Rudram Kota Movie
-
Rudramkota Movie Success Meet: రుద్రం కోట మూవీ సక్సెస్ మీట్ (ఫోటోలు)
-
‘రుద్రంకోట’ మూవీ రివ్యూ
టైటిల్: రుద్రంకోట నటీనటుటు: జయలలిత, అనీల్, విభీష, అలేఖ్య ,బాచి, రమ్య తదితరులు నిర్మాత:అనిల్ ఆర్కా కండవల్లి దర్శకత్వం: రాము కోన సంగీతం: సుభాష్ ఆనంద్, నిరంజన్ నేపథ్య సంగీతం: కోటి సినిమాటోగ్రఫీ: ఆదిమల్ల సంజీవ్ ఎడిటర్: ఆవుల వెంకటేష్ విడుదల తేది: సెప్టెంబర్ 22, 2023 రుద్రంకోట కథేంటంటే.. రుద్రంకోట ఊరిలో కోటమ్మ(సీనియర్ నటి జయలలిత)చెప్పిందే వేదం. తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. అక్రమ సంబంధాలు పెట్టుకుంటే.. స్త్రీలను కూడా శిక్ష విధిస్తుంది. ఆ ఊరికి కాపాలాగా రుద్ర(అనిల్ ఆర్కా కండవల్లి) ఉంటాడు. ఆయన కళ్లుగప్పి ఎవరూ ఊరు దాటలేరు. కోటమ్మ తప్ప మిగతా ఏ మహిళను కూడా రుద్ర కన్నెత్తి చూడడు. మాట్లాడడు. స్మశానంలోనే ఉంటూ ఊరికి కాపాలా కాస్తుంటాడు. అదే ఊరికి చెందిన శక్తి(విభీష)కు రుద్ర అంటే చచ్చేంత ప్రేమ. పట్నం నుంచి ఊరికి వచ్చిన కోటమ్మ మనవరాలు ధృతి(అలేఖ్య) రుద్రపై మోజు పడుతుంది. కానీ రుద్ర మాత్రం ధృతి కోరికను తిరస్కరిస్తాడు. ఇదిలా ఉంటే ఊరి చివర్లో కొంతమంది యువకులు ఓ అఘాయిత్యానికి పాల్పడతారు. అదేంటి? రుద్ర ప్రాణంగా ప్రేమించిన శక్తికి ఏం జరిగింది? అసలు రుద్ర నేపథ్యం ఏంటి? అమ్మాయిలంటే ఎందుకు గిట్టదు? శక్తి ప్రేమ సఫలం అయిందా లేదా? రుద్రపై పగ పెంచుకున్న ధృతి..చివరకు ఏం చేసింది? తప్పు చేసిన వాళ్లకు రుద్ర ఎలాంటి శిక్ష విధించాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. శ్మశాన వాటికలో పెరిగి పెద్దైన ఓ యుకుడి ప్రేమకథా చిత్రమిది. లవ్ అండ్ లస్ట్ తో సాగే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు రాము కోన. కామంతో కొందరు ఎటువంటి దారుణాలకు పాల్పడుతున్నారనేది ఈ చిత్రంలో చూపించారు. అయితే ఈ తరహా కథలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమి కాదు. కానీ హీరో పాత్రను తీర్చి దిద్దిన తీరు బాగుంది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది కానీ.. దాని చుట్టు అల్లుకున్న కథలో మాత్రం బలం లేదు. కోటమ్మ పాత్ర పరిచయంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత రుద్రగా హీరో ఎంట్రీ సీన్ బాగుంటుంది. ఎలాంటి సాగదీత లేకుండా మొదట్లోనే ముఖ్యమైన పాత్రలు..వాటి నేపథ్యాన్ని చూపించారు. దీంతో కథపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. అయితే ఆ ఆసక్తిని చివరి వరకు కొనసాగించలేకపోయాడు. సినిమా ప్రారంభమైన కాసేపటికే కథనం నెమ్మదిగా సాగుతుంది. రొటీన్ సన్నివేశాలతో ఫస్టాఫ్ ముగుస్తుంది. సెకండాఫ్ కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. శక్తి, రుద్ర మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు బాగుంటాయి. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. డైలాగులు పేలవంగా ఉండడం సినిమాకు మైనస్. కోటమ్మ, రుద్ర పాత్రల నేపథ్యాన్ని మరింత బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. హీరోగా అనీల్‌కు తొలి సినిమా అయినా..