భువనేశ్వర్: ఉపరితల యాంటీ రేడియేషన్ మిసైల్ రుద్ర ఎమ్-2ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ టెస్ట్ సెంటర్ నుంచి బుధవారం(మే29) ఈ మిసైల్‌ను పరీక్షించారు.
ఈ సూపర్‌సానిక్ మిసైల్‌ను భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్డీవో అభివృద్ధి చేసింది. యాంటీ రేడియేషన్ మిసైల్‌ను భారత్ దేశీయంగా అభివృద్ధి చేయడం ఇదే తొలిసారి. ఇది శత్రువుల నిఘా రాడార్‌లను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుంది.
ప్రస్తుతం శత్రువుల నిఘా వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి భారత్ రష్యాకు చెందిన కేఎహెచ్-31 యాంటీ రేడియేషన్ మిసైళ్లను వినియోగిస్తుంది. వీటి స్థానంలో త్వరలో రుద్రను వాడనున్నారు.
రుద్ర అనుకున్న లక్ష్యాల మేర పనిచేసిందని, ఈ పరీక్ష పూర్తిగా విజయవతమైందని డీఆర్డీవో ఒక ప్రకటనలో తెలిపింది. రుద్ర పరీక్ష విజయవంతమైందని, దీనిని అభివృద్ధి చేసిన డీఆర్డీవోకు అభినందనలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment