ఇజ్రాయెల్: టెల్ అవీవ్ లోని నైట్ స్పాట్ వద్ద గురువారం తెల్లవారుజామున ఇద్దరు టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో అక్కడి ప్రజలందరూ భయభ్రాంతుయ్యారు. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న భద్రతా దళాలు టెర్రరిస్టులపై కాల్పులు జరిపాయి. దీంతో ఒకరికి గాయం కావడంతో అతనికి సర్జరీ చేసేందుకు ఆసుపత్రికి తరలించారు. మరోకరిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాడికి పాల్పడిన ఇరువురు హెబ్రాన్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించినట్లు తెలిపారు. రాత్రి సమయంలో దాడి కారణంగా ఆ ప్రాంతాన్నంతటిని ఖాళీ చేయించినట్లు వివరించారు. అయితే, దాడిలో గాయపడిన వారు ఇజ్రాయెల్ జాతీయులా? లేదా? అన్న సమాచారాన్ని వెల్లడించలేదు. ఇజ్రాయెల్ జరిగిన ఈ దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది.
అమాయక ప్రజలపై దాడులకు తెగబడటం వల్ల భారీగా మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని హెచ్చరించింది. ఇజ్రాయెల్ కు తాము అండగా ఉంటామని తెలిపింది. పాఠశాలలు, మునిసిపల్ భవనాల వద్ద భద్రత భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. కాగా, గత అక్టోబర్ లో దేశంలో జరిగిన అల్లర్ల కారణంగా207 మంది పాలస్తీయన్లు, 28 ఇజ్రాయిలీలు, ఇద్దరు అమెరికన్లు మరణించిన విషయం తెలిసిందే.