‘సత్యం’ రాజేశ్, డా. కామాక్షీ భాస్కర్ల హీరో హీరోయిన్లుగా ‘గెటప్’ శ్రీను, రాకేందు మౌళి, బాలాదిత్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మించిన ఈ సినిమాను నందిపాటి వంశీకృష్ణ నవంబరు 3న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కామాక్షి మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారు కెమెరామేన్.
రంభ, కల్పనా రాయ్‌లు మాకు దూరపు బంధువులు. నేను క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాను. మెడిసిన్ చేసినా నటిగానూ చేయాలనుకుంటున్నాను. ‘మిస్ ఇండియా’ సినిమాతో నా జర్నీ మొదలైంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రౌడీ బాయ్స్, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, మా ఊరి పొలిమేర 1, విరూపాక్ష’ వంటి సినిమాలు, ‘ఆహా’ ఓటీటీలో మూడు వెబ్ సిరీస్‌లు చేశాను. ఇక ‘మా ఊరి పొలిమేర 1’లో సహనం ఉన్న లక్ష్మీ పాత్ర చేశాను. రెండో భాగంలో నా పాత్ర ఎగ్రెసివ్‌గా ఉంటుంది. భవిష్యత్‌లో డైరెక్టర్ అవుతాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment