మేమిచ్చిన మందుపాతరలు వాడడానికి ఉక్రెయిన్‌కు అనుమతిస్తాం
అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ అస్టిన్ వెల్లడి
కీవ్: యుద్ధంలో రష్యాను పూర్తిస్థాయిలో కట్టడి చేయడమే లక్ష్యంగా ఉక్రెయిన్‌కు అమెరికా అండదండలు అందిస్తోంది. అమెరికా అందజేసిన లాంగ్‌రేంజ్ క్షిపణులను రష్యాపై ప్రయోగించడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నుంచి ఇప్పటికే అనుమతి లభించింది. దీంతో రష్యా భూభాగంలో సుదూర ప్రాంతంలో ఉన్న లక్ష్యాలపై సులువుగా దాడులు ఉక్రెయిన్‌కు అవకాశం లభించింది. అమెరికా మరో శుభవార్త చెప్పింది.
తాము సరఫరా చేసిన యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్స్ ఉపయోగించానికి ఉక్రెయిన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నట్లు అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ అస్టిన్ ప్రకటించారు. ఆయన బుధవారం లావోస్‌లో మీడియాతో మాట్లాడారు. యుద్ధంలో రష్యా సైన్యం వ్యూహం మార్చేస్తుండడంతో ఉక్రెయినవైపు నుంచి కూడా వ్యూహం మార్చక తప్పడం లేదని అన్నారు.
రష్యా పదాతి దళాలు మున్ముందుకు చొచ్చుకొస్తున్నాయని చెప్పారు. ఆయా దళాలను నిలువరించాలంటే యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్స్ ఉపయోగించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ ల్యాండ్ మైన్స్ పెద్దగా ప్రమాదకరం, ప్రాణాంతకం కాదని లాడిన్ అస్టిన్ వివరణ ఇచ్చారు. శత్రు సైన్యం కదలికలను నియంత్రించడానికి ఇవి దోహదపతాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment