WADA
-
డోపింగ్‌లో పట్టుబడిన ద్యుతీచంద్.. తాత్కాలిక నిషేధం
భారత టాప్ అథ్లెట్ క్రీడాకారిణి ద్యుతీచంద్ డోపింగ్ టెస్టులో పట్టుబడింది. ద్యుతీకి నిర్వహించిన శాంపిల్- ఏ టెస్టు రిజల్ట్ పాజిటివ్‌గా వచ్చింది. నిషేధిత సార్స్(SARS) ఉత్ప్రేరకం వాడినట్లు తేలడంతో వరల్డ్ యాంటీ డోపింగ్ ఎజెన్సీ(WADA) ఆమెను తాత్కాలికంగా బ్యాన్ చేస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ''ద్యుతీ శరీరంలో సార్స్ ఎస్-4 Andarine, ఓ డెఫినిలాండ్రైన్, సార్మ్స్ (ఎన్బోర్సమ్), మెటాబోలైట్ లాంటి నిషేధిత పదార్థాలు కనిపించాయి. ఇవి ఆమె శరీరానికి తగినంత శక్తి సామర్థ్యాలు ఇస్తూ పురుష హార్మోన్ లక్షణాలను ఉత్పత్తి చేయడంలో తోడ్పడుతాయి. ఇది నిషేధిత ఉత్ప్రేరకం. ప్రస్తుతం ద్యుతీ అబ్జర్వేజన్‌లో ఉందని.. శాంపిల్-బి టెస్టు పరిశీలించాకా ఒక నిర్ణయం తీసుకుంటాం'' అని వాడా తెలిపింది. ఇక గతేడాది సెప్టెంబర్-అక్టోబర్‌లో జరిగిన జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ద్యుతీచంద్ 200 మీటర్ల ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఇక 100 మీటర్ల ఫైనల్స్‌లో ఆరో స్థానంలో సరిపెట్టుకుంది. అంతకముందు 2018లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో 100, 200 మీటర్ల విభాగాల్లో రజత పతకాలు సొంతం చేసుకుంది. ఇక 2013, 2017, 2019 ఏషియన్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాలు సాధించింది. ఇక 2019లో యునివర్సైడ్ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల విభాగంలో స్వర్ణం సాధించిన తొలి మహిళా స్ప్రింటర్‌గా రికార్డులకెక్కింది. Dutee Chand has been temporarily suspended following a positive analytical finding by WADA. The sample B test and hearing have not yet been released. pic.twitter.com/de0Blbsdnm — Doordarshan Sports (@ddsportschannel) January 18, 2023 చదవండి: Australian Open: బిగ్‌షాక్.. రఫేల్ నాదల్ ఓటమి -
టెన్నిస్ స్టార్ సిమోనా హలెప్‌పై నిషేధం
రొమేనియా టెన్నిస్ స్టార్.. మాజీ వరల్డ్ నంబర్‌వన్ సిమోనా హలెప్ డోపింగ్ టెస్టులో పట్టుబడింది. దీంతో అంతర్జాతీయ టెన్నిస్ ఇంటెగ్రిటీ ఏజెన్సీ(ఐటీఐఏ) శుక్రవారం హలెప్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. విషయంలోకి వెళితే.. ఆగస్టులో యూఎస్ ఓపెన్‌లో పాల్గొన్న హలెప్ డోపింగ్ టెస్టులో భాగంగా శాంపిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే హలెప్ రోక్సాడుస్టాట్(FG-4592)అనే నిషేధిత డ్రగ్ తీసుకున్నట్లు తేలింది. కాగా 2022లో వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(వాడా) రోక్సాడుస్టాట్ డ్రగ్‌ను నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ క్రమంలోనే టెన్నిస్ యాంటీ డోపింగ్ ప్రోగ్రామ్ (TADP) ఆర్టికల్ 7.12.1 ప్రకారం 31 ఏళ్ల హలెప్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు ఐటీఐఏ ధృవీకరించింది. కాగా తనను సస్పెండ్ చేయడంపై స్పందించిన సిమోనా హలెప్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ అయింది.''ఇన్నేళ్ల నా కెరీర్లో మోసం చేయాలనే ఆలోచన ఒక్కసారి కూడా మనస్సులోకి రాలేదు. ఎందుకంటే మోసం అనేది నా విలువలకు పూర్తిగా విరుద్ధం. కానీ తెలియకుండా చేసిన ఒక పని నన్ను బాధిస్తుంది. కానీ నేను తెలియక చేసింది తప్పు కాదని నిరూపించుకోవడానికి చివరి వరకు ప్రయత్నిస్తా. గత 25 ఏళ్లలో టెన్నిస్‌పై పెంచుకున్న ప్రేమను, సాధించిన టైటిల్స్‌ను, గౌరవాన్ని కాపాడుకునేందుకు కృషి చేస్తా'' అంటూ ముగించింది. ఇక సిమోనా హలెప్ 2006లో ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారిణిగా మారింది. ఆమె ఖాతాలో రెండు టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్‌తో పాటు 24 డబ్ల్యూటీఏ టూర్ టైటిల్స్ గెలుచుకుంది. 2017 నుంచి 2019 మధ్య హలెప్ రెండుసార్లు మహిళల టెన్నిస్ నెంబర్ వన్ క్రీడాకారిణిగా కొనసాగింది. రొమేనియా తరపున ఈ ఘనత సాధించిన తొలి మహిళా టెన్నిస్ ప్లేయర్‌గా రికార్డులకెక్కింది. ఆమె కెరీర్లో 2018లో ఫ్రెంచ్ ఓపెన్, 2019లో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించింది. pic.twitter.com/bhS2B2ovzS — Simona Halep (@Simona_Halep) October 21, 2022 చదవండి: సూపర్-12 మ్యాచ్‌లు.. టీమిండియా పూర్తి షెడ్యూల్, వివరాలు -
వేడి నూనెలో వట్టి చేతులతో..
యశవంతపుర: సలసల మరుగుతున్న నూనె చుక్క పడినా బొబ్బలెక్కుతాయి. కానీ అదే వేడి నూనెలో ఉడుకుతున్న వడలను చేతితో బయటకు తీశారు భక్తులు. ఈ ఘటన ఉత్తర కన్నడ జిల్లా కుమట పట్టణంలో జరిగింది. పట్టణంలోని కామాక్షి దేవస్థానంలో దసరా తరువాత పౌర్ణమి రోజున ఘనంగా జాతర జరుగుతుంది. ఇందులో కళాయిలో వేగుతున్న వడలను తీసి భక్తిని చాటుకునే కార్యక్రమం ఉంటుంది. ఆదివారం సాయంత్రం జరిగిన జాతరలో కొందరు భక్తులు ఇలా వడలను తీశారు. ఎవరికీ బొబ్బలు ఎక్కలేదన్నారు. గోవా, మహారాష్ట్రల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. (చదవండి: యాత్ర తర్వాత కొత్త రాహుల్‌ను చూస్తారు) -
నమూనాల సేకరణలో జాగ్రత్త వహించండి
మాంట్రియల్: కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో తమ అనుబంధ సంస్థలకు ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నూతన మార్గనిర్దేశకాలు జారీ చేసింది. అథ్లెట్ల నుంచి నమూనాలు సేకరించే క్రమంలో కరోనా కారణంగా అధికారులతో పాటు, ఆటగాళ్లకు ఎలాంటి హాని కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. స్థానిక ఆరోగ్య అధికారుల నిబంధనల మేరకు నడుచుకోవాలని డోపింగ్ నిరోధక సంస్థలకు సూచించింది. ‘డోపింగ్ నియంత్రణ కోసం మనం పరీక్షలు నిర్వహించే సమయంలో అథ్లెట్లకు, అధికారుల ఆరోగ్యానికి తగిన రక్షణ కల్పించాలి. ఎలాంటి అనారోగ్యం లేని వారినే అథ్లెట్ల నుంచి శాంపుల్స్ సేకరించేందుకు ఉపయోగించాలి. ఈ క్రమంలో అథ్లెట్లను కూడా వారి ఆరోగ్యం గురించి ఆరా తీశాకే నమూనాలు సేకరించాలి’ అని ‘వాడా’ పేర్కొంది. పని చేసే ప్రాంతాలను శుభ్రం గా ఉంచుకోవాలని సూచించింది. తప్పనిసరిగా మాస్క్‌లను వాడాలని హెచ్చరించింది. -
2020 ఒలింపిక్స్ : రష్యాకు భారీ షాక్
-
రష్యాకు బిగ్ షాక్: ఒలింపిక్స్ నుంచి ఔట్!
మాస్కో : రష్యాకు భారీ షాక్ తగిలింది. డోపింగ్ టెస్టుకు సంబంధించి రష్యా తప్పుడు సమాచారం ఇచ్చిందని పేర్కొంటూ రష్యా ఆటగాళ్లపై నిషేధం విధిస్తున్నట్లుగా ప్రపంచ యాంటీ- డోపింగ్ సంస్థ(వాడా) ప్రకటించింది. డోపింగ్ టెస్టులో రష్యా జట్టు దొరికిపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం పేర్కొంది. ఈ నేపథ్యంలో జపాన్ రాజధాని టోక్యోలో 2020లో జరుగనున్న ఒలింపిక్స్, 2022లో చైనాలోని బీజింగ్‌లో జరుగనున్న శీతాకాల ఒలింపిక్స్ నుంచి రష్యాను తప్పిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు స్విట్జర్లాండ్‌లోని లౌసాన్‌లో జరిగిన సమావేశంలో వాడా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఈ విషయం గురించి వాడా ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ... ‘రష్యన్ జట్టుపై నాలుగేళ్ల పాటు నిషేధం విధిస్తున్నాం. వాడా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది’అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌లో రష్యా అథ్లెట్లు న్యూట్రల్స్‌గా మాత్రమే పాల్గొనే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకు వారు వాడా పరీక్షలన్నింటిలో సఫలం కావాల్సి ఉంటుంది. అదే విధంగా వారికి సంబంధించిన శాంపిల్స్ ప్రభావితం కాలేదని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇక నిషేధంపై అప్పీలు చేసుకోవడానికి 21 రోజులపాటు రష్యాకు వాడా గడువునిచ్చింది. -
రష్యాపై నాలుగేళ్ల నిషేధం!
మాస్కో: అంతర్జాతీయ క్రీడల్లో మరో నాలుగేళ్ల పాటు రష్యా జెండా, అథ్లెట్లు కనిపించరేమో! తప్పుడు డోపింగ్ పరీక్షా ఫలితాలు, నిర్వహణతో రష్యా క్రీడా సమాఖ్య ఇప్పుడు భారీ మూల్యమే చెల్లించుకునేందుకు సిద్ధమైంది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) రష్యాపై నాలుగేళ్ల నిషేధం విధించాలని అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలకు సిఫార్సు చేసింది. మాస్కోలోని ల్యాబోరేటరీల్లో నామమాత్రపు పరీక్షలు, నకిలీ నివేదికలు, నిర్వహణ తీరుపై విచారించిన ‘వాడా’ స్వతంత్ర దర్యాప్తు కమిటీ ఆ మేరకు నిషేధాన్ని సూచించింది. రష్యా ఆటగాళ్లు పాల్గొనకుండా చేయడంతో పాటు రష్యా అంతర్జాతీయ పోటీల ఆతిథ్యానికి బిడ్ వేసే అవకాశముండదు. ఇదే జరిగితే యూరో 2020 ఈవెంట్‌ను ఈ సారి ఉమ్మడిగా నిర్వహిస్తున్నప్పటికీ ఇందులో రష్యాకు చెందిన సెయింట్ పీటర్స్బర్గ్ వేదిక కూడా ఉండటం ఫుట్‌బాల్ వర్గాల్ని కలవరపెడుతున్నాయి. రష్యా డోపింగ్ నిరోధక సంస్థ (ఆర్‌యూఎస్‌ఏడీఏ) చీఫ్ యూరీ గానస్ మాట్లడుతూ ‘నిషేధం తప్పేలా లేదు. నాలుగేళ్ల పాటు ఆటలకు దూరమయ్యే అవకాశం ఉంది. దీంతో మా వాళ్లకు టోక్యో ఒలింపిక్స్ (2020), బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ (2022) మెగా ఈవెంట్లలో పాల్గొనే అవకాశం ఉండకపోవచ్చు’ అని అన్నారు. 2015లో రష్యాలో వ్యవస్థీకృత డోపింగ్ వ్యవహారం అంతర్జాతీయ క్రీడా సమాజంలో కలకలం రేపింది. అక్కడి క్రీడాధికారులు, కోచ్‌లు తమ క్రీడాకారులకు శిక్షణతో పాటు నిషేధిత ఉ్రత్పేరకాలు అలవాటు చేస్తున్నట్లు తేలడంతో ‘వాడా’ విచారణకు స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విచారణలో అధికారుల అండదండలతోనే ఇదంతా జరిగిందని తేలడంతో కథ ఆ దేశ నిషేధానికి చేరింది. సాధారణంగా డోపీలపై నిషేధం విధించడం సర్వసాధారణం కానీ... ఇక్కడ అధికారగణం ప్రోద్బలంతోనే ఇదంతా జరగడంతో ఏకంగా రష్యానే నిషేధించాల్సిన పరిస్థితి తలెత్తింది. గత రియో ఒలింపిక్స్ (2016)లో రష్యా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లను అనుమతించలేదు. మిగతా క్రీడాకారులను మాత్రం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) గొడుగు కింద అనుమతించారు. -
మీరు తప్పు చేస్తే.. మేము భరించాలా?
న్యూఢిల్లీ: జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా)పై భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. జాతీయ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ(ఎన్‌డీటీఎల్) అధికారిక గుర్తింపుని ఆర్నెళ్ల పాటు రద్దు చేస్తూ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(వాడా) నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఐఓఏ అధ్యక్షుడు నరిందర్ బత్రా మండిపడ్డారు. ఎన్‌డీటీఎల్ ప్రమాణాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడానికి నాడానే కారణమని బత్రా విమర్శలు గుప్పించారు. దాంతోనే నిషేధానికి గురైనట్లు పేర్కొన్నారు. ఈ నిషేధంతో సేకరించిన నమూనాలను ఇతర దేశాల్లో గుర్తింపు పొందిన ల్యాబ్‌లో పరీక్షలు చేయించాలంటే ఖర్చుతో కూడుకున్న పని అని, ఇదంతా నాడా చేసిన తప్పిదం వల్లే జరిగిందని మండిపడ్డారు. ‘ నాడా చేసిన తప్పిదాలకు మేము అదనపు ఖర్చును భరించాలి. ఆర్నేళ్ల పాటు నాడా పరీక్షలు చేయాలంటే రూపాయిలకు బదులు డాలర్లు చెల్లించాలి. నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్(ఎన్ఎస్ఎఫ్) దీన్ని భరించే పరిస్థితుల్లో లేదు. ఇప్పుడు దీన్ని ఎవరు భరిస్తారు’ అని ఆయన ప్రశ్నించారు. జాతీయ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ(ఎన్‌డీటీఎల్) అధికారిక గుర్తింపుని ఆర్నెళ్ల పాటు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు ల్యాబ్‌లో వివిధ దశల్లో ఉన్న నామూనాలను గుర్తింపు పొందిన ఇతర ల్యాబ్‌లకు పంపాల్సి ఉంటుంది. సేకరించిన నమూనాలకు ఇతర దేశాల్లోని గుర్తింపు పొందిన ల్యాబ్‌ల్లో పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. వాడా విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ 21 రోజుల్లోపు నాడా అప్పీల్ చేసుకునే వీలుంది.(ఇక్కడ చదవండి: నాడాకు వాడా షాక్!) -
నాడాకు వాడా షాక్!
న్యూఢిల్లీ: భారత జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా)కు వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(వాడా) షాకిచ్చింది. జాతీయ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ(ఎన్‌డీటీఎల్) అధికారిక గుర్తింపుని ఆర్నెళ్ల పాటు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎన్‌డీటీఎల్ ప్రమాణాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడమే గుర్తింపు రద్దునకు కారణమని ఓ ప్రకటనలో వాడా తెలిపింది. ఈ మేరకు ఇటీవల చేపట్టిన తనిఖీల్లో వెల్లడైందన్నారు. వాడా ల్యాబొరేటరీ నిపుణుల బృందం మేలో తినిఖీలు ప్రారంభించిందని.. అనంతరం ఓ క్రమశిక్షణా కమిటీ కూడా దర్యాప్తు చేసిందన్నారు. వాటి నివేదికల ఆధారంగానే.. వాడా ఎక్జిక్యూటివ్ కమిటీ నిర్ణయాలు తీసుకుందన్నారు. ఎన్‌డీటీఎల్‌పై నిషేధం తక్షణమే అమలులోకి వస్తుందని వాడా స్పష్టం చేసింది. దీంతో ఇప్పటి వరకు ల్యాబ్‌లో వివిధ దశల్లో ఉన్న నామూనాలను గుర్తింపు పొందిన ఇతర ల్యాబ్‌లకు పంపాల్సి ఉంటుంది. అయితే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా) మాత్రం డోప్ పరీక్షలు నిర్వహించుకునేందుకు ఎలాంటి ఆటంకమూ ఉండదని సమాచారం. కానీ, సేకరించిన నమూనాలకు ఇతర దేశాల్లోని గుర్తింపు పొందిన ల్యాబ్‌ల్లో పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. అయితే టోక్యో ఒలిపింక్స్‌కు ఏడాది కూడా గడువు లేని సమయంలో వాడా ఇలా కొరడా ఝుళిపించడంతో నాడాకు పెద్ద ఎదురుదెబ్బే. -
యూసుఫ్ పఠాన్ కేసు పెండింగ్‌లో ఉంది: వాడా
