missile
-
Iran: యాంటీ-వార్‌షిప్ క్రూయిజ్ క్షిపణి ప్రయోగం విజయవంతం
ఇరాన్ తాజాగా వెయ్యి కిలోమీటర్ల పరిధి సామర్థ్యం కలిగిన నూతన యాంటీ-వార్‌షిప్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించింది. ఇది పర్షియన్ గల్ఫ్‌తో పాటు ఒమన్ సముద్రంలోని యూఎస్ నేవీ నౌకలను లక్ష్యంగా చేసుకోగలుగుతుంది. ఈ క్షిపణి గదర్-380 టైప్ ఎల్ విభాగానికి చెందినది. ఇది యాంటీ-జామింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది శత్రువుల జామింగ్ వ్యవస్థలను కూడా ఆడ్డుకోగలుగుతుంది.ఈ క్షిపణిని భూగర్భ సౌకర్యాల నుండి ప్రయోగించవచ్చని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్(Iran Revolutionary Guard) నేవీ అధిపతి జనరల్ అలీ రెజా తాంగ్సిరి తెలిపారు. దీనిని ఐదు నిమిషాల కంటే తక్కువ సమయంలోనే ప్రయోగించవచ్చు. అయితే ఈ క్షిపణి మోసుకెళ్లే వార్‌హెడ్ గురించి లేదా పరీక్ష సమయం గురించి ఇరాన్ వెల్లడించలేదు. ఈ క్షిపణి వ్యవస్థ గార్డ్ క్షిపణి వ్యవస్థలలో ఒక భాగం మాత్రమే అని, ఈ క్షిపణి శత్రు యుద్ధనౌకలను సమర్థవంతంగా ఎదుర్కోగలదని సమాచారం.ఈ క్షిపణిని మధ్య ఇరాన్ నుండి ఒమన్ సముద్రం(Oman Sea)లోకి ప్రయోగించారు. ఈ క్షిపణిని నిపుణుడైన ఒక వ్యక్తి ఐదు నిమిషాల కంటే తక్కువ సమయంలో సిద్ధం చేసి ప్రయోగించగలడని, ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుందని ఇరాన్ ఒక నివేదికలో పేర్కొంది. ఇరాన్ ఈ క్షిపణిని దక్షిణ తీరంలోని భూగర్భ క్షిపణి కేంద్రం నుండి ప్రయోగించింది. ఈ క్షిపణి శత్రు యుద్ధనౌకలకు చుక్కలు చూపిస్తుందని ఇరాన్ పేర్కొంది. 2024లో గాజాలోని హమాస్, లెబనాన్‌లోని హిజ్బుల్లాతో యుద్ధం జరుగుతున్న సమయంలో ఇరాన్ రెండు వేర్వేరు సందర్భాలలో ఇజ్రాయెల్‌పై వందలాది క్షిపణులను ప్రయోగించింది. అయితే ఇజ్రాయెల్ తన రక్షణ వ్యవస్థల ద్వారా ఈ క్షిపణులను అడ్డుకుని, నాశనం చేసింది.ఇది కూడా చదవండి: ఆర్థిక సంక్షోభంలో మాల్దీవులు.. స్పందించిన భారత్ -
Russia-Ukraine war: రష్యా సైన్యానికి ల్యాండ్ మైన్స్‌తో అడ్డుకట్ట!
కీవ్: యుద్ధంలో రష్యాను పూర్తిస్థాయిలో కట్టడి చేయడమే లక్ష్యంగా ఉక్రెయిన్‌కు అమెరికా అండదండలు అందిస్తోంది. అమెరికా అందజేసిన లాంగ్రేంజ్ క్షిపణులను రష్యాపై ప్రయోగించడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నుంచి ఇప్పటికే అనుమతి లభించింది. దీంతో రష్యా భూభాగంలో సుదూర ప్రాంతంలో ఉన్న లక్ష్యాలపై సులువుగా దాడులు ఉక్రెయిన్‌కు అవకాశం లభించింది. అమెరికా మరో శుభవార్త చెప్పింది. తాము సరఫరా చేసిన యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్స్ ఉపయోగించానికి ఉక్రెయిన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నట్లు అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ అస్టిన్ ప్రకటించారు. ఆయన బుధవారం లావోస్‌లో మీడియాతో మాట్లాడారు. యుద్ధంలో రష్యా సైన్యం వ్యూహం మార్చేస్తుండడంతో ఉక్రెయినవైపు నుంచి కూడా వ్యూహం మార్చక తప్పడం లేదని అన్నారు. రష్యా పదాతి దళాలు మున్ముందుకు చొచ్చుకొస్తున్నాయని చెప్పారు. ఆయా దళాలను నిలువరించాలంటే యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్స్ ఉపయోగించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ ల్యాండ్ మైన్స్ పెద్దగా ప్రమాదకరం, ప్రాణాంతకం కాదని లాడిన్ అస్టిన్ వివరణ ఇచ్చారు. శత్రు సైన్యం కదలికలను నియంత్రించడానికి ఇవి దోహదపతాయని చెప్పారు. -
అదే చివరి రోజవుతుంది.. జాగ్రత్త: కిమ్‌కు సౌత్ కొరియా స్ట్రాంగ్ వార్నింగ్
సియోల్: వరుస క్షిపణి ప్రయోగాలతోపాటు, అణ్వాయుధాలను ప్రయోగిస్తామంటూ ఉత్తరకొరియా పాలకుడు కిమ్ తరచూ చేస్తున్న రెచ్చగొట్టే ప్రకటనలపై దక్షిణ కొరియా దీటుగా స్పందించింది. అణ్వాయుధ ప్రయోగానికి ప్రయత్నిస్తే అందుకు తగురీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించింది. ఆర్మ్డ్ ఫోర్సెస్ డేను పురస్కరించుకుని మంగళవారం సియోల్‌లో అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణి హ్యున్మూ–5 సహా అధునాతన 340 రకాల ఆయుధాలు, ఆయుధ వ్యవస్థలను ప్రదర్శించింది. పరేడ్‌కు హాజరైన ప్రముఖులు, వేలాదిమంది జవాన్లను ఉద్దేశించి ఈ సందర్భంగా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ మాట్లాడారు. ‘మాపై అణ్వాయుధాలను ప్రయోగించేందుకు ఉత్తరకొరియా ప్రయత్నించిన పక్షంలో మా సైన్యం, ఊహించని రీతిలో దీటైన జవాబిస్తుంది. ఉత్తరకొరియా పాలకులకు అదే చివరి రోజవుతుంది. తమను కాపాడేది అణ్వాయుధాలేనన్న భ్రమలను ఉత్తరకొరియా పాలకులు వదిలేయాలి’అని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.చదవండి: ఇరాన్ దాడులు.. ఐరాస చీఫ్‌పై ఇజ్రాయెల్ నిషేధంబంకర్లను సైతం తుత్తునియలు చేసేలా..హ్యున్మూ–5 క్షిపణి 8 టన్నుల భారీ సంప్రదాయ వార్‌హెడ్ కలిగి ఉంటుంది. భూమి లోపలి అండర్ గ్రౌండ్ బంకర్లను సైతం తుత్తునియలు చేసే సత్తా దీని సొంతం. ఈ క్షిపణిని మొట్టమొదటిసారిగా దక్షిణ కొరియా ప్రదర్శించింది. పరేడ్ సమయంలో అమెరికా లాంగ్ రేంజ్ బి–1బీ బాంబర్‌తోపాటు దక్షిణకొరియా అత్యాధునిక ఫైటర్ జట్లు ఆ ప్రాంతంలో చక్కర్లు కొట్టాయి. దక్షిణ కొరియా వద్ద అణ్వాయుధాలు లేవు. ఉత్తర కొరియా అణ్వాయుధ కార్యక్రమాన్ని ధీటుగా ఎదుర్కొనే లక్ష్యంతో దక్షిణ కొరియా ప్రభుత్వం ‘స్ట్రాటజిక్ కమాండ్’ సెంటర్‌ను కూడా ప్రారంభించింది. -
స్పేస్ఎక్స్ మిషన్‌లో... స్వల్ప సమస్య
వాషింగ్టన్: స్పేస్ఎక్స్ సంస్థ క్రూ–9 డ్రాగన్ అంతరిక్ష ప్రయోగంలో చిరు వైఫల్యం చోటుచేసుకుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు నాసాతో కలిసి స్పేస్ ఎక్స్ శనివారం ఈ మిషన్ చేపట్టడం తెలిసిందే. అమెరికాలో ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ నుంచి ఫాల్కన్9 రాకెట్ ద్వారా క్రూ–9 డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించింది. ఇది విజయవంతమైనట్టు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. అయితే, ‘‘డ్రాగన్ వ్యోమనౌక రాకెట్ నుంచి విజయవంతంగా విడిపోయి ఐఎస్ఎస్ వైపు సాగింది. అనంతరం ఫాల్కన్9 రాకెట్ క్షేమంగా భూమిపైకి తిరిగివచి్చంది. అందులోని రెండో దశ మాత్రం సముద్రంలో పడాల్సిన చోటికి కాస్తంత దూరంలో పడిపోయింది’’ అని స్పేస్ఎక్స్ వెల్లడించింది. ఇందుకు కారణాలపై పరిశోధన చేస్తున్నట్లు పేర్కొంది. ఫాల్కన్9 పునరి్వనియోగ రాకెట్. ఇందులోని రెండో దశ విఫలం కావడం ఇది రెండోసారి. ఇది స్పేస్ఎక్స్కు ఇబ్బందికరంగా మారింది. పొరపాట్లు సరి చేసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆ సంస్థ చెబుతోంది. క్రూ–9 రాకెట్లో నాసా వ్యోమగామి నిక్ హేగ్, రోస్కోస్మాస్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ ఐఎస్ఎస్కు పయనమయ్యారు. సునీత, విల్మోర్లను వెనక్కు తీసుకొచ్చేందుకు వీలుగా రెండు సీట్లను ఖాళీగా ఉంచారు. వారిద్దరూ జూన్‌లో స్టార్‌లైనర్ తొలి ప్రయోగంలో భాగంగా ఐఎస్ఎస్ చేరుకోవడం తెలిసిందే. -
చైనా క్షిపణి ప్రయోగం.. అమెరికా, తైవాన్, జపాన్‌లకు ముప్పు
బీజింగ్: పసిఫిక్ మహాసముద్రంలో ఖండాంతర క్షిపణి (ఐసీబీఎం)ని పరీక్షించినట్లు చైనా వెల్లడించింది. ఇది అమెరికా, తైవాన్, జపాన్‌లకు ముప్పుగా పరిణమించనున్నదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్షిపణిని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన రాకెట్ ఫోర్స్ ప్రయోగించిందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఈ క్షిపణిని పసిఫిక్ మహాసముద్రంలో జారవిడిచారు.దేశ వార్షిక శిక్షణ ప్రణాళికలో భాగంగానే ఈ క్షిపణి పరీక్ష నిర్వహించినట్లు చైనా పేర్కొంది. చైనా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ క్షిపణి ప్రయోగం ఆయుధ పనితీరు, సైనిక శిక్షణ ప్రభావాన్ని పరీక్షించింది. నిర్దేశిత లక్ష్యాలను సాధించింది. 1989 తర్వాత మొదటిసారిగా ఐసీబీఎం పరీక్ష గురించి చైనా బహిరంగంగా తెలియజేసింది. చైనాకు చెందిన ఐసీబీఎం తొలి పరీక్ష 1980 మేలో జరిగింది. అనంతరం చైనా తన అణ్వాయుధ పరీక్షలు భూగర్భంలో నిర్వహిస్తూ వస్తోంది.చైనా తాజాగా చేపట్టిన ఈ క్షిపణి పరీక్ష అంతర్జాతీయ ఆందోళనలను పెంచే అవకాశం ఉంది. మరోవైపు, దక్షిణ చైనా సముద్రం విషయంలో అమెరికా, జపాన్, ఫిలిప్పీన్స్, తైవాన్‌తో సహా అనేక దేశాలతో చైనాకు వివాదం నడుస్తోంది. మీడియాకు వెల్లడైన వివరాల ప్రకారం చైనా వద్ద 500కు పైగా అణ్వాయుధాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 350 ఐసీబీఎంలున్నాయి. 2030 నాటికి చైనా వద్ద వెయ్యికి మించిన అణ్వాయుధాలు ఉంటాయని అంచనా. చైనా సైన్యం వందలాది రహస్య క్షిపణులను తయారు చేస్తోందని పెంటగాన్ తన నివేదికలో పేర్కొంది.ఇది కూడా చదవండి: పని ఒత్తిడి పనిపడదాం..!హ్యాపీ వర్క్‌ప్లేస్‌గా మార్చేద్దాం ఇలా..! -
హెజ్బొల్లా క్షిపణి కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి
మస్యాఫ్: సిరియాలోని హెజ్బొల్లా క్షిపణి తయారీ కేంద్రంపై ఇజ్రాయెల్ ప్రత్యేక దళాలు దాడి చేశాయి. లెబనాన్ సరిహద్దుకు 25 మైళ్ల దూరంలో ఉన్న మస్యాఫ్ నగర సమీపంలో సోమవారం చేపట్టిన ఈ దాడిలో 18 మంది మృతి చెందారు. దాడి చిత్రాలను అమెరికా మీడియా బయట పెట్టడంతో వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. భూగర్భంలోని ఈ కేంద్రాన్ని ధ్వంసం చేయడానికి ఇజ్రాయెల్ సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టింది. వైమానిక దళానికి చెందిన ఎలైట్ షాల్డాగ్ యూనిట్ బలగాలు హెలికాప్టర్ల నుంచి దిగి, ఇరాన్ నిర్మించిన కేంద్రంలో పేలుడు పదార్థాలను అమర్చాయి. ఘటనలో 18 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. హెజ్బొల్లాకు క్షిపణుల సరఫరాను దెబ్బతీయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడికి పూనుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ అపరేషన్పై ముందుగానే అమెరికాకు ఇజ్రాయెల్ సమాచారం ఇచ్చిందని సమాచారం. ఇజ్రాయెల్ ప్రభుత్వం దీనిపై స్పందించలేదు. -
‘అగ్ని’ తొలి డైరెక్టర్ రామ్ నరైన్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త, ‘అగ్ని’ క్షిపణి మిషన్ తొలి ప్రోగ్రామ్ డైరెక్టర్ రామ్ నరైన్ అగర్వాల్ (84) కన్నుమూశారు. వయో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్‌లో ఉన్న స్వగృహంలో మృతి చెందారు. రాజస్తాన్‌లోని జైపూర్‌లో జన్మించిన రామ్ నరైన్.. 1983లో ప్రారంభమైన ‘అగ్ని క్షిపణి’ ప్రోగ్రామ్‌లో చేరారు. ఆ మిషన్‌కు తొలి ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా పనిచేసి.. అగ్ని క్షిపణుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆయనను ఫాదర్ ఆఫ్ అగ్ని మిస్సైల్స్‌గా పిలుస్తారు. రామ్ నరైన్ చేసిన సేవలకు 1990లో పద్మశ్రీ, 2000లో పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. శనివారం మధ్యాహ్నం సంతోష్‌నగర్‌లోని నివాసం నుంచి రామ్ నరైన్ అంతిమయాత్ర ప్రారంభం అవుతుందని.. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలను నిర్వహించనున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు.అగ్ని క్షిపణులకు ఆద్యుడు: డీఆర్డీఏ మాజీ డైరెక్టర్ సతీశ్రెడ్డిఅగ్ని క్షిపణుల అభివృద్ధి, ప్రయోగాలలో రామ్ నరైన్ అగర్వాల్ కీలకపాత్ర పోషించారని డీఆర్డీఏ మాజీ డైరెక్టర్ సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల క్షిపణి ప్రయోగాల లాంచ్ పాడ్స్ రూపకల్పనలోనూ కీలకంగా పనిచేశారని చెప్పారు. రామ్ కృషి వల్లే ఈరోజు భారతదేశం రక్షణరంగంలో చాలా ముందుందన్నారు. రామ్ నరైన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని చెప్పారు. -
హౌతీల మిసైల్ కూల్చివేసిన ఇజ్రాయెల్
జెరూసలెం: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. శనివారం(జులై 20) యెమెన్‌లోని అల్ హొదైదా పోర్టును ఇజ్రాయెల్ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా హౌతీ రెబెల్స్ ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. ఈ మిసైల్‌ను ఇజ్రాయెల్ డిఫెన్స్‌ఫోర్స్ (ఐడీఎఫ్) దళాలు మధ్యలోనే దానిని కూల్చివేశాయి.תיעוד: שיגור המיירט בערבה >>@ShaniRami (צילום: אלון וייס, קיבוץ יטבתה) https://t.co/4J3h0Jipsl pic.twitter.com/PnGcJhLIxc— גלצ (@GLZRadio) July 21, 2024 తమ దేశ గగనతలంలోకి ప్రవేశించకముందే క్షిపణిని యారో-3 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో కూల్చివేసినట్లు ఐడీఎఫ్ పేర్కొంది. ఇజ్రాయెల్‌లోని ఇలాట్ నగరంలో ఇప్పటికీ క్షిపణి రక్షణ వ్యవస్థ (ఐరన్‌డోమ్) సైరన్లు మోగుతూనే ఉన్నాయి. శుక్రవారం రాజధాని టెల్‌అవీవ్‌పై హౌతీలు జరిపిన డ్రోన్ దాడికి ప్రతీకారంగా యెమెన్‌లోని హౌతీ స్థావరాలపై ఇజ్రాయెల్ బాంబులు వేసింది. మరోవైపు ఐడీఎఫ్ దళాలు లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై కూడా వైమానిక దాడులు జరిపాయి. హెజ్బొల్లా తీవ్రవాదులకు చెందిన రెండు భారీ ఆయుధ డిపోలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. దాడులను లెబనాన్ మీడియా ధృవీకరించింది. -
ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడి.. ఏడుగురు మృతి
దక్షిణ ఉక్రెయిన్‌లోని ఓ నగరంపై రష్యా సైన్యం జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. క్షిపణుల ద్వారా రష్యా ఈ దాడులను చేసింది. ఉక్రెయిన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ దాడిలో ఏడుగురు పౌరులు మరణించారు. పలువురు గాయపడ్డారు. విల్న్యాన్స్క్లోని పార్కులో మృతదేహాలు పడి ఉన్న ఫోటోలను స్థానిక అధికారులు విడుదల చేశారు.మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారని స్థానిక గవర్నర్ ఇవాన్ ఫెడోరోవ్ తెలిపారు. ఫెడోరోవ్ టెలిగ్రామ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ దాడిలో విల్న్యాన్స్క్లోని ఒక దుకాణం, నివాస భవనం దెబ్బతిన్నాయి. ఈ దాడి నేపధ్యంలో ఉక్రేనియన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా రష్యా దాడుల కట్టడికి భాగస్వామ్య దేశాలకు పిలుపునిచ్చారు.రష్యాలోని ఆరు ప్రాంతాలలో తమ బలగాలు 36 ఉక్రేనియన్ డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనికి ఒక రోజు ముందు ఉక్రెయిన్ రష్యాపై డ్రోన్ దాడికి దిగింది. ఈ దాడిలో ఐదుగురు మరణించారు. -
వాళ్లను చంపేయండి!
టెల్ అవీవ్: అమాయక పాలస్తీనియన్లపై విచక్షణారహితంగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ సైన్యానికి అమెరికా నేతలు పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపే ఫొటో ఒకటి బహిర్గతమైంది. శాంతికాముక ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా సేవలందించిన రిపబ్లికన్ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీ హమాస్‌పై ఇజ్రాయెల్ దాడికి పూర్తి మద్దతు పలుకుతూ ఒక మిస్సైల్‌పై తన సందేశం రాశారు. ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ లెబనాన్ సరిహద్దు వెంట ఇజ్రాయెల్ స్థావరాలకు వెళ్లారు. గాజా స్ట్రిప్‌పై గగనతల దాడికి సిద్ధంగా ఉంచిన ఒక క్షిపణిపై ‘ వాళ్లను చంపేయండి. అమెరికా ఎల్లప్పుడూ ఇజ్రాయెల్‌కు తోడుగా ఉంటుంది’ అని రాసి సంతకం చేశారు. అయితే దేశాన్ని శాంతియుతంగా పాలిస్తానంటూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యరి్థత్వం కోసం పోటీపడిన నాయకురాలు ఇలా యుద్ధజ్వాలలు మరింత రగిలించడమేంటి? అంటూ నెటిజన్లు నిక్కీ హేలీపై విమర్శలు గుప్పించారు. -
యాంటీ రేడియేషన్ మిసైల్... ‘రుద్ర ఎమ్-2’ పరీక్ష సక్సెస్
భువనేశ్వర్: ఉపరితల యాంటీ రేడియేషన్ మిసైల్ రుద్ర ఎమ్-2ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ టెస్ట్ సెంటర్ నుంచి బుధవారం(మే29) ఈ మిసైల్‌ను పరీక్షించారు.ఈ సూపర్‌సానిక్ మిసైల్‌ను భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్డీవో అభివృద్ధి చేసింది. యాంటీ రేడియేషన్ మిసైల్‌ను భారత్ దేశీయంగా అభివృద్ధి చేయడం ఇదే తొలిసారి. ఇది శత్రువుల నిఘా రాడార్లను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుంది.ప్రస్తుతం శత్రువుల నిఘా వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి భారత్ రష్యాకు చెందిన కేఎహెచ్-31 యాంటీ రేడియేషన్ మిసైళ్లను వినియోగిస్తుంది. వీటి స్థానంలో త్వరలో రుద్రను వాడనున్నారు. రుద్ర అనుకున్న లక్ష్యాల మేర పనిచేసిందని, ఈ పరీక్ష పూర్తిగా విజయవతమైందని డీఆర్డీవో ఒక ప్రకటనలో తెలిపింది. రుద్ర పరీక్ష విజయవంతమైందని, దీనిని అభివృద్ధి చేసిన డీఆర్డీవోకు అభినందనలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు పెట్టారు. -
ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల దాడి.. 17 మంది మృతి!
ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల దాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా రష్యా ప్రయోగించిన మూడు క్షిపణులు ఉత్తర ఉక్రెయిన్‌లోని చెర్నిహివ్‌లోని ఎనిమిది అంతస్తుల భవనంపై పడ్డాయి. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. ఈ దాడిలో ముగ్గురు చిన్నారులు సహా 61 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ ఎమర్జెన్సీ సర్వీస్ తెలిపింది. చెర్నిహివ్ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు ఉత్తరాన 150 కిలోమీటర్ల దూరంలో రష్యా - బెలారస్ సరిహద్దులకు సమీపంలో ఉంది. యుక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం మూడవ సంవత్సరంలోకి ప్రవేశించించింది. ఈ యుద్ధంలో రష్యా తన సత్తా చాటుతోంది. పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌కు అదనపు సైనిక సామగ్రిని అందించకపోవడంతో అది రష్యాతో తలపడలేకపోతోంది. ఇంతలో చెక్ రిపబ్లిక్ ప్రధాని పీటర్ ఫియాలా తాము ఉక్రెయిన్‌కు ఐదు లక్షల ఫిరంగి షెల్స్‌ను పంపిణీ చేయనున్నమని ప్రకటించారు. పాశ్చాత్య దేశాలు తమ దేశానికి వాయు రక్షణ వ్యవస్థలను అందించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అభ్యర్థించారు. తమకు తగిన వాయు రక్షణ పరికరాలు ఇప్పటికే అందివుంటే, రష్యా దాడులకు తిప్పికొట్టేవారమని అన్నారు. క్షిపణి, డ్రోన్ దాడులను అడ్డుకునేందుకు తమ దగ్గరున్న వాయు రక్షణ క్షిపణులు అయిపోయాయని జెలెన్స్కీ తెలిపారు. కాగా ఇటీవల రష్యా .. ఉక్రెయిన్‌లోని అతిపెద్ద పవర్ ప్లాంట్లలో ఒకదానిని ధ్వంసం చేసింది. -
మిషన్ దివ్యాస్త్ర విజయవంతం.. అభినందించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అగ్ని-5 క్షిపణి తొలి టెస్ట్ ఫ్లైట్ విజయవంతమైంది. మిషన్ దివ్యాస్త్రలో భాగంగా భారత రక్షణ పరిశోధనా సంస్థ (DRDO) ఈ ప్రయోగం చేపట్టింది. ఈ ప్రాజెక్టు భారత అణు నిరోధక శక్తిని పెంచే లక్ష్యంతో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్(ఎంఐఆర్వీ) పరిజ్ఞానంతో రూపొందించారు. ఈ ప్రాజెక్టు భారత అణు నిరోధక శక్తిని పెంచే లక్ష్యంతో అగ్ని-5 రేంజ్.. 7 వేల కిలోమీటర్లకు పైగా ఉండే అవకాశం ఉంది. మిషన్ దివ్యాస్త్ర విజయవంతంతో డీఆర్డీఓ శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలను చూసి గర్విస్తున్నామని ట్వీట్ చేశారు. అగ్ని-5 క్షిపణి ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదిందించి. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీ-ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్‌వి) సాంకేతికతతో డీఆర్డీవో మిస్సైల్‌ను రూపొందించింది. ఎంఐఆర్వీ సాంకేతికతతో అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం దేశం రక్షణ సంసిద్ధత, వ్యూహాత్మక సామర్థ్యాలను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. మిషన్ దివ్యాస్త్ర అతిపెద్ద అడ్వాన్స్డ్ వెపన్స్ సిస్టమ్‌గా తెలుస్తోంది. దీనికి దేశ భౌగోళిక స్థితిగతులను మార్చే సత్తా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎంఐఆర్వీ టెక్నాలజీతో ఒక మిసైల్‌ను ఉపయోగించి బహుళ వార్ హెడ్స్‌ను వివిధ ప్రాంతాల్లోని టార్గెట్స్‌ను ఛేదించవచ్చని పేర్కొన్నాయి. అయితే, ఈ టెక్నాలజీ కలిగిన దేశాల సంఖ్య తక్కువగా ఉండగా.. ఆయా దేశాల సరసన భారత్ సైతం చేరినట్లయ్యింది. ఈ అగ్ని-5 మిసైల్‌లో ఇండీజీనియస్ ఏవియోనిక్స్ సిస్టస్స్ ఉంటాయి. హై ఎక్యురసీ సెన్సార్ ప్యాకేజ్ ఉండడంతో అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తుంది. -
ఎర్రసముద్రంలో యుద్ధమేఘాలు.. హౌతీ క్షిపణిని కూల్చివేసిన అమెరికా
వాషింగ్టన్: ఎర్రసముద్రంలో అలజడి నానాటికీ పెరిగిపోతోంది. హౌతీ తిరుగుబాటుదారులు, అమెరికా మిత్రపక్షాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. హౌతీల దాడులకు అమెరికా మిత్రపక్షాలు అడ్డుకట్ట వేసే క్రమంలో ఇరువైపుల నుంచి దాడులు జరుగుతున్నాయి. తాజాగా అమెరికా సాయుధ నౌకపై హౌతీలు ప్రయోగించిన యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణిని అమెరికా ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ కూల్చివేసింది. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఎవరూ గాయపడలేదని పేర్కొంటూ సామాజిక మాధ్యమంలో పేర్కొంది. యెమెన్‌లోని హుడైదా సమీపంలో క్షిపణిని కూల్చివేసినట్లు స్పష్టం చేసింది. యెమెన్ గగనతలం, తీరప్రాంతానికి సమీపంగా అమెరికా విమానాలు ఎగురుతున్నట్లు హౌతీ ప్రతినిధి మహ్మద్ అబ్దుల్సలామ్ ఫిర్యాదు చేశారు. అమెరికా చర్య యెమెన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని అభివర్ణించారు. ఎర్ర సముద్రంలో హౌతీల దాడులు పశ్చిమాసియాలో ఆందోళనలను పెంచుతోంది. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో హమాస్‌కు మద్దతుగా హౌతీలు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌కు సంబంధించిన నౌకలపైనే దాడులు చేస్తున్నామని తెలుపుతున్నప్పటికీ.. యూరప్ సహా అనేక దేశాల ఓడలపై దాడులు జరుగుతున్నాయి. దీనిని ఖండించిన అమెరికా మిత్రపక్షాలు హౌతీల దాడులకు అడ్డుకట్ట వేయడానికి నడుం బిగించాయి. ఎర్ర సముద్రంలో హౌతీలపై దాడులు పెంచుతున్నాయి. ఇదీ చదవండి: Israel-Hamas war: యుద్ధజ్వాలలకు... 100 రోజులు -
ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. ఖచ్చితంగా ఉత్తర కొరియా మిసైల్!
ఉక్రెయిన్‌పై రష్యా దాడులను కొనసాగిస్తూనే ఉంది. ఇటీవల ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నగరంపై మిసైల్ దాడి చేసింది. ఖార్కివ్‌పై రష్యా ప్రయోగించిన మిసైల్ ఆ దేశానికి చెందినది కాదని ఉక్రెయిన్ ప్రతినిధి డిమిట్రో చుబెంకో అన్నారు. జనవరి 2 తేదీని ఖార్కివ్ నగరంపై దాడి చేసిన రష్యా మిసైల్ గమనిస్తే.. రష్యా దేశానికి చెందినది కాదని తెలుస్తోందని పేర్కొన్నారు. గతంలో రష్యా ప్రయోగించిన మిసైల్ కంటే పెద్దదిగా ఉందని అన్నారు. దాని తయారి విధానం చూస్తే.. అధునాతనమైనదిగా లేదని చెప్పారు. గతంలో ఖార్కివ్‌పై రష్యా ప్రయోగించిన మిసైల్.. ఇప్పటి మిసైల్‌ను పరిశీలిస్తే అది ఉత్తర కొరియాకు చెందినదిగా నిర్థారించడానికి అవకాశలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. నాజిల్, ఎలక్ట్రికల్ వైండింగ్స్, పలు పరికారలు కూడా చాలా వ్యత్యాసంతో ఉన్నాయని తెలిపారు. ఇది ఖచ్చితంగా ఉత్తర కొరియా మిసైల్ అని తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నట్లు కూడా డిమిట్రో చుబెంకో తెలిపారు. అందుకే రష్యా వేసిన మిసైల్ ఉత్తర కొరియా నుంచి సరఫరా చేసినట్లుగా అనుమానం కలుగుతోందని తెలిపారు. రష్యా ఖార్కివ్ నగరంపై చేసిన మిసైల్ దాడిలో ఇద్దరు మృతి చెందగా.. 60 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. చదవండి: Hamas Attackers: ‘వాళ్లు మనుషులు కాదు.. పెద్దగా నవ్వుతూ రాక్షస ఆనందం’ -
మత్స్యకారులకు దొరికిన వాయుసేన మిస్సైల్
వేటపాలెం: మత్స్యకారుల వలకు మిలిటరీ వాయుసేనకు చెందిన చిన్నపాటి మిస్సైల్ దొరికింది. ఈ ఘటన శుక్రవారం బాపట్ల జిల్లా, వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్యపాలెంలో చోటుచేసుకుంది. దాన్ని మత్స్యకారులు బోటులో ఒడ్డుకు తీసుకొచ్చారు. మెరైన్ ఎస్ఐ సుబ్బారావు బాపట్ల సూర్యలంకకు చెందిన ఎయిర్‌ఫోర్సు మిలిటరీ అధికారులకు సమాచారం అందించారు. ఏం జరిగిందంటే... సూర్యలంకకు చెందిన మిలటరీ అధికారులు ఏటా ఎయిర్‌ఫోర్సుకు చెందిన రిహార్సల్స్ నిర్వహిస్తుంటారు. ఈనెల 3వ తేదీ నుంచి 22వ తేదీ వరకు సముద్ర గగనతలంలో అడ్వాన్స్డ్ మిస్సైల్ సిస్టంపై రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. చిన్నపాటి యుద్ధ మిస్సైల్‌ను ప్రయోగించి అది లక్ష్యం చేరుకోక ముందే సూర్యలంక కేంద్రం నుంచి పేట్రియాట్ మిస్సైల్‌తో దాన్ని పేల్చివేసే రిహార్సల్స్ జరుగుతున్నాయి. దీన్లో భాగంగా ప్రయోగించిన ఈ మిస్సైల్ సముద్రంలో మత్స్యకారులకు దొరికింది. దాన్ని మెరైన్ అధికారుల సమక్షంలో ఎయిర్‌ఫోర్సు అధికారులకు అప్పగించారు. -
ఆ నియంతకు ఖరీదైన మద్యం, సిగరెట్ లేనిదే రోజు గడవదట!
ఉత్తర కొరియా పేరు వినిపించగానే ఎవరికైనా సరే ముందుగా ‘మిసైల్ టెస్ట్’.. తరువాత ఆ దేశ నియంత కిమ్ జోంగ్ పేర్లు గుర్తుకువస్తాయి. తన వింత ప్రవవర్తన, ఆదేశాల కారణంగా కిమ్ జోంగ్ ఆ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగానూ చర్చల్లో కనిపిస్తుంటాడు. కిమ్ జోంగ్ లగ్జరీ లైఫ్న్ను ఎంజాయ్ చేస్తుంటాడు. ఒక ఏడాది వ్యవధిలో కిమ్‌జోంగ్ వందల కోట్ల విలువైన మద్యాన్ని తాగుతాడు. కిమ్ జోంగ్ తాగే మద్యానికి సంబంధించి ఒక్కో బాటిల్ విలువ వేల డాలర్లలో ఉంటుంది. ఇతర దేశాలకు ఛాలెంజ్.. ఉత్తర కొరియాలో ఆర్థికపరిస్థితి మందగమనంలో ఉంది. దీనికితోడు దేశ నియంత తరచూ మిసైల్ పరీక్షలు నిర్వహిస్తూ, ఇతర దేశాలకు ఛాలెంజ్ విసురుతుంటాడు. జపాన్‌లోనూ ఇటువంటి నియంత పాలనే కొనసాగుందనే వాదనలు వినిపిస్తుంటాయి. కిమ్ జోంగ్ లగ్జరీ లైఫ్ గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అతను తాగే ఖరీదైన మద్యం, ఖరీదైన సిగరెట్ల వినియోగం, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మాంసం అతని లగ్జరీ లైఫ్‌ను ప్రతిబింబిస్తాయి. ఒక బాటిల్ ఖరీదు 7 వేల డాలర్లు.. ఆమధ్య విదేశీ మీడియాతో మాట్లాడిన బ్రిటన్ మంత్రి ఒకరు.. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ మద్యపాన ప్రియుడని తెలిపారు. ఆయన బ్లాక్ లేబుల్ స్కాచ్ విస్కీ, ఖరీదైన హెన్సీ బ్రాండ్ తాగడాన్ని ఎంతో ఇష్టపడతారన్నారు. వీటికి సంబంధించిన ఒక బాటిల్ ఖరీదు 7 వేల డాలర్ల వరకూ ఉంటుందన్నారు. ఇంతేకాదు ఆయన అత్యంత ఖరీదైన వైవ్స్ సెంట్ లారెంట్ బ్లాక్ సిగరెట్ తాగుతాన్నారు. ఈ సిగరెట్ బంగారు రేపర్లో చుట్టి ఉంటుందన్నారు. ఇటలీకి చెందిన ఖరీదైన వంటకాలు.. కొన్నేళ్ల క్రితం చైనీస్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ బహిరంగపరిచిన గణాంకాల ప్రకారం 40 ఏళ్ల కిమ్‌జోంగ్ ఉన్ ఉత్తర కొరియాలో హైక్వాలిటీ మద్యం తాగేందుకు ఏటా 30 మిలియన్ డాలర్లు ఖర్చుచేస్తారు. ఇంతేగాదు భోజన ప్రియుడైన కిమ్ జోంగ్ ఇటలీకి చెందిన ఖరీదైన వంటకాలు ఆరగిస్తారు. మద్యం, సిగరెట్ల అలవాటు కారణంగానే అతని బరువు 136 కిలోలకు చేరుకుందని అక్కడి నిపుణులు చెబుతుంటారు. ఇది కూడా చదవండి: మహిళ ఆర్తనాదాలపై ఫిర్యాదు.. సంఘటనా స్థలంలో డంగైన పోలీసులు! -
పాక్ యువతి ట్రాప్‌లో డీఆర్డీఓ సైంటిస్ట్.. కీలక రహస్యాల చేరవేత..
పుణె: హనీ ట్రాప్‌లో చిక్కుకున్న డీఆర్డీఓ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ పాక్ ఏజెంట్‌కు రక్షణ రంగ రహస్యాలను లీక్ చేశాడని దర్యాప్తులో తేలింది. అలియాస్ జరా దాస్‌గుప్తాగా పరిచయమైన పాకిస్థాన్ యువతి కురుల్కర్తో వాట్సాప్ చాట్ ద్వారా మిస్సైల్ సిస్టమ్‌లోని నిగూఢమైన రహస్యాలను రాబట్టింది. డీఆర్డీఓలో ఓ విభాగానికి డైరెక్టర్‌గా పనిచేస్తున్న కురుల్కర్ని మే 3న ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన కస్టడిలో ఉన్నారు. ప్రదీప్ కురుల్కర్కు పాక్ యువతి జరా దాస్‌గుప్తాగా పరిచయమైంది. యూకేలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పి ప్రదీప్‌కు దగ్గరైంది. అనంతరం వాట్సాప్ చాట్, కాల్స్, అశ్లీల వీడియోలతో పాక్ యువతి ప్రదీప్ కురుల్కర్‌ను లోబరుచుకుంది. దర్యాప్తులో జరా దాస్ ఐడీ పాకిస్థాన్‌గా గురించినట్లు అధికారులు తెలిపారు. బ్రహ్మోస్ క్షిపణి, డ్రోన్, యూసీవీ, అగ్ని క్షిపణి లాంఛర్తో పాటు మిలిటరీ బ్రిగేడ్ సిస్టమ్‌కు సంబంధించిన అనేక రహస్యాలను ప్రదీప్ కురుల్కర్ జరా దాస్‌గుప్తాకు షేర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. వీరివురూ 2022 జూన్ నుంచి 2022 డిసెంబర్ వరకు టచ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. ఇంటెలిజెన్స్ అధికారులు కురుల్కర్‌పై అనుమానంతో దర్యాప్తు చేపట్టగా.. 2022 ఫిబ్రవరిలో ఆమె నెంబర్‌ను ఫోన్ నుంచి డిలీట్ చేసినట్లు పేర్కొన్నారు. దర్యాప్తులో నిజానిజాలు వెలుగులోకి రాగా.. అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: Violence On Elections Voting: బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో చెలరేగిన హింస.. తొమ్మిది మంది మృతి.. -
ఉక్రెయిన్ అధ్యక్షుడి సొంతగడ్డ మీద రష్యా మిసైళ్ళ దాడి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: సోమవారం అర్ధరాత్రి ఉక్రెయిన్ అధ్యక్షుడి సొంత ఊరు క్రైవీ రిహ్ పట్టణం మీద రష్యా మిసైళ్ళతో దాడి చేసింది. డెనిప్రో పెట్రోవ్స్క్ పరిసర ప్రాంతాల్లో జనావాసాలపై జరిగిన ఈ దాడిలో ఆరుగురు మరణించగా కనీసం 25మంది తీవ్ర గాయాలు పాలై ఉంటారని అంచనా వేస్తున్నారు అధికారులు. మృతులు పెరగొచ్చు.. రష్యా ఆక్రమించుకున్న ప్రదేశాలను తిరిగి సాధించుకునే పనిలో ఉన్న ఉక్రెయిన్ కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది రష్యా. సాక్షాత్తూ ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ సొంత పట్టణమైన క్రైవీ రిహ్ లో మిసైళ్ళతో జనావాసాలపై దాడులకు దిగింది. ఈ దాడుల్లో ప్రధానంగా ఒక ఐదంతస్తుల భవనంలో మంటలు చెలరేగి నేలకూలింది. ఇదే భవనంలో ఆరుగురు మృతి చెందారు. మరో 25 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు ఇంకా జరుగుతున్నాయని శిధిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉండొచ్చని తెలిపారు స్థానిక మేయర్ ఒలెగ్జాండర్ విల్కుల్. దారుణమైన దృష్యాలు.. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంఘటన తాలూకు ఫోటోలను కూడా టెలిగ్రామ్‌లో పోస్ట్ చేశారు. రష్యా తీవ్రవాదులు జనావాసాలపైన, సామాన్య నగరాల పైన దాడులకు తెగబడ్డారని రాసి ఫోటోలు జతచేశారు. శిధిలమైన ఐదంతస్తుల భవనం, ఛిద్రమైన వాహనాలతో కూడిన ఈ ఫోటోలు హృదయవిదారకంగా ఉన్నాయి. ఇది కూడా చదవండి: అలర్ట్: ప్రపంచంలో టాప్-20 వాయు కాలుష్య పట్టణాల్లో 14 భారత్‌లోనే.. -
నిప్పులు చిమ్ముకుంటూ లక్ష్యానికి...
దొండపర్తి (విశాఖ దక్షిణ): దేశ భద్రతలో భారత నౌకాదళం మరో మైలురాయిని సాధించింది. ఐఎన్ఎస్ విశాఖ నుంచి మధ్య శ్రేణి నౌకా విధ్వంసక క్షిపణిని మంగళవారం ప్రయోగించింది. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన మిసైల్ విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. అత్యంత వేగంతో దూసుకొచ్చే శత్రు దేశాల యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లు, గైడెడ్ బాంబులు, క్రూయిజ్ క్షిపణులు, యుద్ధ నౌకలను సైతం నాశనం చేసే సామర్థ్యం ఈ మధ్యస్థ శ్రేణి క్షిపణికి ఉంది. నేలపై నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించే(ఎంఆర్ఎస్ఏఎం) వ్యవస్థ దీనికి ఉంది. 70 కిలోమీటర్ల రేంజ్లో ఉన్న ల క్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించగల శక్షివంతమైన ఈ క్షిపణి వ్యవస్థను భారత రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్డీఓ), ఇజ్రాయిల్ ఎరోస్పేస్ ఇండస్ట్రీస్ (ఐఏఐ) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. వీటిని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తోంది. మీడియం రేంజ్ సర్ఫేస్ –టు –ఎయిర్ మిస్సైల్ (ఎంఆర్ఎస్ఏఎం) ప్రత్యేకతలు పరిధి: 70 కిలోమీటర్లు మార్గదర్శకత్వం: డ్యూయల్ (కమాండ్ –యాక్టివ్ రాడార్ సీకర్ (ఆర్ఎఫ్) నియంత్రణ: టీవీఎస్ అండ్ ఏరోడైనమిక్ ప్రొపల్షన్: డ్యూయల్ పల్స్ –సాలిడ్ మోటార్ వార్ హెడ్: ప్రీ–ఫ్రాగ్మెంట్ ప్రయాణ సమయం: 230 సెకన్లు పొడవు: 4500 మిల్లీమీటర్లు వ్యాసం: 225 మిమీ బరువు: 275 కిలోలు లాంచర్: షిప్/వాహనం (నిలువు) లాంచ్. భారత రక్షణ దళం శక్తివంతం ‘ఆత్మనిర్భర్’లో భాగంగా భారత సైన్యం శక్తివంతమైన క్షిపణులను సిద్ధం చేసుకుంటోంది. ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే మీడియం రేంజ్ క్షిపణిల తయారీ, అభివృద్ధికి బీడీఎల్‌తో 2017లో ఐఏఐతో ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం ఎదురుగా వచ్చే విమానాలు, హెలికాఫ్టర్లు, మిస్సైళ్లను, యుద్ధ నౌకలను సైతం ధ్వంసం చేసేలా ఈ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇప్పటికే ఒకసారి ఒడిశాలోని బాలాసోర్ తీరం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి సుదూర శ్రేణిలో ఉన్న హైస్పీడ్ ఏరియల్ లక్ష్యాన్ని చేధించింది. తాజాగా పరీక్షించిన ఎంఆర్ఎస్ఏఎం వ్యవస్థలో దేశీయంగా అభివృద్ధి చేసిన డ్యుయల్ పల్స్ రాకెట్ మోటర్‌ను వాడారు. అత్యాధునిక రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ ద్వారా శత్రు విమానాలు, హెలీకాఫ్టర్లు, యాంటీ షిప్ మిసైళ్లను ధ్వంసం చేస్తుంది. -
నౌక విధ్వంసక క్షిపణి తొలి పరీక్ష సక్సెస్
-
క్షిపణి మిస్‌ఫైర్‌పై రాజ్యసభలో రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన
-
భారత్‌పై కాట్సా.. బైడెన్‌దే నిర్ణయం
వాషింగ్టన్: అధునాతన సైనిక సంపత్తిని సమకూర్చుకోవాలన్న భారత్ ప్రయత్నాలకు ఉక్రెయిన్‌పై రష్యా దాడులు అడ్డుకట్ట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యాతోపాటు, దాని సన్నిహిత దేశాలపై పలు ఆంక్షలు విధిస్తున్న అమెరికా చూపు.. రష్యా నుంచి ఎస్–400 క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేస్తున్న భారత్‌పై పడింది. కాట్సా ఆంక్షలను కీలక భాగస్వామిగా ఉన్న భారత్‌పై వర్తింప జేసే విషయంలో అధ్యక్షుడు బైడెన్‌దే తుది నిర్ణయమని అమెరికా ఉన్నతాధికారి ఒకరు గురువారం తెలిపారు. ప్రస్తుత సమయంలో భారత్ రష్యాకు మరింత దూరంగా ఉండాలన్నారు. ఇప్పటికే రష్యాతో కుదుర్చుకున్న మిగ్–29, రష్యన్ హెలికాప్టర్లు, ట్యాంక్ విధ్వంసక ఆయుధాల కొనుగోలు ఒప్పందాలను భారత్ రద్దు చేసుకుందని చెప్పారు. ఇరాన్, ఉత్తరకొరియా, రష్యా దేశాలపై చెప్పుకోదగ్గ స్థాయిలో లావాదేవీలు నెరిపే దేశాలపై కౌంటరింగ్ అమెరికా యాడ్వర్సరీస్ థ్రూ శాంక్షన్స్ యాక్ట్(కాట్సా)ను ప్రయోగిస్తుంది. ఈ చట్టంతో రష్యా నుంచి రక్షణ రంగ కొనుగోళ్లు చేపట్టే దేశాలపై కఠినమైన ఆంక్షలు అమలవుతాయి. (చదవండి: రష్యా దళాలకు చెక్.. ఆ దిశగా ముందుకు సాగుతున్న అమెరికా బలగాలు) -
కెర్మన్‌లో సులేమనీ అంత్యక్రియలు
-
అగ్ని–2 రాత్రి పరీక్ష విజయవంతం
బాలాసోర్ (ఒడిశా) : భూతలం నుంచి భూతలంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని 2’కు మొదటిసారి రాత్రిపూట నిర్వహించిన పరీక్ష విజయవంతమైంది. ఒడిశా తీరంలోని డాక్టర్ అబ్దుల్ కలామ్ ద్వీపంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) కాంప్లెక్స్ 4 నుంచి దీన్ని పరీక్షించామని రక్షణ శాఖ తెలిపింది. ఈ క్షిపణికి 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉంది. దాదాపు 20 మీటర్ల పొడవున్న ఈ క్షిపణి బరువు సుమారు 17 టన్నులు. మరో 1000 కేజీల పేలోడ్‌ను ఇది మోసుకెళ్లగలదు. అగ్ని–2 క్షిపణిని మొదటిసారి 1999 ఏప్రిల్ 11న పరీక్షించారు. చివరిసారిగా 2018 ఫిబ్రవరి 20న పరీక్షించిన ఈ క్షిపణి ఇప్పటికే సైన్యం అమ్ముల పొదిలో చేరింది. -
భారత్-రష్యా: కీలకమైన రక్షణ ఒప్పందం
-
త్వరలో భారత్ సైన్యం చేతికి ఆగ్ని-5 క్షిపణి
-
‘నిర్భయ్’ సక్సెస్
న్యూఢిల్లీ: అణ్వాయుధాలు మోసుకెళ్లే సామర్థ్యం గల స్వదేశంలో తయారైన క్రూయిజ్ క్షిపణి నిర్భయ్‌ను భారత్ తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందిపూర్ ఐటీఆర్ కేంద్రం నుంచి మంగళవారం ఈ పరీక్ష జరిగింది. 2013 నుంచి ఇప్పటి వరకు జరిపిన నాలుగు పరీక్షల్లో విఫలమైన నిర్భయ్ ఐదో ప్రయత్నంలో విజయవంతం కావడం గమనర్హం. ఈ విజయంపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ హర్షం వ్యక్తం చేస్తూ ఈ సాంకేతికత సాధించిన కొన్ని ప్రముఖ దేశాల సరసన భారత్ నిలిచిందని పేర్కొన్నారు. భూ ఉపరితలం నంచి ప్రయోగించే ఈ సబ్‌సోనిక్ క్షిపణి(ఎల్‌ఏసీఎం) 300 కిలోల బరువు గల అణు వార్హెడ్లను మోసుకెళ్లగలదు. ప్రత్యర్థుల రాడార్లు, క్షిపణి రక్షణ వ్యవస్థలను తప్పించుకుని ప్రయాణం చేసేలా డీఆర్డీఓ దీన్ని రూపొందించింది. నిర్భయ్ 647 కి.మీ దూరం ప్రయా ణించేందుకు 50 నిమిషాలు పట్టిందని డీఆర్డీఓ అధికారి ఒకరు వెల్లడించారు. అమెరికా తోమాహక్ క్షిపణులు, పాకిస్తాన్ బాబర్ ఎల్ఏసీఎంకు నిర్భయ్ ఓ దీటైన జవాబు అని భావిస్తున్నారు. -
సౌదీ అరేబియాపై క్షిపణి దాడి
-
నౌక విధ్వంస క్షిపణిని పరీక్షించిన పాక్
ఇస్లామాబాద్ : నావికాదళ యుద్ధ సన్నాహాలను చూసి తాను గర్విస్తున్నానని పాకిస్థాన్ నేవీ చీఫ్ జకౌల్లా అన్నారు. శనివారం పాకిస్థాన్ నౌకలను విధ్వంసం చేసే క్షిపణిని పరీక్షించింది. సీ కింగ్ అనే హెలికాప్టర్ నుంచి దీనిని ఉత్తర అరేబియా సముద్రంలో పరీక్షించింది. ఈ పరీక్ష విజయవంతమైనట్టు పాక్ నేవీ తెలిపింది. నేవీ చీఫ్ జకౌల్లా సమక్షంలో ఈ పరీక్ష నిర్వహించినట్టు వెల్లడించింది. తమది అణుదేశమని ప్రకటించడంతోపాటు భారత్‌ను ఎదుర్కొనేందుకు కొన్ని అణ్వాయుధాలను కూడా సిద్ధంగా పెట్టుకున్నామని పాక్ అధ్యక్షుడు ప్రకటించిన నేపథ్యంలో జరిగిన తాజా పరీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. 'మా నేవీ పట్ల నేను ఆత్మసంతృప్తిగా ఉన్నాను. పాక్ సముద్ర తలాన్ని రక్షించేందుకు కట్టుబడి ఉంది. అన్ని తీరాల ప్రయోజనాలకు రక్షణ కవచంగా ఉంది' అని జకౌల్లా పేర్కొన్నట్లు పాక్ రేడియో తెలిపింది. -
మళ్లీ జపాన్ మీదుగా మిస్సైల్
-
మళ్లీ జపాన్ మీదుగా మిస్సైల్
► ఆంక్షలను పట్టించుకోని ఉత్తరకొరియా ► భయాందోళనలకు గురైన జపాన్‌వాసులు ► మండిపడిన అమెరికా, దక్షిణకొరియా, జపాన్ సియోల్: ఎన్ని హెచ్చరికలు చేసినా.. ఆంక్షలు విధించినా ఉత్తరకొరియా వెనక్కి తగ్గడం లేదు. జపాన్ భూభాగం మీదుగా తాజాగా మరోమారు ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. ప్యాంగ్యాంగ్ నుంచి శుక్రవారం తెల్లవారుజామున ఈ క్షిపణిని ప్రయోగించింది. ఇది జపాన్ మీదుగా వెళ్లి పసిఫిక్ మహాసముద్రంలో పడింది. మూడు వారాల క్రితం జపాన్ భూభాగం మీదుగా ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం చేపట్టిన విషయం తెలిసిందే. అలాగే ఈ నెలలో మరోమారు అణుపరీక్షలను కూడా నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి కొత్తగా ఉత్తరకొరియాపై ఆంక్షలు విధించింది. దీంతో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తాజాగా క్షిపణి ప్రయోగానికి పాల్పడినట్లు స్పష్టమవుతోంది. సుమారు 770 కిలోమీటర్ల ఎత్తులో.. 3,700 కిలోమీటర్లు ప్రయాణించి క్షిపణి సముద్రంలో పడిపోయినట్లు దక్షిణకొరియా రక్షణ శాఖ వెల్లడించింది. కాగా, ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం నేపథ్యంలో న్యూయార్క్‌లో భద్రతామండలి అత్యవసరంగా సమావేశమైంది. ఈ క్షిపణి వల్ల ఉత్తర అమెరికాకుగానీ, అమెరికా పసిఫిక్ టెర్రీటరీ గ్వామ్కుగానీ ఎటువంటి ప్రమాదం లేదని అమెరికా పసిఫిక్ కమాండ్ వెల్లడించింది. వణికిన జపాన్ ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగంతో జపాన్ ఒక్కసారిగా వణికింది. ఉదయం నిద్ర లేవగానే సైరన్ మోతలు.. అత్యవసర సందేశాలతో లక్షలాది మంది జపాన్ వాసులు భయాందోళనలకు గురయ్యారు. ఉత్తరకొరియా క్షిపణిని ప్రయోగించింది అంటూ లౌడ్ స్పీకర్లతో హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం చేపట్టడంపై జపాన్ మండిపడింది. ఇది రెచ్చగొట్టే చర్యని, ఇలాంటి చర్యలు ప్రపంచ శాంతికి విఘాతమని, వీటిని ఉపేక్షించబోమని జపాన్ ప్రధాని షింజో అబే హెచ్చరించారు. ఉత్తరకొరియా ఇదే పద్ధతిలో ముందుకు వెళితే.. దానికి భవిష్యత్తు ఉండబోదని, ఈ విషయం వారికి అర్థమయ్యేలా చేస్తామని చెప్పారు. మండిపడిన అమెరికా ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తరకొరియా మిత్రదేశాలైన చైనా, రష్యా ఇప్పటికైనా ఆ దేశాన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్షిపణి ప్రయోగాన్ని తాము ఖండిస్తున్నట్టు చైనా, రష్యా ప్రకటించాయి. ఐక్యరాజ్యసమితి ఆంక్షల్ని అమలుచేస్తామని చైనా పేర్కొంది. ఉ.కొరియా చర్యను ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఖండించారు. -
కిమ్ దెబ్బ: బంగారం ధరలు జూమ్
సాక్షి,న్యూఢిల్లీ: ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించడంతో గ్లోబల్‌మార్కెట్లు వెనకడుగు వేయగా బంగారం ధరలు మాత్రం పరుగులు తీస్తున్నాయి. మంగళవారం పసిడి ధరలు గ్లోబల్‌గా తొమ్మిదిన్నర నెలల గరిష్టాన్ని నమోదుచేశాయి. అటు దేశీయంగా ఎంసీఎక్స్ మార్కెట్లో పుత్తడి పది గ్రా. రూ.108 పుంజుకుని రూ. 29 275 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. వెండి సెప్టెంబర్ డెలివరీ కేజీ రూ. 124 బలపడి రూ. 39,851 వద్ద కదులుతోంది. అంతర్జాతీయంగా బంగారం 0.5 శాతం పెరిగి 1,316.66 డాలర్ల స్థాయికి పెరిగింది. గత ఏడాది నవంబర్ నాటి 1,322.33 డాలర్లు గరిష్ట స్థాయికి చేరుకుంది. గత సెషన్లో ఇది 1.4 శాతం పెరిగింది. డిసెంబరు డెలివరీ అమెరికా బంగారం ఫ్యూచర్స్ 0.5 శాతం పెరిగి ఔన్సుకు 1,322.20 డాలర్ల వద్ద ఉంది. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగంపై భూగోళ రాజకీయ ఉద్రిక్తతలను పెంచింది. ముఖ్యంగా డాలర్, ఈక్విటీలపై భారీగా పడగా అమెరికా స్టాక్ ఫ్యూచర్స్, ఆసియన్ షేర్ మార్కెట్ల పతనమయ్యాయి. అయితే జపాన్ ఎన్ విలువ డాలర్‌కు వ్యతిరేకంగా నాలుగు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. మరోవైపు ఉత్తర కొరియా ఉత్తర ద్వీపకల్పం మీదుగా పసిఫిక్ జలాల్లో బాలిస్ట్‌క్ మిస్సైల్‌ను ప్రయోగించిందని దక్షిణ కొరియా జపాన్ ప్రకటించాయి. మిస్సైల్ జపాన్ దేశంగుండా ప్రయాణించడంతో జపాన్ ప్రధాని షింజో అబే ఉత్తర కొరియాపై మండిపడ్డారు. ఇది కొరియా ప్రభుత్వ నిర్లక్ష్యానికి తార్కాణమని వ్యాఖ్యానించారు. దీంతో ప్రస్తుతం ఆసియాలో పలు మార్కెట్లు నష్టాలతో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా దేశీయ మార్కెట్లలో సెన్సెక్స్ 250పాయింట్లకు పైగా పతనమైంది. ఉత్తర కొరియా- అమెరికా మధ్య యుద్ధమేఘాలు, అమెరికా రుణ పరిమితి పెంపుపై అనిశ్చితి, వడ్డీ రేట్ల విషయంలో ఫెడ్ అస్పష్టత వంటి అంశాల కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకూ బంగారం ధరలు 14 శాతం లాభపడడవం గమనార్హం. మరోవైపు ఇండియన్ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఐసీఈఎక్స్) సోమవారం ప్రపంచపు మొట్టమొదటి డైమండ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులను ప్రారంభించింది. -
విడిచిపెడితే వినాశనమే
♦ చైనాయే లక్ష్యంగా క్షిపణిని అభివృద్ధి చేస్తున్న భారత్ ♦ అణ్వాయుధ సంపత్తి మెరుగుదిశగా ముందుకు ♦ డ్రాగన్ ఆటకట్టించే రీతిలో తయారీ ♦ 200 వార్హెడ్లకు సరిపడా ప్లుటోనియం సిద్ధం ♦ వెల్లడించిన వాషింగ్టన్ పత్రిక వాషింగ్టన్/న్యూఢిల్లీ: చీటికిమాటికి సరిహద్దుల వద్ద వివాదాలు సృష్టిస్తూ మన భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్న చైనా ఆటకట్టించే దిశగా భారత్ ముందుకు సాగుతోంది. ఇందులోభాగంగా అణ్వాయుధాలను ఆధునీకరిస్తోంది. వాస్తవానికి ఇప్పటిదాకా పాకిస్థాన్నే తన ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న భారత్ ఇప్పుడు కమ్యూనిస్టు దిగ్గజం అంతుచూడాలని భావిస్తున్నట్టు అమెరికాకు చెందిన అణురంగ నిపుణులు పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలోని తన స్థావరం నుంచి ప్రయోగిస్తే చైనా భస్మీపటలం అయ్యేస్థాయి కలిగిన క్షిపణిని భారత్ తయారుచేస్తోందని జూలై–ఆగస్టు మధ్యకాలంలో ప్రచురించిన ఓ వ్యాసంలో అమెరికాకు చెందిన డిజిటల్ జర్నల్ పేర్కొంది. 150 నుంచి దాదాపు 200 వార్హెడ్లకు సరిపడా ప్లుటోనియంను భారత్ సిద్ధం చేసిందని, అయితే 120 నుంచి 130 వార్హెడ్లను మాత్రమే తయారుచేస్తుందని సదరు వ్యాసం పేర్కొంది. సిక్కిం సరిహద్దు వివాదంతో భారత్–చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. డోక్లాం ప్రాంతం నుంచి భారత బలగాలు వెనక్కి వెళ్లాలంటూ చైనా హెచ్చరిస్తున్నా భారత్ వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఇరు దేశాల మధ్య దాదాపు యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో భారత అణు శక్తిపై ప్రముఖ అమెరికన్ అణ్వాయుధ నిపుణులు రాసిన కథనం ఆసక్తికరంగా మారింది. అమెరికాకు చెందిన హన్స్ ఎం క్రిస్టెన్సన్, రాబర్ట్ ఎస్ నోరిస్ అనే ఇద్దరు అణ్వాయుధ నిపుణులు.. ‘ఇండియన్ న్యూక్లియర్ ఫోర్స్ 2017’ పేరుతో కథనం రాశారు. ఇందులో భారత అణు శక్తిని గురించి ప్రస్తావించారు. భారత్ తన అణ్వాయుధ సంపత్తిని ఆధునీకరిస్తోందని.. చైనా మొత్తాన్ని టార్గెట్ చేసేంత క్షిపణులను తయారుచేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోందని పేర్కొన్నారు. ‘ప్రస్తుతం భారత్ వద్ద ఏడు అణు సామర్థ్య వ్యవస్థలు ఉన్నాయి. అందులో రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌లు, నాలుగు భూ ఉపరితల ఖండాంతర క్షిపణులు, ఒకటి సముద్ర ఉపరితల ఖండాంతర క్షిపణి. అయితే ప్రస్తుతం మరో నాలుగు వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది. రానున్న దశాబ్ద కాలంలో వీటిని సిద్ధం చేయనుంది. ఇక అగ్ని–1ను ఆధునీకరించి అగ్ని–2ని తయారుచేసింది. రెండు వేల కి.మీ ప్రయాణించగల సామర్థ్యం దీనికి ఉంది. దీంతో చైనాలోని పశ్చిమ, దక్షిణ, మధ్య భూభాగాలను లక్ష్యంగా చేసుకోవచ్చు. ఇక అగ్ని–4ను భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రయోగిస్తే.. చైనా మొత్తాన్ని టార్గెట్ చేయవచ్చు. లాంగ్ రేంజ్ అగ్ని–5ని కూడా భారత్ అభివృద్ధి చేస్తోంది. ఐదు వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించగల సామర్థ్యం ఉన్న ఈ ఖండాంతర క్షిపణిని దక్షిణాది నుంచి ప్రయోగించినా. చైనా మొత్తాన్ని లక్ష్యంగా చేసుకోవచ్చు’ అని క్రిస్టెన్సన్, నోరీస్ తమ వ్యాసంలో పేర్కొన్నారు. నేడు అఖిలపక్ష సమావేశం చైనా వివాదంపై వివరణ ఇవ్వనున్న కేంద్రం చైనాతో సరిహద్దు వివాదంతోపాటు కశ్మీర్లో తాజా పరిస్థితుల నేపథ్యంలో శుక్రవారం కేంద్రం...అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో పాల్గొనే అన్ని పార్టీల నాయకులకు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రభుత్వ వైఖరిని వివరించనున్నారు. ఈ ప్రతిపక్ష నేతలతోపాటు ఇద్దరు సీనియర్ మంత్రులు కూడా హాజరవనున్నారు. ఈ సందర్భంగా ఈ రెండు అంశాల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని వివరించనున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవనున్న నేపథ్యంలో ఈ రెండు అంశాల విషయంలో అధికార, విపక్షాలు ఏకతాటిపైకి రావాలని కేంద్రం భావిస్తోంది. కాగా ఇండియా–భూటాన్–టిబెట్ ట్రైజంక్షన్‌వద్ద సిక్కిం పరిధిలోగల డోక్లాంవద్ద యథాపూర్వకస్థితిని మార్చేందుకు చైనా యత్నిస్తుండడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. గత మూడువారాలుగా డోక్లాం విషయమై ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరోవైపు అమర్నాథ్ యాత్ర ముగించుకుని తిరిగివస్తున్న భక్తులపై జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు దాడులు జరపడం. ఏడుగురు యాత్రికులు చనిపోవడం తెలిసిందే. ఈ రెండు అంశాల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నాయి. -
కొరియా సీతయ్య..!
-
డీఆర్డీవో క్షిపణి ప్రయోగం విజయవంతం
బాలాసోర్(ఒడిశా): ఉపరితలం నుంచి ఆకాశంలోని లక్ష్యాలను అత్యంత వేగంగా ఛేదించగల స్వల్ప శ్రేణి స్వదేశీ క్షిపణిని భారత రక్షణ శాఖ సోమవారం విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని చండిపూర్లోగల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి సోమవారం ఉదయం 11.30 గంటల సమ యంలో ఈ క్షిపణి ప్రయోగాన్ని చేపట్టినట్లు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో) వర్గాలు వెల్లడించాయి. ఈ క్షిపణి 25 నుంచి 30 కి.మీ. దూరంలోని వివిధ లక్ష్యాలను ఒకే సమయంలో అత్యంత వేగంగా ఛేదించగలదని పేర్కొన్నారు. క్షిపణిలోని రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్స్, టెలిమెట్రీ సిస్టమ్స్, ఇతర ట్రాకింగ్ పరికరాలు సమర్థవంతంగా పనిచేశాయని.. క్షిపణి ప్రయోగం పూర్తిస్థాయిలో విజయవంతమైందని తెలిపారు. -
కిమ్ వేడుకలు: అమెరికాపై బాంబు వేస్తాం
టోక్యో: ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఇంటర్మీడియెట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగం విజయవంతమైందని ప్రకటించారు. ఈ సందర్భంగా రాజధాని ప్యోంగ్యాంగ్లో సంబరాలు అంబరాన్నంటాయి. త్వరలోనే అణు వార్‌హెడ్‌ను మోసుకుని అమెరికా భూభాగాన్ని చేరుకోగల సామర్ధ్యం కలిగిన క్షిపణిని తయారు చేస్తామని పేర్కొన్నారు. ఆదివారం ఉత్తరకొరియా ఇంటర్మీడియెట్ రేంజ్ క్షిపణిని పరీక్షించింది. 2 వేల కిలోమీటర్ల ఎత్తులో 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన క్షిపణి జపాన్ సముద్రజలాల్లో కూలి పోయింది. దక్షిణకొరియా అధ్యక్షుడిగా మూన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం చేపట్టడం ఇదే తొలిసారి. ఉత్తరకొరియా ప్రయోగించిన ఇంటర్మీడియెట్ రేంజ్ మిస్సైల్ క్రమంగా ఖండాంతర క్షిపణి తయారీకి బాటలు వేస్తుందని అమెరికా రాకెట్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత ప్రయోగాల కంటే కొన్ని రెట్ల మెరుగైన ఫలితాలు ఈ క్షిపణి ప్రయోగంతో ఉత్తరకొరియా చూసిందని తెలిపారు. కేవలం ఒక ఏడాదిలోపే ఖండాతర క్షిపణి వ్యవస్ధను ఉత్తరకొరియా చేరుకోగలదని భావిస్తున్నట్లు చెప్పారు. ఉత్తరకొరియా క్షిపణి పరీక్షను అమెరికా, దక్షిణకొరియా, జపాన్‌లు ఖండించాయి. క్షిపణి ప్రయోగంపై ప్రకటన విడుదల చేసిన ప్యోంగ్యాంగ్ మీడియా.. దాని పేరును హ్వాసంగ్-12గా పేర్కొంది. అమెరికా మిలటరీ బలగాలతో తమను రెచ్చగొట్టేందుకు యత్నిస్తే గట్టిగా బదులిస్తామని ఆ దేశం హెచ్చరించింది. విపత్కర పరిణామాలు చూడాలనుకుంటే తమతో పెట్టుకోవాలని అంది. -
ఉ.కొరియా మరో క్షిపణి పరీక్ష
సియోల్: అణు బాంబు వేస్తామంటూ అమెరికాను భయపెడుతున్న ఉత్తర కొరియా ఆదివారం ఖండాం తర క్షిపణిని పరీక్షించింది. క్షిపణి సుమారు 800 కి.మీ. ప్రయాణించి జపాన్‌కు సమీపంలోని సముద్ర జలాల్లో పడింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా, జపాన్, అమెరికా మిలటరీ బృందం స్పష్టం చేసింది. ఈ కొత్త ప్రయోగంతో ఇటీవల ఎన్నికైన దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌తో పాటు పసిఫిక్ మహా సముద్రంలో మోహరించిన జపాన్, అమెరికా, యూరప్ నౌకా దళాలకు ఉత్తర కొరియా సవాల్ విసిరింది. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షపై జపాన్ అధ్యక్షుడు షింజో అబే మాట్లాడుతూ.. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని చెప్పారు. -
క్షిపణి పడుద్ది జాగ్రత్త!
శత్రు దేశాలకు ఇరాన్ గట్టి హెచ్చరిక ఇరాన్ : ఇరాన్ తన శత్రు దేశాలకు గట్టి హెచ్చరికలు పంపింది. ఏ శత్రుదేశమైనా పరిధి దాటి ప్రవర్తిస్తే ఆ దేశాలకు తమ క్షిపణి సమాధానం చెబుతుందని ఇరాన్ ఎలైట్ రెవల్యూషనరీ గార్డ్ ఎయిర్ స్పేస్ విభాగం జనరల్ అమీర్ అలీ తెలిపారు. రివల్యూషనరీ గార్డ్ మిలిటరీ ఇటీవల చేసిన క్షిపణి, రాడార్ వ్యవస్థల్ని పరీక్షించడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ పై ఆంక్షలు విధిస్తామన్న వ్యాఖ్యల నేపథ్యంలో ఇరాన్ తాజాగా హెచ్చరించింది. శత్రుదేశాలు హద్దు మీరినట్లైతే తమ క్షిపణులు ఆ దేశాలకు సమాధానం చెబుతాయని హజిజదె వ్యాఖ్యానిం చారు. ఇదిలా ఉండగా కేవలం ఆత్మరక్షణ చర్యల్లో భాగం గానే క్షిపణి పరీక్షలు జరిపామని, భద్రతామండలిలోని 2231 తీర్మానాన్ని గానీ, పశ్చిమ దేశాలతో అణు ఒప్పం దాల్ని ఉల్లంఘించలేదని ఇరాన్ చెబుతోంది. తమ ప్రజల కు భద్రతనిచ్చేందుకు వారిలో భయాందోళనలు పారద్రో లేందుకే మేము క్షిపణి పరీక్షలు జరిపామని..ముందుగా మేం యుద్ధాన్ని కోరుకోమని ఇరాన్ విదేశాంగ మంత్రి జావద్ జరీఫ్ ట్వీట్లో తెలిపారు. -
నౌకా విధ్వంసక క్షిపణి పరీక్ష జరిపిన పాక్
ఇస్లామాబాద్: నౌకలను విధ్వంసం చేసే క్షిపణిని పాకిస్తాన్ విజయవంతంగా పరీక్షించింది. బుధవారం ఉత్తర అరేబియా సముద్రంలో ఉపరితలం నుంచి ఉపరితలంపై లక్ష్యాన్ని ఛేదించే నౌక విధ్వంసక క్షిపణిని పరీక్షించినట్లు ఆ దేశ నేవీ ప్రకటించింది. పీఎన్ఎస్ అస్లాట్ అనే యుద్ధనౌక నుంచి నేవీ చీఫ్ అడ్మిరల్ ముహమ్మద్ జకుల్లా సమక్షంలో దీన్ని ప్రయోగించారు. ఇది ఎక్కువ కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని నేవీ తెలిపింది. -
లక్ష్యం 350 కిమీ.. మరోసారి పృథ్వీ-2 సక్సెస్!
బాలాసోర్: దేశీయంగా రూపొందించిన అణ్వాయుధ సామర్థ్యం గల పృథ్వీ-2 క్షిపణిని భారత్ సోమవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా చాందిపూర్‌లోని టెస్ట్ రేంజ్లో ఆర్మీ రెండుసార్లు ఈ క్షిపణీని వెంటవెంటనే పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయాణించే ఈ క్షిపణి 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఢీకొనగలదు. 500, వెయ్యి కిలోల వార్‌హెడ్స్ మోసుకెళ్లగలుతుంది. ఇప్పటికే ఈ క్షిపణికి సంబంధించి ఇలాంటి పరీక్షలు రెండింటిని 2009 అక్టోబర్ 12న విజయవంతంగా నిర్వహించారు. ఇప్పటికే ఉత్పత్తి చేసిన క్షిపణుల్లో ర్యాండమ్‌గా పృథ్వీ-2 క్షిపణిని ఎంచుకొని పరీక్షలు నిర్వహించారు. స్ట్రాటెజిక్ ఫోర్స్ కమాండ్ (ఎస్ఎఫ్ఎస్), డీఆర్డీవో శాస్త్రవేత్తల పర్యవేక్షణలో శిక్షణ కసరత్తులో భాగంగా ఈ క్షిపణి పరీక్షలు నిర్వహించినట్టు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. -
చైనాను కలవర పెడుతున్న బ్రహ్మోస్
-
ఉత్తర కొరియాపై జపాన్ సీరియస్
టోక్యో: ఉత్తర కొరియా తన దుందుడుకు చర్యలను కొనసాగిస్తూనే ఉంది. బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఆ దేశం.. వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఉత్తరకొరియా పరిక్షించిన క్షిపణి ఒకటి జపాన్ సమీపంలోని సముద్రజలాల్లో పడింది. దీంతో.. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఇలా ప్రయోగాలు నిర్వహించడం ఏ మాత్రం సహేతుకం కాదంటూ ఉత్తర కొరియాపై జపాన్ మండిపడుతోంది. తమ ప్రాదేశిక జలాల్లోని 'ఎక్స్‌క్లూజీవ్ ఎకనమిక్ జోన్'(ఈఈజెడ్) పరిధిలో క్షిపణి పడిందని జపాన్ వెల్లడించింది. ఇది తమ దేశ భద్రతకు తీవ్రమైన హాని కలిగించే చర్య అని జపాన్ ప్రధాని షింజో అబె అన్నారు. జపాన్ ప్రభుత్వ సీనియర్ అధికారి యొషిహిడే సుగా మాట్లాడుతూ.. ఉత్తర కొరియా చర్య ఎయిర్ క్రాఫ్ట్‌లు, షిప్పులకు హాని కలిగించేలా ఉందని అన్నారు. జపాన్‌కు 200 కిలోమీటర్ల దూరంలోని సముద్రజలాల్లో క్షిపణి పడినట్లు తెలుస్తోంది. దక్షిణ కొరియా, అమెరికా భారీ స్థాయిలో సంయుక్త మిలటరీ ఎక్సర్సైజ్ నిర్వహించనున్న నేపథ్యంలో జరిగిన ఈ క్షిపణి పరీక్షను అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిబంధనలను ఉత్తరకొరియా ఉల్లంఘిచిందని అమెరికా పేర్కొంది. -
చరిత్ర సృష్టించిన డీఆర్డీవో
బలాసోర్: భారత్ వరుసగా రెండో రోజు శుక్రవారం మధ్యశ్రేణి క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్ నుంచి బరాక్-8 క్షిపణిని పరీక్షించింది. భారత్ ఇజ్రాయెల్‌తో కలసి ఈ క్షిపణిని అభివృద్ధి చేసింది. ఈ క్షిపణిని గురువారం రెండు సార్లు విజయవంతంగా పరీక్షించారు. డీఆర్డీవో రెండు రోజుల్లో మూడుసార్లు మధ్యశ్రేణి క్షిపణి పరీక్షలు నిర్వహించి చరిత్ర సృష్టించింది. -
'శాటిలైట్' ను పేల్చేస్తాం
హైడ్రోజన్ బాంబు ప్రయోగంతో తూర్పు ఆసియాపై ఆవహించిన యుద్ధమేఘాలకు ఇంకాస్త కారునలుపును పులుముతోంది ఉత్తర కొరియా. తాజాగా ఆ దేశం తలపెట్టనున్న క్షిపణి ప్రయోగాన్ని పొరుగేశం జపాన్ వ్యతిరేకించడమేకాక తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీచేసింది. అణ్వాయుధాలను మోసుకెళ్లనడమే కాక దాదాపు 3,400 మైళ్ల దూరంలోని లక్ష్యాన్ని సైతం ఛేదించగల ఖండాంతర క్షిపణిని ఇటీవలే అభివృద్ధి చేసిన ఉత్తర కొరియా.. ఈ నెలలోనే దానిని పరీక్షించాలని భావిస్తున్నది. కొరియా నియంత నేత ప్యోగ్ యాంగ్.. 'శాటిలైట్' గా నామకరణం చేసిన ఆ క్షపణి పరీక్షకు ఫిబ్రవరి 8న అధికారిక కౌంట్ డౌన్ ప్రారంభించనున్నారు. ఈ ప్రయోగాన్ని జపాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. 'శాటిలైట్ క్షిపణి గనుక మా గగనతలంలోకి ప్రవేశిస్తే దాన్ని పేల్చిపారేస్తాం'అని ఉత్తరకొరియాను హెచ్చరించింది. 'శిటిలైత్ మన పరిధిలోకిగానీ వస్తే తునాతునకలుచేయండిట' అంటూ జపాన్ రక్షణశాఖ మంత్రి జనరల్ నకతాని సైన్యానికి ఆదేశాలు జరీచేశారు. ఇప్పటికే ఉత్తరకొరియా సరిహద్దు వెంబడి భారీగా సైన్యాన్ని మోహరించిన జపాన్ తమదగ్గరున్న పీఏసీ- 3, ఎస్ఎం-3 క్షిపణి విధ్వంసక వ్యవస్థతో శాటిలైట్ ను కూల్చేస్తామని తెలిపింది. అత్యవసరంగ జారీచేసిన ఆదేశాలు ఫిబ్రవరి 25 వరకు అమలులో ఉంటాయని పేర్కొంది. -
ఐఎస్ ఉగ్రవాదులను వణికిస్తోన్న రష్యా
డెమాస్కస్: చెప్పిన మాట చెప్పినట్లుగా రష్యా చేస్తోంది. వ్యూహాలతో ముందుకు వెళుతూ సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు చుక్కలు చూపిస్తోంది. తొలిసారి సెప్టెంబర్ 30 నుంచి దాడులు ప్రారంభించిన రష్యా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు కంటిపై కునుకులేకుండా చేస్తుంది. తమ దేశానికి చెందిన వైమానిక దళాన్ని రంగంలోకి దించి ఎక్కడికక్కడ ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేస్తోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో ఉగ్రవాదులను హతం చేసిన రష్యా రాత్రిపూట కూడా దాడులు చేస్తోంది. రాత్రిపూట ప్రయోగించి నైట్ టైం క్రూయిజ్ మిసైల్స్ ను ప్రయోగించి సిరియాలోని పలు ఉగ్రవాద స్థావరాలను కూల్చిపడేసింది. సిరియాలోని మూడు కీలక ఉగ్రవాద స్థావరాలపై భారీ మిసైల్స్‌తో రష్యా రాత్రి దాడులకు పాల్పడిందని అధికారులు తెలిపారు. క్యాస్పియన్ సముద్ర తీరం నుంచి ప్రయోగించిన క్షిపణి ఒకటి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బాంబులు తయారు చేసే ఫ్యాక్టరీని, ఆయుధ నిల్ల ప్రాంతాలను, ఇంధన స్టోరేజిలను, శిక్షణ ఇచ్చే క్యాంపులను ధ్వంసం చేసి పారేసిందని, దీంతో ఉగ్రవాదులను కోలుకోలేని దెబ్బతగిలినట్లయింది. ఒకప్పుడు ఘనమైన చరిత్ర, సంస్కృతి సాంప్రదాయాలు విలసిల్లిన సిరియాలో నేడు ఉగ్రవాదులు నెత్తుటేర్లు పారిస్తున్న విషయం తెలిసిందే. అక్కడి ప్రజలు కూడా భయాందోళనలతో తమ మాతృభూమిని వదిలి వివిధ యూరోపియన్ దేశాలకు వలస వెళుతున్నారు. దీంతో ప్రపంచంలోని శక్తిమంతమన దేశాలైన రష్యా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ దేశాలు సిరియాలోని ఉగ్రవాదులపై ప్రత్యక్ష యుద్ధం ప్రకటించాయి. -
భారత అమ్ముల పొదికి ఆకాశ్
