kamakshi
-
ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధం: పొలిమేర నటి
టాలీవుడ్ నటి కామాక్షి భాస్కర్ల గతేడాది పొలిమేర-2 చిత్రంతో ఆకట్టుకుంది. గతంలో వచ్చిన పొలిమేర చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో సత్యం రాజేశ్, బాలాదిత్య, గెటప్ శ్రీను ప్రధాన పాత్రలు పోషించారు. చేతబడుల కాన్సెప్ట్, హారర్ థ్రిల్లర్ కావడంతో అభిమానుల ఆదరణ దక్కించుకుంది. అయితే ఈ చిత్రంలో కామాక్షి తన నటనకు గానూ ప్రశంసలు అందుకుంది. అంతే కాదు ఆమెకు అవార్డు కూడా లభించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన కామాక్షి తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకుంది. అదేంటో తెలుసుకుందాం.తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న కామాక్షి షాకింగ్ కామెంట్స్ చేసింది. సినిమాల్లో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తానని తెలిపింది. ఏ పాత్రలోనైనా నటించేందుకు సిద్ధమని పేర్కొంది. ఒకవేళ కథ డిమాండ్ చేస్తే నగ్నంగా నటించాల్సి వచ్చినా చేస్తానని తేల్చి చెప్పింది. అంతే కాకుండా తాను మంచి డ్యాన్సర్ అని వెల్లడించింది. స్టార్ హీరోల సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో చేసే అవకాశాలు వస్తే ఎట్టి పరిస్థితుల్లో వదులుకోనని కామాక్షి తెలిపింది. -
Kamakshi Bhaskarla: ‘పొలిమేర 2’ హీరోయిన్‌కి అరుదైన పురస్కారం
-
‘మా ఊరిపొలిమేర 2’ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
తొలి ప్రయత్నంలోనే హిట్టవడం ఆనందం
‘సత్యం’ రాజేశ్, కామాక్షీ భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఊరి పాలిమేర 2’. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరీకృష్ణ నిర్మించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌కు చెందిన వంశీ నందిపాటి ఈ నెల 3న విడుదల చేశారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ దిశగా ముందుకు వెళ్తోందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా వంశీ నందిపాటిని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అభినందించారు. వంశీ మంచి అభిరుచిగలవాడని, మొదటి ప్రయత్నంలో చిరస్మరణీమైన హిట్ అందుకోవడం తనకు ఆనందంగా ఉందని అల్లు అరవింద్ అన్నారు. ఈ సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ యూనిట్ నవంబరు 10 నుంచి ఆంధ్రాలో పర్యటించనుందని కూడా ఆయన వెల్లడించారు. -
మా కష్టాన్ని మర్చిపోయే విజయం లభించింది
‘సత్యం’ రాజేశ్, కామాక్షీ భాస్కర్ల ప్రధాన తారాగణంగా రూపోందిన హారర్ అండ్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘మా ఊరి పోలిమేర 2’. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరీకృష్ణ నిర్మించిన ఈ చిత్రాన్ని పంపిణీదారుడు వంశీ నందిపాటి ఈ నెల 3న రిలీజ్ చేశారు.శనివారం జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్‌కు అతిథిగా హాజరైన నిర్మాత ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం వంశీ, గౌరీకృష్ణ చాలా కష్టపడ్డారు. ఈ సినిమా ఘనవిజయం సాధించడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘మా ఊరి పోలిమేర 1’ ఓటీటీలో విడుదలైనా, పార్ట్ 2 థియేటర్స్‌లో రిలీజై ఇంతటి ఘనవిజయం సాధించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా రిలీజ్ కోసం గౌరీకృష్ణ ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. మమ్మల్నిప్రోత్సహించిన ‘బన్నీ’ వాసు, వంశీగార్లకు ధన్యవాదాలు’’ అన్నారు ‘సత్యం’ రాజేశ్, అనిల్ విశ్వనాథ్. ‘‘ఈ సినిమా విషయంలో మూడు రోజుల నుంచి మేం చాలా కష్టపడ్డాం. ఆ కష్టాన్ని మర్చిపోయేలా మంచి విజయం దక్కడం హ్యాపీగా ఉంది’’ అన్నారు వంశీ నందిపాటి. ‘‘కలెక్షన్స్ రిపోర్ట్స్ చూసి హ్యాపీగా ఉన్నాం’’ అన్నారు కామాక్షి. -
ఈ సినిమా నాకో పెద్ద వేడుక
‘సత్యం’ రాజేష్, కామాక్షీ భాస్కర్ల ప్రధాన తారాగణంగా, రాకేందు మౌళి, బాలాదిత్య, కరుణకుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఊరి పోలిమేర 2’. 2021లో వీక్షకుల ముందుకు వచ్చిన ‘మా ఊరి పోలిమేర’కు ఇది సీక్వెల్ చిత్రం. గౌరీకృష్ణ నిర్మించిన ఈ చితాన్ని పంపిణీదారుడు వంశీ నందిపాటి నేడు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ‘సత్యం’ రాజేశ్ మాట్లాడుతూ– ‘‘మా ఊరి పోలిమేర’కు వీక్షకుల నుంచి వచ్చిన స్పందనను బట్టి ‘మా ఊరి పోలిమేర 2’ చేద్దామని అనుకున్నాం. తొలి భాగం ముగిసిన దగ్గర్నుంచే మలి భాగం ఆరంభమవుతుంది. కొమరయ్య (సినిమాలో ‘సత్యం’ రాజేశ్ పాత్ర) గురించి నిజాలు తెలుసుకున్న లక్ష్మి (కామాక్షీ పాత్ర) ఏం చేసింది? ఏ విధంగా పగ తీర్చుకోవాలనుకుంది? కవిత ఎలా జీవించి ఉంది? ఇలాంటి ఆసక్తికరమైన కథనంతో మంచి ట్విస్ట్‌లతో సాగుతుంది. నా కెరీర్లో ఓ పెద్ద వేడుకలా ఈ సినిమాను భావిస్తున్నాను. ప్రస్తుతం ‘గీతాంజలి’ సీక్వెల్, వరుణ్‌తేజ్ ‘మట్కా’ వంటి సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నాను. హీరోగా ‘టెనెంట్’ చేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. -
భవిష్యత్‌లో డైరెక్టర్ అవుతాను: హీరోయిన్
‘సత్యం’ రాజేశ్, డా. కామాక్షీ భాస్కర్ల హీరో హీరోయిన్లుగా ‘గెటప్’ శ్రీను, రాకేందు మౌళి, బాలాదిత్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మించిన ఈ సినిమాను నందిపాటి వంశీకృష్ణ నవంబరు 3న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కామాక్షి మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారు కెమెరామేన్. రంభ, కల్పనా రాయ్‌లు మాకు దూరపు బంధువులు. నేను క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాను. మెడిసిన్ చేసినా నటిగానూ చేయాలనుకుంటున్నాను. ‘మిస్ ఇండియా’ సినిమాతో నా జర్నీ మొదలైంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రౌడీ బాయ్స్, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, మా ఊరి పొలిమేర 1, విరూపాక్ష’ వంటి సినిమాలు, ‘ఆహా’ ఓటీటీలో మూడు వెబ్ సిరీస్‌లు చేశాను. ఇక ‘మా ఊరి పొలిమేర 1’లో సహనం ఉన్న లక్ష్మీ పాత్ర చేశాను. రెండో భాగంలో నా పాత్ర ఎగ్రెసివ్‌గా ఉంటుంది. భవిష్యత్‌లో డైరెక్టర్ అవుతాను’’ అన్నారు. -
కొత్త లోకంలోకి వెళ్తారు
‘సత్యం’ రాజేశ్, కామాక్షీ భాస్కర్ల జంటగా అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మా ఊరి పోలిమేర 2’. ‘మా ఊరి పోలిమేర’కు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మించిన ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్న పంపిణీదారుడు వంశీ నందిపాటి నవంబరు 3న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘సత్యం’ రాజేశ్ మాట్లాడుతూ– ‘‘కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ‘మా ఊరి పోలిమేర 2’ చిత్రం ప్రేక్షకులను కొత్త లోకానికి తీసుకుని వెళ్తుంది’’ అన్నారు. ‘‘తొలి భాగానికి 20 రెట్లు మలి భాగం బాగుంటుంది. త్వరలోనే ‘పోలిమేర 3’ని కూడా ఆరంభిస్తాం’’ అన్నారు అనిల్ విశ్వనాథ్. ‘‘సినిమా విజయంపై పూర్తి నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు. ‘‘ప్రేక్షకులు ఓ థ్రిల్లింగ్ చిత్రాన్ని చూడబోతున్నారు’’ అన్నారు వంశీ. -
‘మా ఊరి పోలిమేర–2’ రిలీజ్ ఎప్పుడంటే..
‘సత్యం’ రాజేష్, కామాక్షి భాస్కర్ల లీడ్ రోల్స్‌లో డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మా ఊరి పోలిమేర–2’. గౌరు గణబాబు సమర్పణలో గౌరీకృష్ణ నిర్మించిన ఈ చిత్రాన్ని నవంబరు 2న విడుదల చేయనున్నారు. డా. అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ– ‘‘గ్రామీణ నేపథ్యంలో మర్డర్ మిస్టరీకి బ్లాక్ మ్యాజిక్ అంశాన్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ‘మా ఊరి పోలిమేర ’ కన్నా రెండో భాగం ఇంకా ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గ్యాని, కెమెరా: ఖుషేందర్ రమేష్ రెడ్డి. -
బీచ్‌లకు రక్షకురాలిగా 96 ఏళ్ల బామ్మ!
చెన్నైలోని బీచ్‌లను అభివృద్ధి పేరుతో ధ్వంసం చేయాలంటే అందరికీ భయం. దానికి కారణం కామాక్షి సుబ్రమణియన్. బీచ్‌లకు రక్షకురాలిగా ‘అమ్మమ్మ’గా అందరూ పిలుచుకునే కామాక్షి గత 40 ఏళ్లుగా చెన్నైలోని బీచ్‌లను కాపాడుతోంది. ఈ పనికి అందరూ పెట్టిన పేరు ‘మిషన్ కామాక్షి’. 1930లో మద్రాసులో ఒక ఘటన జరిగింది. అక్కడి బెసెంట్ నగర్ బీచ్ (ఎలియెట్స్ బీచ్)లో ఒక బ్రిటిష్ అమ్మాయి స్నానం చేస్తూ మునిగిపోబోయింది. ఒడ్డున ఉన్న కాజ్ ష్మిడ్ అనే డెన్మార్క్ నావికుడు అది గమనించాడు. వెంటనే సముద్రంలోకి పరిగెత్తి ఆ అమ్మాయిని కాపాడబోయాడు. అలల తీవ్రత ఎక్కువగా ఉండింది. అమ్మాయిని ఒడ్డుకు తోసేశాడు. తాను మాత్రం సముద్రంలో మునిగిపోయాడు. అమ్మాయి ఆ సంగతి గురించి కిక్కురుమనకుండా సాయంత్రం జరిగిన పార్టీకి హాజరైంది. కాని నాటి గవర్నర్‌కు ఎలాగో సంగతి తెలిసింది. ఆయన ఆగ్రహంతో ఆ అమ్మాయి మీద కేకలేసి కాజ్ ష్మిడ్ సాహసానికి గుర్తుగా ష్మిడ్ మెమోరియల్ కట్టించాడు. చాలా తమిళ సినిమాల్లో ఈ మెమోరియల్ కనిపిస్తుంది. అయితే ఇది అనేక ఏళ్లపాటు శిథిలావస్థలో ఉండింది. కార్పొరేషన్ వారిని వేధించి, వెంటబడి దానిని పునరుద్ధరించిన వ్యక్తి కామాక్షి సుబ్రమణియన్. ఇవాళ ష్మిడ్ మెమోరియల్ ఎంతో చక్కగా పర్యాటకుల్ని ఆకర్షిస్తూ ఉంది. ఏ సాయంత్రం బీచ్‌కు వెళ్లినా ఆ చుట్టుపక్కల నవ్వుతూ కామాక్షి సుబ్రమణియన్ కనిపిస్తుంది. బీచ్ ఒడ్డు మనిషి కామాక్షి సుబ్రమణియన్ బెసెంట్ నగర్లో పుట్టి పెరిగింది. బెసెంట్ నగర్ అడయార్ పక్కనే ఉంటుంది. పెళ్లయ్యాక భర్తతో 1980 వరకూ ఢిల్లీలో ఉండిపోయింది కామాక్షి. భర్త రాష్ట్రపతి భవన్లో కార్యదర్శిగా పని చేసేవాడు. ‘ఆ సమయంలో నా భర్త వల్ల బ్యూరోక్రసిలో ఎలాంటి అలక్ష్యం జరుగుతుందో, తెలిసీ తెలియక ఎన్ని మతలబులు చోటు చేసుకుంటాయో తెలుసుకున్నాను’ అంటుంది కామాక్షి. భర్త రిటైర్ అయ్యాక చక్కా వచ్చి బెసెంట్ నగర్లో నివాసం ఏర్పాటు చేసుకున్న కామాక్షి ఆ రోజుల్లో దట్టంగా ఉన్న చెట్లను కొందరు వంట చెరుకు కోసం కొట్టడం బాల్కనీలో నుంచి గమనించేది. ఆ చెట్లు కొట్టేస్తే నీడ ఏం కాను? అందుకని వారు రావడంతోటే పెద్దగా అరుస్తూ తరిమి కొట్టేది. ‘అలా నా పౌర సేవ మొదలైంది’ అని గుర్తు చేసుకుంది కామాక్షి. ఆమెకు రోజూ బీచ్‌కు వెళ్లడం అలవాటు అలా బీచ్ మీద ప్రేమ ఏర్పడింది. 96 ఏళ్ల వయసులో ‘నగర పౌరులకు హక్కులుంటాయి. పబ్లిక్ స్థలాలు వారి ఆహ్లాదం కోసం. పార్కులు వారికి కావాలి. పేవ్మెంట్లు కావాలి. బీచ్ శుభ్రంగా ఉండాలి. వాటి కోసం నేను పోరాటం చేస్తాను’ అంటుంది కామాక్షి. ఆ మధ్య జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 174 వ వార్డులో ఇండిపెండెంట్‌గా నిలుచుంది కామాక్షి. పత్రికలు ఆమె గురించి విస్తృతంగా రాశాయి. ‘పార్టీ జెండా కింద నిలబడితే పార్టీ పనులన్నీ సమర్థించాలి. నేను అలా చేయలేను’ అందామె. అందుకే ఓడిపోయింది కూడా. కాని నేటికీ ఆమె పౌరుల హక్కుల కోసం పని చేస్తూనే ఉంది. ‘బెసెంట్ నగర్ బీచ్ దగ్గర వాకింగ్ ట్రాక్‌ను అడ్డుకుంటూ పబ్లిక్ టాయిలెట్లు కడుతున్నారు. దానిని అడ్డుకోవడానికి ధర్నా చేస్తున్నాను’ అని ధర్నాకు కూచుందామె. కార్పొరేషన్ అధికారులకు ఆమెను చూస్తే భయం. ఎవరో ఒకరు భయపెట్టకపోతే పనులెలా జరుగుతాయి? 96 ఏళ్లలో కామాక్షి అన్ని పనులు చేస్తుంటే మనం ఎన్ని పనులు చేయాలి? (చదవండి: సబ్బులతో సాంత్వన! అదే యాసిడ్ బాధితులకు ఉపాధిగా..!) -
వేడి నూనెలో వట్టి చేతులతో..
యశవంతపుర: సలసల మరుగుతున్న నూనె చుక్క పడినా బొబ్బలెక్కుతాయి. కానీ అదే వేడి నూనెలో ఉడుకుతున్న వడలను చేతితో బయటకు తీశారు భక్తులు. ఈ ఘటన ఉత్తర కన్నడ జిల్లా కుమట పట్టణంలో జరిగింది. పట్టణంలోని కామాక్షి దేవస్థానంలో దసరా తరువాత పౌర్ణమి రోజున ఘనంగా జాతర జరుగుతుంది. ఇందులో కళాయిలో వేగుతున్న వడలను తీసి భక్తిని చాటుకునే కార్యక్రమం ఉంటుంది. ఆదివారం సాయంత్రం జరిగిన జాతరలో కొందరు భక్తులు ఇలా వడలను తీశారు. ఎవరికీ బొబ్బలు ఎక్కలేదన్నారు. గోవా, మహారాష్ట్రల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. (చదవండి: యాత్ర తర్వాత కొత్త రాహుల్‌ను చూస్తారు) -
చావునుంచి తప్పించుకోవచ్చేమో, కామాక్షి నుంచి తప్పించుకోలేరు?!
ఆన్లైన్లో మోసం చేద్దాం, అమ్మాయిలను వేధించడం వంటి పనులు చేద్దాం అనుకునేవారు ఇక నుంచి జాగ్రత్తగా ఉండక తప్పదు. ఎందుకంటే కామాక్షి శర్మ మీ మోసాన్ని ఇట్టే కనుక్కొని, జైలు ఊచలను లెక్కపెట్టించగలదు. సైబర్ క్రైమ్ నివారణలో భాగంగా ప్రజలకు మాత్రమే కాదు 50,000 మంది పోలీసు సిబ్బందికి శిక్షణ ఇచ్చారు ఘజియాబాద్ వాసి పాతికేళ్ల కామాక్షి శర్మ. తను సాధించిన ఈ ఘనతకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో కామాక్షి శర్మ పేరు నమోదు అయ్యింది. డిజిటల్ యుగంలోకి అడుగుపెట్టామని ఆనందించేలోపే అనర్థాలకు అడ్డూ ఆపూ లేకుండాపోయిందని నిత్యం బాధపడాల్సిన పరిస్థితులను చూస్తున్నాం. ఈ రోజుల్లో ప్రతిది ఆన్లైన్ వేదికగా మారిపోయాక మోసపూరిత అంశాలెన్నింటికో తెరతీసినట్టు అయ్యింది. డబ్బు, అమ్మాయిలను లైంగిక వేధింపులే లక్ష్యంగా చేసుకొని వేల కొద్ది మోసాలు జరుగుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయడానికి నిపుణులు ఎంతో కృషి చేస్తున్నారు. అయినప్పటికీ సైబర్ నేరాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో ఉంటున్న కామాక్షి శర్మ ఎందుకు సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయలేం అని పంతంతో కృషి చేస్తోంది. దీంట్లో భాగంగానే పోలీసు సిబ్బందితో కలిసి పని చేస్తోంది. అభిరుచి వృత్తిగా మార్పు కాలేజీలో రోజుల్లో సరదాగా నేర్చుకున్న హ్యాకింగ్ హాబీ కామాక్షిని సైబర్‌క్రైమ్ ప్రపంచంలో ప్రసిద్ధి చెందేలా చేసింది. హ్యాకర్లు హ్యాకింగ్ చేయడం ద్వారా మోసం చేయగలిగినప్పుడు పోలీసులు వారిని ఏ విధంగా పట్టుకోలేరో, ఎలా చేస్తే వారిని సులువుగా పట్టేయవచ్చో తెలియజెబుతారు కామాక్షి. ‘2017లో నేను బీటెక్ చేస్తున్నప్పుడు హ్యాకింగ్‌ని హాబీగా నేర్చుకున్నాను. నా ఫ్రెండ్సే వారి సొంత ఐడీలను ఇచ్చి, హ్యాక్ చేయమని చెప్పేవారు. ఆ విధంగా కాలేజీ అంతా నేను హ్యాక్ చేస్తానని గుర్తించేవారు. దీంతో హ్యాకింగ్‌లో మరిన్ని నైపుణ్యాలు నేర్చుకోవడానికి, ఆ తర్వాత రోజుల్లో అదే నన్ను ఈ వృత్తివైపుగా మరల్చడానికి దోహదం చేసింది. సైబర్ నేరాలు ఏ ఏవిధంగా పెరుగుతున్నాయి. వాటికి అడ్డుకట్ట వేయచ్చు అనే అంశాల మీద చాలా సాధన చేశాను. ఈ ఆలోచన ను దృష్టిలో పెట్టుకొనే పోలీసు అధికారులతో కలిసి పనిచేయడం ప్రారంభించాను. ఎన్నో నేరాలకు అడ్డుకట్టవేయగలిగాను’ అంటారామె. 35 రోజుల మిషన్ కరోనా మహమ్మారి సమయంలో చాలా మంది ప్రజలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ పేరుతో తమ ఇళ్ల నుండే పనులు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సైబర్ బెదిరింపు చాలా వేగంగా పెరిగింది. నేరగాళ్లు అమ్మాయిలను వేధించి తీసుకున్న ఫొటోలు, లక్షలాది రూపాయలు ప్రజల ఖాతాల నుండి దొంగలిస్తున్నారు. కామాక్షి 2019లో జమ్మూ నుండి కన్యాకుమారి వరకు 35 రోజుల సైబర్ క్రైమ్ మిషన్‌ను పూర్తి చేసింది. ఇందులో సైబర్ నేరాలను ఎలా ఎదుర్కోవాలో పోలీసు సిబ్బందితో కలిసి పర్యవేక్షించింది. ఈ పరీక్షలో ఐపీఎస్ అధికారులు కూడా పాల్గొన్నారు. కామాక్షి ఈ విషయం గురించి మరింతగా ప్రస్తావిస్తూ –‘హ్యాకింగ్ ద్వారా హాకర్లు మోసం చేయగలిగినప్పుడు పోలీసులు వారిని ఎందుకు పట్టుకోలేరని కామాక్షి అభిప్రాయపడ్డారు. దీనిని దృష్టిలో ఉంచుకునే నా హ్యాకింగ్ దర్యాప్తు వైపుగా మార్చాను. అప్పుడే పోలీసు అధికారులతో కలిసి పనిచేయడం ప్రారంభించాను’ అని తెలియజేస్తారు కామాక్షి. ఇక నుంచి సైబర్ నేరానికి పాల్పడాలనుకునేవాళ్లు కామాక్షి చేతికి చిక్కిపోతామని భయపడక తప్పదు లేదంటే నేరానికి శిక్ష అనుభవించక తప్పదు. -
భయమెరగని బామ్మ
బెదిరిస్తే ఏమవుతుంది..? ఏమీ కాదు అలా బెదిరించిన వారే తోకముడుస్తారు.. అంటూ సమస్యల పరిష్కారానికై ముందుకు సాగుతోంది 92 ఏళ్ల ఈ చెన్నై బామ్మ. పేరు కామాక్షి. చెన్నై బెసెంట్ నగర్లో ఉంటున్న ఈ బామ్మను కలిస్తే చాలు మనం మరిచిపోయిన ఎన్నో బాధ్యతలను గుర్తుచేస్తుంది. సమస్యల పరిష్కారానికి మనమూ కదలాలనిపించేలా చేస్తుంది. ‘నేను ముసల్దానినైపోయాను. అలాగని ఇప్పుడప్పుడే ఈ లోకాన్ని విడిచివెళ్లాలనుకోవడం లేదు. నేను భోజనం చేయడానికి ఇప్పుడు నా పళ్లెంలో చాలా పనులున్నాయి. ముందు వాటి సంగతి చూడాలి’ అంటోంది కామాక్షి పాటి. చుట్టుపక్కల కాలనీవాసులే కాదు కార్పొరేషన్ అధికారులు కూడా ఆమెను చూస్తే జంకుతారు. ఆమె బాధ్యతను తెలుసుకొని ప్రేమగా పలకరిస్తారు, గౌరవిస్తారు. పరిచయం లేని వారికి కూడా మన ఇంట్లోని బామ్మలాగానే కనిపిస్తారు. అది ఎంతవరకు అంటే.. చుట్టుపక్కల ఎవరైనా పౌర ప్రమాణాల ఉల్లంఘనకు పాల్పడనంతవరకే. తెల్లవారు ఝాము నుంచి రాత్రి పది వరకు తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కామాక్షి పాటి ఏదైనా సమస్యను పరిష్కరించడానికి వెనకాడరు. ఈ వయస్సులో కూడా ఆమెకు నచ్చని ప్రభుత్వ ప్రతిపాదన ఏదైనా వస్తే దానిని నిరసిస్తూ వీధుల్లోకి వస్తారు లేదా ఆ సమస్యను పరిష్కరించడానికి ఎంత పెద్ద పొజిషన్లో ఉన్న అధికారినైనా నిలదీస్తారు. ఇంతకీ ఈమె ఎవరంటారా .. తంజావూరులో పుట్టిన కామాక్షి పాటి బెంగుళూరులో చదువుకుంది. పెళ్లై ఢిల్లీ వెళ్లింది. ‘ఢిల్లీలో ఆ మూడు దశాబ్దాలు నా జీవితంలో ఉత్తమమైనవి. 1948లో అక్కడికి వెళ్లాను. నవజాత దేశంలో అల్లకల్లోల రాజకీయాల సమయం. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండేవి. కానీ, ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉండేవారు’ అని నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు వివరిస్తుంది. ‘1981లో తిరిగి చెన్నైకి వచ్చాను. ఇక్కడ మారిన వాతావరణం, సంస్కృతి చూసి షాక్ అయ్యాను. సర్దుబాటు చేసుకోవడానికి కొన్నాళ్లు పట్టింది’ అని చెబుతారు. అనుకోకుండా కార్యకర్తగా.. చెన్నై బెసెంట్నగర్లోని కామాక్షి ఉంటున్న ఇంటి ముందు రహదారి ఓ సమస్యగా మారింది. ప్రజలు దీనిని బహిరంగ మరుగుదొడ్డిగా ఉపయోగించేవారు. చనిపోయిన జంతుకళేబరాలను పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఖననం చేసేవారు. ఇళ్లలోని వ్యర్థాలను పోసి వెళుతుండేవారు. విసిగిపోయిన కామాక్షి పదే పదే అధికారులకు విజ్ఞప్తులు చేసేది. అధికారులు ఆ విజ్ఞప్తులను తీసుకునేవారు. కానీ, ఏదో సాకు చెప్పి అప్పటికి తప్పించుకునేవారు. ‘రహదారికి ఇరువైపులా చెట్లు ఉండాలి’ అని వారికి గుర్తు చేసేది. మూడేళ్లు నిరంతర విజ్ఞప్తులు, నిరసనల తర్వాత కార్పొరేషన్ అధికారులు రహదారిని అందంగా తీర్చిదిద్దడంతోపాటు రోడ్‌సైడ్ పార్క్‌ను నిర్మించడంతో ఆమె తన మొదటి విజయాన్ని సాధించింది. కామాక్షి పాటి: అలుపెరుగని అవిశ్రాంత కార్యకర్త ఆమె 80వ పుట్టినరోజు సందర్భంగా అప్పటి చెన్నై కమిషనర్ ఈ పార్కు ఆధునీకరణ బాధ్యతను ఆమెకు అప్పగించారు.అప్పటికి ఆమె కార్పొరేషన్ అధికారులు, స్థానిక చట్టసభ సభ్యులతో పరిచయాలను ఏర్పరుచుకుంది. కామాక్షి పర్యవేక్షణ ఎంత బాగుంటుందో 12 ఏళ్లుగా ఆమె నిర్వహిస్తున్న పార్క్ చెబుతుంది. ‘నేనెప్పుడూ అలవాటు ప్రాముఖ్యతను చెబుతాను. ఒక స్థలాన్ని పునరుద్ధరించినా, ఒకసారి శుభ్రపరిచినా అంతటితో ఏమీ ముగిసిపోదు. దానిని నిరంతరాయంగా కొనసాగించాలి. ఒక బాధ్యతగా తీసుకోవాలి’ అని ఆమె సలహా ఇస్తారు. రోడ్డు, పార్క్ పని పూర్తయింది. ఇక పౌర సమస్యలను పరిష్కరించడానికి ముందుకు వచ్చారు కామాక్షి. బెసెంట్ నగర్‌లోని చుట్టుపక్కల వాసులు తమ మనోవేదనలను, పరిపాలనకు సంబంధించి సమస్యలు పరిష్కరించేలా చూడమని కామాక్షికి దగ్గరకు వచ్చేవారు. దీంతో ఆమె తరచూ సమావేశాలను ఏర్పాటు చేస్తుంది. ఆమె సాధించిన విజయాలలో బెసెంట్ నగర్ బీచ్‌లోని కార్ల్ జెష్మిత్ మెమోరియల్ పునరుద్ధరణ అతి ముఖ్యమైనది. శిథిలావస్థలో ఉన్న ఈ మెమోరియల్‌లో మద్యం సేవించడం, గోడలపై పిచ్చి రాతలు రాయడం, స్మారక చిహ్నంపై మూత్రవిసర్జన చేయడం వంటివి గమనించిన పాటి అది పూర్తిగా బాగయ్యేంతవరకు అధికారులను వదిలిపెట్టలేదు. బెదిరింపులు బేఖాతరు కామాక్షి పాటి విజయం.. రహదారులు, ష్మిత్ మెమోరియల్ పునరుద్ధరుణతో ఆగలేదు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించే షాపులను అడ్డుకోవడం, కాలిబాటలను విస్తరించే విధానాల కోసం బెసెంట్ అవెన్యూలో నియమ నిబంధనలను ఏర్పాటు చేసింది. రాత్రి 10 దాటిన తర్వాత నిర్మాణ కార్యక్రమాలు ఆపాలని, పిల్లలు, వృద్ధుల నిద్రకు అవరోధం కలిగించకుండా చూడాలని కోరుతుంది. బాధ్యతాయుతమైన పౌరురాలిగా ఉండటం ఇష్టమైన కామాక్షికి అవినీతి వైఖరులకు పాల్పడే వారితో ఎప్పుడూ గొడవగానే ఉంటుంది. నా విధానాలకు వ్యతిరేకంగా ఫిర్యాదులు ఇచ్చేవారున్నారు. కానీ, వారెవరూ ఇటువంటి బాధ్యత తీసుకోరు. వీధుల్లో చెత్త వేయద్దని నిలదీస్తే యువకులు స్పందించే తీరు బాధిస్తుంటుందని కామాక్షి తెలుపుతుంది. నిరసన తెలపడం కష్టమైన పనికాదు. ప్రతి ఒక్కరూ తమ సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకోవాలి’ అని కోరుతుంది కామాక్షి. కాటికి కాళ్లు చాపుకున్న ముసలివాళ్లు ఏం చేస్తారులే అనుకోవద్దు. తలుచుకుంటే కొండను కూడా పిండిచేయగలమని నిరూపించగలరు. ముళ్ల మార్గాలనూ నందనవనంగా మార్చగలరు. – ఆరెన్నార్ -
ఆధ్యాత్మికతతోనే ఆనంద భరితం
కామాక్షీ పీఠం స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న బ్రహ్మశ్రీ చాగంటి అమలాపురం టౌన్ : అందరూ ఆధ్యాత్మికతతోనే ఆనంద భరితమైన సమాజం ఆవిష్కృతమవుతుందని ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉద్బోధించారు. అమలాపురంలోని కామాక్షీ పీఠం మహా సంస్థానంలో జరుగుతున్న స్వర్ణోత్సవాల్లో ఆయన బుధవారం రాత్రి పాల్గొని ప్రసంగించారు. పీఠాన్ని ఆయన సందర్శించి స్వర్ణోత్సవాల గురించి పీఠాధిపతి కామేశ మహర్షిని చాంగటి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీఠం ప్రవచన మందిరంలో భక్తులనుద్దేశించి చాగంటి రామాయణం, భాగవతాలకు సంబంధించి ప్రవచనాలు చెప్పారు. ఆయన ఉపన్యసాలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో విన్నారు. అనంతరం చాగంటి పీఠం తరఫున స్వర్ణోత్సవ వేడుకల వేదికపై పీఠాధిపతి కామేశ మహర్షి పండిత శాలువతో ఘనంగా సత్కరించారు. -
కామాక్షి హత్య కేసులో నిందితుడు అరెస్ట్
కోవూరు: సహజీవనం చేస్తున్న కామాక్షి అనే వివాహితను హత్య చేసిన కేసులో నిందితుడు కోవూరు నాగులకట్టకు చెందిన పసుపులేటి రవిని సోమవారం అరెస్ట్ చేసినట్లు నెల్లూరు రూరల్ డీఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి వెల్లడించా రు. సోమవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలు వెల్లడించారు. రవికి నెల్లూరు ఇరుకళల పరమేశ్వరి గుడి ప్రాంతానికి చెందిన కామాక్షితో పరిచయం ప్రేమగా మారింది. కామాక్షికి ఇది వరకే వివాహమై ఇద్దరు పిల్ల లు ఉన్నారు. రవి, కామాక్షి ప్రేమ బల పడటంతో వేరే కాపురం ఉందామని కామాక్షి కోరింది. దీంతో ఇద్దరూ వెంకటేశ్వరపురం కాపురం పెట్టారు. రవి ఇంట్లో లేని సమయంలో కామాక్షి వేరే వారితో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయాన్ని చూసిన రవి ఆమెను మందలించాడు. ఇద్దరికి ప్రతి రోజు గొడవలు రావడంతో మనస్పర్థలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. దీంతో కామాక్షిని ఎలాగైనా వదిలించుకోవాలనుకున్న రవి ఈ నెల 19 తేదీన రాత్రి కామాక్షిని పడుగుపాడు సాయి ఎన్క్లేవ్ వద్దకు తీసుకువెళ్లి ఆమె చున్నీతో గొం తుకు బిగించి హత్య చేసి అక్కడే ఉన్న సన్న పాటి డ్రైనేజీ కాలువలో తొక్కి వెళ్లిపోయాడు. రెండు రోజుల తర్వాత వెలుగు చూసిన హత్యను పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టి నింది తుడు రవిగా గుర్తించారు.అతని కోసం గాలించగా సోమవారం సాలుచింతల దగ్గర ఉన్న పెట్రోలు బంకు వద్ద తిరుగుతున్న అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి మోటార్‌బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. హత్య కేసును అతి త్వరగా ఛేదించడంలో కృషి చేసిన సీఐ మాధవరావు, ఎస్ఐ వెంకట్రావును ఆయన అభినందించారు. Sునదర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.