న్యూఢిల్లీ:భారత క్రికెటర్లకు డోపింగ్ పరీక్షలు నిర్వహించే విషయాన్ని వరల్డ్ యాంటీ డోపింగ్ సంస్థ(వాడా) చూసుకుంటుందని కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ పేర్కొన్నారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)తో క్రికెటర్లకు డోపింగ్ పరీక్ష నిర్వహిం చేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సుముఖంగా లేని నేపథ్యంలో ఆ వ్యవహారాన్ని వాడానే చూసుకుంటుందన్నారు. కాగా, క్రికెటర్లు ఓ ప్రైవేటు సంస్థతో డోపింగ్ పరీక్షలు చేయించుకునేందుకు అంగీకరించడం సంతోషంగా ఉందంటూ దేశంలోని అన్ని క్రీడాసంఘాలు నాడా పరీక్షలను ఎదుర్కొంటున్నాయనే విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
'క్రికెటర్లను డోపింగ్ పరిధిలోకి తీసుకొస్తారా లేదా అనేది వాడాకు వదిలేస్తున్నాం. వాడా డోపింగ్ నిబంధనలకు లోబడే ఐసీసీ నమోదైంది. క్రికెటర్లకు డోప్ పరీక్షలు చేయాలా..వద్దా అనేది వాడా నిర్ణయించాలి. డోపింగ్ జరిగినప్పుడు ఆటగాళ్లు, కోచ్‌లే కాదు అభిమానులపై ప్రభావం ఉంటుంది. అందుకే ప్రతి సంస్థలోనూ డోపింగ్ లేకుండా చూసుకోవాలి. క్రికెట్ దానికి మినహాయింపు కాదు' అని రాథోడ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment