపై విమర్శలు గుప్పించారు. -
వరల్డ్ కప్ ఫైనల్ వేళ.. అమెరికా రాయబారి సందడి.. వీడియో ట్రెండింగ్!
ప్రపంచమంతా క్రికెట్ వరల్డ్ కప్ హడావుడి నెలకొంది. ఇప్పటికే రెండు సార్లు ప్రపంచ కప్ సాధించిన తర్వాత భారత జట్టు మరోసారి వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఉత్కంఠభరితమైన ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ సందడి చేశారు. 1983లో తొలిసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న భారత జట్టులోని కొందరు సభ్యులను అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ కలిశారు. బ్యాట్ పట్టి వారితో సరదాగా క్రికెట్ ఆడారు. నాటి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. 1983 విజయం 40వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ వేడుకలకు సంకేతంగా తాను సంతకం చేసిన బ్యాట్‌ను లెజెండరీ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, రోజర్ బిన్నీ, జిమ్మీ అమర్నాథ్, కీర్తి ఆజాద్, రవిశాస్త్రిలకు బహూకరించారు. దీనికి సంబంధిచిన వీడియోను ఎరిక్ గార్సెట్టీ తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. భారత్‌లో క్రికెట్ అభివృద్ధికి బాటలు వేశారంటూ 1983 వరల్డ్ కప్ నెగ్గిన లెజండరీ క్రికెటర్లను అభినందిస్తూ భారత్ మరోసారి ట్రోఫీని గెలవాలని ఆకాంక్షించారు. భారత్ ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్ ఆడుతున్న తరుణంలో గార్సెట్టీ షేర్ చేసిన ఈ వీడియో ట్రెండింగ్‌లో నిలిచింది. అత్యధికంగా వ్యూవ్స్, లైక్స్ వచ్చాయి. అలాగే పలువురు స్పందిస్తూ కామెంట్లు చేశారు. Met the OGs of cricket 🏏 – '83 legends @therealkapildev, Sunil Gavaskar, @iRogerBinny, @JimmyAmarnath, @KirtiAzaad, and @RaviShastriOfc! They bowled me over with their stories from India's first cricket World Cup victory! Rooting for #TeamIndia for the World Cup final on Sunday.… pic.twitter.com/71aTKDIuax — U.S. Ambassador Eric Garcetti (@USAmbIndia) November 17, 2023 -
దుర్గా మండపంలో అమెరికా రాయబారి గార్సెట్టి డ్యాన్స్
న్యూఢిల్లీ: భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ఆదివారం హల్చల్ చేశారు. ఢిల్లీలోని సీఆర్ పార్కులో ఏర్పాటు చేసిన దుర్గా మండపానికి వెళ్లిన ఆయన..సంప్రదాయ ధునుచి డ్యాన్స్ చేసి, అందరినీ వినోద పరిచారు. ఇందుకు సంబంధించిన వీడియోను గార్సెట్టి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. బెంగాలీ స్ట్రీట్ ఫుడ్ ఝల్మురితోపాటు కొన్ని రకాల బెంగాలీ స్వీట్లను రుచి చూసిన ఆయన ‘ధునుచి నాచ్’లో పాల్గొన్నారు. ఉత్సవంలో పాలుపంచుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందంటూ అందులో పేర్కొన్నారు. దుర్గా మాత మండపాల్లో సాధారణంగా చేసే నాట్యాన్ని ధునుచి నాచ్ అని పిలుస్తుంటారు. దేవతకు హారతి ఇచ్చేందుకు వాడే మట్టి పాత్రనే ధునుచి అంటారు. -
జరిగింది చాలు, మానవ హక్కులను కాపాడండి : యూఎన్‌లో మౌన నిరసన
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి ముగింపు సమావేశం సందర్భంగా కొంతమంది మానవ హక్కుల ప్రతినిధులు మౌనంగా నిరసన తెలిపారు. జెనీవాలో జరిగిన రెండు రోజుల ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమీక్ష ముగింపులో భాగంగా రాయబారి మిచెల్ టేలర్ ప్రసంగం సందర్భంగా సామాజిక, జాతి, న్యాయ ఉద్యమకారులు పలువురు ఈ నిరసన వ్యక్తం చేశారు. మిచెల్ మాట్లాడుతున్న సమయంలో గాజాలో ఇజ్రాయెల్ చర్యలను సమర్ధిస్తున్న ఆమెరికాకు వ్యతిరేకంగా మానవ హక్కులను, గౌరవాన్ని కాపాడండి అంటూ ప్రతినిధులు మౌనంగా లేచి నిలబడి, వెనక్కి తిరిగి నిల్చున్నారు. ముందుగా డిగ్నిటీ డెలిగేషన్ సభ్యులు ఈ మౌన నిరసనకు దిగారు. అమెరికా న్యాయ వ్యవస్థ, చట్టాలు, విధానాలపై, వైఖరికి పట్ల తాము చాలా నిరాశకు గురయ్యామని అలయన్స్ శాన్ డియాగో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆండ్రియా గెర్రెరో అన్నారు. గ్వామ్, ప్యూర్టో రికో, హవాయి తదితర ప్రాంతాల ప్రతినిధులుఇందులో ఉన్నారు. జెనీవాలోని యుఎన్లోని యుఎస్ రాయబారి మిచెల్ టేలర్ బుధవారం యుఎన్ మానవ హక్కుల కమిటీ సమావేశమైంది. ఈ కమిటీ సమావేశానికి సంబంధించిన ప్రతిపాదనలు, సిఫార్సులను వచ్చే నెల (నవంబర్ 3న) విడుదల చేయనుంది. కాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అధ్యక్షుడితో సమావేశమయ్యారు. అలాగే బైడెన్ సలహామేరకు రఫా సరిహద్దు గుండా గాజా ప్రజలకు ఆహార పదార్థాలు, మందులు అనుమతించడానికి ఎట్టకేలకు ఇజ్రాయెల్ నిర్ణయం తీసుకుంది. యుద్ధం నేపథ్యంలో తర్వాత చేపట్టాల్సిన చర్యలపైనా చర్చించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇది ఇలా ఉంటే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) కూడా ఇజ్రాయెల్ చేరుకున్నారు. కష్టాల్లో ఉన్న దేశానికి మద్దతుగా ఉంటాం.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాము ఎపుడూ నిలబడతామంటూ గురువారం ట్వీట్ చేశారు. రిషీ కూడా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు, అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌తో సమావేశంకానున్నారు. At the UN Human Rights Committee, many delegates turned their backs on US Ambassador Michelle Taylor in silent protest against the American backing of Israel's war-crimes in Gaza. Huge. The world is slowly waking up to their lies and deceit. #Gaza pic.twitter.com/YIEHKY114D — Advaid അദ്വൈത് (@Advaidism) October 19, 2023 I am in Israel, a nation in grief. I grieve with you and stand with you against the evil that is terrorism. Today, and always. סוֹלִידָרִיוּת pic.twitter.com/DTcvkkLqdT — Rishi Sunak (@RishiSunak) October 19, 2023 -
భావప్రకటన అంటే.. హింసకు పాల్పడటం కాదు..
వాషింగ్టన్: శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ పై ఖలిస్థాన్ వేర్పాటువాదుల దాడిని అక్కడి ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. గత నెల ఖలిస్థాన్ వేర్పాటువాది భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు ప్రతీకారంగా అతని అనుచరులు ఈ హింసాకాండకు తెరతీశారు. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ పేరిట వేర్పాటువాద సంస్థకు నాయకుడైన హర్దీప్ సింగ్ నిజ్జర్ పై 10 లక్షల ప్రైజ్ మనీ కూడా ఉంది. కెనడాలో గురుద్వారా గుమ్మం వద్దే అతడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. దీంతో అమెరికాలోని ఖలిస్థాన్ మద్దతుదారులు అక్కడి భారత దౌత్య కార్యాలయంపై దాడికి పాల్పడి నిప్పు కూడా పెట్టిన విషయం తెలిసిందే. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఖలిస్తానీలు హింసకు ప్రతిగా హింస అంటూ నినదించారు. గడిచిన ఐదు నెలల్లో శాన్ ఫ్రాన్సిస్కోలోని దౌత్య కార్యాలయంపై దాడులు జరగడం ఇది రెండో సారి. దీంతో అమెరికా ప్రజాప్రతినిధుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. భారత దౌత్య కార్యాలయంలో పనిచేస్తున్న దౌత్యాధికారుల భద్రత మాకు చాలా ముఖ్యమని, శాంతికి భంగం కలిగిస్తే ఎవ్వరినీ సహించేది లేదని వైట్ హౌస్ జాతీయ భద్రతా విభాగానికి చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు. మరో ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధి RO ఖన్నా మాట్లాడుతూ.. నాకు భారత దౌత్యాధికారి సంధు వ్యక్తిగతంగా కూడా తెలుసు. ఆయనంటే నాకు చాలా గౌరవం. ఎప్పుడన్నా మానవ హక్కుల గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు ఆలోచనతోనూ, పరిపక్వతతోనూ నిజాయతీగా స్పందిస్తూ ఉంటారు. అలాంటి వారికి హాని కలిగించే విధంగా ప్రవర్తించడం దారుణం, అప్రజాస్వామికం. అమెరికాలో ప్రతి ఒక్కరికీ భావప్రకటన స్వేఛ్చ ఉంటుంది. అలాగని దాన్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టి, హింసను ప్రేరేపించమని కాదు దానర్ధం. ప్రభుత్వం ఈ హింసాకాండపై విచారణ జరిపించి దీని వెనుక ఉన్న ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: భారత్ ఆరోపణల్ని తప్పుబట్టిన కెనడా ప్రధాని.. ‘అది వాస్తవం కాదు’ Khalistan supporters’ try to set on fire Indian consulate in San Francisco; US 'strongly condemns’@siddhantvm and @live_pathikrit share their views@Sriya_Kundu | #Khalistan #SanFrancisco pic.twitter.com/wEtGKyfn35 — News18 (@CNNnews18) July 4, 2023 -
హైదరాబాదే మన ఫ్యూచర్ ..!
-
ఎట్టకేలకు గార్సెట్టి ఎంపిక ఖరారు
వాషింగ్టన్: రెండు సంవత్సరాలకుపైగా ఎటూ తేలని భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి ఎంపిక ప్రక్రియ ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. అమెరికా పార్లమెంట్ ఎగువసభలో జరిగిన ఓటింగ్‌లో 52–42 ఓటింగ్ ఫలితంతో గార్సెట్టి నామినేషన్ గండాన్ని విజయవంతంగా గట్టెక్కారు. దీంతో భారత్‌లో అమెరికా రాయబారిగా గార్సెట్టి త్వరలో నియామకం కానున్నారు. తొలిసారిగా 2021 జూలైలో గార్సెట్టిని భారత్‌లో అమెరికా రాయబారిగా నామినేట్ చేస్తున్నట్లు అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. లాస్ ఏంజెలిస్ నగర మాజీ మేయర్ అయిన గార్సెట్టిపై పలు లైంగిక వేధింపులు, ఆధిపత్య ధోరణి ఆరోపణలు ఉన్నాయి. ఇన్నాళ్లూ అమెరికా నూతన రాయబారి వ్యవహారం సందిగ్ధంగా ఉండటంతో చరిత్రలో తొలిసారిగా 2021 జనవరి నుంచి ఇప్పటిదాకా భారత్‌లో అమెరికా రాయబారిగా ఎవరూ లేరు. కాగా, బైడెన్‌కు సన్నిహితుడు నూతన రాయబారిగా వస్తుండటంతో భారత్‌తో సత్సంబంధాలు మెరుగుపడతాయని భారతీయ అమెరికన్లు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. -
దూత లేని దౌత్యమా?
రెండేళ్ల క్రితం జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా అధికారం స్వీకరించినప్పటి నుంచీ న్యూఢిల్లీలో అమెరికా రాయబారి లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. అమెరికా – భారత్ భాగస్వామ్యం తమ అత్యంత ముఖ్యమైన సంబంధాల్లో ఒకటని బైడెన్ అన్నారు. భారత్‌లో శాశ్వత రాయబారి లేకపోవడానికి సెనేట్ నిర్ధారణ ప్రక్రియే కారణమంటూ శ్వేత సౌధ అధికారులు భుజాలు ఎగరేస్తారు. కానీ అమెరికా బహిరంగంగా పేర్కొంటున్నట్లుగా భారత్ తనకు అంత విలువైన దేశమే అయినట్లయితే, భారత రాయబారిగా తన నామినీ ఎరిక్ గార్సెటీని నిర్ధారింప జేసుకోవడంలో అధ్యక్ష పాలనా యంత్రాంగం మరింత శక్తిని ఎందుకు ప్రదర్శించడం లేదనే ప్రశ్న ఇప్పటికీ మిగిలే ఉంది. భారత్‌లో అమెరికా రాయబారిగా లాస్ ఏంజెల్స్ మాజీ మేయర్ ఎరిక్ గార్సెటీని తిరిగి నామినేట్ చేయడానికి జో బైడెన్ యంత్రాంగం తీసుకున్న తాజా నిర్ణయం ఇరుదేశాల ద్వైపాక్షిక బాంధవ్యపు విచిత్ర పరిస్థితిని ఎత్తి చూపింది. రెండేళ్ల క్రితం బైడెన్ అధికారం స్వీకరించినప్పటి నుంచీ న్యూఢిల్లీలో అమెరికా రాయబారి లేరు. ఇండో–పసిఫిక్‌లో చైనాకు శక్తిమంతమైన ప్రతిజోడిగా భారత్ మీద అమెరికా ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్న సమయంలో ఇలా జరగడం గమనార్హం. క్వాడ్ సభ్యులైన ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాతో కలిసి పనిచేస్తున్న భారత్ ఈ ప్రాంతంలో అధికార సమతౌల్యాన్ని కొనసాగించడానికి కీలకంగా ఉంటోంది. ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికాతో ఉన్న ఐ2యూ2 భాగస్వామ్య కూటమి సభ్యురాలిగా కూడా భారత్ మొత్తం మధ్యప్రాచ్యంలో చైనా ప్రభావాన్ని నిలువరించడంలో కీలక పాత్రను కలిగి ఉంటోంది. వ్యూహాత్మకంగా ఇంత ప్రాధాన్యం కలిగినది అయినప్పటికీ, శ్వేత సౌధం రెండేళ్లుగా భారత్‌లో అమెరికా రాయబారి పదవిని ఖాళీగా ఎందుకు ఉంచినట్లు? అయితే, భారత్‌కు దీంతో ఏమాత్రం సంబంధం లేదు. 2021 జూలైలో గార్సెటీ అమెరికా ప్రభుత్వ నూతన యంత్రాంగంలోకి నామినేట్ అయ్యారు. కానీ సెనేట్‌లో తన నియామక నిర్ధారణ సమస్యల్లో చిక్కుకుంది. మేయర్‌గా గార్సెటీ తన సహాయకుల్లో ఒకరిపై వచ్చిన లైంగిక వేధింపు ఫిర్యాదులను పట్టించుకోలేదన్న ఆరోపణలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో గార్సెటీ నియామకాన్ని సమర్థిస్తూ ఓటు వేయాలని పార్టీ ఇచ్చిన పిలుపును వ్యతిరేకిస్తూ కొంతమంది డెమోక్రాట్లు తమ ప్రత్యర్థులైన రిపబ్లికన్లతో చేతులు కలిపారు. ఏప్రిల్ నెలలో అంటే నామినేషన్ ను ప్రకటించిన తొమ్మిది నెలల తర్వాత, గార్సెటీని రాయబారిగా నిర్ధారించేందుకు తగిన ఓట్లు తన వద్ద ఉండకపోవచ్చని సెనేట్ మెజారిటీ లీడర్ చక్ షుమెర్ అంగీకరించారు. దీంతో భారత్‌లో అమెరికా రాయబారి పదవి అనిశ్చితిలో ఉండిపోయింది. దీనిపట్ల ప్రారంభంలో ఎలా స్పందించాలో తెలియని భారతీయ అధికారులు తర్వాత చీకాకుపడ్డారు. గత 20 నెలల కాలంలో పలువురు అమెరికన్ దౌత్యవేత్తలు తాత్కాలిక బాధ్యతలు స్వీకరించారు. కానీ తమ విజయానికి అతి ముఖ్యమైన స్థానిక సంబంధాలను నెలకొల్పుకోవడానికి ముందే వారంతా బదిలీ అవుతూ వచ్చారు. ఇటీవల, రాయబార పదవికి కెరీర్ డిప్లొమాట్ అయిన ఎలిజిబెత్ జోన్్స పేరు ప్రకటించారు. కానీ ఆమె నియామకం కూడా తాత్కాలికమే. పూర్తి కాలం రాయబారిని నిర్ధారించగానే ఆమె వైదొలుగుతారని భావిస్తున్నారు. భారత్‌లో అమెరికా రాయబారి లేకపోవడమన్నది భారత్‌తో పొత్తును విస్తృతపర్చుకోవడంలో అమెరికా నిబద్ధత పైనే ప్రశ్నలు లేవనెత్తింది. అమెరికా–భారత్ భాగస్వామ్యం తమ అత్యంత ముఖ్య మైన సంబంధాల్లో ఒకటని అమెరికా అధ్యక్షుడు అన్నారు. భారత్ తమకు ఒక విస్మరించలేని భాగస్వామి అని కూడా ఆయన కొని యాడారు. కానీ న్యూఢిల్లీలో అమెరికా రాయబారిని నియమించడంలో బైడెన్ ప్రభుత్వ అసమర్థత కొందరు భారతీయులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. లండన్, ప్యారిస్ నగరాల్లో కూడా ఇంత సుదీర్ఘ కాలంపాటు ఈ పదవిని అమెరికా ఖాళీగా ఉంచగలిగేదా అనేది వారి ఆశ్చర్యానికి కారణం. ఇదే సమయంలో అమెరికా, భారత్ మధ్య వ్యూహాత్మక భాగ స్వామ్యం ఇంత కీలకంగా ఇదివరకెన్నడూ లేదని చెప్పాలి. చైనాతో పెరుగుతున్న తమ శత్రుత్వం నేపథ్యంలో అమెరికా పక్షాన నిలబడా లంటూ సంవత్సరాలుగా తెస్తున్న ఒత్తిడులను భారత్ ప్రతిఘటిస్తూ వచ్చింది. కానీ హిమాలయాల్లో భారత్ భూభాగంలోకి చైనా ఇటీవలి ఆక్రమణలు చైనా విస్తరణవాదాన్ని భారత్ సవాలు చేసేలా చేశాయి. ఈ ఉమ్మడి అవసరానికి తోడుగా, భద్రత, సాంకేతికత, పర్యావరణ మార్పు అంశాల్లో అమెరికా సాయం భారత్ కోరుతోంది. భారత్ ఒక ముఖ్యమైన ఆర్థిక భాగస్వామి కూడా. అలాగే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించినంతవరకూ భారత ఉపఖండానికి అమెరికా అతిపెద్ద వనరుగా ఉంటోంది. 2021లో వీటి విలువ 45 బిలియన్ డాలర్లు. అంతర్జాతీయ సరఫరా చెయిన్లపై చైనా ఆధి పత్యాన్ని నిలువరించేలా అమెరికన్ అధికారులు తమ ఉత్పాదక స్థావరాలను నెలకొల్పేలా అమెరికన్ కంపెనీలను ప్రోత్సహిస్తూ వచ్చారు. ఈ క్రమంలో వారు అమెరికా పాలనా యంత్రాంగానికి చెందిన ‘ప్రధానమైన మిత్రుల’ ఎజెండాలో భారత్‌ను కేంద్ర స్థానంలో నిలిపారు. ఉదాహరణకు ఆపిల్ కంపెనీ 2025 సంవత్సరానికల్లా తన మొత్తం ఐఫోన్ లలో దాదాపుగా 25 శాతాన్ని భారత్‌లోనే ఉత్పత్తి చేయ నుందని భావిస్తున్నారు. అదే విధంగా, భారతీయ ఔషధ కంపెనీలు ఆమెరికా సాధారణ జనరిక్ మందుల ప్రధాన సరఫరాదారుగా చైనాను తోసిరాజనగలుగుతాయి. అయితే గార్సెటీ నియామకాన్ని నిర్ధారించడంలో అమెరికా వైఫల్యం ఇరుదేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన బాంధవ్యాన్ని వమ్ము చేసింది. ఆ నిర్ధారణలోని ఘర్షణను అలా ఉంచినట్లయితే, భారత్‌లో రాయబారి పదవికి గార్సెటీ ఒక మంచి ఎంపిక అని చెప్పాలి. ఆయనది చిన్న వయసే (51 ఏళ్లు). చురుకైనవాడు. బైడెన్ తో ఆయనకు ఉన్న సన్నిహిత సంబంధం వల్ల, అధ్యక్షుడితో నేరుగా సంప్రదించే స్థానంలో ఉన్నారు. అధ్యక్షుడి చెవిలో నేరుగా ఊదగలిగే శక్తి ఉన్న అమెరికన్ రాయ బారిని కలిగి ఉండటం అనేది ఆతిథ్య దేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. న్యూఢిల్లీలోని అమెరికా రాయబారి నివాసాన్ని రూజ్వెల్ట్ హౌస్ అని పిలుస్తారు. చైనా, భారత యుద్ధ కాలం సహా తాను కోరుకున్నప్పుడల్లా అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ బ్యూరో క్రసీని దాటి తన సన్నిహిత మిత్రుడు, అధ్యక్షుడు అయిన జాన్ ఎఫ్. కెన్నెడీని నేరుగా కలవగలిగే స్థాయి ఉన్న జాన్ కెన్నెత్ గాల్బ్రెయిత్ వంటి ప్రముఖ ఆర్థికవేత్త ఈ రూజ్వెల్ట్ హౌస్‌లో నివసించారు. భవి ష్యత్తులో అమెరికా సెనేటర్ కానున్న డేనియల్ ప్యాట్రిక్ మొయినిహాన్ కూడా ఈ పదవిని అలంకరించారు. భారత్‌లో శాశ్వత రాయబారి లేకపోవడానికి సెనేట్ నిర్ధారణ ప్రక్రియే కారణమంటూ శ్వేత సౌధ అధికారులు భుజాలు ఎగరేస్తూ ప్రైవేటుగా నిందిస్తుంటారు. కానీ అమెరికా బహిరంగంగా పేర్కొంటున్నట్లుగా భారత్ తనకు అంత విలువైన దేశమే అయినట్లయితే, తన నామినీని నిర్ధారింప జేసుకోవడంలో అధ్యక్ష పాలనా యంత్రాంగం మరింత శక్తిని ఎందుకు ప్రదర్శించడం లేదనే ప్రశ్న ఇప్పటికీ మిగిలే ఉంది. 2000 సంవత్సరంలో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ చారిత్రాత్మక భారత్ సందర్శన నుంచి, రిపబ్లికన్, డెమోక్రాటిక్ పాలనా యంత్రాంగాలు అమెరికా భౌగోళిక వ్యూహంలో భారత్‌ను అత్యంత ప్రధాన భాగస్వామిగా ఎంచుతూ వచ్చాయి. డిసెంబర్ నెలలో జీ20 కూటమి అధ్యక్ష బాధ్యతను స్వీకరించిన భారత్ నిజంగానే అమెరికా గ్లోబల్ విజన్ లో గణనీయంగా ఇమిడి పోతుందనడంలో సందేహమే లేదు. పైగా, పర్యావరణ మార్పు, ఇస్లా మిక్ ఉగ్రవాదం వంటి ఉమ్మడి ఆంశాల్లో సహకారం వల్ల ఇరుదేశాలు ఎంతో ప్రయోజనం పొందగలవు. ఆసియాలో అమెరికా అత్యంత కీలక భాగస్వామితో వ్యవహరించడానికి తగిన వ్యక్తిగత సంబంధాలను పెంచి పోషించగల రాయ బారిని నిర్ధారించే విషయంలో తన రాజకీయ మూలధనాన్ని వెచ్చించడం శ్వేతసౌధానికి తప్పనిసరి అవసరం. ఈ కోణంలో బైడెన్ యంత్రాంగం కలిసి పనిచేసి, ఏమాత్రం జాగు చేయకుండా గార్సెటీని న్యూఢిల్లీ విమానం ఎక్కించాలి. శశి థరూర్ వ్యాసకర్త కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ (‘ప్రాజెక్ట్ సిండికేట్’ సౌజన్యంతో) -
బైడెన్ టీమ్ మనవాళ్లే మరో ఇద్దరు
ట్రంప్ తన నాలుగేళ్ల పదవీ కాలంలో లోకంతో అనేక తగాదాలు పెట్టుకున్నారు. ఆఖరికి ఐక్యరాజ్య సమితినీ, ప్రపంచ ఆరోగ్య సంస్థనూ ఆయన వదల్లేదు! ‘మా డబ్బు తీసుకుంటూ మాకు శత్రువులు అయినవారికి అనుకూలంగా ఉంటారేంటి!’ అని ఆయన ఘర్షణ. ‘శత్రు దేశాలు ఉంటాయి కానీ.. సమితులకు, సంస్థలకు అన్నీ స్నేహదేశాలే’ అని వారి సమాధానం. ఇప్పుడీ దెబ్బతిన్న సంబంధాలన్నిటినీ కొత్త అధ్యక్షుడు బైడెన్ చక్కబెట్టుకుంటూ రావాలి. అందుకే ఆయన ఆచితూచి రాయబార సిబ్బందిని ఎంపిక చేసుకుంటున్నారు. ఆ వరుసలో తాజాగా అపాయింట్ అయినవారే సోహినీ చటర్జీ, అదితీ గొరూర్. ఇద్దరూ భారత సంతతి అమెరికన్లు. ఐక్యరాజ్యసమితిలోని అమెరికా రాయబారికి సీనియర్ పాలసీ అడ్వైజర్‌గా సోహినీ చటర్జీ వెళుతున్నారు. ఆమెతోపాటు పాలసీ అడ్వైజర్‌గా ఆమెకన్నా వయసులో చిన్నవారైన అదితీ గొరూర్. అమెరికా ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్లిద్దరూ కీలకమైన స్థానాలకు ఎంపికైనవారు. ఈ ఇద్దరినే బైడెన్ తీసుకోడానికి తగిన కారణాలే ఉన్నాయి. సోహినీ ఇటీవలి వరకు కొలంబియా విశ్వవిద్యాలయంలోని ‘అంతర్జాతీయ, ప్రజా వ్యవహారాల విద్యాసంస్థ’ లో సహాయ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల అర్థిక పరిస్థితులు, జాతుల అణచివేతలు, ఘర్షణల మూలాలు సోహినీ మునివేళ్లపై ఉంటాయి. ఏ వేలితో ఏ మీటను నొక్కితే సమస్యకు పరిష్కారం క్రియాశీలం అవుతుందో ఆమెకు తెలుసు. యు.ఎస్.ఎ.ఐ.డి. (యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్)లో కూడా సోహినా కొన్నాళ్లు పని చేశారు. అక్కడి పాలసీ, ప్లానింగ్, లెర్నింగ్ బ్యూరోలో ఆమె పని. ఒబామా హయాంలో బైడన్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా సోíß నీ సీనియర్ పాలజీ అడ్వైజర్‌గా పని చేశారు. ఆ అనుభవం చూసే బైడెన్ ఇప్పుడు ఆమెను ఎంపిక చేసుకున్నారు. లాయర్ గా కూడా సోహినీ ప్రసిద్ధురాలు. ∙∙ అదితి గొరూర్ ఇంతకుముందే యు.ఎన్.తో కలిసి పనిచేశారు. సమితి శాంతి పరిరక్షక విభాగంలో నిపుణురాలిగా ఉన్నారు. ప్రపంచాన్ని మెరుగుపరిచే వినూత్న ఆవిష్కణల కోసం కృషి చేస్తుండే ప్రఖ్యాత స్టిమ్సన్ సెంటర్ (వాషింగ్టన్) లో అదితి కాన్ఫ్లిక్ట్స్ ప్రొగ్రామ్ డైరెక్టర్‌గా పని చేశారు. జాతుల ఘర్షణల నుంచి పౌరులను కాపాడటం ఆ కార్యక్రమ లక్ష్యం. స్టిమ్సన్‌లో చేరకముందు అదితి బెంగళూరు లోని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్స్’లో, వాషింగ్టన్ డీసీలోని ‘ఏషియన్ ఫౌండేషన్ అండ్ సెంటర్ ఫర్ లిబర్టీ ఇన్ ది మిడిల్ ఈస్ట్’ సంస్థలో, మెల్బోర్న్ లోని ‘యూనివర్సిటీ లా స్కూల్’లో మానవ హక్కుల పరిరక్షణపై అధ్యయనం జరిపారు. ఆమె చదివింది కూడా అదే చదువు. జార్జిటౌన్ యూనివర్సిటీలో ‘ఇంటర్నేషనల్ సెక్యూరిటీ’లో ఎం.ఎం చేశారు. మెల్బోర్న్ యూనివర్సిటీలో ఆనర్స్‌తో ‘లా’ చదివారు. అదితి నైజీరియాలోని లాగోస్ లో పుట్టారు. ఇండియా, ఓమన్, ఆస్ట్రేలియాల్లో పెరిగారు. యు.ఎస్.లో స్థిరపడ్డారు. -
ఎట్టకేలకు ఆయన మీసం కత్తిరించేశారు!
