జెరూసలెం: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. శనివారం(జులై 20) యెమెన్‌లోని అల్ హొదైదా పోర్టును ఇజ్రాయెల్ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా హౌతీ రెబెల్స్ ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. ఈ మిసైల్‌ను ఇజ్రాయెల్ డిఫెన్స్‌ఫోర్స్ (ఐడీఎఫ్) దళాలు మధ్యలోనే దానిని కూల్చివేశాయి.
תיעוד: שיגור המיירט בערבה >>@ShaniRami
(צילום: אלון וייס, קיבוץ יטבתה) https://t.co/4J3h0Jipsl pic.twitter.com/PnGcJhLIxc— גלצ (@GLZRadio) July 21, 2024
తమ దేశ గగనతలంలోకి ప్రవేశించకముందే క్షిపణిని యారో-3 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో కూల్చివేసినట్లు ఐడీఎఫ్ పేర్కొంది. ఇజ్రాయెల్‌లోని ఇలాట్ నగరంలో ఇప్పటికీ క్షిపణి రక్షణ వ్యవస్థ (ఐరన్‌డోమ్) సైరన్లు మోగుతూనే ఉన్నాయి. శుక్రవారం రాజధాని టెల్‌అవీవ్‌పై హౌతీలు జరిపిన డ్రోన్ దాడికి ప్రతీకారంగా యెమెన్‌లోని హౌతీ స్థావరాలపై ఇజ్రాయెల్ బాంబులు వేసింది.
మరోవైపు ఐడీఎఫ్ దళాలు లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై కూడా వైమానిక దాడులు జరిపాయి. హెజ్బొల్లా తీవ్రవాదులకు చెందిన రెండు భారీ ఆయుధ డిపోలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. దాడులను లెబనాన్ మీడియా ధృవీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment