ఇజ్రాయెల్ క్షిపణిపై నిక్కీ హేలీ సందేశం
వెల్లువెత్తిన విమర్శలు
టెల్ అవీవ్: అమాయక పాలస్తీనియన్లపై విచక్షణారహితంగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ సైన్యానికి అమెరికా నేతలు పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపే ఫొటో ఒకటి బహిర్గతమైంది. శాంతికాముక ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా సేవలందించిన రిపబ్లికన్ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీ హమాస్‌పై ఇజ్రాయెల్ దాడికి పూర్తి మద్దతు పలుకుతూ ఒక మిస్సైల్‌పై తన సందేశం రాశారు.
ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ లెబనాన్ సరిహద్దు వెంట ఇజ్రాయెల్ స్థావరాలకు వెళ్లారు. గాజా స్ట్రిప్‌పై గగనతల దాడికి సిద్ధంగా ఉంచిన ఒక క్షిపణిపై ‘ వాళ్లను చంపేయండి. అమెరికా ఎల్లప్పుడూ ఇజ్రాయెల్‌కు తోడుగా ఉంటుంది’ అని రాసి సంతకం చేశారు. అయితే దేశాన్ని శాంతియుతంగా పాలిస్తానంటూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యరి్థత్వం కోసం పోటీపడిన నాయకురాలు ఇలా యుద్ధజ్వాలలు మరింత రగిలించడమేంటి? అంటూ నెటిజన్లు నిక్కీ హేలీపై విమర్శలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment