
అనిల్, విభీష, రియా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘రుద్రంకోట’. రాము కోన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏఆర్ కె విజువల్స్ పతాకంపై అనిల్ ఆర్కా కండవల్లి నిర్మిస్తున్నారు. సీనియర్ జటి జయలలిత సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర సెప్టెంబర్ 22న ప్రేక్షకులముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర హీరో, నిర్మాత అనిల్ ఆర్కకండవల్లి మీడియాతో మాట్లాడుతూ..శ్మశాన వాటికలో పెరిగి పెద్దైన ఓ యుకుడి ప్రేమకథా చిత్రమిది. భద్రాచలం దగ్గర రుద్రంకోట అనే ఊరి నేపథ్యంలో కథ నడుస్తుంది. ఇప్పటి వరకు ఎవరూ చూపించని అంశాలను మా చిత్రంలో చూపిస్తున్నాము.
ఇందులో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలుంటాయి. సీనియర్ నటి జయలలిత గారు సమర్పకులుగా వ్యవహరిస్తూ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించారు. ప్రముఖ సంగీత దర్శకులు కోటి గారు మా చిత్రానికి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. సెన్సార్ ప్రముఖులు యుబైఏ సర్టిఫికెట్ తో పాటు సినిమా బావుందంటూ ప్రశంసించారు. ప్రేక్షకులకు కూడా మా చిత్రం కచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం ఉంది’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment