Tel Aviv
-
ఇజ్రాయెల్‌పై డ్రోన్ దాడులు జరిపాం: హౌతీ రెబల్స్
ఇరాన్, ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ సమీపంలో డ్రోన్ దాడులు చేసినట్లు యెమెన్ హౌతీ రెబల్స్ ప్రకటించాయి. గురువారం ఉదయం ఆక్రమిక పాలస్తీనాలోని జాఫా (టెల్ అవీవ్) ప్రాంతంలో పలు కీలక లక్ష్యాలను టార్గెట్ చేసి మరీ డ్రోన్ ఆపరేషన్ చేపట్టినట్లు హౌతీరెబల్స్ తెలిపాయి. తాము ప్రయోగించిన డ్రోన్లను ఇజ్రాయెల్ ఎదుర్కోకపోయింది. దీంతో తాము చేసిన డ్రోన్ దాడుల ఆపరేషన్ విజయవంతమైనట్లు పేర్కొంది.Yemen’s Houthi group says it “achieved its goals” in a drone attack on Tel Aviv, although there was no confirmation from Israeli authorities.“The operation achieved its goals successfully as the drones reached their targets without the enemy being able to confront or shoot them… pic.twitter.com/izNdIn7eAa— GAROWE ONLINE (@GaroweOnline) October 3, 2024 క్రెడిట్స్: GAROWE ONLINEయెమెన్ హౌతీ రెబల్స్ డ్రోన్ దాడులను ఇప్పటివరకు ఇజ్రాయెల్ అధికారికంగా గుర్తించకపోవటం గమనార్హం. గత రాత్రి అనుమానాస్పద వైమానిక టార్గెట్లను తాము అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. మరోవైపు.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేయకంటే ముందే హౌతీలు ఇజ్రాయెల్‌పై క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినట్లు బుధవారం పేర్కొంది.యెమెన్‌లోని చాలా ప్రాంతాలను నియంత్రించే హౌతీ తిరుగుబాటుదారులు.. హమాస్‌పై మద్దతుగా ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్‌కు మద్దతు ఇచ్చే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్‌లో హౌతీ రెబల్స్ ఓ భాగం. ఇటీవల యెమెన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహిస్తుండగా .. ఇజ్రాయెల్ నగరాలపై హౌతీ రెబల్స్ క్షిపణులు ప్రయోగించి దాడులు చేశాయి.చదవండి: ‘హత్యకు ముందే కాల్పుల విరమణకు నస్రల్లా అంగీకారం’ -
ఇజ్రాయెల్ Vs హమాస్: మళ్లీ యుద్ధ మేఘాలు.. దూసుకెళ్లిన రాకెట్స్
టెల్ అవీవ్: ఇజ్రాయెల్-హమాస్ మధ్య మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ టార్గెట్‌గా హామాస్ రాకెట్లను ప్రయోగించింది. ఈ క్రమంలో టెల్ అవీవ్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది.వివరాల ప్రకారం.. హమాస్ అగ్రనేత హనియే హత్య అనంతరం ఇజ్రాయెల్‌పై దాడులు చేసేందుకు హమాస్ సిద్ధమవుతోంది. ఈక్రమంలోనే తాజాగా ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడులకు దిగింది. ఈ సందర్బంగా హమాస్‌కు చెందిన సాయుధ అల్-ఖస్సామ్ బ్రిగేడ్స్.. టెలీ అవీవ్ టార్గెట్‌గా M90 రాకెట్స్‌ను ప్రయోగించింది. హమాస్ రాకెట్ల దాడికి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో పేలుళ్లు సంభవించాయి. ఈ మేరకు పేలుళ్ల శబ్ధం కూడా వినిపించినట్టు ఇజ్రాయెల్ మీడియా ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, హమాస్ రాకెట్ల దాడుల కారణంగా ఇజ్రాయెల్‌లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని మీడియా పేర్కొంది. Al-Qassam Brigades say they bombed Tel Aviv and its suburbs with two missiles #hamas #iran #Isreal#hamas #GazaGenocide #TelAviv pic.twitter.com/M3bx0PR6nZ— no love no tension (@adeelriaz1991) August 13, 2024 ఇక, హమాస్ మెరుపుదాడులతో ఇజ్రాయెల్-హమాస్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తాజా హమాస్ దాడుల కారణంగా ఇజ్రాయెల్ మరోసారి హమాస్ టార్గెట్‌గా బాంబు వర్షం కురిపించే ఛాన్స్ ఉంది. అయితే, ఇరు వర్గాల మధ్య శాంతి చర్చలు జరుగుతాయనుకున్న వేళ దాడులు జరగడం గమనార్హం. ⚡️ A rocket barrage now from the #Gaza Strip 🔥🔥 pic.twitter.com/ENqdAYkunF— محمّد محفوظ عالم (@md_mehfuzalam) August 13, 2024 -
ఇజ్రాయెల్‌పై డ్రోన్ దాడి.. భారీ పేలుడు
టెల్ అవీవ్: ఇజ్రాయెల్‌లో శుక్రవారం(జులై 19) తెల్లవారుజామున బాంబు పేలుడు కలకలం రేపింది. రాజధాని టెల్ అవీవ్‌లోని అమెరికా రాయబార కార్యాలయ సమీపంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ పేలుడులో ఏడుగురికి గాయాలయ్యాయి. Initial Reports suggest a Car Bomb has Exploded in the Ben Yehuda Area of Tel Aviv, near several Embassies and Diplomatic Sites including the U.S. Consulate. It is Unknown if any Building was Damaged, but Emergency Services are on Scene. pic.twitter.com/u2eig5O714— OSINTdefender (@sentdefender) July 19, 2024 గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బాంబు స్వ్కాడ్ ఘటనాస్థలానికి చేరుకుంది. డ్రోన్ దాడి వల్లే పేలుడు జరిగిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) నిర్ధారించింది. పేలుడు జరిగిన పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఘటనా స్థలానికి ఎవరూ రావొద్దని సూచించారు. పేలుడుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గత ఏడాది అక్టోబర్7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్ మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో వందల మంది మృతి చెందారు.అప్పటి నుంచి ఇజజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. మరోవైపు లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న హెజ్బొల్లా కూడా ఇజ్రాయెల్‌పై అప్పుడప్పుడు రాకెట్ దాడులు చేస్తోంది. ఇటీవల ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై డ్రోన్ దాడులు చేసిన విషయం తెలిసిందే. -
ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి మరో 471 మంది..
న్యూఢిల్లీ: ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నుంచి ఆదివారం రెండు విమానాల్లో 471 మంది భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు. వీటిలో ఒక విమానం ఎయిరిండియాకు చెందినది కాగా, మరోటి స్పైస్‌జెట్ సంస్థదని అధికారులు చెప్పారు. ఆదివారం ఉదయం 197 మందితో కూడిన మూడో విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కాగా, 274 మంది ప్రయాణికులతో నాలుగో విమానం సాయంత్రం వచ్చినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన ‘ఎక్స్’లో విడుదల చేశారు. శుక్ర, శనివారాల్లో ఎయిరిండియా ఏర్పాటు చేసిన ఛార్టర్డ్ విమా నాల్లో 435 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. తాజా తరలింపుతో యుద్ధ వాతావరణం నెలకొన్న ఇజ్రాయెల్ నుంచి ఇప్పటి వరకు నాలుగు విమానాల్లో స్వదేశానికి వచ్చిన భారతీయుల సంఖ్య 900 దాటింది. -
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం ఏంటో తెలుసా?
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం ఏమిటి అనగానే చాలా మంది ప్యారిస్ లేదా సింగపూర్ అని చెబుతారు. కానీ, అవి ఏవి కావు. ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్ నగరం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా నిలిచింది. పెరుగుతున్న జీవన వ్యయాల ఆధారంగా ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయు) ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో ఇజ్రాయిల్ నగరం టెల్ అవీవ్ తొలిసారిగా అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా 173 నగరాల్లో నిత్యావసర సరుకుల ధరలు, అద్దె, రవాణా వంటి ఇతర వ్యయాలను పరిగణలోకి తీసుకొని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ "వరల్డ్ వైడ్ సిటీ కాస్ట్ ఆఫ్ లివింగ్" పేరుతో ఒక జాబితాను రూపొందించింది. రవాణా, కిరాణా సరుకుల ధరలు పెరగడం వల్ల ఈ జాబితాలో టెల్ అవీవ్ అగ్రస్థానంలో నిలిచింది. అలాగే, ఈ జాబితాలో పారిస్, సింగపూర్ నగరాలు ఉమ్మడిగా రెండవ స్థానంలో ఉన్నాయి. (చదవండి: దూసుకెళ్తున్న జీఎస్టీ వసూళ్లు!) తర్వాత స్థానాల్లో జ్యూరిచ్, హాంగ్ కాంగ్ ఉన్నాయి. న్యూయార్క్ 6వ స్థానంలో, జెనీవా 7వ స్థానంలో, కోపెన్ హాగన్ 8వ స్థానంలో, లాస్ ఏంజిల్స్ 9వ స్థానంలో, ఒసాకా 10వ స్థానంలో నిలిచాయి. గత ఏడాది సర్వే జరిపిన ఈ జాబితాలో పారిస్, జ్యూరిచ్, హాంగ్ కాంగ్‌లు ఉమ్మడిగా ప్రథమ స్థానంలో ఉన్నాయి. గత ఐదు సంవత్సరాలలో నమోదైన ద్రవ్యోల్బణ రేటు, కరోనావైరస్ మహమ్మారి వల్ల కొన్ని దేశాలలో వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఆయా దేశాలలో జీవన వ్యయం కూడా అదే స్థాయిలో పెరిగింది. -
‘మరో 10 దేశాలు టచ్‌లో ఉన్నాయి’
జెరూసలేం : పవిత్ర నగరం జెరూసలేంను ఇజ్రాయిల్ రాజధానిగా అమెరికా గుర్తించడంతో.. మరో పది దేశాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు ఇజ్రాయిల్ విదేశాంగ శాఖమంత్రి టిజిపి హోటెవెలి తెలిపారు. అందులో భాగంగా ఆయా దేశాల రాయబార కార్యాలయాలను టెల్ అవైవ్ నుంచి జెరూసలేంకు మార్చేవిధంగా చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఐరోపా సహా మరికొన్ని దేశాలతో ఇప్పటికే సంప్రదింపులు పూర్తయినట్లు ఆయన చెప్పారు. పిలిప్పీన్స్, రొమేనియా, దక్షిణ సూడాన్, హోండూరస్ సహా మరికొన్ని దేశాలు తమ రాయబార కార్యాలయాలను టెల్ అవైవ్ నుంచి జెరూసలేంకు మార్చేసందుకు అనుకూలంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇది ప్రారంభమేనని.. త్వరలో మరికొన్ని దేశాలు ఇజ్రాయిల్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటాయని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా.. జెరూసలేం విషయంలో అమెరికా అధ్యక్షుడి ప్రతిపాదనను ఐక్యరాజ్య సమితి తిరస్కరించిన విషయం తెలిసిందే. -
విమానానికి బాంబు బెదిరింపు.. రక్షణగా ‘ఫైటర్లు’
టెల్ అవీవ్ : న్యూయార్క్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళుతున్న ఈఎల్ ఏఎల్ ప్యాసింజర్ విమానానికి మంగళవారం బాంబు బెదిరింపు వచ్చింది. వెంటనే ఆ విమానానికి రక్షణగా స్విట్జర్లాండ్ ఎయిర్‌ఫోర్స్ యుద్ధ విమానాలను మోహరించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, బాంబు బెదిరింపు తప్పుడు సమాచారమని అధికారులు తెలిపారు. -
టెల్ అవీవ్‌లో కాల్పులు, నలుగురు మృతి
ఇజ్రాయెల్: టెల్ అవీవ్ లోని నైట్ స్పాట్ వద్ద గురువారం తెల్లవారుజామున ఇద్దరు టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో అక్కడి ప్రజలందరూ భయభ్రాంతుయ్యారు. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న భద్రతా దళాలు టెర్రరిస్టులపై కాల్పులు జరిపాయి. దీంతో ఒకరికి గాయం కావడంతో అతనికి సర్జరీ చేసేందుకు ఆసుపత్రికి తరలించారు. మరోకరిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాడికి పాల్పడిన ఇరువురు హెబ్రాన్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించినట్లు తెలిపారు. రాత్రి సమయంలో దాడి కారణంగా ఆ ప్రాంతాన్నంతటిని ఖాళీ చేయించినట్లు వివరించారు. అయితే, దాడిలో గాయపడిన వారు ఇజ్రాయెల్ జాతీయులా? లేదా? అన్న సమాచారాన్ని వెల్లడించలేదు. ఇజ్రాయెల్ జరిగిన ఈ దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. అమాయక ప్రజలపై దాడులకు తెగబడటం వల్ల భారీగా మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని హెచ్చరించింది. ఇజ్రాయెల్ కు తాము అండగా ఉంటామని తెలిపింది. పాఠశాలలు, మునిసిపల్ భవనాల వద్ద భద్రత భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. కాగా, గత అక్టోబర్ లో దేశంలో జరిగిన అల్లర్ల కారణంగా207 మంది పాలస్తీయన్లు, 28 ఇజ్రాయిలీలు, ఇద్దరు అమెరికన్లు మరణించిన విషయం తెలిసిందే.