
వడలు తీస్తున్న భక్తులు
యశవంతపుర: సలసల మరుగుతున్న నూనె చుక్క పడినా బొబ్బలెక్కుతాయి. కానీ అదే వేడి నూనెలో ఉడుకుతున్న వడలను చేతితో బయటకు తీశారు భక్తులు. ఈ ఘటన ఉత్తర కన్నడ జిల్లా కుమట పట్టణంలో జరిగింది. పట్టణంలోని కామాక్షి దేవస్థానంలో దసరా తరువాత పౌర్ణమి రోజున ఘనంగా జాతర జరుగుతుంది. ఇందులో కళాయిలో వేగుతున్న వడలను తీసి భక్తిని చాటుకునే కార్యక్రమం ఉంటుంది. ఆదివారం సాయంత్రం జరిగిన జాతరలో కొందరు భక్తులు ఇలా వడలను తీశారు. ఎవరికీ బొబ్బలు ఎక్కలేదన్నారు. గోవా, మహారాష్ట్రల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు.
(చదవండి: యాత్ర తర్వాత కొత్త రాహుల్‌ను చూస్తారు)