అగ్ని-3 అణ్వస్త్ర క్షిపణి పరీక్ష విజయవంతం | India successfully test fires nuclear-capable Agni III ballistic missile | Sakshi
Sakshi News home page

అగ్ని-3 అణ్వస్త్ర క్షిపణి పరీక్ష విజయవంతం

Published Fri, Apr 17 2015 2:00 AM | Last Updated on Sun, Sep 3 2017 12:23 AM

అగ్ని-3 అణ్వస్త్ర క్షిపణి పరీక్ష విజయవంతం

అగ్ని-3 అణ్వస్త్ర క్షిపణి పరీక్ష విజయవంతం

అణ్వస్త్ర సామర్థ్యంగల అగ్ని-3 బాలిస్టిక్ క్షిపణిని గురువారం భారత్ మూడోసారి విజయవంతంగా పరీక్షించింది.

బాలాసోర్: అణ్వస్త్ర సామర్థ్యంగల అగ్ని-3 బాలిస్టిక్ క్షిపణిని గురువారం భారత్ మూడోసారి విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని వీలర్ ఐలాండ్ నుంచి డీఆర్‌డీఓ నేతృత్వంలో సైన్యం ఈ పరీక్షను పూర్తిచేసింది. ఉపరితలం నుంచి ఉపరితలంపై 3000 కి.మీ. దూరంలోపు లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణిని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌నుంచి ఉదయం 09.55 గంటలకు పరీక్షించినట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.

అగ్ని-3లో రెండంచెల ఘన  ఇంధన వ్యవస్థ ఉంటుంది. 17 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వ్యాసం, 50 టన్నుల బరువు ఉండే ఈ క్షిపణి 1.5 టన్నుల న్యూక్లియర్ వార్‌హెడ్‌ను మోసుకుపోతుంది. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఈ క్షిపణి ఇప్పటికే సైన్యం అమ్ములపొదిలోకి చేరింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement