ఇజ్రాయెల్‌పై డ్రోన్‌ దాడి.. భారీ పేలుడు | Huge Bomb Blast In Israel Capital Tel Aviv | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌పై డ్రోన్‌ దాడి.. భారీ పేలుడు

Published Fri, Jul 19 2024 8:57 AM | Last Updated on Fri, Jul 19 2024 9:45 AM

Huge Bomb Blast In Israel Capital Tel Aviv

టెల్‌ అవీవ్‌: ఇజ్రాయెల్‌లో శుక్రవారం(జులై 19) తెల్లవారుజామున బాంబు పేలుడు కలకలం రేపింది. రాజధాని టెల్‌ అవీవ్‌లోని అమెరికా రాయబార కార్యాలయ సమీపంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ పేలుడులో ఏడుగురికి గాయాలయ్యాయి. 

 గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బాంబు స్వ్కాడ్‌ ఘటనాస్థలానికి చేరుకుంది. డ్రోన్‌ దాడి వల్లే పేలుడు జరిగిందని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌(ఐడీఎఫ్‌) నిర్ధారించింది. పేలుడు జరిగిన పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

ఘటనా స్థలానికి ఎవరూ రావొద్దని సూచించారు. పేలుడుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గత ఏడాది అక్టోబర్‌7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్‌ మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో వందల మంది మృతి  చెందారు.

అప్పటి నుంచి ఇజజ్రాయెల్‌, హమాస్‌ మధ్య యుద్ధం  జరుగుతోంది. మరోవైపు లెబనాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న హెజ్బొల్లా కూడా ఇజ్రాయెల్‌పై అప్పుడప్పుడు రాకెట్‌ దాడులు చేస్తోంది. ఇటీవల ఇరాన్‌ కూడా ఇజ్రాయెల్‌పై డ్రోన్‌ దాడులు చేసిన విషయం తెలిసిందే. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement