హిట్‌ అయినదే పెద్ద సినిమా | Rudram kota Movie Trailer Launch by Hero Srikanth | Sakshi
Sakshi News home page

హిట్‌ అయినదే పెద్ద సినిమా

Published Thu, Sep 21 2023 1:46 AM | Last Updated on Thu, Sep 21 2023 4:07 PM

Rudram kota Movie Trailer Launch by Hero Srikanth - Sakshi

‘‘రుద్రం కోట’ చిత్రం ట్రైలర్, పాటలు బాగున్నాయి. ఇప్పుడు ఏది హిట్‌ అయితే అదే పెద్ద సినిమా అవుతోంది. ఈ మూవీని ప్రేక్షకులు ఆదరించి, కొత్తవారిని ప్రొత్సహించాలి’’ అన్నారు నటుడు శ్రీకాంత్‌. రుద్ర హీరోగా, శక్తి, విభీష హీరోయిన్లుగా రాము కోన దర్శకత్వం వహించిన చిత్రం ‘రుద్రం కోట’. నటి జయలలిత కీలక పాత్రలో నటించి, సమర్పించారు.

అనిల్‌ ఆర్కా కండవల్లి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న స్క్రీన్‌ మాక్స్‌ సంస్థ ద్వారా విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని శ్రీకాంత్, నటి రాశీ విడుదల చేశారు. రాశీ మాట్లాడుతూ– ‘‘రుద్రం కోట’ టీజర్, ట్రైలర్‌ బాగున్నాయి. సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘మా సినిమాను స΄ోర్ట్‌ చేస్తున్నవారికి కృతజ్ఞతలు’’ అన్నారు జయలలిత. ‘‘ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరించి పెద్ద సినిమాగా చేస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు అనిల్‌ ఆర్కా.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement