ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధం: పొలిమేర నటి | Tollywood Actress Kamakshi Bhaskarla Opens About Her Acting In Films | Sakshi
Sakshi News home page

Kamakshi Bhaskarla: 'కథ డిమాండ్ చేస్తే అలాంటి పాత్రకైనా ఓకే'

Published Fri, May 31 2024 9:33 PM | Last Updated on Sat, Jun 1 2024 9:24 AM

Tollywood Actress Kamakshi Bhaskarla Opens About Her Acting In Films

టాలీవుడ్ నటి కామాక్షి భాస్కర్ల గతేడాది పొలిమేర-2 చిత్రంతో ఆకట్టుకుంది. గతంలో వచ్చిన పొలిమేర చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో సత్యం రాజేశ్‌, బాలాదిత్య, గెటప్‌ శ్రీను ప్రధాన పాత్రలు పోషించారు. చేతబడుల కాన్సెప్ట్‌, హారర్‌ థ్రిల్లర్‌ కావడంతో అభిమానుల ఆదరణ దక్కించుకుంది. అయితే ఈ చిత్రంలో కామాక్షి తన నటనకు గానూ ప్రశంసలు అందుకుంది. అంతే కాదు ఆమెకు అవార్డు కూడా లభించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన కామాక్షి తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకుంది. అదేంటో తెలుసుకుందాం.

తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న కామాక్షి షాకింగ్ కామెంట్స్ చేసింది. సినిమాల్లో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తానని తెలిపింది. ఏ పాత్రలోనైనా నటించేందుకు సిద్ధమని పేర్కొంది. ఒకవేళ కథ డిమాండ్‌ చేస్తే నగ్నంగా నటించాల్సి వచ్చినా చేస్తానని తేల్చి చెప్పింది. అంతే కాకుండా తాను మంచి డ్యాన్సర్‌ అని వెల్లడించింది. స్టార్ హీరోల సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో చేసే అవకాశాలు వస్తే ఎట్టి పరిస్థితుల్లో వదులుకోనని కామాక్షి తెలిపింది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement