కామాక్షి హత్య కేసులో నిందితుడు అరెస్ట్
Published Tue, Aug 23 2016 1:13 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
కోవూరు: సహజీవనం చేస్తున్న కామాక్షి అనే వివాహితను హత్య చేసిన కేసులో నిందితుడు కోవూరు నాగులకట్టకు చెందిన పసుపులేటి రవిని సోమవారం అరెస్ట్ చేసినట్లు నెల్లూరు రూరల్ డీఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి వెల్లడించా రు. సోమవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలు వెల్లడించారు. రవికి నెల్లూరు ఇరుకళల పరమేశ్వరి గుడి ప్రాంతానికి చెందిన కామాక్షితో పరిచయం ప్రేమగా మారింది. కామాక్షికి ఇది వరకే వివాహమై ఇద్దరు పిల్ల లు ఉన్నారు. రవి, కామాక్షి ప్రేమ బల పడటంతో వేరే కాపురం ఉందామని కామాక్షి కోరింది. దీంతో ఇద్దరూ వెంకటేశ్వరపురం కాపురం పెట్టారు. రవి ఇంట్లో లేని సమయంలో కామాక్షి వేరే వారితో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయాన్ని చూసిన రవి ఆమెను మందలించాడు. ఇద్దరికి ప్రతి రోజు గొడవలు రావడంతో మనస్పర్థలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. దీంతో కామాక్షిని ఎలాగైనా వదిలించుకోవాలనుకున్న రవి ఈ నెల 19 తేదీన రాత్రి కామాక్షిని పడుగుపాడు సాయి ఎన్‌క్లేవ్ వద్దకు తీసుకువెళ్లి ఆమె చున్నీతో గొం తుకు బిగించి హత్య చేసి అక్కడే ఉన్న సన్న పాటి డ్రైనేజీ కాలువలో తొక్కి వెళ్లిపోయాడు. రెండు రోజుల తర్వాత వెలుగు చూసిన హత్యను పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టి నింది తుడు రవిగా గుర్తించారు.అతని కోసం గాలించగా సోమవారం సాలుచింతల దగ్గర ఉన్న పెట్రోలు బంకు వద్ద తిరుగుతున్న అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి మోటార్‌బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. హత్య కేసును అతి త్వరగా ఛేదించడంలో కృషి చేసిన సీఐ మాధవరావు, ఎస్‌ఐ వెంకట్రావును ఆయన అభినందించారు. Sునదర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Advertisement