
న్యూఢిల్లీ: ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నుంచి ఆదివారం రెండు విమానాల్లో 471 మంది భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు. వీటిలో ఒక విమానం ఎయిరిండియాకు చెందినది కాగా, మరోటి స్పైస్‌జెట్ సంస్థదని అధికారులు చెప్పారు. ఆదివారం ఉదయం 197 మందితో కూడిన మూడో విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కాగా, 274 మంది ప్రయాణికులతో నాలుగో విమానం సాయంత్రం వచ్చినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన ‘ఎక్స్’లో విడుదల చేశారు. శుక్ర, శనివారాల్లో ఎయిరిండియా ఏర్పాటు చేసిన ఛార్టర్డ్ విమా నాల్లో 435 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. తాజా తరలింపుతో యుద్ధ వాతావరణం నెలకొన్న ఇజ్రాయెల్ నుంచి ఇప్పటి వరకు నాలుగు విమానాల్లో స్వదేశానికి వచ్చిన భారతీయుల సంఖ్య 900 దాటింది.
Comments
Please login to add a commentAdd a comment