ఎక్కడా తడబడకుండా నటించాడు. శ్మశాన వాటికలో పెరిగి పెద్దైన యువకుడు రుద్ర పాత్రలో ఒదిగిపోయాడు. కోటమ్మ పాత్రకు సీనియర్ నటి జయలలిత న్యాయం చేశారు. అమె పాత్రను తీర్చిదిద్దిన తీరు బాగుంది. పల్లెటూరి అమ్మాయి శక్తిగా విభీష చక్కగా నటించింది. తెరపై అందంగా కనిపించింది. ఇక నెగెటివ్ షేడ్స్ ఉన్న ధృతి పాత్రని అలేఖ్య న్యాయం చేసింది. తెరపై అందాలను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంది. సాంకేతిక విషయాలకొస్తే.. కోటి నేపథ్య సంగీతం జస్ట్ ఒకే. సుభాష్ ఆనంద్, నిరంజన్ అందించిన పాటు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి అందాలను చక్కగా తన కెమెరాలో బంధించాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
హిట్ అయినదే పెద్ద సినిమా
‘‘రుద్రం కోట’ చిత్రం ట్రైలర్, పాటలు బాగున్నాయి. ఇప్పుడు ఏది హిట్ అయితే అదే పెద్ద సినిమా అవుతోంది. ఈ మూవీని ప్రేక్షకులు ఆదరించి, కొత్తవారిని ప్రొత్సహించాలి’’ అన్నారు నటుడు శ్రీకాంత్. రుద్ర హీరోగా, శక్తి, విభీష హీరోయిన్లుగా రాము కోన దర్శకత్వం వహించిన చిత్రం ‘రుద్రం కోట’. నటి జయలలిత కీలక పాత్రలో నటించి, సమర్పించారు. అనిల్ ఆర్కా కండవల్లి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న స్క్రీన్ మాక్స్ సంస్థ ద్వారా విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని శ్రీకాంత్, నటి రాశీ విడుదల చేశారు. రాశీ మాట్లాడుతూ– ‘‘రుద్రం కోట’ టీజర్, ట్రైలర్ బాగున్నాయి. సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘మా సినిమాను స΄ోర్ట్ చేస్తున్నవారికి కృతజ్ఞతలు’’ అన్నారు జయలలిత. ‘‘ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరించి పెద్ద సినిమాగా చేస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు అనిల్ ఆర్కా. -
సీరియల్స్‌కు సినిమాకు తేడా అదే : దర్శకుడు
సీరియల్స్‌కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. వారు దర్శకుడు, టెక్నీషియన్లు ఎవరనేది పట్టించుకోరు. కానీ ప్రతి రోజు మా సీరియల్ చూస్తారు. సినిమా అలా కాదు. ఒక్క హిట్ పడిందంటే చాలు మంచి ఫాలోయింగ్, పేరు వస్తుంది. సీరియల్‌కు ఉన్నన్ని కష్టాలు సినిమాకు ఉండవు’అని దర్శకుడు రాము కోన అన్నారు. పలు సీరియళ్లకు దర్శకత్వం వహించిన రాము.. `రుద్రంకోట`అనే సినిమాను తెరకెక్కించాడు. దర్శకుడిగా ఇది అతనికి తొలి సినిమా. సీనియర్ నటి జయలలిత సమర్పకులుగా వ్యవహిరిస్తూ ఓ కీలక పాత్రలో పోషిస్తున్నారు. సెప్టెంబర్ 22న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో రాము తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► నేను 2001లో నటుడు కావాలని ఇండస్ట్రీకి వచ్చాను. చాలా ప్రయత్నాలు చేశాను కానీ వర్కవుట్ అవ్వలేదు. ఆ తరుణంలో ఒక మేకప్ మ్యాన్ ద్వారా `పద్మవ్యూహం`సీరియల్ కు కొన్ని రోజులు పని చేశాను. ఆ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అక్కడ కూడా మానేశాను. ఇలా కాదని మద్రాసు వెళ్లాను. అక్కడ మిత్రుడి ద్వారా డైరక్టర్ సురేష్ గారి వద్ద ఒక సీరియల్ కు అసిస్టెంట్ డైరక్టర్ చేరాను. అలా ఆయన దగ్గర చాలా వర్క్ నేర్చుకున్నా. ఆ తర్వాత ప్రామ్టర్ గా కొన్ని సీరియల్స్ కు పని చేశాను. అలా నా కెరీర్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు అన్ని