తొలి ప్రయత్నంలోనే హిట్టవడం ఆనందం | Maa Oori Polimera 2 turning into sensational hit | Sakshi
Sakshi News home page

తొలి ప్రయత్నంలోనే హిట్టవడం ఆనందం

Published Fri, Nov 10 2023 4:44 AM | Last Updated on Fri, Nov 10 2023 4:44 AM

Maa Oori Polimera 2 turning into sensational hit - Sakshi

అల్లు అరవింద్, వంశీ నందిపాటి 

‘సత్యం’ రాజేశ్, కామాక్షీ భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఊరి పాలిమేర 2’. అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకత్వంలో గౌరీకృష్ణ నిర్మించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌కు చెందిన వంశీ నందిపాటి ఈ నెల 3న విడుదల చేశారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ దిశగా ముందుకు వెళ్తోందని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

ఈ సందర్భంగా వంశీ నందిపాటిని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ అభినందించారు. వంశీ మంచి అభిరుచిగలవాడని, మొదటి ప్రయత్నంలో చిరస్మరణీమైన హిట్‌ అందుకోవడం తనకు ఆనందంగా ఉందని అల్లు అరవింద్‌ అన్నారు. ఈ సినిమాను హిట్‌ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ యూనిట్‌ నవంబరు 10 నుంచి ఆంధ్రాలో పర్యటించనుందని కూడా ఆయన వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement