సత్యం రాజేశ్, కామాక్షీ భాస్కర్ల
‘సత్యం’ రాజేశ్, కామాక్షీ భాస్కర్ల జంటగా అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మా ఊరి పోలిమేర 2’. ‘మా ఊరి పోలిమేర’కు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మించిన ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్న పంపిణీదారుడు వంశీ నందిపాటి నవంబరు 3న రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా ‘సత్యం’ రాజేశ్ మాట్లాడుతూ– ‘‘కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ‘మా ఊరి పోలిమేర 2’ చిత్రం ప్రేక్షకులను కొత్త లోకానికి తీసుకుని వెళ్తుంది’’ అన్నారు. ‘‘తొలి భాగానికి 20 రెట్లు మలి భాగం బాగుంటుంది. త్వరలోనే ‘పోలిమేర 3’ని కూడా ఆరంభిస్తాం’’ అన్నారు అనిల్ విశ్వనాథ్. ‘‘సినిమా విజయంపై పూర్తి నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు. ‘‘ప్రేక్షకులు ఓ థ్రిల్లింగ్ చిత్రాన్ని చూడబోతున్నారు’’ అన్నారు వంశీ.
Comments
Please login to add a commentAdd a comment