సియోల్: దక్షిణ కొరియాలో వివాదాలకు దారి తీసిన ‘మీసం’ బ్లేడ్ కత్తిరింపునకు బలైంది. అనేక సందర్భాల్లో విమర్శల పాలైన యూఎస్ రాయబారి హ్యారీ హారిస్ ఎట్టకేలకు తన మీసాన్ని కత్తిరించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేసిన ఆయన.. ‘‘సంతోషం. ఇప్పటికైనా ఇది పూర్తైంది’’ అని పేర్కొన్నారు. రాజధాని సియోల్‌లో నమోదయ్యే అత్యధిక ఉష్ణోగ్రతలు, వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ఇలా చేశానని, కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాస్కు ధరించడానికి వీలుగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా జపనీస్ మూలాలు(తల్లి తరఫున) ఉన్న రిటైర్డ్ నేవీ అడ్మిరల్ అయిన హ్యారీ హారిస్ 2018 నుంచి దక్షిణ కొరియాలో అమెరికా రాయబారిగా ఉంటున్నారు. ఈ క్రమంలో తన మీసకట్టుతో అనేకసార్లు ఆయన వార్తల్లో నిలిచారు. 1910 నుంచి 1945 వరకు కొరియా ద్వీపకల్పంలో కొనసాగిన జపాన్ వలస పాలనలోని గవర్నర్ల స్టైల్‌ను గుర్తు చేసేలా ఉన్న మీసకట్టు కారణంగా విమర్శలు ఎదుర్కొన్నారు. వచ్చే ఏడాదిలోనే అందరికీ వ్యాక్సిన్ Glad I did this. For me it was either keep the 'stache or lose the mask. Summer in Seoul is way too hot & humid for both. #COVID guidelines matter & I'm a masked man! Enjoyed getting to know Mr. Oh & appreciated his heartfelt words about how much he values the #USROKAlliance. https://t.co/ja2WMD49Fr — Harry Harris (@USAmbROK) July 25, 2020 అయితే ఈ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయని హ్యారీ.. తన వ్యక్తిగత నిర్ణయాన్ని, శైలిని తప్పుబట్టడం సరికాదని హితవు పలికారు. అదే విధంగా... ఇరు దేశాల మధ్య(జపాన్- కొరియా) ఉన్న చారిత్రాత్మక శత్రుత్వం గురించి తనకు తెలుసునని, అయితే తానిప్పుడు జపనీస్ అంబాసిడర్‌గా దక్షిణ కొరియాలో పదవి చేపట్టలేదని, అమెరికా రాయబారిగా మాత్రమే ఉన్నానంటూ వివాదానికి తెరతీశారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు నిర్ణయం మార్చుకున్న ఆయన ఇటీవల తన మీసాన్ని కత్తిరించుకోవడం విశేషం. కాగా దక్షిణ కొరియా, జపాన్ రెండూ అమెరికా ప్రధాన మిత్ర దేశాలన్న సంగతి తెలిసిందే. అయితే చైనా, ఉత్తర కొరియాను ఎదుర్కొనే క్రమంలో ఈ రెండూ అమెరికాతో దోస్తీ కట్టినప్పటికీ.. గతంలో తమ మధ్య ఉన్న శత్రుత్వం దృష్ట్యా అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హారిస్, ఆయన మీసాన్ని విమర్శిస్తూ కొంతమంది వివాదాస్పద వ్యాఖ్యలకు దిగారు. (ఆంత్రాక్స్‌పై పాక్, చైనా పరిశోధనలు?) 잘한 결정이라고 생각합니다. 콧수염을 기르고 마스크까지 착용하기엔 서울의 여름은 매우 덥고 습합니다. 코로나 지침이 중요하니 마스크는 필수죠! 오 사장님을 뵙게 되어 반가웠고 #한미동맹 을 중요하게 생각해주셔서 매우 감사했습니다. https://t.co/pqfIQshM2g — Harry Harris (@USAmbROK) July 25, 2020 -
తారామతి, ప్రేమామతి సమాధులకు కొత్తందాలు
సాక్షి, హైదరాబాద్: తారామతి, ప్రేమామతి సమాధులు కొత్తందాలను సంతరించుకున్నాయి. పర్యాటకులను ఆకట్టుకునేందుకు జిగేల్మంటున్నాయి. లక్షా మూడు వేల యూఎస్ డాలర్లతో సుందరీకరించిన ఈ రెండు సమాధులను భారత్ లోని యూఎస్ అంబాసిడర్ కెన్నెత్ ఐ జస్టర్ చేతు ల మీదుగా మంగళవారం పర్యాటకులకు అంకి తం చేశారు. ఈ సందర్భంగా జస్టర్ మాట్లాడు తూ.. ఆగాఖాన్ ట్రస్టు ఫర్ కల్చర్ ఆధ్వర్యంలో 17వ శతాబ్దపు కులీకుతుబ్‌షాహీ రాజుల సమాధుల సుందరీకరణ పనులకు తమ ప్రభు త్వం ఏటా నిధులు కేటాయిస్తోందన్నారు. ప్రపంచం లోని చారిత్రక కట్టడాలను వారసత్వ సంపదగా భావితరాలకు అందించడానికే ఈ సాయం చేస్తున్నామన్నారు. ‘గతంలోనూ ఆగాఖాన్ ఫౌండేషన్‌కు లక్షా ఒక వేయి డాలర్లను ఇచ్చాం. సుందరీకరణ పనులు ఊహించిన దానికంటే గొప్పగా జరుగుతున్నాయి’అని ఆయన ప్రశంసించారు. కుతుబ్‌షాహీ సమాధుల సుందరీకరణ పను లు కూడా పూర్తయితే ఇక్కడ ప్రపంచస్థాయి పర్యాటక ప్రాంతం రూపుదిద్దుకుంటుందన్నారు. ఆయన వెంట తెలంగాణ రాష్ట్ర పురాతత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నారాయణ, ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ సీఈవో రితీష్‌నంద, సైట్ అధికారి గణేష్‌రెడ్డి తదితరులున్నారు. వెన్నెల రాత్రుల్లో అక్కాచెల్లెళ్ల నృత్యం అక్కాచెల్లెళ్లయిన తారామతి, ప్రేమామతి.. చివరి కుతుబ్‌షాహీ సుల్తాన్ ఆస్థానంలో నృత్యకారిణులు. మంచి అభినయంతో, అందమైన గాత్రాలతో వినసొంపుగా పాడేవారు. ఇవి రాజులను మంత్రముగ్ధులను చేసేవి. వీరి ఆటపాటలకు వీలుగా తారామతి బారాదరిలో నృత్య వేదికలను నిర్మించారు. బారాదరి.. రెండంతస్తులతో, చదరపు ఆకారంలో అన్నివైపులా బలమైన తోరణాలతో, చక్కని శబ్దగ్రాహ్యతతో కూడిన విలక్షణమైన నిర్మాణం. గోల్కొండ కోటకు సమీపంలోనే ఇది ఉంది. నృత్య ప్రదర్శనల సందర్భంలో బారాదరి – గోల్కొండ కోటను కలుపుతూ తీగలను అనుసంధానించే వారు. వాటిపై తారామతి, ప్రేమామతి వెన్నెల రాత్రుల్లో నృత్యాలు చేసేవారని చరిత్రకారులు చెబుతారు. మరణానంతరం వీరిద్దరిని ఇబ్రహీంబాగ్‌లోని కుతుబ్‌షాహీల రాజ శ్మశానవాటికలో ఖననం చేశారు. ఈ రెండు సమాధులు పక్కపక్కనే ఉంటాయి. ప్రస్తుతం వీటినే సుందరీకరించి, పర్యాటకుల సందర్శనకు వీలుగా అంకితం చేశారు. -
'రక్షణ సంబంధాల్లో కొత్త అధ్యాయం'
సాక్షి, విశాఖపట్నం : భారత్, అమెరికా మధ్య రక్షణ సంబంధాలలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని అమెరికా రాయభారి కెన్నత్ జస్టర్ పేర్కొన్నారు.ఇండియా - అమెరికా త్రివిధ దళాల సంయుక్త విన్యాసాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కెన్నత్ జస్టర్‌కు భారత్ తరఫున నౌకాదళ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ గోర్మడే స్వాగతం పలికారు. కెన్నత్ మాట్లాడుతూ.. డిసెంబర్ 18,19 తేదిలలో హైదరాబాద్ లో, ఫిబ్రవరిలో లక్నోలో రెండు దేశాల మధ్య వాణిజ్య సదస్సులు ఉన్నాయని తెలిపారు. దీని ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఇండియా-అమెరికా భాగస్వామ్యంతో హైదరాబాద్ లో అపాచి హెలికాఫ్టర్లు, ఎఫ్ 16 యుద్ధ విమానాల విడిభాగాలు, సి1 30 విమానాల విడిభాగాల తయారీలు పురోగతిలో ఉన్నాయన్నారు. కాగా, భారత - అమెరికా సంయుక్త విన్యాసాలు టైగర్ ట్రంప్ 2019 ఉభయచర విన్యాసాలలో భాగంగా ఐఎన్ఎస్ జలాశ్వపై ఉభయ దళాలు మార్చ్ ఫాస్ట్ నిర్వహించాయి. ఇందులో భాగంగా ఈనెల 21 వరకు విశాఖ, కాకినాడలలో ఇండో-అమెరికన్ త్రివిధ దళాలు విన్యాసాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం విశాఖ తీరానికి అమెరికా యుద్ద నౌక జర్మన్ టౌన్ చేరుకుంది. ఈ సందర్భంగా ఇండియా, అమెరికా నేవీ అధికారులు యుద్ద విమానాలు, మిస్సైల్ ను ప్రదర్సించారు. భారత - అమెరికా మిలటరీ సహకారానికి ఈ విన్యాసాలు ఒక మంచి ఉదాహరణగా నిలుస్తాయని ఇండియా, అమెరికా నేవీ అధికారులు పేర్కొన్నారు.ఇరు దేశాల మధ్య త్రివిధ దళాల మధ్య మెరుగైన సంబంధాలు, మానవీయ సాయం, విపత్తుల వంటి అంశాలలో నైపుణ్యాల అభివృద్ది , పరస్పర సహకారాలకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. సంయుక్త విన్యాసాలలో భాగంగా ఇరుదేశాల త్రివిధ దళాల సైనికులు పరస్పర సందర్శనలు, సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే లైవ్ ఫైర్ డ్రిల్లులు, భారత హెలీకాప్టర్లు అమెరికా నౌక జర్మన్ టౌన్ పై లాండింగ్ వంటివి రాబోయే తొమ్మిదిరోజుల పాటు నిర్వహిస్తారు. -
మహ్మద్ షమీకి యూఎస్ వీసా నిరాకరణ
న్యూఢిల్లీ: టీమిండియా ఫాస్ట్ బౌలర్ అయిన మహ్మద్ షమీకి అమెరికా వీసాను తిరస్కరించిన ఘటన తాజాగా వెలుగుచూసింది. షమీపై పలు కేసులు విచారణలో ఉన్నందు వల్ల వీసా ఇవ్వడానికి అమెరికా రాయబార కార్యాలయం నిరాకరించింది. 2018వ సంవత్సరంలో షమీ భార్య హాసిన్ జహాన్ అతనిపై గృహహింస కేసు పెట్టింది. హాసిన్ జహాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోల్‌కతా పోలీసులు షమీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాంతో షమీపై కేసులు విచారణలో ఉన్నాయి. ఆ క్రమంలోనే షమీ యూఎస్ వీసాను నిరాకరించారు. కాగా, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ జోహ్రీ వెంటనే స్పందించి అమెరికా రాయబార కార్యాలయానికి లేఖ రాశారు. భారత క్రికెటర్ అయిన మహ్మద్ షమీ ప్రపంచ కప్‌తోపాటు పలు క్రికెట్ టోర్నీల్లో పాల్గొని విజయాలు సాధించాడని, అతనికి పీ వన్ కేటగిరి కింద అంతర్జాతీయ క్రీడాకారుడిగా గుర్తించి వీసా జారీ చేయాలని బీసీసీఐ సీఈవో కోరారు. దీంతో అమెరికా షమీకి ఎట్టకేలకు వీసా జారీ చేసినట్లు సమాచారం. -
నిక్కీ అడుగులు ఎటువైపు ?
ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి, భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ ఆకస్మికంగా రాజీనామా చేయడం పలు ఊహాగానాలకు దారి తీస్తోంది. అమెరికాలో మధ్యంతర ఎన్నికలకు నెలరోజుల ముందు ఆమె రాజీనామా చేయడం ట్రంప్ సర్కార్‌కి దెబ్బేనన్న భావన వ్యక్తమవుతోంది. రాజీనామా అనంతరం ప్రెస్ మీట్లో నిక్కీ హేలీ ట్రంప్‌ను పల్లెత్తు మాట అనలేదు. పైపెచ్చు 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకే తాను మద్దతు పలుకుతానని స్పష్టం చేశారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో నిక్కీ హేలీ పోటీపడతారన్న ఊహాగానాలకు ఆమె తెరదించుతూ తాను ట్రంప్ తరఫున ప్రచారం చేస్తానని మాత్రమే ఆమె వెల్లడించారు. అధ్యక్ష ఎన్నికల్లో ఆమె పోటీ పడినా, లేకపోయినా ట్రంప్‌కు రాజకీయంగా ముప్పుగా మారుతారన్న విశ్లేషణలైతే వినిపిస్తున్నాయి. రాజకీయ అడుగులు ఎటు ? నిక్కీ హేలీ అమెరికా రాజకీయాల్లో తనకంటూ సొంతంగా ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. భారత వలసదారుల కుటుంబంలో పుట్టి, మైనార్టీగా ఉన్నప్పటికీ 2010లో దక్షిణ కేరొలినాకు తొలి మహిళా గవర్నర్‌గా ఎన్నికయ్యారు. అతి పిన్న వయసులోనే గవర్నర్ పదవిని చేపట్టిన మహిళగా రికార్డు సృష్టించారు. 2014లో తిరిగి గవర్నర్ పదవి చేపట్టారు. ట్రంప్ ప్రభుత్వంలో చేరేవరకు గవర్నర్‌గానే ఉన్నారు. అమెరికా రాయబారిగా ఆమె అనుసరించిన విదేశీ విధానం విమర్శకుల ప్రశసంల్ని సైతం పొందింది . ట్రంప్ ప్రభుత్వంలో రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ వైట్‌హౌస్‌తో వ్యవహారాల్లో విచక్షణ చూపిస్తూ, అమెరికా విదేశాంగ విధానానికి ఒక గుర్తింపు తెచ్చిన మహిళగా పేరు సంపాదించారు.‘‘రిపబ్లికన్ పార్టీలో నిక్కీ హేలీ ఒక రైజింగ్ స్టార్. అలాంటివారు ఎప్పటికైనా ట్రంప్‌కి ముప్పుగానే మారతారు’’ అని రిపబ్లికన్ పార్టీ వ్యూహకర్త మైక్ ముర్ఫీ అభిప్రాయపడ్డారు. రిపబ్లికన్‌పార్టీ అభ్యర్థుల ప్రచార వ్యూహకర్తగా పనిచేసిన క్రిస్టిన్మాథ్యూస్ కూడా హేలీ తన సొంత ప్రయోజనాల కోసమే రాయబారి పదవికి రాజీనామా చేసినట్టు అంచనా వేశారు. ‘‘హేలీ అద్భుతమైన పనితీరుని కనబరిచారు. ఆమెకున్న పేరుప్రతిష్టలను పెంచుకున్నారు. ట్రంప్ పాలనాయంత్రాంగంలో హేలీలాంటి వ్యక్తి మరొకరు కనిపించరు. భవిష్యత్ రాజకీయ కోసమే ఆమె పదవి నుంచి తప్పుకున్నారు’’అని మాథ్యూస్ వ్యాఖ్యానించారు.. డెమొక్రాట్లు కూడా హేలీ పనితీరుని అభినందించిన సందర్భాలు ఉన్నాయి. రాజకీయంగా ఆమె అడుగులు ఎటు వైపు వేస్తారన్న చర్చ డెమొక్రాటిక్ పార్టీలోకూడా సాగుతోంది. ట్రంప్‌తో ఢీ కొనాలంటే 2020లో అధ్యక్ష బరిలోకి దిగాలని, 2024 వరకు వేచి చూస్తే ఇప్పుడున్న పేరుని హేలీ కాపాడుకోవడం కష్టమన్న అభిప్రాయమూ వినిపిస్తోంది. గత ఎన్నికల్లో ట్రంప్‌తో ఢీ అంటే ఢీ గత అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో నిక్కీ హేలీ ట్రంప్‌కు మద్దతు ఇవ్వలేదు. ఫ్లోరిడా సెనేటర్ మార్కో రూబియోకు మద్దతుగా నిలవడమే కాదు, ట్రంప్‌ను తరచూ విమర్శించే వారు. ఆయన మాటల్ని తిప్పికొడుతూ ఉండేవారు. అయినప్పటికీ హేలీ సొంత రాష్ట్రంలోని ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ గెలిచారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక లైంగిక ఆరోపణలు వచ్చిన సమయంలో కూడా ఆమె బాధితుల పక్షానే మాట్లాడారు. ట్రంప్ ప్రభుత్వంలో చేరిన తర్వాత కూడా హేలీ ట్రంప్‌కు వ్యతిరేకమనే ఆరోపణలు కూడా వచ్చాయి. ట్రంప్ వ్యవహారశైలిపై ఆరోపణలు గుప్పిస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రికలో పేరు లేకుండా ప్రచురితమైన∙వ్యాసం నిక్కీ హేలీ రాసినదేనన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఆమె దానిని ఖండిస్తూ అధ్యక్షుడిని సవాల్చేయాల్సి వస్తే నేరుగానే చేస్తానని చెప్పుకున్నారు. ఇలా మొదట్నుంచి ట్రంప్‌ను వ్యతిరేకిస్తూ వస్తున్న హేలీ భవిష్యత్‌లో కూడా రాజకీయంగా ఢీ కొడతారన్న అభిప్రాయమైతే వినిపిస్తోంది. అమెరికా రాయబారి పదవికి నిక్కీ హేలీ రాజీనామా -
నిక్కి హేలీ స్థానంలో ఇవాంకను నియమించండి
-
నిక్కీ హేలీ స్థానంలో ఇవాంకా ట్రంప్..?!
