ఇరాన్, ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ సమీపంలో డ్రోన్ దాడులు చేసినట్లు యెమెన్ హౌతీ రెబల్స్ ప్రకటించాయి. గురువారం ఉదయం ఆక్రమిక పాలస్తీనాలోని జాఫా (టెల్ అవీవ్) ప్రాంతంలో పలు కీలక లక్ష్యాలను టార్గెట్ చేసి మరీ డ్రోన్ ఆపరేషన్ చేపట్టినట్లు హౌతీరెబల్స్ తెలిపాయి. తాము ప్రయోగించిన డ్రోన్లను ఇజ్రాయెల్ ఎదుర్కోకపోయింది. దీంతో తాము చేసిన డ్రోన్ దాడుల ఆపరేషన్ విజయవంతమైనట్లు పేర్కొంది.
Yemen’s Houthi group says it “achieved its goals” in a drone attack on Tel Aviv, although there was no confirmation from Israeli authorities.
“The operation achieved its goals successfully as the drones reached their targets without the enemy being able to confront or shoot them… pic.twitter.com/izNdIn7eAa— GAROWE ONLINE (@GaroweOnline) October 3, 2024
క్రెడిట్స్: GAROWE ONLINE
యెమెన్ హౌతీ రెబల్స్ డ్రోన్ దాడులను ఇప్పటివరకు ఇజ్రాయెల్ అధికారికంగా గుర్తించకపోవటం గమనార్హం. గత రాత్రి అనుమానాస్పద వైమానిక టార్గెట్లను తాము అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. మరోవైపు.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేయకంటే ముందే హౌతీలు ఇజ్రాయెల్‌పై క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినట్లు బుధవారం పేర్కొంది.
యెమెన్‌లోని చాలా ప్రాంతాలను నియంత్రించే హౌతీ తిరుగుబాటుదారులు.. హమాస్‌పై మద్దతుగా ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్‌కు మద్దతు ఇచ్చే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్‌లో హౌతీ రెబల్స్ ఓ భాగం. ఇటీవల యెమెన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహిస్తుండగా .. ఇజ్రాయెల్ నగరాలపై హౌతీ రెబల్స్ క్షిపణులు ప్రయోగించి దాడులు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment