న్యూఢిల్లీ: భారత క్రికెటర్ ఒకరు డోప్ టెస్టులో దొరికిపోయాడు. ఈ విషయాన్ని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(వాడా) తాజాగా స్సష్టం చేసింది. 2016 డోపింగ్ టెస్టుల్లో భాగంగా నివేదిక విడుదల చేసిన వాడా.. ఒక భారత క్రికెటర్ డోపీగా తేలినట్లు వెల్లడించింది. అయితే సదరు క్రికెటర్ ఎవరనేది మాత్రం స్పష్టం చేయలేదు.
పోటీల సందర్భంగా మొత్తం 138 మంది బీసీసీఐ అనుబంధ క్రికెటర్లకు డోప్ టెస్ట్ నిర్వహించగా అందులో ఒకరు దోషిగా తేలినట్టు ఆ నివేదిక పేర్కొంది. 2013 లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సందర్భంగా కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు ప్రదీప్ సంగ్వాన్ డోప్ టెస్టులో పట్టుబడిన విషయం తెలిసిందే. అటు తరువాత డోప్ టెస్టులో మరో క్రికెటర్ విఫలకావడం ఇదే తొలిసారి.
Comments
Please login to add a commentAdd a comment