ముంబై: ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ప్రొటోకాల్ ప్రకారం ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్ కేసు పెండింగ్‌లో ఉందని ‘వాడా’ మేనేజర్ మాగి డ్యురండ్ వెల్లడించారు. అనుకోకుండా నిషిద్ధ ఉత్ప్రేరకం తీసుకున్నట్లు తేలడంతో పఠాన్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐదు నెలల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. గత ఆగస్టు 15 నుంచే అమలైన ఈ సస్పెన్షన్ ఈ నెల 14తో ముగియనుంది. వాడా సంస్థ మీడియా రిలేషన్స్, కమ్యూనికేషన్స్ మేనేజర్ మాగి డ్యురండ్ మాట్లాడుతూ ‘ఇది పెండింగ్ కేసు. ఇప్పుడు దీనిపై వ్యాఖ్యానించబోం’ అని అన్నారు. అయితే వాడా డోపింగ్ కోడ్–2015 ప్రకారం తొలిసారి డోపీలకు కేసు తీవ్రతను బట్టి గరిష్టంగా నాలుగేళ్ల నిషేధం విధించే అవకాశం ఉంది. -
'క్రికెటర్ల సంగతి వాడా చూసుకుంటుంది'
న్యూఢిల్లీ:భారత క్రికెటర్లకు డోపింగ్ పరీక్షలు నిర్వహించే విషయాన్ని వరల్డ్ యాంటీ డోపింగ్ సంస్థ(వాడా) చూసుకుంటుందని కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ పేర్కొన్నారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)తో క్రికెటర్లకు డోపింగ్ పరీక్ష నిర్వహిం చేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సుముఖంగా లేని నేపథ్యంలో ఆ వ్యవహారాన్ని వాడానే చూసుకుంటుందన్నారు. కాగా, క్రికెటర్లు ఓ ప్రైవేటు సంస్థతో డోపింగ్ పరీక్షలు చేయించుకునేందుకు అంగీకరించడం సంతోషంగా ఉందంటూ దేశంలోని అన్ని క్రీడాసంఘాలు నాడా పరీక్షలను ఎదుర్కొంటున్నాయనే విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. 'క్రికెటర్లను డోపింగ్ పరిధిలోకి తీసుకొస్తారా లేదా అనేది వాడాకు వదిలేస్తున్నాం. వాడా డోపింగ్ నిబంధనలకు లోబడే ఐసీసీ నమోదైంది. క్రికెటర్లకు డోప్ పరీక్షలు చేయాలా..వద్దా అనేది వాడా నిర్ణయించాలి. డోపింగ్ జరిగినప్పుడు ఆటగాళ్లు, కోచ్‌లే కాదు అభిమానులపై ప్రభావం ఉంటుంది. అందుకే ప్రతి సంస్థలోనూ డోపింగ్ లేకుండా చూసుకోవాలి. క్రికెట్ దానికి మినహాయింపు కాదు' అని రాథోడ్ అన్నారు. -
డోప్ టెస్టులో దొరికిన భారత క్రికెటర్!
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ ఒకరు డోప్ టెస్టులో దొరికిపోయాడు. ఈ విషయాన్ని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(వాడా) తాజాగా స్సష్టం చేసింది. 2016 డోపింగ్ టెస్టుల్లో భాగంగా నివేదిక విడుదల చేసిన వాడా.. ఒక భారత క్రికెటర్ డోపీగా తేలినట్లు వెల్లడించింది. అయితే సదరు క్రికెటర్ ఎవరనేది మాత్రం స్పష్టం చేయలేదు. పోటీల సందర్భంగా మొత్తం 138 మంది బీసీసీఐ అనుబంధ క్రికెటర్లకు డోప్ టెస్ట్ నిర్వహించగా అందులో ఒకరు దోషిగా తేలినట్టు ఆ నివేదిక పేర్కొంది. 2013 లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సందర్భంగా కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు ప్రదీప్ సంగ్వాన్ డోప్ టెస్టులో పట్టుబడిన విషయం తెలిసిందే. అటు తరువాత డోప్ టెస్టులో మరో క్రికెటర్ విఫలకావడం ఇదే తొలిసారి. -
సెరెనా, వీనస్ లు డోపింగ్ కి పాల్పడ్డారా?
అమెరికన్ మహిళా టెన్నిస్ దిగ్గజాలు సెరెనా విలియమ్స్, వీనస్ లు డోపింగ్ కు పాల్పడ్డారా?. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ(వాడా) వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన హ్యాకర్లు ఈ విషయాన్నే నొక్కి చెబుతున్నారు. సెరెనా, వీనస్ లతో పాటు రియో ఒలింపిక్స్ లో నాలుగు బంగారుల పతకాలు సాధించిన జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ కూడా నిషేధ ఉత్ర్పేరకాలు వాడినట్లు వారు పేర్కొన్నారు. వాడా వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన రష్యాకు చెందిన 'ఫ్యాన్సీ బీరర్స్' హ్యాకర్లు అమెరికన్ ఆటగాళ్లకు సంబంధించిన డాక్యుమెంట్లను బయటపెట్టినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. వాడా డేటాబేస్ లోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట డజన్ల కొద్ది అమెరికన్ అథ్లెట్లు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినా.. వారు క్రీడల్లో పాల్గొనేందుకు వాడా అంగీకరించినట్లు ఫ్యాన్సీ బీరర్స్ పేర్కొంది. ఈ వార్తలపై స్పందించిన వాడా తమ వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైనట్లు ప్రకటించింది. క్రీడాకారులు గాయపడినప్పుడు ఉపయోగించే మందులలో వాడా నిషేధిత ఉత్ప్రేరకాన్ని అమెరికన్లు ఉపయోగించినట్లు ఫ్యాన్సీ బీరర్స్ తెలిపింది. వాడా నిబంధనల ప్రకారం గాయాల దృష్ట్యా నిషేధిత మందు వినియోగం అనివార్యమైనప్పుడు మాత్రమే వాటిని తీసుకోవాలి. ఈ నిబంధనను అడ్డంపెట్టుకుని అవసరం ఉన్నా లేకపోయినా అమెరికన్ అథ్లెట్లు దొంగ సర్టిఫికేట్లను సృష్టించి ఉత్ప్రేరకాలను తీసుకున్నారని ఫ్యాన్సీ బీరర్స్ పేర్కొంది. రియోలో అమెరికా సాధించిన పతాకాలన్నీ నిషేధిత ఉత్ర్పేరకం ఉపయోగించి గెలుచుకున్నవేనని ఆరోపించింది. క్రీడాకారులకు చెందిన రహస్య సమాచారాన్ని దొంగిలిచడాన్ని వాడా ఖండించింది. గత మూడు వారాలుగా వాడా వెబ్ సైట్ ను హ్యాక్ చేసేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తున్నట్లు వాడా చైర్మన్ తెలిపారు. ఫ్యాన్సీ బీరర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. నిషేధిత ఉత్ప్రేరకాలైన ఆక్సీకొడోన్, హైడ్రోమార్ఫోన్, ప్రిడ్నిసోన్, మిథైల్ ప్రిడ్నిసోలోన్ లను సెరెనా విలియమ్స్ 2010, 2014, 2015లలో వినియోగించినట్లు చెప్పింది. ప్రిడ్నిసోన్, ప్రిడ్నిసోలోన్, ట్రైయామ్సీలోన్ లాంటి నిషేధిత ఉత్ర్ఫేరకాలను 2010, 2011, 2012, 2013లలో వీనస్ ఉపయోగించినట్లు పేర్కొంది. అయితే, నిషేధిత ఉత్ర్పేరకాలను ఉపయోగించిన అథెట్లను వాడా ఎందుకు అనుమతించిందనే వివరాలు డేటాబేస్ లో లేవని తెలిపింది. రియోలో నాలుగు స్వర్ణాలు సాధించిన జిమ్నాస్ట్ బైల్స్ మిథైల్ ఫెనిడేట్ అనే నిషేధిత ఉత్ప్రేరకాన్నివినయోగించినా ఆమెపై నిషేధం విధించలేదని చెప్పింది. ఫ్యాన్సీ బీరర్స్ ప్రకటనలపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసి) స్పందించింది. హ్యాకర్ల గ్రూప్ ప్రకటించిన ఆటగాళ్లలో ఎవరూ డోపింగ్ కు పాల్పడలేదని పేర్కొంది. ప్రపంచస్థాయి అథ్లెట్ల గౌరవానికి భంగం కలిగేలా చేయడాన్ని ఖండించింది. -
భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌కు షాక్!
భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ రియో ఒలింపిక్స్ లో పాల్గొంటాడా.. లేదా అన్న దానిపై మళ్లీ నీలినీడలు కమ్ముకున్నాయి. నాడా రిపోర్టులను పరిగణనలోకి తీసుకోకుండా నర్సింగ్ ను ఈ నెల 18న ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి ఆ రెజ్లర్ ను ప్రశ్నించాలని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ(వాడా) నిర్ణయించింది. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) జరిపిన డోపింగ్ టెస్టులో పాజిటీవ్ గా తేలినా అతడి తప్పులేదని భావించి అతడికి క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన నివేదికను ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య, ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థలకు నాడా అందజేసింది. ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ, వాడా మాత్రం నర్సింగ్‌ను బరిలో దింపేందుకు అనుమతించడం లేదు. తాజాగా నర్సింగ్ యాదవ్ పై నాలుగేళ్ల నిషేధం విధించాలనుకుంటున్నట్లు తన నిర్ణయాన్ని వెల్లడించింది. నాడా క్లీన్ చిట్ ను వాడా పట్టించుకోలేదు. దీంతో క్లీన్ చిట్ కోసం నర్సింగ్ మళ్లీ అప్పీలు చేయనున్నాడు. క్లీన్ చిట్ రాకపోవడంతో నర్సింగ్ రియోలో ఆడతాడా లేదా అనే దానిపై స్పష్టత కరువైంది. వాడా అప్పీల్ విషయం మాకు సోమవారం తెలిసిందని భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ చెప్పారు. దీనిపై అదేరోజు మా లాయర్ ద్వారా బదులిచ్చినట్లు తెలిపారు. 18న దీనిపై విచారణ కొనసాగుతుంది. కచ్చితంగా దీని నుంచి నర్సింగ్ బయటపడతాడని ఆయన ధీమాగా ఉన్నారు. -
బ్రెజిల్ అథ్లెట్లకు డోప్ టెస్టులు చేయలేదు!
రియోడీజనీరో: రియో ఒలింపిక్స్ కు నెల రోజుల ముందు నుంచి ఇప్పటివరకూ తమ అథ్లెట్లకు డోపింగ్ టెస్టులు చేయలేదని ఆతిథ్య బ్రెజిల్ అధికారులు షాకింగ్ వార్త తెలిపారు. జూలై 1 - 24 తేదీల మధ్య ఒక్క అథ్లెట్ కు కూడా డోప్ టెస్టులు చేయలేదని వెల్లడించింది. ఈ విషయంపై ఇతర దేశాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి దేశం తమ అథ్లెట్లకు కచ్చితంగా డోపింగ్ టెస్టులు నిర్వహించాలి కానీ రియోకు ఆతిథ్యమిచ్చిన బ్రెజిల్ అలా చేయకపోవడంపై ఇతర దేశాల అథ్లెట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వివాదం అక్కడ చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ(వాడా) తమ దేశ డోపింగ్ టెస్టింగ్ లాబోరేటరీని మూసివేసిన కారణంగా డోప్ టెస్టులు చేయలేదని బ్రెజిల్ వివరణ ఇచ్చుకుంది. డోపింగ్ టెస్టులు ఎందుకు నిర్వహించలేదో తెలపాలంటూ వాడా డైరెక్టర్ బ్రెజిల్ అధికారులను ప్రశ్నించగా, అసలు విషయాన్ని బయటపెట్టారు. అయితే ఈ వివరణపై వాడా అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ దేశంలోని మరో మూడు ల్యాబ్ లకు శాంపిల్స్ పంపించినా, అక్కడ పరికరాలు లేనందున టెస్టులకు వీలుకాలేదని బ్రెజిల్ చెబుతోంది. జూన్ 22న బ్రెజిల్ లాబోరేటరీపై విధించిన నిషేధాన్ని జూలై 20న ఎత్తివేసిన విషయం తెలిసిందే. -
క్రికెటర్ పెరీరాకు నష్ట పరిహారం!
కొలంబో: శ్రీలంక క్రికెటర్ కుశాల్ పెరీరా నిషేధిత పదార్థాలు తీసుకున్నాడని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(వాడా) తప్పుడు నివేదిక ఇవ్వడంతో అందుకు ప్రతిఫలంగా నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఆ దేశ క్రికెట్ బోర్డు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)ని ఆశ్రయించింది. దీనికి సంబంధించిన నివేదికను ఇప్పటికే ఐసీసీకి అందజేసినట్లు శ్రీలంక చైర్మన్ తిలంగా సుమతిపాలా స్పష్టం చేశారు. ఈ మేరకు కుశాల్ పై వచ్చిన ఆరోపణల కారణంగా అతను ఖర్చుపెట్టిన మొత్తాన్ని చెల్లించాల్సిందిగా వాడాను ఐసీసీ కోరినట్లు సుమతి పాలా తెలిపారు. కుశాల్ విషయంలో తప్పు జరగడంపై వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ పరిహారం చెల్లించడానికి అంగీకారం తెలిపిందన్నారు. కాగా, ఆ పరిహారం అందిన వెంటనే కుశాల్ కు అందజేయనున్నట్లు తెలిపారు. డోపింగ్ చేశాడన్న ఆరోపణలతో నిషేధానికి గురైన పెరీరాకు గత రెండు నెలల క్రితం ఊరట లభించిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ లో న్యూజీలాండ్ తో పర్యటనకు వెళ్లిన కుశాల్, గత జూలైలో చేసిన డోపింగ్ పరీక్షల్లో ఫెయిలయ్యాడన్న కారణంగా స్వదేశానికి పంపించారు. యూఏఈలో పాకిస్తాన్ తో టెస్ట్ సిరీస్ సందర్భంగా నిషేధిత పదార్థాలను తీసుకున్నాడని వాడా నిర్వహించిన టెస్టుల్లో తేలడంతో అతడిపై నాలుగేళ్ల నిషేధం పడింది. అయితే ఖతార్ కు చెందిన ల్యాబొరేటరీలో చేసిన డోపింగ్ టెస్టుల్లో నెగటివ్ రావడంతో కుశాల్ పై విధించిన నాలుగేళ్ల నిషేధాన్ని ఐసీసీ ఎత్తివేసింది. -
మెల్డోనియంపై వాడా యూటర్న్
మాంట్రియల్: నిషిద్ధ ఉత్ప్రేరకాల జాబితాలో మెల్డోనియంను కొనసాగించడంపై అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) పునరాలోచనలో పడింది. మానవ శరీరంలో మెల్డోనియం బయటపడటానికి ఎంత సమయం పడుతుందో చెప్పడానికి కచ్చితమైన సాంకేతిక సమాచారం లేదు. దీంతో అథ్లెట్లు ఉత్ప్రేరకాన్ని ఈ ఏడాది జనవరి 1కి ముందా లేక తర్వాత తీసుకున్నారా అనే విషయాన్ని చెప్పడం వాడాకు కష్టంగా మారింది. ఈ ఏడాది జరిపిన డోప్ పరీక్షలో టెన్నిస్ స్టార్ మరియా షరపోవాతో పాటు 172 మంది అథ్లెట్లు ఈ మెల్డోనియంను వాడినట్లు తేలింది. అయితే ఇందులో ఎవరు జనవరి 1 తర్వాత తీసుకున్నారో స్పష్టంగా తేలడం లేదు. మరోవైపు మెల్డోనియంపై వాడా యూటర్న్ తీసుకున్నా... షరపోవా మాత్రం విచారణకు హాజరుకావాల్సిందేనని ఐటీఎఫ్ స్పష్టం చేసింది. -
'వద్దు.. వద్దు.. మేం విచారిస్తూనే ఉన్నాం'
నైరోబి: తమ దేశ అథ్లెట్లపై వచ్చిన డోపింగ్ ఆరోపణలపై కెన్యా భద్రతా అధికారులు విచారణ వేగవంతం చేశారు. విచారణ పూర్తై వారు తప్పు చేసినట్లు తేలితే అది దేశానికి చెడ్డ పేరు తెస్తుందని వారు భావిస్తున్నారు. డోపింగ్ మహమ్మారిని అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని గతంలో తాము విధించిన గడువులోగా కెన్యా స్పందించకపోవడంతో ప్రపంచ డోపింగ్ వ్యతిరేక ఏజెన్సీ(వాడా) ఈ కేసును తన స్వతంత్ర క్రమశిక్షణ కమిటీకి బదిలీ చేస్తానని పేర్కొంది. ఈ నేపథ్యంలో స్పందించిన కెన్యా ఆ అవసరం లేదని, ఇప్పటికే తమ పోలీసులు కీలక ఆధారాలను పరిశీలిస్తున్నారని, త్వరలో అనుమానితులను అరెస్టు చేస్తారని వాడాకు వివరించారు. డోపింగ్ నిజమని తేలితే రష్యా వలె కెన్యాపై కూడా నిషేధం విధించే అవకాశం ఉందని వస్తున్న వార్తలను కొట్టిపారేస్తూ అలా జరగబోదని వాడా తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యవహారం తన క్రమశిక్షణ కమిటీ చేతిలోకి వెళ్లిందని పేర్కొంది. గతంలో కెన్యా అథ్లెట్లు డోపింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. -
డోపింగ్‌లో పట్టుబడ్డ హసన్
కరాచీ: పాకిస్తాన్ యువ స్పిన్నర్ రెజా హసన్ డోపింగ్‌లో పట్టుబడ్డాడు. జనవరిలో జరిగిన ఓ టోర్నీ సందర్భంగా జరిపిన డోప్ పరీక్షలో హసన్ కోకైన్ తీసుకున్నట్లు తేలింది. భారత్‌లోని ‘వాడా’ ల్యాబోరేటరీలో క్రికెటర్ యూరిన్ (శాంపిల్-ఎ)ను పరీక్షించిన నిపుణులు మాదక ద్రవ్యం తీసుకున్నట్లు తేల్చారు. -
'వాడా’ వార్నింగ్ సరికాదు: బోల్ట్
మొనాకో: జమైకా స్టార్, స్ప్రింట్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (వాడా) హెచ్చరికలపై మండిపడ్డాడు. తాజాగా ఐదో సారి ‘వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎంపికైన ఒలింపిక్ చాంపియన్... వాడా వార్నింగ్‌లతో తను రూ. కోట్ల విలువైన స్పాన్సర్‌షిప్‌లు కోల్పోతానని వాపోయాడు. జమైకాకు చెందిన చాలా మంది అథ్లెట్లు ఇటీవల డోప్ టెస్టుల్లో పట్టుబడ్డారు. దీంతో విచారణకు అదేశించిన వాడా డోపీలపై కఠిన చర్యలుంటాయని, ఏకంగా జమైకా అథ్లెట్లందరినీ రియో ఒలింపిక్స్ (2016)లో పాల్గొనకుండా వేటు వేస్తామని గట్టిగా హెచ్చరించింది. దీనిపై స్పందించిన బోల్ట్ ‘వాడా నిర్ణయం నన్ను నిరాశపరిచింది. అది నిజంగా నా ఆదాయానికి గండికొట్టే హెచ్చరిక. నాకు తెలిసిందల్లా ట్రాక్ అండ్ ఫీల్డే. అదే నా లోకం. ఇందులో రాణించేందుకు ఎంతో కష్టపడతా. వాడా, ఐఏఏఎఫ్ల నుంచి ఎన్నో పరీక్షలెదుర్కొంటా’నని అన్నాడు. కానీ వ్యక్తిగత పరీక్షల ఆధారంగా కాకుండా ఏకంగా టీమ్ మొత్తాన్ని నిషేధిస్తామనడం సబబు కాదని అన్నాడు. దీని వల్ల తనకు ఎండార్స్మెంట్లు తెచ్చే ఏజెంట్లు అయోమయానికి గురవుతారని... తాను ఆ జాబితాలో ఉన్నాననే అనుమానంతో స్పాన్సర్‌షిప్‌లు కట్టబెట్టరని బోల్ట్ వివరించాడు. తప్పుచేసినవారిపైనే చర్యలుండాలని, అంతే గానీ టీమ్ మొత్తంపై వేటు తగదన్నాడు.