ఆధ్యాత్మికతతోనే ఆనంద భరితం
ఆధ్యాత్మికతతోనే ఆనంద భరితం
Published Wed, Jun 7 2017 10:53 PM | Last Updated on Tue, Sep 5 2017 1:03 PM
కామాక్షీ పీఠం స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న బ్రహ్మశ్రీ చాగంటి
అమలాపురం టౌన్ : అందరూ ఆధ్యాత్మికతతోనే ఆనంద భరితమైన సమాజం ఆవిష్కృతమవుతుందని ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉద్బోధించారు. అమలాపురంలోని కామాక్షీ పీఠం మహా సంస్థానంలో జరుగుతున్న స్వర్ణోత్సవాల్లో ఆయన బుధవారం రాత్రి పాల్గొని ప్రసంగించారు. పీఠాన్ని ఆయన సందర్శించి స్వర్ణోత్సవాల గురించి పీఠాధిపతి కామేశ మహర్షిని చాంగటి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీఠం ప్రవచన మందిరంలో భక్తులనుద్దేశించి చాగంటి రామాయణం, భాగవతాలకు సంబంధించి ప్రవచనాలు చెప్పారు. ఆయన ఉపన్యసాలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో విన్నారు. అనంతరం చాగంటి పీఠం తరఫున స్వర్ణోత్సవ వేడుకల వేదికపై పీఠాధిపతి కామేశ మహర్షి పండిత శాలువతో ఘనంగా సత్కరించారు.
Advertisement
Advertisement