rudra
-
పని మొదలెట్టిన పరమ్ రుద్ర!
సాంకేతిక రంగంలో భారత వాటా బిట్లు, బైట్లలోకాదు టెరా బైట్లు, పెటా బైట్లలో ఉండాలంటూ ప్రధాని మోదీ ఆవిష్కరించిన పరమ్ రుద్ర సూపర్ కంప్యూటర్లు మెరుపు వేగంతో పనిచేస్తున్నాయి. అత్యంత వేగంతో డేటాను ప్రాసెస్చేస్తూ అత్యంత క్లిష్టమైన లెక్కలను అలవోకగా చేసేస్తూ మన సత్తా చాటుతున్నాయి. వాతావరణ పరిశోధనల కోసం 850 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందించిన హై–పెర్ఫామెన్స్ కంప్యూటింగ్ (హెచ్పీసీ) వ్యవస్థలయిన అర్క, అరుణికలను కూడా ప్రధాని ఆవిష్కరించారు. ఈ సూపర్ కంప్యూటర్ల కథాకమామిషు ఏమిటో చూద్దామా...! పరమశివుని పేరుతో పరమ్ రుద్ర పూర్తి దేశీయంగా తయారైన ఈ సూపర్ కంప్యూటర్లకు పరమ్‌రుద్ర అని పేరుపెట్టారు. లయకారుడైన పరమశివుని రౌద్రావతారానికి గుర్తుగా కేంద్రం వీటికి ఇలా నామకరణం చేసింది. జాతీయ సూపర్ కంప్యూటింగ్ విధానంలో భాగంగా రూ.130 కోట్ల ఖర్చుతో వీటిని తయారుచేసి పుణె, ఢిల్లీ, కోల్‌కతాల్లో ఏర్పాటుచేశారు. హెచ్పీసీ వ్యవస్థలు సంక్షిష్టమైన సమస్యలకు పరిష్కారాలు కనుగొనడంలో శాస్త్రవేత్తలకు ఇవి ఎంతగానో సాయపడతాయి. వందల కంప్యూటర్లు విడిగా ఎంతో శ్రమతో సుదీర్ఘకాలంపాటు చేసే పనిని ఇవి శరవేగంగా చక్కబెట్టేస్తాయి. నవ్యావిష్కరణకు రాచబాటలు యువ శాస్తవేత్తలు అందుబాటులో ఉన్న డేటాను విశ్లేíÙంచి, తమ పరిశోధనలకు అన్వయించి కొత్త ఆవిష్కరణలు చేసేందుకు పరమ్‌రుద్ర దోహదపడుతుంది. వ్యవసాయం, విపత్తు నిర్వహణ రంగాల అభివృద్ధిలో సూపర్కంప్యూటర్ల పాత్ర కీలకమైంది. సువిశాల విశ్వంలో కొత్త ప్రదేశాలపై దృష్టిపెట్టడం మొదలు వాతావరణ సూచనలను అత్యంత ఖచి్చతత్వంతో ఇవ్వడందాకా బహుముఖ ప్రయోజనాలు వీటి వల్ల సాధ్యం. వర్షాలు, వరదలు, వడగల్లు, కరువు కాటకాల రాకను ముందస్తుగా అంచనావేయొచ్చు. అర్క, అరుణిక పనేంటి? వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించేందుకు, వాతావరణ శాస్త్రంలో పరిశోధనల కోసం రూపొందించిన హెచ్పీసీలే వాటికి ఆర్క, అరుణిక. పుణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటరాలజీ, నోయిడాలోని నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్క్యాస్టింగుల్లో వీటిని ఏర్పాటు చేశారు. ప్రతీ ఆరు కి.మీ. పరిధిలో వాతావరణంలో మార్పులు, వర్షాలు, ఉరుములు, పిడుగులు పడే అవకాశాలు, ఆకస్మిక వరదలనూ వీటి సాయంతో అత్యంత కచి్చతత్వంతో ముందుగానే తెలుసుకోవచ్చు. కేవలం కిలోమీటర్, అంతకన్నా తక్కువ ప్రాంతాలపైనా శోధన చేసి ఆ డేటాను అర్క, అరుణికల ద్వారా పక్కాగా విశ్లేషించవచ్చు. ఏఏ పనుల్లో వాడతారు? → వాతావరణ మార్పులు, పరమాణు జీవశాస్త్రం, జన్యుమార్పిడి విధానాలు, కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్, రక్షణ, గగనతల, తదితర అధునాతన శాస్త్రసాంకేతిక రంగాల్లో ఈ సూపర్ కంప్యూటర్లను వాడతారు. → పుణెలో ఏర్పాటుచేసిన పరమ్‌రుద్ర కంప్యూటర్ను జెయింట్ మీటర్ రేడియో టెలిస్కోప్ కోసం వినియోగంలోకి తెచ్చారు. → వేల సీపీయూలు, 90 అత్యంత శక్తివంత ఎన్విడియా ఏ100 జీపీయూలు, 35 టెరాబైట్ల మెమరీ, 2 పెటాబైట్ల స్టోరేజీ దీని సొంతం. → సువిశాల విశ్వంలో అత్యంత శక్తివంత అయస్కాంత క్షేత్రం నుంచి దూసుకొచ్చే రేడియో విస్ఫోటం (ఫస్ట్ రేడియో బరస్ట్) మూలాలను కనుగొనేందుకు టెలిస్కోప్ సేకరించిన డేటాను ఈ కంప్యూటర్‌తో విశ్లేíÙస్తారు. తద్వారా విశ్వంపై అవగాహన మరింతగా పెరిగే ఆస్కారముంది. → ఢిల్లీలోని ఇంటర్ యూనివర్సిటీ యాక్సిలిరేటర్ సెంటర్లో మరో పరమ్ రుద్రను ఏర్పాటుచేశారు. → మెటీరియల్ సైన్స్, అణు భౌతిక శా్రస్టాలపై పరిశోధనలో ఇది సాయపడనుంది. – కోల్‌కతాలోని ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ కేంద్రంలోనూ పరమ్రుద్రను ఏర్పాటుచేశారు. → దీన్ని భౌతికశాస్త్రం, ఖగోళశాస్త్రం, భూవిజ్ఞానశాస్త్రంలో పరిశోధనలకు వాడనున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రుద్ర క్షిపణి పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: ఆకాశంలో నుంచి భూమి పైనున్న లక్ష్యాలపైకి ప్రయోగించే రుద్ర ఎం–2 మిస్సైల్‌ను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరం నుంచి ఎస్‌యూ–30 ఫైటర్ జెట్ ద్వారా ప్రయోగించిన రుద్ర నిర్దేశించిన అన్ని లక్ష్యాలను అందుకుందని రక్షణమంత్రిత్వ శాఖ వెల్లడించింది. రుద్ర ఎం–2 మిస్సైల్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. డీఆర్డీఓకు చెందిన పలు లాబోరేటరీలు రూపొందించిన సాంకేతికతలను ఇందులో వాడారు. నేలపై ఉన్న పలురకాల శత్రు లక్ష్యాలను చేధించేందుకు రుద్ర క్షిపణిని అభివృద్ధి చేశారు. రుద్ర ఎం–2ను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీఓ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభినందించారు. రుద్ర ఎం–2 క్షిపణి పరీక్ష విజయవంతం కావడం భారత సాయుధబలగాల బలాన్ని రెట్టింపు చేస్తుందని పేర్కొన్నారు. -
యాంటీ రేడియేషన్ మిసైల్... ‘రుద్ర ఎమ్-2’ పరీక్ష సక్సెస్
భువనేశ్వర్: ఉపరితల యాంటీ రేడియేషన్ మిసైల్ రుద్ర ఎమ్-2ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ టెస్ట్ సెంటర్ నుంచి బుధవారం(మే29) ఈ మిసైల్‌ను పరీక్షించారు.ఈ సూపర్‌సానిక్ మిసైల్‌ను భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్డీవో అభివృద్ధి చేసింది. యాంటీ రేడియేషన్ మిసైల్‌ను భారత్ దేశీయంగా అభివృద్ధి చేయడం ఇదే తొలిసారి. ఇది శత్రువుల నిఘా రాడార్లను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుంది.ప్రస్తుతం శత్రువుల నిఘా వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి భారత్ రష్యాకు చెందిన కేఎహెచ్-31 యాంటీ రేడియేషన్ మిసైళ్లను వినియోగిస్తుంది. వీటి స్థానంలో త్వరలో రుద్రను వాడనున్నారు. రుద్ర అనుకున్న లక్ష్యాల మేర పనిచేసిందని, ఈ పరీక్ష పూర్తిగా విజయవతమైందని డీఆర్డీవో ఒక ప్రకటనలో తెలిపింది. రుద్ర పరీక్ష విజయవంతమైందని, దీనిని అభివృద్ధి చేసిన డీఆర్డీవోకు అభినందనలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు పెట్టారు. -
హిట్ అయినదే పెద్ద సినిమా
‘‘రుద్రం కోట’ చిత్రం ట్రైలర్, పాటలు బాగున్నాయి. ఇప్పుడు ఏది హిట్ అయితే అదే పెద్ద సినిమా అవుతోంది. ఈ మూవీని ప్రేక్షకులు ఆదరించి, కొత్తవారిని ప్రొత్సహించాలి’’ అన్నారు నటుడు శ్రీకాంత్. రుద్ర హీరోగా, శక్తి, విభీష హీరోయిన్లుగా రాము కోన దర్శకత్వం వహించిన చిత్రం ‘రుద్రం కోట’. నటి జయలలిత కీలక పాత్రలో నటించి, సమర్పించారు. అనిల్ ఆర్కా కండవల్లి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న స్క్రీన్ మాక్స్ సంస్థ ద్వారా విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని శ్రీకాంత్, నటి రాశీ విడుదల చేశారు. రాశీ మాట్లాడుతూ– ‘‘రుద్రం కోట’ టీజర్, ట్రైలర్ బాగున్నాయి. సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘మా సినిమాను స΄ోర్ట్ చేస్తున్నవారికి కృతజ్ఞతలు’’ అన్నారు జయలలిత. ‘‘ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరించి పెద్ద సినిమాగా చేస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు అనిల్ ఆర్కా. -
హనుమకొండలో రుద్రేశ్వరున్ని దర్శించుకుంటున్న భక్తులు
-
కుమారులే.. కాడ్డెదులుగా..
మహబూబ్‌నగర్: పుడమితల్లిని నమ్ముకున్న ఓ రైతు చివరికి కన్న కొడుకులను కాడెద్దులుగా మార్చారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని గోకులపాడుకు చెందిన అయ్యన్న ఉల్లిపంట సాగుచేశాడు. ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాలకు కలుపు ఏపుగా పెరిగింది. దీంతో కలుపుతీతకు ఇటు కూలీలు దొరకక.. అటు కాడెద్దులు లేకపోవడంతో తన ఇద్దరు కుమారులు యశ్వంత్, రుద్రప్రతాప్‌లను కాడెద్దుల మాదిరిగా గుంటుక కట్టి కలుపు తీశారు. ఆదివారం చంద్రశేఖర్‌నగర్ శివారులో కనిపించిన ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. – మానవపాడు -
ఆ పాత్ర చేయడానికి భయపడ్డా!
‘‘ఛాలెంజింగ్ రోల్స్ చేసినప్పుడే ఏ ఆర్టిస్ట్‌కైనా సంతృప్తి లభిస్తుంది. అందుకే ‘రుద్ర’ వెబ్ సిరీస్‌లో నాది కాస్త నెగటివ్ షేడ్ క్యారెక్టర్ అయినప్పటికీ చేశాను’’ అన్నారు రాశీ ఖన్నా. అయితే ఈ క్యారెక్టర్ ఒప్పుకునే ముందు ఈ బ్యూటీ భయపడ్డారట. ఈ విషయం గురించి రాశీ ఖన్నా మాట్లాడుతూ – ‘‘సినిమాల్లో నన్ను పాజిటివ్ రోల్స్‌లో చూసిన ఫ్యాన్స్ నెగటివ్ షేడ్స్‌లో చూసి ఫీలవుతారేమోనని కాస్త భయపడ్డాను. నా మీద ఎంతో అభిమానం చూపిస్తున్న ఫ్యాన్స్‌కి నేను ఆన్సరబుల్. సౌత్‌లో నాకు పాజిటివ్ ఇమేజ్ ఉంది కాబట్టి ఇక్కడివారు ఎలా రియాక్ట్ అవుతారో అని కొంచెం డౌట్ ఉండేది. కానీ ఆర్టిస్ట్‌గా చాలెంజింగ్ రోల్స్ చేయాలి కాబట్టి నా కంఫర్ట్ జోన్ నుంచి బయటికొచ్చి ‘రుద్ర’ చేశాను. నా క్యారెక్టర్ చాలామందికి నచ్చింది. కొంతమందికి నచ్చలేదు. నచ్చక పోవడానికి కారణం నా మీద వారికున్న పాజిటివ్ ఇమేజ్. ఏది ఏమైనా నాకు ఫ్యాన్స్ సపోర్ట్ ఎప్పుడూ కావాలి. ఎందుకంటే ఒక యాక్టర్‌గా నేను డిఫరెంట్‌గా ట్రై చేసినప్పుడు వాళ్లు చూస్తేనే నేను మళ్లీ మళ్లీ అలాంటివి చేయగలుగుతాను. లేకపోతే ఒకే తరహా రోల్స్‌కి పరిమితం కావాల్సి వస్తుంది’’ అన్నారు. -
Rashi Khanna: హీరోయిన్ చేతిలో రెండు వెబ్ సిరీస్‌లు!
డిజిటల్ ఎంటర్టైన్మెంట్పై మరింత ఫోకస్ పెట్టినట్లున్నారు హీరోయిన్ రాశీ ఖన్నా. ఇప్పటికే ‘ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్’ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకద్వయం రూపొందిస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతితో పాటు ఓ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నారు రాశీ ఖన్నా. తాజాగా అజయ్ దేవగణ్ నటించనున్న ‘రుద్ర’ (ప్రచారంలో ఉన్న టైటిల్) వెబ్ సిరీస్‌లో ఓ మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేసేందుకు ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ‘వెంటిలేటర్’ ఫేమ్ ఎమ్. రాజేష్ ‘రుద్ర’ సిరీస్‌ను డైరెక్ట్ చేయనున్నారు. ఇంగ్లిష్ సైకలాజికల్ క్రైమ్ డ్రామా ‘లూథర్’ ఆధారంగా ఈ హిందీ వెబ్ సిరీస్ రూపొందనుంది. ‘లూథర్’ సిరీస్‌లో రూథ్ విల్సన్ పోషించిన పాత్రలో రాశీ కనిపిస్తారట. ‘రుద్ర’ షూటింగ్ ఈ నెల 21న ప్రారంభం అవుతుందని బాలీవుడ్ సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో రాశీ ఓ లీడ్ క్యారెక్టర్ చేసే చాన్స్ దక్కించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక తెలుగులో నాగచైతన్య ‘థ్యాంక్యూ’, గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే తమిళంలో మూడు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇలా కెరీర్లో టాప్ గేర్‌తో దూసుకెళ్తున్నారు రాశీ ఖన్నా. -
పుత్రోత్సాహం
పుత్రోత్సాహం కొడుకు పుట్టినప్పుడు కాదు ఏదైనా సాధించినప్పుడు కలుగుతుంది అని సుమతీ శతకం చెబుతుంది. అరవింద్ సామి కూడా ఇప్పుడు ‘పుత్రోత్సాహాన్ని’ ఆస్వాదిస్తున్నారు. ఆయన కుమారుడు రుద్ర ఐబీ ప్రోగ్రామ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు. ఆ ఆనందాన్ని షేర్ చేసుకుంటూ – ‘‘ఐబీ ప్రోగ్రామ్ నుంచి మా అబ్బాయి గ్రాడ్యుయేట్ అయినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ మైల్స్టోన్ రీచ్ అయిన అందరికీ కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. ‘నీ లైఫ్‌ను హ్యాపీగా, ప్రేమతో, ప్రశాంతంగా, నిజాయితీగా, సమగ్రతతో లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రపంచానికి ఉపయోగపడేలా ఉండు. పెద్ద పెద్ద కలల్ని కను. గుర్తుపెట్టుకో.. పతీదీ పాజిబులే’’ అని రుద్రకు నాలుగు మంచి మాటలు చెప్పారు అరవింద్ సామి. ఐబీ (ఇంటర్నేషనల్ బ్యాకులోరియట్) డిగ్రీ చాలా ప్రెస్టీజియస్ గ్లోబల్ డిగ్రీ. ఐబీ ఫాలో అయ్యే స్కూల్స్ అందరూ గ్లోబల్ సిలబస్ ఫాలో అవుతుంటారు. కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా టైమ్ మేనేజ్మెంట్, రియల్ వరల్డ్ స్కిల్స్ ఇలా ప్రతీదాంట్లో స్టూడెంట్స్‌ను ట్రైన్ చేస్తారు. ప్రపంచంలో ఎక్కడైనా బతకగలిగే పర్ఫెక్ట్ సిటిజన్‌గా తీర్చిదిద్దుతారు. ఇలాంటి ప్రెస్టీజియస్ డిగ్రీను కొడుకు సంపాదించాడు అంటే పుత్రోత్సాహమే కదా.6 -
ప్రశ్నించడమే పురోగతికి సోపానం
చర్చల ద్వారా నేనూతన ఆలోచనలు ఇండోర్ ప్రొఫెసర్ ప్రకాశ్ ‘గీతం’లో మూడురోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభం పటాన్చెరు: ప్రశ్నించడమే పురోగతికి సోపానమని ఇండోర్‌కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ప్రొఫెసర్ ప్రకాశ్ డి.వ్యవహారి అన్నారు. వివిధ అంశాలపై ఒకరితో మరొకరు చర్చిస్తేనే నూతన ఆలోచనలు వస్తాయన్నారు. రుద్రారంలోని గీతం వర్సిటీ హైదరాబాద్ క్యాంపస్‌లో మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. వైర్లెస్ అండ్ ఆప్టికల్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ పేరిట నిర్వహిస్తోన్న సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ పరి శోధకులు హాజరయ్యారు. ఈ సందర్భం గా ప్రకాశ్ మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా సౌకర్యవంతమైన జీవనాన్ని అందించేందుకు ఇంజినీర్లు నవకల్పనలు చేయాలన్నారు. విద్యుత్, మరుగుదొడ్డి వంటి కనీస సౌకర్యాలు లేని వారు కూడా సెల్ఫోన్లను వినియోగిస్తున్నారని వివరించారు. ప్రజలు సులువుగా వినియోగించగల చౌకగా లభించే ఉపకరణాల తయారీకి యువ ఇంజినీర్లు పూనుకోవాలని మరో వక్త ప్రొ.ప్రకాశ్ సూచించారు. పరిశోధన అనేది జీవనాడి వంటిదని ఆత్మీయ అతి థి ప్రొ. వివేక్ ఎస్ దేశ్‌పాండే అభిప్రాయపడ్డారు. పక్షుల ద్వారా సమాచారం చేరేవేసే దశ నుంచి మొదలైన కమ్యూనికేషన్ల వ్యవస్థ ఐదు దశాబ్దాల్లో చెప్పుకోదగ్గ పురోభివృద్ధి సాధించిందని గీతం వర్సిటీ ప్రొ. వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ చెప్పారు. ప్రస్తుతం మనం గ్రహాల మధ్య సమాచారాన్ని మార్పిడి చేసుకునే దశలో ఉన్నామన్నా రు. అదే సమయంలో సిగ్నళ్లు సరిగ్గా అందకపోవడం, మేఘాలు, సోలార్ రేడియేషన్ వంటి వాటివల్ల అవరోధాలను ఎదుర్కొంటున్నామన్నారు. ఆ సవాళ్లను అధిగమించేలా పరిశోధనలు సాగాలని సూచించారు. ఐట్రిపుల్ఈ, ఐట్రిపుల్ఈ ఫొటోనిక్స్ సొసైటీ, కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా(సీఎస్ఐ) సౌజన్యంతో గీతం విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ఈ సదస్సులో సీఎస్ఈ విభాగాధిపతి ప్రొ. ఎస్.ఫణికుమార్, నిర్వాహక కార్యదర్శి డాక్టర్ డి.నిఖితతోపాటు మొత్తం 160 మంది పత్ర సమర్పణ చేయగా 40 పత్రాలను ఆమోదించి ప్రచురించిన సీడీని ముఖ్యఅతిథి ఆవిష్కరించారు. -
ప్రాణాలు కాపాడిన 'రుద్ర' గావుకేక
పూణే : విపత్కర పరిస్థితుల్లో మధ్య మాలిన్ గ్రామంలో శిథిలాలు తొలగిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.. ఇంతలో శిథిలాల మధ్య నుంచి ఓ చిన్నారి గావుకేక! కొండచరియల మధ్య చిక్కుకొని మూర్చపోయిన తల్లి ఒడిలో ఉన్న మూడు నెలల పసికందు రుద్ర బిగ్గరగా ఏడ్చింది.. దాంతో అప్రమత్తమైన సహాయక సిబ్బంది తల్లి, బిడ్డను శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. కొండచరియలు విరిగిపడటం రుద్ర తల్లి ప్రమీలా లింబే ఇల్లు శిథిలాల కింద సమాధి అయింది. అయితే ప్రమాదాన్ని పసిగట్టిన ఆమె ఓ ఇనుప డబ్బాలో బిడ్డతోపాటు తలదాచుకున్నారు. శిథిలాల మధ్య ఇరుక్కుపోయి సాయం కోసం అరిచి..అరిచి ఆమె మూర్ఛపోగా ఆమె ఒడిలో చిన్నారి పెట్టిన గావుకేకతో.. తల్లిబిడ్డల ప్రాణాలు దక్కాయి. వారిద్దరూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకూ ఆ డబ్బాలోనే ఉండిపోయారని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అంతసేపు డబ్బాలో ఉండి వారిద్దరూ ప్రాణాలతో బటయపడటం అద్భుతమే మరి.