వాషింగ్టన్ : ఐక్యరాజ్యసమితిలో అమెరికా ప్రతినిధిగా ఉన్న నిక్కీ హేలీ రాజీనామా చేశారు. ఎలాంటి ముందస్తు ఊహాగానాలు లేకుండా ఆమె అకస్మాత్తుగా రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. అయితే నిక్కీ రాజీనామా తరువాత ఆమె స్థానంలో ఎవరూ వస్తారు అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఇవాంకా ట్రంప్‌ని ఆ పదవిలో నియమిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగా ట్రంప్ కూడా సంకేతాలు వెలువరించారు. ‘నిక్కీ తర్వాత అలాంటి డైనమిక్ అంబాసిడర్ అయ్యే అర్హత ఇవాంకాకి ఉందనుకుంటున్నా. అయితే, నా కూతుర్ని ఎంపిక చేస్తే.. నాకు బంధుప్రీతి అని ఆరోపిస్తారేమో’ అంటూ ట్రంప్ విలేకరుల సమావేశంలో తెలిపారు. అయితే ఈ వార్తల్ని ఇవాంకా కొట్టి పారేశారు. ‘ప్రస్తుతం నేను వైట్ హౌస్‌లో చాలా గొప్ప వారితో కలిసి పనిచేస్తున్నాను. నిక్కీ హేలీ చాలా గొప్ప వ్యక్తి. ఆమె స్థానంలో అధ్యక్షుడు మరో గొప్ప వ్యక్తిని నియమిస్తారని నమ్ముతున్నాను. అయితే ఆ వ్యక్తి నేను మాత్రం కాదం’టూ ఇవాంకా ట్రంప్ తెలిపారు. దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ అయిన నిక్కీ హేలీ.. 2020 ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకే రాజీనామా చేసి ఉంటారనే ప్రచారం జోరందుకుంది. అయితే, ఆ వాదనను నిక్కీ హేలీ కొట్టిపారేశారు. ‘నా జీవితంలో ఇవి ఉన్నతమైన రోజులు. నా తర్వాత అంబాసిడర్‌గా వచ్చేవారికి అన్నీ అనుకూలంగా ఉండేలా చూడడం ఇప్పుడు నా ముందున్న లక్ష్యం. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో లేను. ట్రంప్‌కే ప్రచారం చేస్తా’ అని నిక్కీ హేలీ ప్రకటించారు. కానీ, తాను ఎందుకు రాజీనామా చేశారో మాత్రం ఆమె చెప్పలేదు. -
అమెరికా రాయబారి పదవికి నిక్కీ హేలీ రాజీనామా
వాషింగ్టన్ : ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి పదవికి నిక్కీ హేలీ రాజీనామా చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమె రాజీనామాకు ఆమోదం కూడా తెలిపినట్టు సమాచారం. ఇండియన్ అమెరికన్ అయిన నిక్కీ హేలీని 2016 నవంబర్‌లో ఐరాసకు అమెరికా రాయబారిగా ట్రంప్ నియమించారు. ఈ పదోన్నతితో అమెరికా యంత్రాంగంలో కేబినెట్ స్థాయి పదవికి నియమితురాలైన తొలి ఇండో అమెరికన్‌గా నిక్కీ పేరు మారుమోగింది. హేలీ గతంలో సౌత్ కరోలినా గవర్నర్‌గా కూడా పనిచేశారు. కాగా, అమెరికా కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం ఓవల్‌లోని కార్యాలయంలో తన స్నేహితురాలు నిక్కీ హేలీతో కలిసి ఓ ముఖ్యమైన ప్రకటన చేయనున్నట్టు ట్రంప్ ట్విట్ చేశారు. Big announcement with my friend Ambassador Nikki Haley in the Oval Office at 10:30am. — Donald J. Trump (@realDonaldTrump) October 9, 2018 -
అమెరికా ఎంబసీ వద్ద బాంబు పేలుడు
-
అమెరికా ఎంబసీ వద్ద పేలుడు
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద గురువారం బాంబు పేలుడు సంభవించింది. ఎంబసీ సమీపంలో పేలుడు శబ్దాలు వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకునిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పేలుడుకు పాల్పడింది చైనాలోని టోంగ్లియో ప్రాంతానికి చెందిన 26ఏళ్ల జియాంగ్గా గుర్తించారు. జియాంగ్ అమెరికా రాయబార కార్యాలయం ఎదుట బాంబు దాడికి యత్నించగా, బాంబు తీవ్రత తక్కువగా ఉండటంతో నిందితుడు మినహా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చైనా పోలీసులు తెలిపారు. నిందితుడి పూర్తి వివరాలను దాడికి గల కారణాలను పోలీసులు వెల్లడించలేదు. ఈ ఘటన జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే భారత ఎంబసీ కూడా ఉంది. పేలుడు అనంతరం ఎంబసీ సమీపంలో దట్టమైన పొగ అలుముకున్న ఫోటోలు సామాజికమాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. పేలుడు జరిగిన కొద్ది సమయంలోనే ఎంబసీ కార్యకలాపాలను పునరుద్దరించారు. -
ఇజ్రాయిల్ పాలస్తీనా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తత.. 37మంది మృతి
-
అమెరికాపై రష్యా దౌత్య ప్రతీకారం
మాస్కో: అమెరికా చర్యకు రష్యా ప్రతిచర్యలకు ఉపక్రమించింది. మాజీ గూఢచారి సెర్గీ స్క్రిపాల్పై బ్రిటన్‌లో జరిగిన విష ప్రయోగానికి రష్యానే కారణమంటూ అమెరికా గత వారం సియాటెల్‌లోని రష్యా రాయబార కార్యాలయాన్ని మూయించి, అందులోని 60 మంది దౌత్యాధికారుల్ని బహిష్కరించింది. ఇందుకు బదులుగా తీసుకుంటున్న చర్యల్లో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని అమెరికా రాయబార కార్యాలయానికి అనుమతులు రద్దు చేస్తూ అందులోని 60 మంది దౌత్యాధికారుల్ని బహిష్కరించనున్నట్లు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తెలిపారు. -
సీమాంతర ఉగ్రవాదాన్ని సహించం
న్యూఢిల్లీ: భారత్‌ను హిందూ–పసిఫిక్ సముద్ర ప్రాంతంలో ‘ప్రధాన శక్తి’గా అమెరికా పరిగణిస్తోందని భారత్‌లో ఆ దేశ రాయబారి కెన్నెత్ జస్టర్ పేర్కొన్నారు. అమెరికా వ్యాపార రంగానికి భారత్ ఓ కీలకమైన వాణిజ్య శక్తి అని అభివర్ణించారు. నవంబర్‌లో భారత రాయబారిగా జస్టర్ బాధ్యతలు తీసుకున్నప్పటికీ గురువారం తొలిసారిగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. భారత్‌పై అమెరికా విధానం గురించి కెన్నెత్ వివరించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని అమెరికా ఎట్టిపరిస్థితుల్లో సహించబోదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఆయన ప్రసంగంలో ఎక్కడా పాకిస్తాన్ పేరును ప్రస్తావించలేదు. ఇటీవల పాకిస్తాన్‌కు అమెరికా ఇచ్చే సాయాన్ని నిలిపేసిన విషయం తెలిసిందే. అమెరికాకు సంబంధించి సున్నితమైన సాంకేతికత బదిలీ విషయంలో మొదట్లో భారత్, అమెరికా మధ్య సంబంధాలు కాస్త దెబ్బతిన్న సంగతి నిజమేనని పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రధానమైన 4 ఎగుమతుల నియంత్రణ గ్రూపుల్లో భారత్ ఇప్పటికే రెండింటిలో (వాసెనార్, క్షిపణి సాంకేతికత నియంత్రణ గ్రూప్స్) సభ్యత్వం పొందిందని గుర్తు చేశారు. అలాగే ఆస్ట్రేలియా గ్రూప్ ఆన్ కెమికల్, బయలాజికల్ వెపన్స్ గ్రూపులో త్వరలోనే భారత్ చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అణు సరఫరాదారుల గ్రూపులో భారత్ సభ్యత్వం విషయంలో కూడా అమెరికా చాలా కృషి చేస్తోందని ఉద్ఘాటించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు: ► ఇంటెలిజెన్స్, నిఘా, యుద్ధ విమానాల తయారీలో ఇరుదేశాలకు భారీ ఒప్పందాలు జరగనున్నాయి. ► భారత్‌తో ఆర్థిక, వాణిజ్య సంబంధాల బలోపేతానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత్‌తో వాణిజ్యలోటు ఆందోళనకరమే. ► చైనాలో వ్యాపార నిర్వహణకు చాలా అమెరికన్ కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ సంస్థలన్నీ ఆశగా ప్రత్యామ్నాయ వేదికలకోసం వెతుకుతున్నాయి. ► అమెరికా వ్యాపారాల నిర్వహణకు అసలైన ప్రాంతీయ కేంద్రం భారత్. ► రక్షణ, ఉగ్రవాద వ్యతిరేక రంగాల్లో దీర్ఘకాల సుస్థిర బంధాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నాయి. ► వలసవాదుల దేశంగానే అమెరికా ఉండబోతోంది. ► భారత్, అమెరికా దేశాలు ఉగ్రబాధితులు. అందుకే ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ఇరుదేశాలు కలిసి పనిచేస్తున్నాయి. -
పాక్ గేమ్ ఇక చెల్లదు!
వాషింగ్టన్: ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ ఏళ్లుగా డబుల్ గేమ్ ఆడుతోందని, పాక్ తన వైఖరి మార్చుకోకపోవడం వల్లే.. ఆ దేశానికి ఇవ్వాలని భావించిన 255 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని నిలిపివేశామని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హెలీ స్పష్టం చేశారు. ‘పాకిస్థాన్‌కు 255 మిలియన్ డాలర్ల ఆర్థిక సహకారాన్ని అమెరికా నిలిపివేసింది. ఇందుకు కారణాలు సుస్పష్టం. పాకిస్థాన్ ఏళ్లుగా డబుల్ గేమ్ ఆడుతోంది’ అని ఆమె అన్నారు. ఉగ్రవాదానికి ఆశ్రయమిస్తూ.. మద్దతుగా నిలుస్తుండటంతోనే పాకిస్థాన్‌కు పూర్తిస్థాయిలో నిధులు నిలిపేయాలన్న తీవ్ర నిర్ణయానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చారని తెలిపారు. ‘కొన్ని సందర్భాల్లో పాకిస్థాన్ మాతో కలిసి పనిచేసింది. అదే సమయంలో ఆఫ్గనిస్థాన్‌లో మాపై దాడులు చేస్తున్న ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోంది. పాక్ ఆడుతున్న ఈ గేమ్ మాకు ఆమోదయోగ్యం కాదు. ఉగ్రవాదంపై పోరులో పాక్ నుంచి ఎక్కువ సహకారాన్ని ఆశిస్తున్నాం’ అని ఆమె తెలిపారు. ఉగ్రవాదంపై పోరు విషయంలో ఆఫ్ఘన్లో తమకు ఏమాత్రం సహాయం చేయడం లేదని మండిపడుతూ.. తాజాగా అధ్యక్షుడు ట్రంప్ పాక్‌కు అందజేసే సహాయ నిధులను పూర్తిగా నిలిపేసిన సంగతి తెలిసిందే. -
భారత్‌లో అమెరికా రాయబారిగా కెనెత్
వాషింగ్టన్: భారత్‌లో అమెరికా రాయబారిగా కెనెత్ జెస్టర్(62)ను నామినేట్ చేస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ ప్రకటించారు. ట్రంప్‌నకు గట్టి మద్దతుదారైన జెస్టర్.. భారత్, అమెరికా చారిత్రక అణు ఒప్పందం ఖరారులో కీలక పాత్ర పోషించారు. బుష్ హయాంలో ఇండో-యూఎస్ సంబంధాల మెరుగుదలకు ఆయన తీవ్ర కృషి చేశారు. జెస్టర్ నామినేషన్ విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్ సెనేట్‌కు తెలిపారు. సెనేట్ త్వరలోనే జెస్టర్ నియామకాన్ని ఆమోదిస్తుందని భావిస్తున్నారు. సెనేట్ ఆమోదం తర్వాత ప్రస్తుత రాయబారి రిచర్డ్ వర్మ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. హార్వర్డ్ లాస్కూల్ నుంచి కెనెత్ లా డిగ్రీ చేశారు. అనంతరం పబ్లిక్ పాలసీపై మాస్టర్స్ డిగ్రీ పొందారు. -
అమెరికా రాయబారిగా కెన్నెత్ జష్టర్
సాక్షి, వాషింగ్టన్: భారత్‌లో అమెరికా రాయబారిగా కెన్నెత్ జష్టర్(62)ను నియమించినట్లు అమెరికా ప్రకటించింది. ఈసందర్భంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లో మాట్లాడుతూ భారత్‌లో అమెరికా రాయబారిగా ఆర్థికవేత్త, నిపుణుడైన కెన్నెత్ జష్టర్‌ను నియమించినట్లు ఆయన ప్రకటించారు. గత జూన్‌లోనే భారత్‌కు నూతన రాయబారిని నియమించే అవకాశం ఉందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. కెన్నెత్ అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారల్లో అమెరికా తరపున అధ్యక్షుడిగా, జాతీయ ఆర్థిక మండలికి డిప్యూటీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. సెనేట్ అమోదం పొందిన వెంటనే జష్టర్ గతంలో భారత్‌లో అమెరికా రాయబారిగా కొనసాగిన రిచర్డ్ వర్మ ఆయన స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి భారత్‌లో అమెరికా రాయబారి స్థానం ఖాళీగా ఉంది. -
అమెరికా ఎంబసీ సమీపంలో బాంబు దాడి
కాబూల్: అఫ్ఘనిస్థాన్ రాజధానిలో కాబూల్‌లో మంగళవారం బాంబు పేలుడు జరిగింది. అమెరికా ఎంబసీ కార్యాలయ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరో 8 మందికి గాయాలయ్యాయి. పేలుడు జరిగిన ప్రాంతంలో అమెరికా ఎంబసీతో పాటు పలు దేశాల రాయబార కార్యాలయలున్నాయి. -
ట్రంప్ ప్రభుత్వంలో మరో తెలుగు సంతతి వ్యక్తి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత సంతత వ్యక్తికి తన ప్రభుత్వంలో కీలక పదవిని అప్పజెప్పారు. పెరూ దేశ అమెరికా రాయబారిగా భారతీయ అమెరికన్ కృష్ణా ఆర్ ఉర్స్ ను నియమించారు. అమెరికా దేశ రాయబారిగా 1986 లో కెరీర్ ప్రారంభించిన ఆయన ప్రస్తుతం స్పెయిన్‌లోని అమెరికా ఎంబసీలో డిప్యూటీ చీఫ్‌గా పనిచేస్తున్నారు. గత ముప్పై ఏళ్లుగా దక్షిణ అమెరికా దేశాలకు సంబంధించిన ఆర్థిక, అభివృద్ధి విధానాల నిపుణుడిగా కృష్ణా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఇప్పటి వరకు సీనియర్ అధికారిగాను, యూఎస్ఏ తరఫున ఏడు దేశాల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఆయన తెలుగు, హిందీతో పాటు స్పానిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. టెక్సాస్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్‌ను, జార్జిటౌన్ యూనివర్సిటీ నుంచి బీఎస్ డిగ్రీని పొందారు. పెరూకు అమెరికా దౌత్యవేత్తగా కృష్ణను నియమిస్తున్నట్లు వైట్‌హౌస్ అధికారిక ప్రకటన చేసింది. కాగా ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ముగించుకు రాగానే.. భారత సంతతి వ్యక్తికి కీలక పదవి తగ్గడం విశేషం. -
అమెరికా ఆఫీసుల్లో వాటిపై నిషేధం
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలోని తమ దౌత్య కార్యాలయాల్లోకి సందర్శకులు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఐప్యాడ్లు లాంటి పరికరాలను తీసుకురాకుండా అమెరికా నిషేధం విధించింది. గురువారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తున్నట్లు పేర్కొంది. చెన్నై కేంద్రంలో అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలను ఇప్పటికే నిషేధించారు. ప్రపంచవ్యాప్తంగా తమ అన్ని కేంద్రాల్లోనూ అమెరికా ఇలాంటి చర్యలే చేపట్టింది. యూఎస్ ప్రభుత్వ కార్యాలయాల్లో భద్రతను పెంచేందుకే ఈ మార్పులు చేస్తున్నామని ఢిల్లీ దౌత్య కార్యాలయం అధికార ప్రతినిధి వెల్లడించారు. వ్యక్తిగత ఎలక్ట్రానిక్ వస్తువులు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఐప్యాడ్లతో పాటు నెట్బుక్స్, క్రోమ్‌బుక్స్, ఐపాడ్లు, కిండిల్స్, మ్యాక్‌బుక్స్‌లను కూడా అనుమతించబోమని స్పష్టం చేశారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా దౌత్య కార్యాలయాల్లోకి సందర్శకులను మొబైల్ఫోన్లతో అనుమతిస్తామని చెప్పారు. చెన్నై కార్యాలయంలో మొబైల్ఫోన్లను కూడా అనుమతించబోమన్నారు. సందర్శకుల ఎలక్ట్రానిక్ వస్తువులు కార్యాలయం వెలుపల పెట్టుకునేందుకు ఎటువంటి ఏర్పాట్లు లేవని వెల్లడించారు. -
కొత్తగా 2 లక్షల ఉద్యోగాలొచ్చాయ్!
వాషింగ్టన్ : ట్రంప్ ప్రభుత్వం పదవిలోకి వచ్చిన తర్వాత అమెరికాలో ఉద్యోగాల నియామకం పెరుగుతోంది. ఏప్రిల్ నెలలో అమెరికా కంపెనీలు 2,11,000 ఉద్యోగాలను పెంచుకున్నాయి. ఈ ఏడాదిలో మొదటి మూడు నెలల కాలంలో నమోదైన ఆర్థిక వ్యవస్థ పతనం తాత్కాలికమేనని ఈ డేటా సూచిస్తోంది. అదేవిధంగా నిరుద్యోగిత రేటు కూడా 4.4 శాతానికి పడిపోయింది. దశాబ్దకాలంలో ఇదే అత్యంత కనిష్టమని లేబర్ డిపార్ట్ మెంట్ పేర్కొంది. పేలవమైన ప్రదర్శన చూపిన తొలి క్వార్టర్ అనంతరం కన్జ్యూమర్ డిమాండ్ పునరుద్ధరించుకున్నట్టు బిజినెస్ లు అంచనా వేస్తున్నాయి. ఏడేళ్లుగా తక్కువగా వెచ్చిస్తూ వచ్చిన అమెరికన్లు ప్రస్తుతం తమ ఖర్చులను పెంచుకుంటున్నారని ఈ డేటా సూచించింది. ఇంకా ఉద్యోగాలు కావాల్సి ఉందని తెలిసింది. అంతకముందు వరకు నెలకు సగటును 1,85,000 ఉద్యోగాలను మాత్రమే కంపెనీలు ఏర్పాటుచేసేవి. ప్రస్తుతం ఆ ఉద్యోగాలు పెరిగాయి. అయితే సగటున చెల్లించే చెల్లింపులు చాలా నిదానంగా పెరుగుతున్నాయని వెల్లడైంది. 12 నెలల కాలంలో పేచెక్స్ 2.5 శాతమే పెరిగాయి. ఎంప్లాయర్స్ కూడా చాలా బలవంతం మీద వేతనాలను ఎక్కువ చెల్లిస్తున్నారని తెలిసింది. -
ఉగ్రవాదం కేసులో శిశువుకు సమన్లు!
ఓ తాతయ్య అనుకోకుండా చేసిన పొరపాటు.. ఆయన మూడు నెలల మనవడికి అనుకోని చిక్కులు తెచ్చిపెట్టింది. ఈస్టాగా పేరొందిన వీసా మాఫీ పత్రాల్లో సదరు తాతయ్య పొరపాటును ఓ ప్రశ్నకు 'నో' అని సమాధానం పెట్టేందుకు బదులు 'ఎస్' అని టిక్ చేశారు. అంతే అధికారులు కూడా ఏమాత్రం బుర్ర ఉపయోగించలేదు. ఏకంగా మూడు నెలల బాలుడికి సమన్లు పంపించడమే కాదు.. ఉగ్రవాద సంబంధాల కేసులో అతన్ని ప్రశ్నించడానికి రాయబార కార్యాలయానికి పిలిపించారు. ఈ విచిత్రమైన ఘటన లండన్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో జరిగింది. తాతయ్య పౌల్ కెన్యన్ తన మూడు నెలల మనవడు హర్వీ కెన్యన్‌ను తొలిసారి విదేవీ పర్యటనకు తీసుకెళ్లాలని నిర్ణయించాడు. ఇందులో భాగంగా చిన్నారికి వీసా లేకుండా ప్రయాణానికి అవసరమైన ఈస్టా దరఖాస్తును ఆయన నింపాడు. అయితే, 'మీరు ఉగ్రవాద కార్యకలాపాలు, గూఢచర్యం, జాతి వ్యతిరేక కుట్ర లేదా సామూహిక హననానికి పాల్గొనాలనుకుంటున్నారా? లేక గతంలో పాల్పడ్డారా?' అన్న ప్రశ్నకు పౌల్ పొరపాటున ఎస్ అని పెట్టారు. అంతే, లండన్ నుంచి ఫ్లోరిడాలోని ఓర్లాండ్‌కు ఆ శిశువు ప్రయాణాన్ని నిలిపివేయడమే కాకుండా అతన్ని లండన్‌లోని అమెరికా రాయబారా కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించారు. చేషైర్లోని పాయిన్టన్ నుంచి లండన్‌లోని రాయబార కార్యాలయానికి వచ్చేందుకు ఆ బాలుడి కుటుంబానికి పది గంటల సమయం పట్టింది. ఇక, అధికారుల ప్రశ్నల సమయంలో ఆ శిశువు ఏమాత్రం ఏడవకుండా శాంతంగానే ఉన్నాడని అతని తాత తెలిపాడు. ఈ ఘటన వల్ల ఆ చిన్నారి కుటుంబానికి 3వేల డాలర్లు అధిక వ్యయం కావడమే కాకుండా.. కుటుంబమంతా ఒకేసారి విదేశీ విహారానికి వెళ్లలేకపోయింది. మొదట తాత, అతని ఇంకో మనవరాలు అనుకున్న సమయానికి అమెరికా వెళ్లిపోగా.. కొడుకు కోసం ఆగిపోయిన తల్లిదండ్రులు కొన్నిరోజుల తర్వాత వెళ్లి వారిని కలుసుకున్నారు. -
భారత్–పాక్ ఉద్రిక్తత నివారణకు కృషి చేస్తాం
న్యూయార్క్: భారత్, పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోకూడదన్న అమెరికా విధానంలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య ఉద్రికత్తను తగ్గించేందుకు యత్నిస్తామని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ చెప్పారు. ‘ఉద్రిక్తతలను తగ్గించే యత్నాల్లో మావంతు పాత్ర ఏమిటో కనుగొనేందుకు మా ప్రభుత్వం చర్చిస్తుంది.. ఏదో ఒకటి జరిగేవరకు వేచిచూడం’ అని అన్నారు. ఈ ప్రయత్నంలో తమ దేశాధ్యక్షుడు ట్రంప్ భాగమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ఐరాస భద్రతా మండలికి సంబంధించి ఏప్రిల్ నెలకుగాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన హేలీ మీడియాతో మాట్లాడారు. శాంతి చర్చల కోసం భారత్, పాక్‌లను అమెరికా ఒప్పిస్తుందా అని అడిగిన ప్రశ్నకు ఆమె పైవిధంగా స్పందించారు. హేలీ వ్యాఖ్యలను భారత్ తోసిపుచ్చింది. ఉగ్రరహిత వాతావరణంలో వివాదాలను పరిష్కరించుకోవడం తమ విధానమని, అయితే హింస ఇంకా కొనసాగుతూనే ఉందని విదేశాంగ ప్రతినిధి చెప్పారు. -
'మా అమ్మను భారత్‌లో జడ్జి కానివ్వలేదు'
న్యూయార్క్: భారత్‌లో తన తల్లి న్యాయశాస్త్రాన్ని చదివి లాయర్ అయినా.. అప్పుడున్న పరిస్థితులు ఆమె న్యాయమూర్తి (జడ్జి)ని కానివ్వలేదని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హెలీ గుర్తుచేసుకున్నారు. భారత సంతతికి చెందిన ఆమె బుధవారం ఐరాసలో అంతర్జాతీయ సంబంధాలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా మహిళల పాత్ర గురించి ప్రశ్నించగా.. ఆమె మాట్లాడుతూ.. 'నేను మహిళలకు పెద్ద అభిమానిని. వారు చేయలేనిదంటూ ఏమీ లేదు. మహిళల పురోగతికి కృషి చేసే ఏ ప్రజాస్వామ్యమైనా.. దానివల్ల అధికంగా లబ్ధి పొందుతుంది' అని పేర్కొన్నారు. భారత్‌లో తన తల్లి జీవితాన్ని ఆమె ఈ సందర్భంగా వివరించారు. 'భారత్‌లో పెద్దగా చదువుకొనే అవకాశం లేకపోయినప్పటికీ మా అమ్మ లా స్కూల్‌కు వెళ్లి విద్యాభ్యాసం చేసింది. భారత్‌లో తొలి మహిళా న్యాయమూర్తిగా ఆమెకు అవకాశం లభించి ఉండేది. కానీ అప్పుడున్న పరిస్థితుల వల్ల ఆమె న్యాయమూర్తిగా ధర్మాసనంలో కూర్చోలేకపోయింది. కానీ తన కూతురే ఇప్పుడు సౌత్ కరోలినా గవర్న్‌ర్ కావడం, ఐరాసకు అమెరికా రాయబారి కావడం ఆమెకు ఎంత గొప్పగా ఉంటుందో ఊహించుకోండి' అని నిక్కీ పేర్కొన్నారు. నిక్కీ హెలీ అజిత్ సింగ్ రాంధావ, రాజ్ కౌర్ రాంధావ దంపతులకు జన్మించారు. ఆమె మొదటి పేరు నిమ్రత రాంధావ. 1960లో ఆమె కుటుంబం మొదట కెనడాకు, ఆ తర్వాత అమెరికాకు వలస వెళ్లిపోయింది. నిజానికి, భారత తొలి మహిళ జడ్జిగా జస్టిస్ అన్నా చాందీ కీర్తి గడించారు. ఆమె తొలి మహిళ హైకోర్టు న్యాయమూర్తిగా కూడా నియమితులయ్యారు. 1937లోనే ఆమె ట్రావెన్కోర్ మునసబు (న్యాయాధికారి)గా నియమితులయ్యారు. -
కాల్పులను ఖండించిన అమెరికా
న్యూఢిల్లీ: కన్సాస్ జాతి విద్వేష కాల్పులను భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం ఖండించింది. ఈ ఘటనపై తమ దేశ దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని అమెరికా ఎంబసీ అధికారి మ్యారీకే ఎల్ కార్లసన్ వెల్లడించారు. కేసుపై వేగంగా దర్యాప్తు జరుపుతుందని అన్నారు. ఈ ఘటనలో తెలుగు వ్యక్తి శ్రీనివాస్ కూచిభొట్ల ప్రాణాలు కోల్పోవడం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెంటనే స్పందించింది. గాయపడిన మేడసాని అలోక్ ఇంటికి భారత కాన్సులేట్ జనరల్ ఆర్డీ జోషి వెళ్లి అతడిని పరామర్శించారు. అలోక్ క్షేమంగా ఉన్నాడని, అతడికి అవసరమైన సహాయం అందిస్తామని హూస్టన్ లోని భారత రాయబార కార్యాలయ అధికారి అనుమప్ రే హామీయిచ్చారు. శ్రీనివాస్ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. -
ఐరాసకు అమెరికా రాయబారిగా నిక్కీ హేలీ
వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితికి అమెరికా రాయబారిగా భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ హోదా ఉన్న ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయ అమెరికన్‌గా ఆమె రికార్డుకెక్కారు. 45 ఏళ్ల హేలీతో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రమాణం చేయించారు. దేశాధ్యక్షుడు ట్రంప్.. రాయబారిగా హేలీ నియాకాన్ని మంగళవారం ధ్రువీకరించగానే ఆమె దక్షిణ కరోలినా గవర్నర్ పదవికి రాజీనామా సమర్పించారు. ట్రంప్ కేబినెట్లో చేరిన తొలి మహిళగానూ హేలీ నిలిచారు. -
చరిత్ర సృష్టించిన నిక్కీ హెలీ!
వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో అమెరికా రాయబారిగా భారత సంతతికి చెందిన నిక్కీ హెలీ నియామకాన్ని అమెరికా సెనేట్ మంగళవారం ఖరారు చేసింది. ప్రస్తుతం దక్షిణ కరోలినా గవర్నర్‌గా ఉన్న ఆమె త్వరలోనే తన పదవికి రాజీనామా చేసి.. అమెరికాలోనే అత్యున్నత దౌత్యపదవిని చేపట్టనున్నారు. రిపబ్లికన్ పార్టీ రైజింగ్ స్టార్‌గా పేరొందిన నిక్కీ హెలీకి దౌత్య అనుభవం లేకపోయినా.. ఈ పదవి చేపట్టేందుకు ఆమెకు సెనేట్‌లో బంపర్ మెజారిటీ లభించడం గమనార్హం. డెమొక్రాట్లు సైతం ఆమెకు మద్దతు పలుకడంతో 96-4 మార్జిన్‌తో సెనేట్ ఆమోదం లభించింది. దీంతో అమెరికా అధ్యక్ష యంత్రాంగంలో క్యాబినెట్ ర్యాంకు పొందిన మొట్టమొదటి భారత సంతతి వ్యక్తిగా నిక్కీ హెలీ చరిత్ర సృష్టించారు. తన అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించే వ్యక్తిగా పేరొందిన నిక్కీ హెలీ సెన్సిబుల్ దౌత్యవేత్తగా అమెరికా ఖ్యాతిని ఐరాసలో నిలబెడతారని డెమొక్రాట్లు కూడా భావిస్తుండటంతోనే ఆమెకు ఈ స్థాయిలో మద్దతు లభించింది. అమెరికా ఎన్నికల ప్రచారంలో ఐరాసపై కూడా ట్రంప్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ట్రంప్ అభిప్రాయాలతో నిక్కీ హెలీ నిర్ద్వంద్వంగా విభేదించారు. రాయబారి పదవీ ధ్రువీకరణ విషయంలో సెనేట్ కమిటీ ముందు హాజరైన నిక్కీ.. రష్యా తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. నాటో కొనసాగింపును స్వాగతించారు. అలాగే ముస్లింలపై నిషేధం విధించాలి, వారి జనాభా రిజిస్టర్‌ను కొనసాగించాలన్న వ్యాఖ్యలను సైతం వ్యతిరేకించారు. ఇవన్ని అధ్యక్షుడు ట్రంప్ అభిప్రాయాలను విభేదించేవే. అయినా నిర్భయంగా నిక్కీ తన అభిప్రాయాలను వ్యక్తీకరించడంతో ప్రతిపక్ష డెమొక్రాట్ సభ్యుల మద్దతును కూడా ఆమె పొందగలిగారు. -
భారత్‌లో అమెరికా రాయబారిగా టెల్లిస్?
వాషింగ్టన్: భారత్‌లో తదుపరి అమెరికా రాయబారిగా అష్లే టెల్లిస్ (55) నియమితులయ్యే వీలుంది. డొనాల్డ్ ట్రంప్.. ముంబైలో జన్మించిన టెల్లిస్‌కు భారత, ఆసియా బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్లు తెలిసింది. వైట్‌హౌజ్ మాజీ ఉద్యోగి అయిన టెల్లిస్ భారత్, ఆసియా అంశాల్లో నిపుణుడు. దక్షిణముంబైలోని సెయింట్ గ్జేవియర్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ, పీజీ పూర్తిచేశారు. ఆసియా రాజకీయాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన ట్రంప్.. టెల్లిస్‌ను ఎంచుకున్నట్లు ఓ అమెరికన్ వార్తా సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం రిచర్డ్ వర్మ భారత్‌లో అమెరికా రాయబారిగా ఉన్నారు. -
అమెరికా ఎంబసీ వద్ద కాల్పుల కలకలం
అంకార: అంకారలోని అమెరికా రాయబార కార్యాలయం ముందు ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. టర్కీలో రష్యా రాయబారి హత్యకు గురైన కొన్ని గంటల్లోనే ఈ సంఘటన చోటుచేసుకోవడంతో అధికారులు షాక్ తిన్నారు. నల్లటి కోటు ధరించిన ఓ వ్యక్తి రాయబార కార్యాలయం ముందుకు వచ్చి ఎనిమిది రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. అనంతరం ఎంబసీలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే, అక్కడే ఉన్న గార్డులు చాలా ధైర్యంగా అతడిని నిలువరించి చేతిలోని గన్ లాక్కుని ఎలాంటి నష్టం లేకుండా చూశారు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలవలేదు. అంకారాలోనే రష్యా రాయబారిని పోలీసు దుస్తుల్లో వచ్చిన ఓ దుండగుడు వేదికపైనే కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఆ షాక్ నుంచి తేరుకోకముందే మరో రాయబార కార్యాలయం లక్ష్యంగా దాడికి యత్నం జరగడాన్ని అక్కడి అధికారులు సీరియస్ గా తీసుకుంటున్నారు. -
రద్దుపై మోదీకి అమెరికా రాయబారి ప్రశంస
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు ప్రభావం అమెరికా-భారత్ దౌత్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ భారత దేశంలోని అవినీతిని రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నారని తమకు అర్థమైందని అన్నారు. అదే సమయంలో ప్రజలు పడుతున్న అవస్థలను కూడా తాము అర్థం చేసుకున్నామని చెప్పారు. బుధవారం కోల్‌కతాలో జరిగిన ఓ సమావేశంలో పెద్ద నోట్ల రద్దుపై స్పందించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ రాయబార కార్యాలయంలో భారతీయ ఉద్యోగులు చాలా ఎక్కువ మంది ఉన్నారని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. సీమాంతర ఉగ్రవాదాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. అలాంటిదానికి అంతంపలకాలని కోరారు. అలాంటి చర్యలకు పాల్పడే వారిని దోషులుగా గుర్తించి శిక్షించాల్సిందేనని తెలిపారు. పాకిస్థాన్‌తో తమ దేశం చేసుకున్న రక్షణ ఒప్పందం దృష్టంతా ఉగ్రవాదాన్ని నిర్మూలించే అంశంలో భాగమేనని, కానీ భారత్‌తో సంబంధాల విషయంలో విస్తృతి పెద్దదని తెలిపారు. భారత్‌తో సంబంధాల తమకు చాలా ముఖ్యమైనవని అన్నారు. -
ఆ పోర్న్ స్టార్‌ను రాయబారిగా నియమించండి!
అమెరికాలో వైరల్ ఆన్లైన్ పిటిషన్ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికకావడంతో చాలామంది షాక్ తిన్నారు. పలువురు అమెరికన్లయితే గుండెలు అవిసేలా రోదించారు. బిజినెస్ టైకూన్ అయిన్ ట్రంప్ గెలుపుతో అమెరికా అంతటా ఆందోళనలు చెలరేగాయి. అందుకు కారణం ఎన్నికల సందర్భంగా ట్రంప్ ఉయోగించిన విద్వేష భాషనే. ముస్లింలు అమెరికాకు రాకుండా నిషేధం విధిస్తానని, అమెరికాలోని వలసదారులపై కొరడా ఝళిపిస్తానని ట్రంప్ పలు విద్వేషపూరితమైన హామీలు ఇచ్చారు. అయితే, ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తన హామీలపై కొంత వెనుకకు తగ్గినట్టు కనిపిస్తోంది. భారత సంతతికి చెందిన నిక్కీ హెలీని ఐక్యరాజ్యసమితికి అమెరికా రాయబారిగా నియమించారు. ట్రంప్ తొలి మహిళా నియామకం ఇదే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు ఒక చిత్రమైన విజ్ఞప్తి ఆన్లైన్లో అందింది. ప్రముఖ పోర్న్‌స్టార్‌గా, శృంగార తారగా పేరొందిన మియా ఖలిఫాను సౌదీ అరేబియాకు అమెరికా రాయబారిగా నియమించాలంటూ చేంజ్.ఓఆర్జీ వెబ్సైట్లో ఆన్లైన్ పిటిషన్ నమోదైంది. ‘సాంస్కృతిక నేపథ్యాలకు అతీతంగా జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రజలను ఒక్కచోటకు చేరుస్తున్న ఘనత మియా ఖలిఫాది. మధ్యప్రాచ్యంలో ఆమె మనకు గొప్ప నేతగా వెలుగొందనుంది. అమెరికా బహుళ సంస్కృతికి ప్రతీకగా నిలువనుంది’ అంటూ పిటిషనర్ దీనిని పెట్టాడు. సరదాకు పెట్టినట్టు భావిస్తున్న ఈ ఆన్లైన్ పిటిషన్ వెంటనే వైరల్‌గా మారిపోయింది. దీనికి మద్దతుగా ఇప్పటికే 1200మంది సంతకాలు చేశారు. మరో మూడు వందల సంతకాలు వస్తే.. ఈ పిటిషన్ అధికారికంగా స్వీకరించేందుకు అర్హత సాధిస్తోంది. మరోవైపు ఈ వైరల్ పిటిషన్‌పై సోషల్ మీడియాలో ఛలోక్తులు వెల్లువెత్తుతున్నాయి. -
ఐక్యరాజ్య సమితికి ఎన్నారై మహిళ
భారత-అమెరికన్ మహిళ నిక్కీ హేలీకి బంపర్ చాన్స్ తగిలింది. దక్షిణ కరొలినా గవర్నర్‌గా ఉన్న ఆమె.. ఐక్యరాజ్య సమితికి అమెరికా రాయబారిగా వెళ్లనున్నారు. ఈ మేరకు అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆఫర్‌ను ఆమె అంగీకరించినట్లు వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఓ కథనంలో పేర్కొంది. దీంతో కేబినెట్ స్థాయిలో ట్రంప్ నియమించిన మొట్టమొదటి మహిళగా ఆమె నిలిచారు. అయితే ట్రంప్ బృందం మాత్రం ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. నిక్కీ హేలీ (44) తల్లిదండ్రులు భారత దేశం నుంచి అమెరికాకు వలస వెళ్లారు. ప్రస్తుతం ఆమె రెండోసారి దక్షిణ కరొలినా గవర్నర్‌గా ఉన్నారు. గవర్నర్‌గా ఉన్న పాలనాకాలంలో వాణిజ్య, కార్మిక సమస్యల మీద ప్రధానంగా దృష్టి సారించారు. ఆమెకు దౌత్యపరమైన అనుభవం మాత్రం పెద్దగా లేదు. కానీ, అమెరికా సైన్యం, జాతీయ భద్రత లాంటి అంశాల్లో ఆమె విధానాలు ప్రధానస్రవంతిలోని ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలతో సరిపోతాయని వాషింగ్టన్ పోస్ట్ వ్యాఖ్యానించింది. ప్రధానమైన పదవుల్లో ఎవరెవరిని నియమించాలనే అంశంపై చర్చలలో భాగంగా గత వారం న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో నిక్కీ హేలీని డోనాల్డ్ ట్రంప్ కలిసి చర్చించారు. దాంతో.. మిట్ రోమ్నీతో పాటు ఆమెను కూడా విదేశాంగ మంత్రిని చేయబోతున్నారనే కథనాలు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు మాత్రం హేలీని ఐక్యరాజ్య సమితికి పంపడం దాదాపు ఖాయమైనట్లే చెబుతున్నారు. -
ఉప్పు, నిప్పుల మధ్య కీలక ముందడుగు
వాషింగ్టన్ డీసీ: దశాబ్దాలుగా ఉప్పు, నిప్పులా ఉన్న అమెరికా,క్యూబా సంబంధాల్లో కీలక ముందడుగు పడింది. ఐదు దశాబ్దాల అనంతరం క్యూబాలో అమెరికా రాయబార కార్యాలయం తెరుచుకోనుంది. జెఫ్రీ డిలారెంటిస్ ను క్యూబాలో అమెరికా రాయబారిగా నియమిస్తూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.50 ఏళ్ల అనంతరం క్యూబాలో అంబాసిడర్‌ను నియమించడం గర్వంగా ఉందని ఒబామా వ్యాఖ్యానించారు. క్యూబా, అమెరికా సంబంధాలను మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషించిన ఆయన జెఫ్రీని అభినందించారు.ఇరు దేశాల మధ్య ఉన్న యుద్ధ పూరిత పరిస్థితులను పరిష్కరించడంలో ఒబామాతో కలిసి జెఫ్రీ కీలకపాత్ర పోషించారు. దాదాపు 90 ఏళ్ల అనంతరం ఈ యేడాది మార్చిలో అమెరికా అధ్యక్షుని హోదాలో ఒబామా క్యూబాలో పర్యటించారు. దీంతో ఇరు దేశాలు స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించుకోవడంలో కీలక ముందడుగు పడింది. -
గౌరవమే ముఖ్యం... వీసా తృణప్రాయం..
న్యూఢిల్లీః 'పగరీ'ని తీయమన్నందుకు ప్రముఖ బీజేపీ ఎంపీ ఏకంగా యూఎస్ వీసానే తిరస్కరించారు. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో ఒకటైన పగరీని ధరించి యూఎస్ ఎంబసీకి వీసాకోసం వెళ్ళిన ఆయన్ను.. తలపై ధరించిన పగరీ తీయాలని సూచించడంతో ఆగ్రహించిన ఎంపీ.. తమ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే.. ప్రత్యేక గౌరవాన్నిచ్చే పగరీని తలపైనుంచీ తీసేది లేదంటూ.. వీసానే వద్దన్నారు. తమదేశంలో జరిగే రైతు సదస్సులో పాల్గొనేందుకు రావాలంటూ ఆహ్వానం పలికిన అమెరికా వీసాకోసం ఎంబసీకి పిలిచింది. ఈ సందర్భంలో అధికారులు పగరీని తీసేయమనడంతో అవమానంగా భావించిన సదరు ఎంపీ వీసానే తిరస్కరించారు. బీజేపీ లోక్ సభ ఎంపీ వీరేంద్ర సింగ్.. యూఎస్ వీసాను తృణప్రాయంగా తిరస్కరించారు. తనకు వీసాకన్నా భారత సంస్కృతీ సంప్రదాయాలే ముఖ్యమని స్పష్టం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా అమెరికా ఎంబసీ ఇంటర్వ్యూలో వీరేంద్ర సింగ్ ను పగరీ తీయమని అడగడంతో ఆయన ఆగ్రహించారు. వీసాను ఇవ్వకున్నా సరేగానీ తమ సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నమైన పగరీని తీసేది లేదని వక్కాణించారు. అయితే మొదటి ఇంటర్వ్యూలో యూఎస్ ఎంబసీ తన పగరీపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో.. అమెరికానే స్వయంగా తనను ఆహ్వానించినట్లు గుర్తు చేశారు. వీసాకోసం బుధవారం యూఎస్ ఎంబసీకి వెళ్ళని వీరేంద్ర సింగ్ ను 'పగరీ' (తలపాగా) తీయమని అడగడంతో అందుకు అంగీకరించిన ఆయన... ఆమెరికా ఆహ్వానాన్ని సైతం బుట్టదాఖలు చేశారు. రైతు కుటుంబానికి చెందిన తనకు పగరీ ఓ గౌరవ చిహ్నమని, దేశ సంస్కృతీ సాంప్రదాయాలకూ గుర్తుగా ఉండే పగరీని తీసేది లేదంటూ ఎంబసీకి వివరించినట్లు వీరేంద్ర సింగ్ చెప్పారు. భద్రతకోసం తన గౌరవాన్ని ఎలా వదులుకుంటానంటూ ఆయన ప్రశ్నించారు. తమ దేశాన్ని సందర్శించమని అమెరికా స్వయంగా ఆహ్వానించిందని.. పగరీ తీయమన్నందుకు తాను వీసాను తిరస్కరించినట్లు చెప్పారు. భారత సంప్రదాయ సంస్కృతుల్లో భాగంగా మహాత్మా పూలే వంటి వారు కూడా పగరీ ధరించడం కనిపిస్తుంది. అటువంటి పగరీని పార్లమెంట్ లో సమస్యలపై చర్చించేప్పుడు సైతం ధరించి కనిపించే వీరేంద్ర సింగ్.. వీసాకోసం ఎంబసీముందు తీయడం అగౌరవంగా భావించి.. ఏకంగా యూఎస్ వీసానే తిరస్కరించారు. ఆత్మ గౌరవంకోసం అమెరికాకే షాకిచ్చిన ఎంపీ... జరిగిన ఘటనపై పార్లమెంట్ లో లేవనెత్తుతానని హెచ్చరించారు. -
చాద్ రాయబారిగా భారతీయ అమెరికన్ మహిళ
వాషింగ్టన్: సెంట్రల్ ఆఫ్రికా దేశం చాద్‌లో తమ తదుపరి దౌత్యవేత్తగా భారత సంతతికి చెందిన గీతా పసిని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నామినేట్ చేశారు. ఆమె ప్రస్తుతం ఆఫీస్ ఆఫ్ కెరీర్ డెవలప్మెంట్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 2011-14 మధ్యకాలంలో జిబౌటి దేశంలో అమెరికా రాయబారిగా ఆమె సేవలందించారు. అంతకుముందు రెండేళ్లు తూర్పు ఆఫ్రికా వ్యవహారాల కార్యాలయ డెరైక్టర్‌గా పనిచేశారు. అమెరికా విదేశీ వ్యవహారాల విభాగంలో 1988లో చేరిన గీత భారత్‌తో పాటు కామెరూన్, ఘనా, రొమేనియాల్లోనూ పనిచేశారు. చాద్ దౌత్యవేత్తతో పాటు పలు కీలక పదవులకు అధికారులను ఒబామా నామినేట్ చేసినట్లు వైట్‌హౌస్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. -
54 ఏళ్ల తరువాత యూఎస్ ఎంబసీలోకి జాతీయ జెండా!
హవానా: గత కొన్ని దశాబ్దాల నుంచి అగ్రరాజ్యం అమెరికాకు పొరుగు దేశం క్యూబాతో సత్సబంధాలు లేవు. దీంతో 54 ఏళ్ల క్రితం క్యూబాలోని రాయబార కార్యాలయంలో అమెరికన్ జాతీయ జెండాను తొలగించారు. ఎప్పుడో ఐదు దశాబ్దాల క్రితం క్యూబాలోని అమెరికా రాయబార కార్యాలయంలో తొలగించబడిన ఆ దేశ జాతీయ జెండా.. ఎట్టకేలకు తిరిగి వారి రాయబార కార్యాలయంలో రెపరెపలాడింది. 1961, జనవరి 4 వ తేదీన ఇరు దేశాల మధ్య పరస్పర వైరంతో క్యూబాలోని అమెరికన్ రాయబార కార్యాలయం నుంచి జాతీయ జెండాను తొలగించారు. అయితే ప్రస్తుతం ఇరుదేశాల మధ్య సత్సంబంధాలకు బీజం పడింది. 1945 తరువాత తొలిసారి అమెరికన్ దేశ సెక్రటరీ కెర్రీ క్యూబా దేశంలో పర్యటించారు. ఈ సందర్భంగా జాన్ కెర్రీ శుక్రవారం క్యూబాలోని అమెరికన్ రాయబార కార్యాలయంలో తమ దేశ జాతీయ జెండాను ఆవిష్కరించి మర్యాద పూర్వక వేడుకలను నిర్వహించారు. అనంతరం ప్రసంగించిన ఆమె.. ఇక నుంచి రెండు దేశాల ప్రజలు ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రగతి పథంలో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. తొలుత ఇంగ్లిష్ లో తరువాత స్పానిష్ లో మాట్లాడిన ఆమె.. ఇరు దేశాలు తప్పక అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదామన్నారు. ఇదిలాఉండగా గత 50 సంవత్సరాల నుంచి అమెరికాతో సత్సబంధాలను కొనసాగించకపోవటంతో క్యూబా ఆర్థిక పరిస్థితి తీవ్ర అవరోధంలోకి నెట్టింది. -
ప్రపంచ యూత్ ఆర్చరీ నుంచి తప్పుకున్న భారత్
ఆటగాళ్లకు వీసా నిరాకరించిన అమెరికా న్యూఢిల్లీ : ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్స్ నుంచి భారత జట్టు వైదొలిగింది. ఇందులో పాల్గొనాల్సిన 31 మంది ఆర్చర్ల బృందంలో 20 మందికి యూఎస్ ఎంబసీ వీసా నిరాకరించింది. దీనికి నిరసనగా భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) ఈ నిర్ణయం తీసుకుంది. ఈనెల 8 నుంచి 14 వరకు దక్షిణ డకోటాలోని యాంక్టాన్‌లో ఈ టోర్నీ జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం నేడు (శనివారం) జట్టు అమెరికాకు వెళ్లాల్సి ఉంది. అయితే ఏడుగురు ఆర్చర్లు, ఇద్దరు కోచ్‌లు, ఒక సాయ్ అధికారికి మాత్రమే వీసా మంజూరయ్యింది. ఆటగాళ్లను ఇంటర్వ్యూ చేసిన వీసా అధికారి అంతగా సంతృప్తి పడలేదని, వీరంతా అక్కడికి వెళ్లి తిరిగి రారేమోనని రిజెక్ట్ చేసినట్టు భారత ఆర్చరీ సంఘం కోశాధికారి వీరేందర్ సచ్దేవ తెలిపారు. ‘వీసా నిరాకరణకు నిరసనగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నాం. మరోసారి వీసా కోసం అప్లై చేసుకున్నప్పటికీ ఏఏఐ అధ్యక్షుడు వీకే మల్హోత్రా సూచన మేరకు వైదొలిగేందుకు నిర్ణయం తీసుకున్నాం’ అని సచ్దేవ పేర్కొన్నారు. -
యూఎస్ వీసా నిరాకరణ..భారత ఆటగాళ్లకు షాక్
న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్ ఈవెంట్లో పాల్గొననున్న భారత ఆటగాళ్లకు ఇక్కడి అమెరికా ఎంబసీ వీసా నిరాకరించింది. మొత్తం 30 మంది ఆటగాళ్లకుగాను 10 మందికి వీసా ఇచ్చింది. ఇందుకు నిరసనగా భారత్ ఈ మెగా ఈవెంట్ నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని భారత్ ఆర్చర్ల సమాఖ్యకు చెందిన ఓ అధికారి వీరెందర్ సచ్‌దేవా వెల్లడించాడు. దక్షిణకొరియా కోచ్ చే వోమ్ లిమ్ కూడా బాధితులలో ఒకరు. అండర్-20 విభాగంలో బాలికలు, బాలురు దక్షిణ దకోటాలోని యాంక్టన్ లో జరగనున్న పోటీలలో పాల్గొనాల్సి ఉండగా, ఈ విషయం వారికి షాకిచ్చింది. జూన్ 8 నుంచి 14 వరకు జరిగే ఈ ఈవెంట్‌కి భారత ఆర్చర్లు శనివారం అమెరికా బయలుదేరాల్సి ఉండగా ఎంబసీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఏడు మంది ఆర్చర్లకు, ఇద్దరు కోచ్‌లకు, మరోక సభ్యునికి వీసా సదుపాయాన్ని కల్పించింది. ముగ్గురు భారత్ కోచ్‌లు మిమ్ బహదుర్ గురుంగ్, చంద్రశేఖర లాగురీ, అవదేశ్లకు వీసా రాలేదు. ఇంటర్వ్యూలో ఆటగాళ్ల సమాధానాలు సంతృప్తికరంగా లేనందున ఎంబసీ అధికారి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడని భారత ఆర్చరీ సమాఖ్యకు చెందిన ఓ అధికారి వీరెందర్ సచ్డేవా తెలిపారు. ఆ ఆటగాళ్లు ఇండియాకి తిరిగి వస్తారో లేదోనని సందేహించాడని కూడా ఆయన చెప్పారు. కానీ చాలా మంది ఆర్చర్లు అస్సాం, జార్ఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలోని మారుమూల ప్రాంతాలవారే కావడం గమనార్హం. వారికి భావవ్యక్తీకరణ నైపుణ్యంతో పాటు, ఇంగ్లీష్ అంతగా రాదని వీరెందర్ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా పలు దేశాల్లో పర్యటించిన కోచ్ లిమ్ నిరాకరణకు గురవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని వీరేందర్ అన్నాడు. అమెరికా ఆర్చరీ సమాఖ్య ఆహ్వానం మేరకు, భారత ఆర్చరీ సంఘం ఎంపిక చేసిన ఆటగాళ్లను పంపినా ఇలా జరగడం బాధాకరమన్నాడు. యూఎస్ ఆర్చరీ సమాఖ్య సలహా మేరకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చిందని వీరెందర్ సచ్‌దేవా తెలిపాడు. -
సీఎం కేజ్రీవాల్‌తో సమావేశమైన అమెరికా రాయబారి
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. ఢిల్లీ సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కూడా పాల్గొన్నారు. సామాజిక, పర్యావరణ రంగాల్లో అమెరికా రాయబారి కార్యాలయం నిర్వహిస్తోన్న కార్యక్రమాల గురించి రిచర్డ్ వర్మ సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా ఘనరూప వ్యర్థాల మేనేజ్మెంట్, స్వచ్ఛ ఇంధనం, నీటి రీసైక్లింగ్, యమునా నదిని శుభ్రం చేయడం, కాలుష్యం వంటి సమస్యల పరిష్కారానికి సలహాలు ఇవ్వాల్సిందిగా అమెరికా రాయబారిని కేజ్రీవాల్ కోరారు. నగరాన్ని మార్చే చక్కటి అవకాశం తమకు లభించిందని, ఇది చాలా పెద్ద బాధ్యత కూడా అని కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీని తాము ప్రపంచంలోని అత్యుత్తమ నగరాలలో ఒకటిగా తీర్చిదిద్దాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం తాము కొత్త ఐడియాలు, భాగస్వాముల కోసం అన్వేషిస్తున్నామన్నారు . ఈ సమస్యలకు పరిష్కారాలను చూపించగలిగి ప్రపంచంలో పాటించే అత్యుత్తమ పద్ధతులను ఢిల్లీలో అమలుచేయడానికి ముందుకొచ్చే వారి కోసం తాము ఎదురుచూస్తున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘అవినీతి నిరోధక హెల్ప్‌లైన్’ గురించి అమెరికా రాయబారి ఆరా తీశారు. అవినీతి, మహిళల భద్రత వంటి అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించారు. అవినీతి జాతీయ సమస్య అని, అన్ని స్థాయిలలోనూ ఇది జరుగుతోందన్నారు. కానీ, దీని వల్ల సామాన్యుడు అధికంగా నష్టపోతున్నాడని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. -
అమెరికా రాయబారిపై కత్తితో దాడి
-
అమెరికా రాయబారిపై కత్తితో దాడి
సౌత్ కొరియా: సౌత్ కొరియా లోని అమెరికా రాయబారి మార్క్ లిప్పర్ట్ పై ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లో వుండగా జరిగిన ఈ దాడిలో లిప్పర్ట్ ముఖంపై చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన లిప్పర్ట్ ను ఆసుపత్రికి తరలించారు. కాగా లిప్పర్ట్ ప్రాణానికేమీ ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. మరోవైపు భద్రతా సిబ్బంది దాడి చేసిన దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఆయన లిప్పర్ట్ తో ఫోన్ లో మాట్లాడారు. త్వరగా కోలుకోవాలని ఒబామా ఆకాంక్షించారు. ఈ దాడిని సౌత్ కొరియా- అమెరికా మైత్రిపై జరిగిన దాడిగా సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ అభివర్ణించారు.మరోవైపు ఉత్తర, దక్షిణ కొరియా ఏకంకావాలంటూ దుండగుడు నినాదాలు చేసినట్టుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. -
'ఒబామా చాపర్ హైదరాబాద్‌లో తయారీ'
అమెరికా అధ్యక్షుడి హెలికాప్టర్ విడిభాగాలు హైదరాబాద్‌లో తయారీ సీఎం కేసీఆర్‌కు తెలియజేసిన అమెరికా రాయబారి రిచర్డ్స్ సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు వినియోగించనున్న హెలికాప్టర్ విడిభాగాలు హైదరాబాద్‌లో తయారవుతున్నాయని భారత్‌లోని అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ తెలిపారు. మంగళవారం ఆయన సచివాలయంలో సీఎం కె.చంద్రశేఖరరావును కలిశారు. అనేక రంగాల్లో అమెరికాతో తెలంగాణకు సంబంధాలున్నాయని, అమెరికా అధ్యక్షుడు వినియోగించనున్న హెలికాప్టర్ విడిభాగాలు హైదరాబాద్‌లోని టాటా కంపెనీలో తయారవుతున్నాయని సీఎంకు వివరించారు. గచ్చిబౌలిలో కొత్తగా నిర్మిస్తున్న అమెరికా కాన్సులేట్ కార్యాలయం పురోగతిపై సీఎంతో చర్చించారు. దేశంలో నాలుగు అమెరికా కాన్సులేట్ కార్యాలయాలుంటే అందులో ఒకటి తెలంగాణలో ఉన్నదంటూ తమ దేశం తెలంగాణకు ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తుచేశారు. పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్ అత్యంత అనుకూలమైన ప్రాంతమని రిచర్డ్‌తో సీఎం అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా పెట్టుబడిదారులకు ప్రోత్సాహకంగా ఉండే పారిశ్రామిక విధానాన్ని తీసుకువచ్చామని వివరించారు. -
దుమ్ముకు భయపడుతున్న ఒబామా!
న్యూఢిల్లీ : ప్రపంచాన్ని గజగజ వణికించే అమెరికా అధ్యక్షడు ఒబామా మాత్రం ప్రస్తుతం ఓ విషయంలో విపరీతంగా వణుకుతున్నట్లు సమాచారం. దాంతో ఆయన నాలుగు గోడల మధ్య గది తలుపులు మూసుకుని కూర్చోవాలనుకుంటున్నారట.. ఇంతకీ ఒబామాను అంతగా భయపెట్టిస్తున్న అంశం ఏమిటో తెలుసా? ఢిల్లీలోని దుమ్ము, ధూళి కణాలకట (కాలుష్యం). అమెరికాలో ఉన్న పెద్దన్న ఒబామాకి... హస్తిన కాలుష్యానికి లింక్ ఏంటా అని అనుకుంటున్నారా? ఈ ఏడాది భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఒబామా ముఖ్య అతిథిగా హాజరు కానున్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దుమ్ము, ధూళి కణాల కాలుష్యంతో నిండి ఉన్న నగరాల్లో న్యూఢిల్లీ మొదటి వరసలో ఉందని పలు నివేదికలు ఇప్పటికే కోడైకూస్తున్నాయి. ఆ కాలుష్యంతో ఉపిరితిత్తులకు అలా ఇలా కాదంటా దెబ్బ మాత్రం గట్టిగా ఉంటుందంటూ వెల్లడించిన నివేదికల్లో బహిర్గతమైనాయి. ఈ నేపథ్యంలో కాలుష్యం కారణంగా ఒబామా ఢిల్లీ వచ్చిన గదికి మాత్రమే పరిమితం కానున్నారు. అయితే గణతంత్ర వేడుకల్లో పాల్గొనే సందర్భంగా ఒబామాకు ప్రత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ అద్దల గదిని తయారు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం భారత్‌లో యూఎస్ రాయబార కార్యాలయం ఇప్పటికే రంగంలోకి దిగి ప్రయత్నాలు ప్రారంభించిందని సమాచారం. -
భారత్‌లో అమెరికా రాయబారిగా వర్మ
వాషింగ్టన్: భారత్‌లో అమెరికా రాయబారిగా రిచర్డ్ రాహుల్ వర్మ (46) పేరు ఖరారైంది. మంగళవారం యూఎస్ సెనెట్ రాహుల్ వర్మ పేరును ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో ఈ పదవిని చేపట్టిన మొట్టమొదటి భారతీయ అమెరికన్ రాయబారిగా రాహుల్ వర్మ ఖ్యాతి పొందారు. వర్మ ఈ పదవిని చేపట్టడం ద్వారా భారత్ - అమెరికా సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు ఒబామా ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ నేపథ్యంలో అంతకంటే ముందే వర్మ ఈ పదవిని చేపట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఒబామా తన ప్రభుత్వం హయాంలో భారతీయ సంతతికి పెద్ద పీట వేస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో భారత్‌లో రాయబారిగా వర్మ పేరును ప్రతిపాదించారు. అమెరికా విదేశాంగశాఖతో సహా వివిధ విభాగాల్లో ఆయన కీలక పదవులు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన హ్యూమన్ రైట్స్ ఫస్ట్, ది క్లింటన్ ఫౌండేషన్, నేషనల్ డెమాక్రాటిక్ ఇన్స్టిట్యూట్ బోర్డుల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఇంతకుముందు భారత దేశంలో అమెరికా రాయబారిగా నాన్సీ పావెల్ వ్యవహరించారు. ఆ సమయంలో నాన్సీపై పలు వివాదాలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేశారు. నాటి నుంచి భారత్‌లో అమెరికా రాయబారి పదవి ఖాళీగా ఉంది. మరోవైపు భారత్‌లో నరేంద్ర మోడీ ప్రధాని పదవిని చేపట్టారు. దీంతో భారత్‌తో సంబంధాలు మరింత బలోపేతానికి కృషి చేసేందుకు ఒబామా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అందులోభాగంగా వర్మను భారత్‌లో అమెరికా రాయబారిగా ఒబామా ఎంపిక చేసినట్లు సమాచారం. -
‘సిస్కోసిస్టమ్’లో ఇంజనీర్‌గా హరీశ్చంద్ర
ఏడాదికి రూ 56 లక్షల వేతనం అమెరికాలో ఉద్యోగం ఖమ్మం: అమెరికాకు చెందిన సిస్కో సిస్టమ్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఖమ్మంలోని కవిరాజ్‌నగర్‌కు చెందిన విద్యార్థి ఊట్ల హరీశ్చంద్ర ఇంజనీర్‌గా ఉద్యోగం సాధించాడు. హరీశ్ ఐఐ టీ ఖరగ్‌పూర్‌లో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతుండగానే.. మంగళవారం కాలేజీలో జరిగిన క్యాంపస్ సెలక్షన్స్‌లో ఏడాదికి రూ.56 లక్షల వేతనంతో ఉద్యోగం సాధించాడు. హరీశ్చంద్ర తండ్రి జగన్ మోహన్‌రావు ఖమ్మంలోని జాతీయ బాల కార్మిక విముక్తి పథకంలో ఫీల్డ్ ఆఫీసర్‌గా, తల్లి ప్రమీలారాణి నేలకొండపల్లి మండల డిప్యూటీ తహశీల్దార్‌గా పని చేస్తున్నారు. వారి పెద్ద కుమారుడైన హరీశ్ పదో తరగతి వరకు నగర శివారులోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంలో చదివి ప్రథమ స్థానంలో నిలిచాడు. హరీశ్ చంద్ర చదువుతోపాటు లాన్ టెన్నిస్‌లో పలు జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు కైవసం చేసుకున్నాడు. మేఘన మనమ్మాయే... కూసుమంచి: గుగూల్ ప్రపంచంలో సాఫ్ట్వేర్ డెవలపింగ్ ఇం జనీర్‌గా ఎంపికై ప్రపంచ స్థాయిలో అరుదైన గౌరవం దక్కించుకున్న తోటకూరి శ్రీమేఘన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జుజుల్‌రావుపేట వాసి కావడంతో స్థానికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తోటకూరి శ్రీనివాస్ 25 సంవత్సరాల క్రితం వెళ్లి ముంబైలోని ఎన్టీపీసీలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. మేఘన తల్లి వాణి కరీంనగర్ జిల్లా రామగుండం ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు. మేఘన ఏడాది వేతనం రూ.75 లక్షలు. -
ఏపీ, ఒడిశాలకు అమెరికా 61 లక్షల సాయం
న్యూఢిల్లీ: హుదూద్ తుపానుతో తీవ్ర నష్టాన్ని చవిచూసిన ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లోని బాధితులకు సహాయం కోసం అమెరికా లక్ష డాలర్ల(రూ.61 లక్షలు) ఆర్థిక సా యాన్ని ప్రకటించింది. అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ(యూఎస్ఎయిడ్) ద్వారా ప్లాన్ ఇండియా ఎన్జీవోకు ఈ నిధులను అందజేయనున్నట్లు అమెరికా రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. -
భారత్‌లో అమెరికా రాయబారిగా రాహుల్ వర్మ!
భారతదేశంతో సత్సంబంధాలు ఉంటే మంచిదని భావిస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. తన యంత్రాంగంలో పలువురు భారతీయ అమెరికన్లకు పెద్దపీట వేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో అడుగు ముందుకేసి భారత సంతతికి చెందిన రిచర్డ్ రాహుల్ వర్మను భారతదేశంలో అమెరికా రాయబారిగా ప్రతిపాదించారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా హోంశాఖలో గతంలో సహాయ మంత్రి హోదాలో పనిచేసిన వర్మ.. ప్రస్తుతం స్టెప్టో అండ్ జాన్సన్ అనే న్యాయ సంస్థలో సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. ఇంతకుముందు భారత దేశంలో అమెరికా రాయబారిగా వ్యవహరించి, తన పదవీకాలంలో పలు వివాదాలు మూటగట్టుకున్న నాన్సీ పావెల్ రాజీనామా చేసినప్పటినుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. జార్జిటౌన్ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం చేసిన రాహుల్ వర్మ.. జాతీయ భద్రతా చట్టం, అంతర్జాతీయ వ్యవహారాలు తదితర విషయాల్లో ప్రముఖ న్యాయవాదిగా పేరుపొందారు. ఇంతకుముందు ఆయన హిల్లరీ క్లింటన్‌తో కలిసి పనిచేశారు. గతంలో అమెరికా ఎగుమతి నియంత్రణలు, ఆర్థిక ఆంక్షలపై కూడా ఆయన కృషి చేశారు. కొంతకాలం పాటు అమెరికా వైమానిక దళంలో కూడా ఎయిర్ ఫోర్స్ జడ్జి అడ్వకేట్‌గా పనిచేశారు. -
నరేంద్ర మోడీతో నాన్సీ పావెల్ భేటీ
పుష్కర కాలం పాటు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అంటేనే మండిపడుతూ వచ్చిన అమెరికా.. ఎట్టకేలకు వైఖరి మార్చుకుంది. భారతదేశంలో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ గురువారం నాడు నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. 2002లో గోధ్రా అనంతర మత ఘర్షణలు జరిగినప్పటి నుంచి మోడీకి అమెరికా వీసా నిరాకరించిన విషయం తెలిసిందే. ఇన్నాళ్ల తర్వాత నాన్సీ పావెల్ వచ్చి, బీజేపీ ప్రధాని అభ్యర్థి అయిన మోడీని కలిసి చేతులు కలిపారు. ఈ సందర్భంగా మోడీ ఆమెకు ఎరుపు, పసుపు పచ్చ పూలతో కూడిన ఓ బొకేను అందించారు. మరికొందరు అధికారులతో కలిసి నాన్సీ పావెల్ సుదీర్ఘ సమయం పాటు మోడీతో సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు సాధించే అవకాశం ఉందని సర్వేలన్నీ చెబుతుండటంతో.. ముందుగానే మోడీతో సంబంధాలను మెరుగుపరుచుకోవడం మంచిదని భావించే అమెరికా ఈ నర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు మళ్లీ మోడీకి వీసా ఇచ్చే అవకాశం మాత్రం కనిపించడంలేదు. తమ వీసా విధానంలో ఎలాంటి మార్పు లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి జెన్ సాకీ వాషింగ్టన్లో వ్యాఖ్యానించారు. -
మోడీతో అమెరికా రాయబారి భేటీ
గాంధీనగర్: గుజరాత్ సీఎం నరేంద్ర మోడీతో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ సమావేశమయ్యారు. ఈ ఉదయం గాంధీనగర్‌లోని మోడీ నివాసానికి చేరుకుని ఆయనతో నాన్సీ పావెల్ భేటీ అయ్యారు. తొమ్మిదేళ్ల కిందట మోడీపై విధించిన నిషేధాన్ని అమెరికా ఎత్తివేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి అయిన మోడీ సారథ్యంలో ఎన్డీఏ గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పలు సర్వేలు వెల్లడించడంతో మోడీతో సంబంధాలు పునరుద్ధరించాలని అమెరికా భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే మోడీపై తమ వైఖరి మారలేదని అమెరికా నిన్న స్పష్టం చేసింది. 2002 నాటి గోధ్రా ఘటన అనంతరం చెలరేగిన అల్లర్లను కారణంగా చూపి 2005లో మోడీకి దౌత్య వీసా ఇచ్చేందుకు నిరాకరించడంతోపాటు టూరిస్ట్, బిజినెస్ వీసాలను అమెరికా ఉపసంహరించింది. -
భారత్‌లో ఆరురోజులున్న స్నోడెన్!
న్యూయార్క్: అమెరికా రహస్యాలను బట్టబయలు చేసిన ఎన్ఎస్ఏ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్, గతంలో భారత్‌లో ఆరు రోజులు ఉన్నాడని అమెరికా ‘ఫారెన్ పాలసీ’ మ్యాగజైన్ సోమవారం వెల్లడించింది. స్నోడెన్ ఎన్ఎస్ఏలో పనిచేస్తున్న కాలంలో భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో ఉంటూ అక్కడకు చేరువలో ఉన్న ఒక సంస్థ ఎథికల్ హ్యాకింగ్‌పై నిర్వహించిన కోర్సుకు హాజరయ్యాడని వెల్లడించింది. -
మారిషస్‌లో యూఎస్ ఎంబసీ మూసివేత
మారిషస్‌లోని యూఎస్ రాయబార కార్యాలయాన్ని వారం రోజులపాటు మూసివేస్తున్నట్లు ఆ కార్యాలయ ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. ప్రపంచంలోని పలుదేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలను అల్ ఖైదా తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని సమాచారం మేరకు ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విదేశాల్లోని యూఎస్ వాసులు, రాయబార కార్యాలయ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆఫ్రికాతోపాటు వివిధ దేశాల రాయబార కార్యాలయాలను మూసివేయాలని అమెరికా ప్రభుత్వం ఆ ఆదేశాలు జారీ చేసింది. పలుదేశాల్లోని యూఎస్ రాయబార కార్యాలయాలపై దాడి చేయాలని తీవ్రవాద సంస్థ అల్‌ఖైదా వివిధ దేశాల్లోని తమ శాఖలను ఆదేశించినట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు ఒబామా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఈజిప్టు, యెమెన్, సౌదీ అరేబియా, కువైట్, మెడగాస్కర్, బురుండి దేశాలతోపాటు మరో 19 దేశాల్లోని యూఎస్ రాయబార కార్యాలయాలను ఇప్పటికే మూసివేసిన సంగతి తెలిసిందే. -
గల్ఫ్‌లో 19 అమెరికన్ దౌత్య కార్యాలయాల మూసివేత
వాషింగ్టన్: గల్ఫ్ దేశాల్లోని 19 దౌత్య కార్యాలయాలను అమెరికా సోమవారం మూసివేసింది. అల్‌కాయిదా హెచ్చరికల నేపథ్యంలో పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికాల్లోని ఎంబసీలను ఈనెల 10 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. గల్ఫ్ దేశాల్లో అల్ కాయిదా అమెరికా దౌత్య కార్యాలయాలపై దాడులకు సిద్ధపడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం లభించడంతో అమెరికా ముందు జాగ్రత్తలు చేపట్టింది. ఇందులో భాగంగానే గల్ఫ్‌లోని 22 ఎంబసీలను ఆదివారం మూసివేశారు. ఈ నెలలో అల్‌కాయిదా దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం ఉండటంతో గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అమెరికా తన పౌరులను హెచ్చరించింది. రంజాన్ ముగింపులో జరిగే ఈద్ పర్వదినం సందర్భంగా గల్ఫ్ దేశాల్లోని స్థానిక పద్ధతుల ప్రకారం వారం రోజుల పాటు తమ రాయబార, దౌత్య కార్యాలయాలను మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు అమెరికా విదేశాంగ ప్రతినిధి జెన్ సాకీ చెప్పారు. అయితే, అల్‌కాయిదా సంభాషణలను తాము సేకరించామని అమెరికన్ జనరల్ ఒకరు చెప్పారు. అమెరికన్లతో పాటు పాశ్చాత్య దేశాల పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు సాగించాలని పథకం వేసుకుందని అమెరికా ఉమ్మడి బలగాల చైర్మన్ జనరల్ మార్టిన్ డింప్సీ చెప్పారు.