ఇజ్రాయెల్‌ Vs హమాస్‌: మళ్లీ యుద్ధ మేఘాలు.. దూసుకెళ్లిన రాకెట్స్‌ | Hamas Targets Israel Tel Aviv With M90 Rockets | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌ Vs హమాస్‌: మళ్లీ యుద్ధ మేఘాలు.. దూసుకెళ్లిన రాకెట్స్‌

Published Tue, Aug 13 2024 7:48 PM | Last Updated on Tue, Aug 13 2024 8:06 PM

Hamas Targets Israel Tel Aviv With M90 Rockets

టెల్‌ అవీవ్‌: ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్‌ రాజధాని  టెల్‌ అవీవ్‌ టార్గెట్‌గా హామాస్‌ రాకెట్లను ప్రయోగించింది. ఈ క్రమంలో టెల్ అవీవ్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది.

వివరాల ప్రకారం.. హమాస్ అగ్రనేత హనియే హత్య అనంతరం ఇజ్రాయెల్‌పై దాడులు చేసేందుకు హమాస్‌ సిద్ధమవుతోంది. ఈక్రమంలోనే తాజాగా ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడులకు దిగింది. ఈ సందర్బంగా హమాస్‌కు చెందిన సాయుధ అల్-ఖస్సామ్ బ్రిగేడ్స్.. టెలీ అవీవ్‌ టార్గెట్‌గా M90 రాకెట్స్‌‌ను ప్రయోగించింది. హమాస్‌ రాకెట్ల దాడికి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో పేలుళ్లు సంభవించాయి. ఈ మేరకు పేలుళ్ల శబ్ధం కూడా వినిపించినట్టు ఇజ్రాయెల్‌ మీడియా ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, హమాస్‌ రాకెట్ల దాడుల కారణంగా ఇజ్రాయెల్‌లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని మీడియా పేర్కొంది.

 

 

ఇక, హమాస్‌ మెరుపుదాడులతో ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తాజా హమాస్‌ దాడుల కారణంగా ఇజ్రాయెల్‌ మరోసారి హమాస్‌ టార్గెట్‌గా బాంబు వర్షం కురిపించే ఛాన్స్‌ ఉంది. అయితే, ఇరు వర్గాల మధ్య శాంతి చర్చలు జరుగుతాయనుకున్న వేళ దాడులు జరగడ​ం గమనార్హం. 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement