జెరూసలేం : పవిత్ర నగరం జెరూసలేంను ఇజ్రాయిల్ రాజధానిగా అమెరికా గుర్తించడంతో.. మరో పది దేశాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు ఇజ్రాయిల్ విదేశాంగ శాఖమంత్రి టిజిపి హోటెవెలి తెలిపారు. అందులో భాగంగా ఆయా దేశాల రాయబార కార్యాలయాలను టెల్ అవైవ్ నుంచి జెరూసలేంకు మార్చేవిధంగా చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఐరోపా సహా మరికొన్ని దేశాలతో ఇప్పటికే సంప్రదింపులు పూర్తయినట్లు ఆయన చెప్పారు.
పిలిప్పీన్స్, రొమేనియా, దక్షిణ సూడాన్, హోండూరస్ సహా మరికొన్ని దేశాలు తమ రాయబార కార్యాలయాలను టెల్ అవైవ్ నుంచి జెరూసలేంకు మార్చేసందుకు అనుకూలంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇది ప్రారంభమేనని.. త్వరలో మరికొన్ని దేశాలు ఇజ్రాయిల్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటాయని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా.. జెరూసలేం విషయంలో అమెరికా అధ్యక్షుడి ప్రతిపాదనను ఐక్యరాజ్య సమితి తిరస్కరించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment