
డీఆర్‌డీవో క్షిపణి ప్రయోగం విజయవంతం
ఉపరితలం నుంచి ఆకాశంలోని లక్ష్యాలను అత్యంత వేగంగా ఛేదించగల స్వల్ప శ్రేణి స్వదేశీ క్షిపణిని భారత రక్షణ శాఖ సోమవారం విజయవంతంగా ప్రయోగించింది.
బాలాసోర్(ఒడిశా): ఉపరితలం నుంచి ఆకాశంలోని లక్ష్యాలను అత్యంత వేగంగా ఛేదించగల స్వల్ప శ్రేణి స్వదేశీ క్షిపణిని భారత రక్షణ శాఖ సోమవారం విజయవంతంగా ప్రయోగించింది.
ఒడిశాలోని చండిపూర్‌లోగల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి సోమవారం ఉదయం 11.30 గంటల సమ యంలో ఈ క్షిపణి ప్రయోగాన్ని చేపట్టినట్లు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీవో) వర్గాలు వెల్లడించాయి. ఈ క్షిపణి 25 నుంచి 30 కి.మీ. దూరంలోని వివిధ లక్ష్యాలను ఒకే సమయంలో అత్యంత వేగంగా ఛేదించగలదని పేర్కొన్నారు. క్షిపణిలోని రాడార్‌లు, ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్స్, టెలిమెట్రీ సిస్టమ్స్, ఇతర ట్రాకింగ్ పరికరాలు సమర్థవంతంగా పనిచేశాయని.. క్షిపణి ప్రయోగం పూర్తిస్థాయిలో విజయవంతమైందని తెలిపారు.