జెరూసలెం: ఇజ్రాయెల్‌పై హౌతీ గ్రూపు మిలిటెంట్లు ఆదివారం(సెప్టెంబర్15) ఉదయం మిసైల్‌తో దాడి చేశారు.యెమెన్ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు.తూర్పు వైపు నుంచి మిసైల్ దూసుకువచ్చింది. అది ఓ బహిరంగ ప్రదేశంలో పడింది. మిసైల్ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలవలేదని ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది.
మిసైల్ దాడి కారణంగా రాజధాని టెల్‌అవీవ్‌తో పాటు సెంట్రల్ ఇజజ్రాయెల్‌లో సైరన్ అలర్ట్ మోగింది. దీంతో పౌరులు సురకక్షిత పప్రాంతాల్లో తలదాచుకునేందుకు పరుగులు పెట్టారు.క్షిపణి దాడితో భారీ శబ్దాలు వచ్చాయని, ఐరన్‌డోమ్ వ్యవస్థ క్షిపణిపై దాడి చేయడం వల్లే ఈ శబ్దాలు వచ్చాయని ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది.
కాగా, జులైలో యెమెన్ కేంద్రంగా పనిచేసే హౌతీ మిలిటెంట్లు రాజధాని టెల్‌అవీవ్‌పై చేసిన డ్రోన్ దాడిలో ఓ పౌరుడు మృతి చెందాడు. ఇరాన్ మద్దతుతోనే హౌతీలు దాడులు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదీ చదవండి..పేలిన ఆయిల్ ట్యాంకర్.. 25 మందికిపైగా మృతి
Comments
Please login to add a commentAdd a comment