మేజర్ టీవీ ఛానల్స్ లో హిట్ సీరియల్స్ డైరక్ట్ చేశాను. ఇప్పటి వరకు దాదాపు ఐదు వేలకు పైగా ఎపిసోడ్స్ డైరక్ట్ చేశాను. ఆ సమయంలోనే `రుద్రంకోట` సినిమా డైరక్ట్ చేసే అవకాశం వచ్చింది. ► రుద్రంకోట దగ్గర జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం చేశాము. శ్మశాన వాటికలో పెరిగి పెద్దైన ఓ యుకుడి ప్రేమకథా చిత్రం. భద్రాచలం దగ్గర రుద్రంకోట అనే ఊరి నేపథ్యంలో కథ నడుస్తుంది. ఇప్పటి వరకు ఎవరూ చూపించని అంశాలను మా చిత్రంలో చూపిస్తున్నాము. ఇందులో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలుంటాయి. లవ్ అండ్ లస్ట్ తో సాగే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. అండర్ కరెంట్ గా మంచి సందేశం కూడా అందిస్తున్నాం. అదేంటో సినిమాలో చూస్తే అర్థమవుతుంది. ► ఇందులో లీడ్ రోల్ లో సీనియర్ నటి జయలలిత గారు నటించారు. కోటమ్మ పాత్రలో తను నటించిన తీరు అద్భుతం. అలాగే హీరోగా రుద్ర నటించాడు. తనకు ఇది తొలి సినిమా అయినా ఎక్కడా తడబడకుండా నటించాడు. అమ్మాయిలంటే గిట్టని పాత్రలో తను ఒదిగిపోయాడు. అలాగే హీరోయన్స్ శక్తి, విభీష ఇద్దరూ పోటీ పడి నటించారు. ప్రతి పాత్ర సినిమాకు కీలకంగా ఉంటుంది. ► జయ లలిత గారు చేసిన కోటమ్మ పాత్ర సినిమాకు హైటెట్. అలాగే మ్యూజిక్ కూడా మరో హైలెట్ గా నిలుస్తుంది. ఇప్పటి వరకు జయలలిత గారితో నేను చాలా సీరియల్స్ కు పని చేశాను. ఆ అభిమానంతో నేను తన పేరు సమర్పకురాలిగా వేసుకున్నాను. జయలలిత గారు మా సినిమాకు ఎంతో సపోర్ట్ చేశారు. ► దర్శకుడు గా నాకు ఆదర్శం రాజమౌళి గారు. ఆయన కూడా మొదట `శాంతి నివాసం` అనే సీరియల్ చేసారు. ఆ తర్వాత సినిమాలు డైరక్ట్ చేసి...తెలుగు సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకెల్లారు. ఆయన ఆదర్శంతోనే సీరియల్ నుంచి నేను కూడా సినిమాల వైపు వచ్చాను. -
శ్మశాన వాటికలో పనిచేసే యువకుడి ప్రేమ కథే `రుద్రంకోట`
అనిల్, విభీష, రియా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘రుద్రంకోట’. రాము కోన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏఆర్ కె విజువల్స్ పతాకంపై అనిల్ ఆర్కా కండవల్లి నిర్మిస్తున్నారు. సీనియర్ జటి జయలలిత సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర సెప్టెంబర్ 22న ప్రేక్షకులముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర హీరో, నిర్మాత అనిల్ ఆర్కకండవల్లి మీడియాతో మాట్లాడుతూ..శ్మశాన వాటికలో పెరిగి పెద్దైన ఓ యుకుడి ప్రేమకథా చిత్రమిది. భద్రాచలం దగ్గర రుద్రంకోట అనే ఊరి నేపథ్యంలో కథ నడుస్తుంది. ఇప్పటి వరకు ఎవరూ చూపించని అంశాలను మా చిత్రంలో చూపిస్తున్నాము. ఇందులో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలుంటాయి. సీనియర్ నటి జయలలిత గారు సమర్పకులుగా వ్యవహరిస్తూ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించారు. ప్రముఖ సంగీత దర్శకులు కోటి గారు మా చిత్రానికి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. సెన్సార్ ప్రముఖులు యుబైఏ సర్టిఫికెట్ తో పాటు సినిమా బావుందంటూ ప్రశంసించారు. ప్రేక్షకులకు కూడా మా చిత్రం కచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం ఉంది’అని అన్నారు.