న్యూఢిల్లీ: దాదాపు 32 ఏళ్ల నిరీక్షణకు తెరపడుతోంది. ఎప్పుడెప్పుడా అనుకుంటున్న భారత సైనికుల కల నెరవేరబోతుంది. భారతఅమ్ముల పొదిలోకి మరో శక్తిమంతమై క్షిఫణి ఆకాశ్ మంగళవారం అధికారికంగా చేరనుంది. ఇందుకోసం ఢిల్లీలో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఆకాశ్‌ను భారత సైన్యానికి అప్పగించనున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ ఆకాశ్ క్షిపణి దేశానికే గర్వకారణం. శత్రుసైన్యం విమానాలను దీటుగా ఎదుర్కొనేందుకు భారతీయశాస్త్రవేత్తలు దీన్ని రూపొందించారు. హైదరాబాద్‌లోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ లేబోరేటరీ (డీఆర్డీఎల్)లో పనిచేస్తున్న ఆకాశ్‌క్షిపణి ప్రాజెక్టు డెరైక్టర్ గడ్డమణుగు చంద్రమౌళి ఆధ్వర్యంలో దీన్ని రూపొందించారు. ఆకాశ్ క్షిపణి ప్రత్యేకతలు ఆకాశంలో ఎగిరే శత్రు విమానాలు, పెలైట్ రహిత విమానాలను ఛేదించేందుకు ఆకాశ్ క్షిపణి వ్యవస్థ పనిచేస్తుంది. ఒకేసారి నాలుగు విమానాలను, నాలుగు సూపర్సోనిక్ క్షిపణులతో ఛేదించడం దీని ప్రత్యేకత. ఈ వ్యవస్థను పూర్తిఆటోమేటిక్గా గానీ, సెమీ ఆటోమేటిక్‌గా గానీ ప్రయోగించవచ్చు. ప్రపంచంలో ఇటువంటి సామర్థ్యం అమెరికా, రష్యా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్ దేశాలకు మాత్రమే ఉంది. మన ఆకాశ్ క్షిపణి వ్యవస్థ ప్రపంచంలోని దేశాలన్నింటికంటే ముందుంది. మన క్షిపణికున్న ప్రత్యేక ఫీచర్స్ ఇతర దేశాలకు లేవు. ప్రపంచంలోనే అతితక్కువ ఖర్చుతో ఒక విమానాన్ని ఛేదించగల సామర్థ్యం. దీనినే లో కాస్ట్పర్ కిల్ అంటారు. విన్యాసాలు చేస్తూ వేగంగా కదిలే విమానాలను సైతం ఆకాశ్ ఛేదిస్తుంది. దీనికి సంబంధించిన అతిముఖ్యమైన రాడార్లను బెంగళూరులోని ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ఎల్ఆర్డీఈ)ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. సూక్ష్మంగా ఉండే లక్ష్యాలను గుర్తించడం, అతివేగంగా పయనించే 64 లక్ష్యాలను ఒకేసారి ట్రాక్ చేయడం, ఒకేసారి ఎనిమిది క్షిపణులను గైడ్ చేయడం, శత్రు, మిత్ర విమానాలను గుర్తించడం, అత్యాధునిక ఎలక్ట్రానిక్ కౌంటర్ మెస్యూరింగ్ (ఈసీసీఎం) ఫీచర్స్‌తో ఈ రాడార్‌ను రూపొందించారు. -
అగ్ని-3 అణ్వస్త్ర క్షిపణి పరీక్ష విజయవంతం
బాలాసోర్: అణ్వస్త్ర సామర్థ్యంగల అగ్ని-3 బాలిస్టిక్ క్షిపణిని గురువారం భారత్ మూడోసారి విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని వీలర్ ఐలాండ్ నుంచి డీఆర్డీఓ నేతృత్వంలో సైన్యం ఈ పరీక్షను పూర్తిచేసింది. ఉపరితలం నుంచి ఉపరితలంపై 3000 కి.మీ. దూరంలోపు లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణిని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌నుంచి ఉదయం 09.55 గంటలకు పరీక్షించినట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. అగ్ని-3లో రెండంచెల ఘన ఇంధన వ్యవస్థ ఉంటుంది. 17 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వ్యాసం, 50 టన్నుల బరువు ఉండే ఈ క్షిపణి 1.5 టన్నుల న్యూక్లియర్ వార్‌హెడ్‌ను మోసుకుపోతుంది. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఈ క్షిపణి ఇప్పటికే సైన్యం అమ్ములపొదిలోకి చేరింది. -
ఐఎస్ఐ చేతికి ఆర్మీ మిస్సైల్స్ డేటా
* పటన్ అరెస్టుతో వెలుగుచూస్తున్న వాస్తవాలు * మిలటరీకి చెందిన ఫొటోలు, డాక్యుమెంట్లు అందజేత * మహిళా ఉగ్రవాది నుంచి పటన్ అకౌంట్‌కు రూ. 74 వేలు * ఉన్నతాధికారి కంప్యూటర్ నుంచి రహస్యాల చేరవేత సాక్షి, హైదరాబాద్: ఆర్మీ రహస్యాలు పాక్ ఉగ్రవాదులకు చేరవేసిన సైనిక అధికారి పటన్‌కుమార్ అరెస్టుతో దిమ్మతిరిగే విషయాలు గురువారం వెలుగు చూశాయి. పటన్‌ను పోలీసు కస్టడీకి ఇవ్వాలని సీసీఎస్ పోలీసులు వేసిన పిటిషన్‌పై నాంపల్లి చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది. ముద్దాయి తరఫున న్యాయవాది లేకపోవడంతో వాయిదా వేసినట్లు మేజిస్ట్రేట్ వెల్లడించారు. ముద్దాయి వాదన వినకుండా కస్టడీకి ఇవ్వలేమని, అతనికి పోలీసులు ముందుగా సమాచారం ఇవ్వాలని చెప్పారు. దీంతో పోలీసులు చంచల్‌గూడ జైలులో ఉన్న పటన్‌కు కస్టడీ పిటిషన్ విషయంపై వివరించారు. ఇలావుండగా పటన్ నుంచి 4 కంప్యూటర్లు, ల్యాప్‌టాప్, బ్లూటూత్, 3 సెల్ఫోన్లు, నాలుగు పెన్‌డ్రైవ్‌లు, 10 సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. హార్డ్‌డిస్క్‌ను డీకోడ్ చేసేందుకు ఎఫ్ఎస్ఎల్ అధికారులు శ్రమిస్తున్నారు. డీకోడ్ అయితే పటన్ ఐఎస్ఐ మహిళా ఏజెంట్‌కు వెల్లడించిన మరిన్ని రహస్యాలు బయటపడే అవకాశం ఉంది. పటన్కుమార్ను సస్పెండ్ చేస్తూ పోలీసు శాఖకు ఆర్మీ అధికారులు సమాచారాన్ని అందజేసినట్లు తెలిసింది. పటన్‌కుమార్ వ్యవహార శైలిపై బీహార్, పశ్చిమ బెంగాల్ పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో అతను పని చేసిన విభాగాల్లో అతని ప్రవర్తన, తీరుతెన్నులను తెలుసుకుంటున్నారు. అనుష్క అగర్వాల్ పేరిట చాటింగ్ చేసిన ఆ యువతి అసలుపేరు ఏమిటనేది తేలాల్సి ఉంది. పంపిన రహస్యాలు ఇవే ఆర్మీ మిస్సైల్స్ నిల్వ కర్మాగారాల వివరాలతో పాటు కీలక విభాగాల్లో ఉన్న 40 మంది ఆర్మీ అధికారుల వివరాలను పటన్ పంపినట్లు తెలుస్తోంది. ఆర్మీ డాక్యుమెంట్లు, ఫోటోలు కూడా పంపించాడు. దేశంలో ఉన్న 12 ఆర్మీ యూనిట్ల బ్రిగేడ్ల పేర్లు, ఆ ప్రదేశాల వివరాలు, పశ్చిమ సరిహద్దులోని ఆర్మీ సమాచారాన్ని ఫోన్లో అనుష్కకు చెప్పాడు. సైన్యం కదలికలు, ఎత్తుగడలు, కీలక స్థావరాలను ఆమెకు వెల్లడించాడు. జీ మెయిల్ ఐడీ ‘ప్రియాన్షూ1995’తో ఈ మెయిల్ సృష్టించిన పటన్ దాని ఐడీని అనుష్కకు చేరవేశాడు. పలు వివరాలను ఈ మెయిల్‌కు పంపగానే ఆమె వాటిని డౌన్లోడ్ చేసుకుంది. కాగా పాక్ మహిళా ఉగ్రవాదికి పలు రహస్యాల చేరవేతపై ఆర్మీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఓ అధికారికి చెందిన కంప్యూటర్ను పటన్ ఉపయోగించాడని అధికారుల పరిశీలనలో తేలింది. ఆ అధికారి కంప్యూటర్ కోడ్ పటన్‌కు తెలియడంతో ఆ వివరాలను అనుష్కకు పంపినట్లు తెలిసింది. రహస్యాలకు పారితోషికం ఇక్కడి సమాచారాలు అనుష్కకు అందించినందుకు గాను మొదటిసారిగా 2013 మేలో బీహార్‌లోని ఎస్బీఐలో ఉన్న పటన్ బ్యాంక్ అకౌంట్లోకి పశ్చిమ బెంగాల్ మాల్దా జిల్లాలోని ఎస్బీఐ (మంగల్వాడి బ్రాంచి) నుంచి రూ.9,000ను అనుష్క పంపించింది. ఇలా ఏడాది కాలంలో రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.20 వేలు, రూ.20 వేల చొప్పున రూ.74 వేలు వేసింది. తాను అడిగిన రహస్యాలు పంపితే హైదరాబాద్‌కు వచ్చి స్వయంగా కలుస్తానని, లండన్‌కు కూడా పంపిస్తానని చెప్పింది. తన తండ్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసాడని పటన్‌ను నమ్మించింది. పటన్ చిక్కాడిలా పటన్ సెల్‌కు ఐఎస్ఐ మహిళా ఉగ్రవాది చేసిన సెల్ నంబర్ టవర్ లొకేషన్‌ను పోలీసులు గుర్తించారు. ఆమె వాడిన సెల్‌ఫోన్ ప్రదేశం పాక్ సరిహద్దుల్లోదని తేలింది. దీంతో ఆమె పాకిస్థాన్ నుంచే ఆర్మీ రహస్యాలను రాబట్టిందని విచారణలో తేలింది. పాక్ సరిహద్దుల్లో సెల్ఫోన్లను ఐబీ అధికారులు ట్రాప్ చేసే క్రమంలో హైదరాబాద్ నుంచి తరచూ ఫోన్లు వస్తున్నాయని గ్రహించారు. ఐబీ అధికారులు హైదరాబాద్ పోలీసులను అప్రమత్తం చేయడంతో పటన్ గుట్టు రట్టయ్యింది. 15 రోజులు టాస్క్‌ఫోర్స్ పోలీసులు శ్రమించి పటన్‌ను పట్టుకోగలిగారు. పటన్ నేపథ్యమిదీ బీహార్ రాష్ట్రానికి చెందిన పటన్‌కుమార్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. ఆ తరువాత ఇతని కుటుంబం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో స్థిరపడింది. 1996లో క్లర్క్‌గా ఆర్మీలో ఉద్యోగం సంపాదించాడు. మొదటి పోస్టింగ్ ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో నిర్వహించాడు. 2010లో పెళ్లి చేసుకున్నాడు. 2006 నుంచి 2012 వరకు జమ్మూలోని పూంచ్ ప్రాంతంలోని ఆర్మీ సెంటర్లో పనిచేశాడు. 2012లో సికింద్రాబాద్‌కు బదిలీ అయ్యాడు. అతని భార్య, పిల్లలు మాత్రం బీహార్లోనే ఉంటున్నారు. అనుష్క ఎఫ్బీలో సైనికాధికారుల ఫొటోలు కాగా అనుష్క ఫేస్బుక్లో 20 మంది సైనికాదుకారుల పేర్లు, ఫోటోలు కూడా దర్శనమిచ్చాయి. వారి పాత్ర ఏ మేరకు ఉందనే విషయంపై కూడా దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. ఆర్మీ పీఆర్ఓ వివరణ పటన్ ఈఎంఈలో పనిచేయడం లేదని అతను ఆర్మీ ఆర్టిల్లరీ విభాగానికి చెందిన వాడని ఆర్మీ పౌర సంబంధాల శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. సికింద్రాబాద్‌లోని 151 ఎంసీ/ఎంఎఫ్ డిటాచ్మెంట్ వి భాగంలో పనిచేస్తున్నట్లు అందులో పేర్కొంది. -
చైనా క్షిపణి నిరోధక పరీక్ష విజయవంతం
బీజింగ్: చైనా గగనతలానికి క్షిపణి రక్షణ కవచం ఏర్పాటులో భాగంగా ఆ దేశం బుధవారం మూడోసారి క్షిపణి నిరోధక పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. క్షిపణి నిరోధక సాంకేతికత పరీక్షలో భాగంగా చైనా మిలటరీ భూతలం నుంచి ఈ క్షిపణి పరీక్షను నిర్వహించిందని, ఈ పరీక్ష అన్ని రకాలుగా విజయవంతం అయిందని చైనా రక్షణ శాఖ వెల్లడించింది. అయితే మిలటరీ పెద్ద ఎత్తున చేపట్టిన ఈ క్షిపణి పరీక్ష నేపథ్యంలో బుధవారం 12 విమానాశ్రయాల్లో 290 విమానాల రాకపోకలు ప్రభావితమైనట్లు ‘జిన్హువా’ వార్తాసంస్థ పేర్కొంది. అలాగే సైన్యం పెద్ద ఎత్తున కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో షాంఘై, నాంజింగ్, తదితర పట్టణాల్లోని విమానాశ్రయాల్లో రాకపోకలపై గత ఆదివారం నుంచి ఆగస్టు 15 వరకూ ఆంక్షలు కూడా విధించినట్లు తెలిపింది. -
బక్ క్షిపణుల సామర్థ్యమిదీ...
ఉక్రెయిన్ గగనతలంపై దాదాపు 10 కి.మీ. ఎత్తులో ఎగురుతున్న మలేసియా విమానాన్ని ‘బక్’ రకం క్షిపణి కుప్పకూల్చడంతో దీని సామర్థ్యంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీని పనితీరును పరిశీలిస్తే...అమెరికాతో ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో నాటి సోవియెట్ రష్యా ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల మధ్యశ్రేణి బక్ రకం క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసింది.సైనిక విమానాలు, హెలికాప్టర్లు, క్రూయిజ్ క్షిపణులను కూల్చేందుకు వీటిని వాడతారు. ఈ క్షిపణులు 72 వేల అడుగుల ఎత్తులోని లక్ష్యాలను సైతం ఛేదించగలవు. (క్షిపణి ఢీకొట్టే సమయానికి మలేసియా విమానం 33 వేల అడుగుల ఎత్తులో ఎగురుతోంది)ఒక్కో బక్ వ్యవస్థలో నాలుగు క్షిపణలు, రాడార్ వాహనం, లాంచ్ వాహనం, కమాండ్ కాంప్లెక్స్ ఉంటాయి. ఈ క్షిపణి రాడార్ సాయంతో నిర్దేశిత లక్ష్యాన్ని గుర్తిస్తుంది. ఒక్కసారి క్షిపణిని ప్రయోగించాక అది 30 కి.మీ ఎత్తు వరకూ ఎగరగలుగుతుంది. ఒక్కో క్షిపణి అంచున 70 కిలోల పేలుడు పదార్థాలు ఉంటాయి. లక్ష్యాన్ని సమీపించగానే తొలుత క్షిపణి అంచు పేలిపోతుంది. అనంతరం మిగిలిన క్షిపణి భాగం పదునైన ఇనుప ముక్కలను లక్ష్యంపై చిమ్ముతుంది.{పస్తుతం ఉక్రెయిన్తోపాటు రష్యా దళాలు అత్యాధునిక ఎస్ఏ-17 రకం బక్ వ్యవస్థను వినియోగిస్తున్నాయి. -
క్షిపణితో మలేసియా విమానం కూల్చివేత
-
ఉక్రెయిన్ గగనతలంపై భద్రత లేదా ?
-
క్షిపణితో మలేసియా విమానం కూల్చివేత!
కీవ్/మాస్కో/వాషింగ్టన్/ కౌలాలంపూర్: రెండు దేశాల ఆధిపత్య పోరులో 295 మంది అమాయక ప్రయాణికులు బలయ్యారు. 295 మందితో అమ్‌స్టర్‌డామ్ నుంచి కౌలాలంపూర్‌కు బయల్దేరిన విమానాన్ని గురువారం సాయంత్రం ఉక్రెయిన్ గగనతలంపై పేల్చేశారు. రష్యా సరిహద్దుల్లో ఉక్రెయిన్ ప్రభుత్వ దళాలు, రష్యా అనుకూల తిరుగుబాటుదారుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రాంతంలో.. ఆ విమానం కూలిపోయింది. ఘటనలో విమానంలో ఉన్న 280 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది.. మొత్తం 295 మంది మరణించారు. పేల్చివేతపై ఇప్పటివరకూ ఎవరూ బాధ్యత తీసుకోలేదు. కానీ ఉక్రెయిన్ దళాలే పేల్చేశాయని రష్యా అనుకూల తిరుగుబాటుదారులు పేర్కొంటుండగా.. అది తిరుగుబాటుదారుల పనేనంటూ ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ప్రయాణీకుల విమానాన్ని కూల్చివేయడంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నాలుగు నెలల క్రితం హిందూ మహాసముద్రంలో అంతు చిక్కని రీతిలో అదృశ్యమైన ఎంహెచ్ 370 విమాన ఘటనను మరచిపోకముందే ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన ఈ రెండు విమానాలు మలేసియన్ ఏర్‌లైన్స్‌కు చెందినవే కావడం గమనార్హం. సమాచారం అందగానే హుటాహుటిన అత్యవసర సహాయ దళాలు ఘటనాప్రాంతానికి బయల్దేరాయని ఉక్రెయిన్ అధికారులు పేర్కొన్నారు. ఈ దుర్ఘటనను విమాన విపత్తుగా పేర్కొన్న ఉక్రెయిన్ ప్రధానమంత్రి వెంటనే విచారణకు ఆదేశించారని సమాచారం. విమానం కూలిపోయిన ప్రాంతంలో 22 మృతదేహాలను లెక్కించినట్లు ఘటనాస్థలానికి చేరిన జర్నలిస్ట్ ఒకరు తెలిపారు. 10 కిమీల ఎత్తున మలేసియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777 ప్యాసెంజర్ విమానం గురువారం సాయంత్రం ఉక్రెయిన్‌లోని, సంక్షోభ ప్రాంతమైన దొనెస్క్లో ఉన్న షక్తర్క్ పట్టణ పరిసరాల్లోకి రాగానే రాడార్ సంకేతాలకు దూరమైంది. అది రష్యా అనుకూల తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ప్రాంతం. ఆ సమయంలో ఆ విమానం ఉక్రెయిన్ గగనతలంపై 30 వేల అడుగుల (దాదాపు 10 కిమీల) ఎత్తున ఉంది. దీన్ని భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణితో పేల్చేశారని భావిస్తున్నారు. కాలిపోతు న్న శకలాలు, మృతదేహాలు రష్యా సరిహద్దుకు 40 కిమీల దూరంలోని గ్రబావొ గ్రామ సమీపంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మీరంటే మీరు.. గత కొన్ని వారాలుగా ఉక్రెయిన్‌కు చెందిన పలు మిలటరీ విమానాలను రష్యా అనుకూల తిరుగుబాటు దారులు పేల్చేస్తున్నారు. బుధవారం కూడా తమ యుద్ధవిమానాన్ని పేల్చేశారని ఉక్రెయిన్ ప్రకటించింది. తిరుగుబాటుదారులకు రష్యా అన్నిరకాలుగా సహకరిస్తోందని, అత్యాధునిక క్షిపణులను వారికి అందిస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఉక్రెయిన్ సాయుధ దళాలు గగన లక్ష్యాలపై ఎలాంటి దాడులు చేయలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పొరొషెంకొ తన అధికారిక వెబ్సైట్లో ప్రకటించారు. ఉక్రెయిన్ వైమానిక దళమే మలేసియా ప్యాసెంజర్ విమానాన్ని పేల్చేసిందని తిరుగుబాటుదారుల నేత అలెక్జాండర్ బొరొదాయి ఆరోపించారు. విమాన ప్రమాద వార్త వినగానే షాక్‌కు గురయ్యానని, దీనిపై తక్షణమే విచారణకు ఆదేశించానని మలేసియా ప్రధానమంత్రి నజిబ్ రజాక్ ప్రకటించారు. ఒబామా ఆరా విమాన ప్రమాద ఘటనపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఆరా తీశారు. రష్యాపై అమెరికా తాజాగావిధించిన ఆంక్షల విషయంపై ఫోన్లో మాట్లాడుతూ.. ప్రమాద విషయాన్ని కూడా ప్రస్తావించారు. కాగా, ప్రమాద ఘటనపై జాతీయ భద్రత బృందం ఒబామాకు వివరాలందించింది. గురువారం సాయంత్రం ఎప్పుడేం జరిగింది.. 7:45: ఆమ్‌స్టర్‌డ్యాం నుంచి కౌలాలంపూర్ వెళుతున్న మలేసియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్17(బోయింగ్ 777 రకం)తో రాడార్ సంబంధాలు తెగిపోయాయి. మొత్తం 295 మందీ చనిపోయి ఉంటారని రష్యన్ వార్తా సంస్థ ఇంటర్‌ఫ్యాక్స్ వెల్లడించింది. 7.45: ఉక్రెయిన్ గగనతలంలో తమ విమానంతో సంబంధాలు కోల్పోయినట్లు మలేసియా ఎయిర్‌లైన్స్ సంస్థ ట్విట్టర్లో ట్వీట్ చేసింది. 7.45: విమానం 33వేల అడుగుల ఎత్తులో వెళుతుండగా భూమిపై నుంచి మిసైల్‌తో కూల్చేశారని ఉక్రెయిన్ హోంమంత్రికి సలహాదారుడు ఆంటన్ గెరాషెంకో తన ఫేస్బుక్ పేజీలో పేర్కొన్నారు. 7.46: మీడియా కథనాలు తమ దృష్టికి వచ్చాయని, సమాచారం సేకరిస్తున్నామని బోయింగ్ కంపెనీ ప్రకటించింది. 7.49: మలేసియా విమాన ప్రమాదంపై వెంటనే దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు ఉక్రెయిన్ ప్రధాని ప్రకటించారు. 7.50: మలేసియా విమానం కూల్చివేతలో ఉక్రెయిన్ రక్షణ దళాల ప్రమేయం లేదని ఆ దేశాధ్యక్షుడిని ఉటంకిస్తూ ఇంటర్‌ఫ్యాక్స్ వార్తా సంస్థ కథనం. 7.50: దాదాపు 15 కిలోమీటర్ల పరిధిలో విమాన శకలాలు పడ్డాయని, దాదాపు వంద వరకు చిధ్రమైన మృతదేహాలు కనిపిస్తున్నట్లు ఘటనా స్థలానికి వెళ్లిన ఎమర్జెన్సీ సహాయక బృందం వెల్లడి. 7.50: అమెరికా అధ్యక్షుడు ఒబామాకు విషయం తెలిసినట్లు వైట్‌హౌజ్ ప్రకటన 7.53: తక్షణ దర్యాప్తునకు ఆదేశించిన మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ 7.57: ఉక్రెయిన్ ప్రభుత్వమే విమానాన్ని కూల్చివేసిందని అక్కడి వేర్పాటువాద నేత అలెగ్జాండర్ బోరోదోయ్ ఆరోపణ. ఖండించిన ప్రభుత్వ వర్గాలు. 7.57: ఘటనపై ఉక్రెయిన్ అధికారులతో నిరంతర సంప్రదింపులు జరపాలని సీనియర్ అమెరికన్ అధికారులను ఆదేశించిన ఒబామా 8.04: మలేసియా విమానాన్ని రెబెల్స్ కూల్చివేశారని ఉక్రెయిన్ సర్కారు ఆరోపణ 8.04: ఈ ఘటనపై ఒబామాతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చర్చించినట్లు ఆ దేశ వార్తా సంస్థ వెల్లడి 8.07: మృతులకు బోయింగ్ కంపెనీ సంతాపం. అన్ని విధాలా సాయం చేసేందుకు సిద్ధమని ప్రకటన -
బ్రహ్మోస్ సక్సెస్..
న్యూఢిల్లీ: యుద్ధనౌకలను తుత్తునియలు చేసే బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణిని భారత్ సోమవారం ఉదయం విజయవంతంగా ప్రయోగించింది. 290 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఇది గురి తప్పకుండా చేధించగలదు. ప్రయోగం సందర్భంగా బ్రహ్మోస్ క్షిపణి నిర్దేశిత ప్రమాణాలను విజయవంతంగా సాధించినట్లు రక్షణశాఖ అధికారులు తెలిపారు. కర్ణాటకలోని కార్వార్ తీరంలో యుద్ధనౌక ఐఎన్ఎస్ కోల్‌కతా నుంచి ఈ పరీక్షను నిర్వహించారు. మజ్గావ్ డాక్‌యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఈ యుద్ధనౌకను ఇంకా నౌకాదళంలో ప్రవేశపెట్టలేదు. కదన రంగంలోకి దిగితే ఒకేసారి 16 బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించగలిగే సత్తా ఐఎన్ఎస్ కోల్‌కతా సొంతం. ఐఎన్ఎస్ కోల్‌కతా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ తరహా యుద్ధనౌకలలో మొదటిది.విసృ్తత పరీక్షల అనంతరం వచ్చే జూలైలో దీన్ని నౌకాదళంలో ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.రష్యా తయారీ తల్వార్ యుద్ధనౌకలు సహా పలు యుద్ధనౌకలలో బ్రహ్మోస్ క్షిపణి విధ్వంసక వ్యవస్థలను ప్రవేశపెట్టారు.సైనిక, వైమానిక దళాలలో బ్రహ్మోస్ క్షిపణులను ఇప్పటికే చేర్చారు.సు-30 ఎంకేఐ యుద్ధవిమానాల నుంచి కూడా బ్రహ్మోస్‌ను ప్రయోగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో విధులు నిర్వహించే సైనిక దళాలకు బ్రహ్మోస్ క్షిపణులను అందచేశారు.భారత్-రష్యాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ విభిన్న యుద్ధతంత్రాల కోసం పలు రకాల క్షిపణులను రూపొందించింది. మెరుపు వేగంతో దాడులు చేసే హైపర్ సోనిక్ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. -
‘అస్త్ర’ పరీక్ష సక్సెస్
న్యూఢిల్లీ: భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్ర క్షిపణిని ఆదివారం విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) వెల్లడించింది. దృష్టి క్షేత్రానికి ఆవల(బియాండ్ విజువల్ రేంజ్) గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే అస్త్ర క్షిపణిని వెస్ట్రన్ సెక్టార్‌లోని ఓ నౌకాదళ స్థావరం నుంచి సుఖోయ్-30 యుద్ధవిమానం ద్వారా వాయుసేన పరీక్షించిందని, ఈ పరీక్ష అన్ని రకాలుగా విజ యవంతమైందని డీఆర్డీవో అధికారులు ప్రకటించారు. పరీక్ష విజ యవంతం కావడంపై శాస్త్రవేత్తలను డీఆర్డీవో చీఫ్ అవినాశ్ చందర్ అభినందించారు. త్వరలో అస్త్ర క్షిపణికి వాస్తవ లక్ష్య ఛేదన పరీక్ష నిర్వహించనున్నామని, తర్వాత స్వదేశీ తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌లో అమర్చనున్నామని తెలిపారు. అస్త్ర క్షిపణిని సుఖోయ్-30 యుద్ధ విమానం ద్వారా ప్రయోగించడం యుద్ధవిమానాల్లో క్షిపణి అమరికకు సంబంధించి కీలక మైలురాయని అన్నారు. ఈ క్షిపణికి మరిన్ని ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా, భారత్ స్వదేశీయంగా రూపొందించిన తొలి బీవీఆర్ ఎయిర్-టు-ఎయిర్ మిసైల్ అయిన అస్త్ర అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేస్తుంది. గగనతలంలో సుమారు 20 కి.మీ. నుంచి 80 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది.